logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లా : కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 143 ఫిర్యాదులు : అదనపు కలెక్టర్ మధు మోహన్ కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం 'ప్రజావాణి' నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మొత్తం 143 దరఖాస్తులను ఆయన స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, చట్టప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

2 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
2 hrs ago

కామారెడ్డి జిల్లా : కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 143 ఫిర్యాదులు : అదనపు కలెక్టర్ మధు మోహన్ కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం 'ప్రజావాణి' నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మొత్తం 143 దరఖాస్తులను ఆయన స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, చట్టప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

More news from Telangana and nearby areas
  • నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమం - చేపట్టబడిందని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నార సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణి హాల్ నందు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం పోస్టర్స్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం అనేది దేశవ్యాప్తంగా యువతకు క్రమబద్ధమైన వేతనంతో కూడిన ఇంటర్ షిప్ అవకాశాలను భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమంగా వెల్లడించారు.  . ఈ పథకంలో భాగంగా: ఇంటర్న్‌లకు నెలకు కనీసం ₹9,000 ఆర్థిక సహాయం తో పాటు మరొక 6000 పాకెట్ మనీ కింద ఇస్తారన్నారు .భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో అన్ని రంగాలలో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. వివిధ పాత్రలు మరియు రంగాలలో అవకాశాలను అందించడానికి పీఎంఐఎస్ పైలట్ దశలో 300 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నాయని.. ప్రస్తుతం, పైలట్ దశ యొక్క మూడవ రౌండ్ కొనసాగుతుందని తెలిపారు., దీనిలో కంపెనీలు నిరంతరం ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటిస్తున్నాయన్నారు.. 18-25 సంవత్సరాల వయస్సు గల పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివిన అర్హులైన యువత అధికారిక పిఎంఐఎస్ పోర్టల్ డబ్ల్యూ డబ్ల్యూ ప్రైమ్ మినిస్టర్ షిప్. ఎంసీఏ. గవర్నమెంట్ డాట్ ఇన్ ఎంసీఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు., కెరీర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న ఇంటర్న్‌షిప్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు
    1
    నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమం - చేపట్టబడిందని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నార
సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణి హాల్ నందు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం పోస్టర్స్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం అనేది దేశవ్యాప్తంగా యువతకు క్రమబద్ధమైన వేతనంతో కూడిన ఇంటర్ షిప్ అవకాశాలను భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమంగా వెల్లడించారు.  . ఈ పథకంలో భాగంగా: ఇంటర్న్‌లకు నెలకు కనీసం ₹9,000 ఆర్థిక సహాయం తో పాటు మరొక 6000 పాకెట్ మనీ కింద ఇస్తారన్నారు .భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో అన్ని రంగాలలో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు.
వివిధ పాత్రలు మరియు రంగాలలో 
అవకాశాలను అందించడానికి పీఎంఐఎస్ పైలట్ దశలో 300 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నాయని.. ప్రస్తుతం, పైలట్ దశ యొక్క మూడవ రౌండ్ కొనసాగుతుందని తెలిపారు., దీనిలో కంపెనీలు నిరంతరం ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటిస్తున్నాయన్నారు.. 18-25 సంవత్సరాల వయస్సు గల పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివిన అర్హులైన యువత అధికారిక పిఎంఐఎస్ పోర్టల్ డబ్ల్యూ డబ్ల్యూ ప్రైమ్ మినిస్టర్ షిప్. ఎంసీఏ. గవర్నమెంట్ డాట్ ఇన్ ఎంసీఏ  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు., కెరీర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న ఇంటర్న్‌షిప్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    4 hrs ago
