Shuru
Apke Nagar Ki App…
కనగాల రావులమ్మకి నివాళి అర్పించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఎన్టీఆర్ జిల్లా / జగ్గయ్యపేట : కనగాల రావులమ్మ గారికి నివాళి అర్పించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆదివారం. పెనుగంచిప్రోలు మండలం, కొనకంచి గ్రామంలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనకాల శ్రీనివాసరావు గారి మాతృమూర్తి రావులమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమానికి నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన రావు గారు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు లేసి నివాళులర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
Narasimha Rao Senior Journalist Damala
కనగాల రావులమ్మకి నివాళి అర్పించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఎన్టీఆర్ జిల్లా / జగ్గయ్యపేట : కనగాల రావులమ్మ గారికి నివాళి అర్పించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆదివారం. పెనుగంచిప్రోలు మండలం, కొనకంచి గ్రామంలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనకాల శ్రీనివాసరావు గారి మాతృమూర్తి రావులమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమానికి నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన రావు గారు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు లేసి నివాళులర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.1
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ అడ్డుగోడ..? నేలకొండపల్లిలో బీజేపీ ఆగ్రహ జ్వాలలు.. పొట్టి శ్రీరాములు సెంటర్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు. మహిళల హక్కులను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపాటు నేలకొండపల్లి బిజెపి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్... మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నేలకొండపల్లిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకోవటంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకుడు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగమైన మహిళలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళల అభివృద్ధి, సాధికారతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్, అసలు సమయంలో మాత్రం మహిళల హక్కులకు విరుద్ధంగా వ్యవహరించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మహిళల ఆశయాలను నీరుగార్చిందని తీవ్రంగా దుయ్యబట్టారు. బిజెపి జిల్లా నాయకుడు. నున్న రవి కుమార్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మహిళలు పోరాడుతున్న రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదే మహిళల హక్కులను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ వైఖరిని దేశవ్యాప్తంగా మహిళలు ఖండిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళల గౌరవం, సమాన హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందని, అన్ని పక్షాలను ఏకం చేసి మహిళా బిల్లును తప్పనిసరిగా ఆమోదింపజేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ తో పాటుగా నాయకులు కార్యకర్తలు మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు బిజెపి సీనియర్ నాయకులు భావనాసి దుర్గారావు బిజెపి నాయకులు సూరేపల్లి గ్యానరత్నం కొండ హర్షవర్ధన్ కే స్వామి దాస్ ఎలిగేటి గిరి కందరబోయిన గోపి బిజెపి మైనార్టీ మోర్చా స్టేట్ ఈసీ నెంబర్ ఎస్కే షర్ఫుద్దీన్ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ ఎలిగేటి వెంకటేష్ ఎస్సీ మోర్చా గుండె పొంగు క్రాంతి తోకటి నాగ చారి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు తేజావత్ నాగరాజు పాల్గొన్నారు.3
- Post by SHOT NEWS1
- Post by Ramprasad islavath1
- మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.1
- .పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఓ నిరుపేద కూలీని దురదృష్టం వెన్నాడింది. తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాకు చెందిన హిడ్మా సోరి (46), మామిడికాయలు కోసే పని నిమిత్తం కురవి మండలం బలపాల గ్రామానికి వలస వచ్చాడు. ప్రతిరోజూ రాత్రి సమయంలో తేనె తాగే అలవాటు ఉన్న హిడ్మా సోరి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో చీకట్లో పొరపాటు పడ్డాడు. తేనె డబ్బాకు బదులుగా పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను తీసి తాగాడు. గంట తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. తాను తాగింది పురుగుల మందని గుర్తించాడు. వెంటనే తన బంధువులకు విషయం తెలపడంతో, వారు అతడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తెల్లవారుజామున 1:30 గంటలకు హిడ్మా సోరి తుదిశ్వాస విడిచాడు. మృతుని అల్లుడు ముడమి దేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉండటం, మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించే స్తోమత లేకపోవడంతో కురవి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కురవి రెండో ఎస్సై జయకుమార్, మృతదేహాన్ని తరలించే ఖర్చుల నిమిత్తం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీలు హరిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కూలీ మృతి పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి1
- Post by Syyed taher1
- అంజుమన్ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదు గుంటూరులోని అంజుమన్ స్థలాలు ప్రభుత్వం సైన్స్ పార్క్ పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తుందని అలా ఇచ్చే ప్రసక్తి లేదని ముస్లిం ప్రజాసంఘాలు తెలియజేశాయి. ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్ రిజ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన భూములు ఇచ్చి సైన్స్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని, ముస్లింల అభివృద్ధి కోసం ముస్లింల దాతలు ఇచ్చిన స్థలాన్ని తీసుకుంటే లీగల్ ఫై ట్ చేస్తామని ఆయన తెలియజేశారు.1