  • పిల్లలు చదువు.. ఆటల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా బాలల భద్రత.. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహిళా, శిశు, దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ ఆద్వర్యంలో సోమవారం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఆటల పరికరాలు, వాలీ బాల్ లు పంపిణీ చేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల నృత్యం ఆలోచింపజేసింది.అంగన్వాడీ కేంద్రానికి పిల్లల ఎందరు వస్తున్నారు?రోజు పోషకాహారం ఇస్తున్నారా కలెక్టర్ ఆరా తీశారు? షి టీమ్ నంబర్ 87126 56425, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీ మానస్ 14416 హెల్ప్ లైన్ పై వివరించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు  ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు.వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. పిల్లల భద్రత.. అభివృద్ధి బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లదని పేర్కొన్నారు. పిల్లలు నిర్భయంగా మాట్లాడాలని తెలిపారు. తమకు నచ్చిన ఆటలు ఆడాలని, కచ్చితంగా చదవాలని తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల్లో ఇంట్లో తల్లికి సహాయం చేయాలని, తండ్రి వృత్తిని పరిశీలిస్తూ.. సహాయం చేయాలని వివరించారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాబ్యాసం చేయాలని, ఏదైనా కొలువు సాధించాలని ఆకాంక్షించారు. ఎక్కువ శాతం హెల్మెట్ లేకుండా వెళ్తుండడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. తమ ఇంట్లో ద్విచక్ర వాహనం ఉన్న వారు హెల్మెట్ ధరించి బయటికి వెళ్లేలా.. కుటుంబ సభ్యులు సూచించాలని తెలిపారు. తమ, కుటుంబ రక్షణ కోసం హెల్మెట్ తీసుకోవాలని సూచించారు. మూడేండ్ల వయసు, అలాగే ఆరేండ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని సూచించారు. కోడి గుడ్లు, బాలామృతం, స్నాక్స్, పాలు పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. చదివే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పిల్లలకు తినడం, ఆడుకోవడం ఇతర అంశాల్లో రాణిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్ నీటి శుద్ధి యంత్రాలు, ఆట పరికరాలు పంపిణీ చేశామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు కొలుస్తారని, ఎదుగుదల లోపించిన పిల్లలకు ప్రత్యేక వైద్యం, పోషకాహారం అందిస్తారని తెలిపారు.ఆర్ బీ ఎస్ కే వాహనాలు ద్వారా పిల్లలను హాస్పిటల్ తీసుకువెళ్తారని వివరించారు. పిల్లలను దత్తత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేసుకోవాలని, పూర్తి వివరాలు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, దీంతో తాము అనుకున్న లక్ష్యం సులువుగా చేరుకుంటారని పేర్కొన్నారు. డ్రగ్స్ కు బానిస అయితే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతారని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం,జిల్లా వైద్యాధికారి రజిత, తహసిల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సాగర్, సీడీపీఓ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
    3
    పిల్లలు చదువు.. ఆటల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా బాలల భద్రత.. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహిళా, శిశు, దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ ఆద్వర్యంలో సోమవారం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఆటల పరికరాలు, వాలీ బాల్ లు పంపిణీ చేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల నృత్యం ఆలోచింపజేసింది.అంగన్వాడీ కేంద్రానికి పిల్లల ఎందరు వస్తున్నారు?రోజు పోషకాహారం ఇస్తున్నారా కలెక్టర్ ఆరా తీశారు? షి టీమ్ నంబర్ 87126 56425, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీ మానస్ 14416 హెల్ప్ లైన్ పై వివరించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు  ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు.వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు.
పిల్లల భద్రత.. అభివృద్ధి బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లదని పేర్కొన్నారు. పిల్లలు నిర్భయంగా మాట్లాడాలని తెలిపారు. తమకు నచ్చిన ఆటలు ఆడాలని, కచ్చితంగా చదవాలని తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల్లో ఇంట్లో తల్లికి సహాయం చేయాలని, తండ్రి వృత్తిని పరిశీలిస్తూ.. సహాయం చేయాలని వివరించారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాబ్యాసం చేయాలని, ఏదైనా కొలువు సాధించాలని ఆకాంక్షించారు. ఎక్కువ శాతం హెల్మెట్ లేకుండా వెళ్తుండడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. తమ ఇంట్లో ద్విచక్ర వాహనం ఉన్న వారు హెల్మెట్ ధరించి బయటికి వెళ్లేలా.. కుటుంబ సభ్యులు సూచించాలని తెలిపారు. తమ, కుటుంబ రక్షణ కోసం హెల్మెట్ తీసుకోవాలని సూచించారు. మూడేండ్ల వయసు, అలాగే ఆరేండ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని సూచించారు. కోడి గుడ్లు, బాలామృతం, స్నాక్స్, పాలు పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. చదివే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పిల్లలకు తినడం, ఆడుకోవడం ఇతర అంశాల్లో రాణిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్ నీటి శుద్ధి యంత్రాలు, ఆట పరికరాలు పంపిణీ చేశామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు కొలుస్తారని, ఎదుగుదల లోపించిన పిల్లలకు ప్రత్యేక వైద్యం, పోషకాహారం అందిస్తారని తెలిపారు.ఆర్ బీ ఎస్ కే వాహనాలు ద్వారా పిల్లలను హాస్పిటల్ తీసుకువెళ్తారని వివరించారు. పిల్లలను దత్తత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేసుకోవాలని, పూర్తి వివరాలు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, దీంతో తాము అనుకున్న లక్ష్యం సులువుగా చేరుకుంటారని పేర్కొన్నారు. డ్రగ్స్ కు బానిస అయితే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతారని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం,జిల్లా వైద్యాధికారి రజిత, తహసిల్దార్ విజయ్ ప్రకాశ్ రావు,  ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సాగర్, సీడీపీఓ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    26 min ago
  • బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ "కేటీఆర్"పిలుపు మేరకు మాజీ మంత్రి "కొప్పుల ఈశ్వర్"ఆదేశానుసారం సోమవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక తెలంగాణ తల్లి విగ్రహంకు పూలమాలలు వేసి అనంతరం బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.మరియు అక్కడ ఉన్న స్థానికులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో,మాజీ మున్సిపల్ ఛైర్మన్ సంగి సత్తెమ్మ గారు, ధర్మపురి మండల కన్వీనర్ అయ్యోరి రాజేష్ కుమార్ , పట్టణ కన్వీనర్ బండారి రంజిత్, నాయకులు ఓడ్నాల మల్లేశం, సంగి శేఖర్, చిలువేరి శ్యాంసుందర్, బండారి అశోక్,చుక్క రవి,బాకీ శేఖర్,గుర్రాల సుధాకర్,అనంతుల లక్ష్మణ్,ఎండీ షమీమా,తరాల కార్తీక్,జెట్టి రాజన్న, ఆనందాసు శ్రీనివాస్, స్తంభంకాడి మహేష్,నక్క రాజేందర్, మామిడి శ్రీనివాస్ ,అక్కనపెల్లి సురేందర్, చల్ల రవి,కాశెట్టి విజయ్,వేముల నరేష్, కళ్ళెం రిషిరెడ్డి,ఎండీ రావుఫ్ మొలుగూరి రాజన్న, చిపిరిశెట్టి రాజన్న, కనకుల స్వామి,మొలగూరి ప్రశాంత్,అంబటి లక్ష్మణ్,,మామిడి శివసాయి,మూటపెల్లి రాజేందర్,ఎడ్ల రాజేశం,ఎండీ అలీ, మూటపెల్లి రాహుల్, అప్పాల శివ,దుర్గం రవి, ముత్తునూరి మహేష్, కొండాపురం యశ్వంత్, చల్ల మున్నా,గడిపెల్లి నరేందర్ తదితరులు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది...
    1
    బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ "కేటీఆర్"పిలుపు మేరకు మాజీ మంత్రి "కొప్పుల ఈశ్వర్"ఆదేశానుసారం సోమవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక తెలంగాణ తల్లి విగ్రహంకు పూలమాలలు వేసి అనంతరం బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.మరియు అక్కడ ఉన్న స్థానికులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో,మాజీ మున్సిపల్ ఛైర్మన్ సంగి సత్తెమ్మ గారు, ధర్మపురి మండల కన్వీనర్ అయ్యోరి రాజేష్ కుమార్ , పట్టణ కన్వీనర్ బండారి రంజిత్, నాయకులు ఓడ్నాల మల్లేశం, సంగి శేఖర్, చిలువేరి శ్యాంసుందర్, బండారి అశోక్,చుక్క రవి,బాకీ శేఖర్,గుర్రాల సుధాకర్,అనంతుల లక్ష్మణ్,ఎండీ షమీమా,తరాల కార్తీక్,జెట్టి రాజన్న, ఆనందాసు శ్రీనివాస్, స్తంభంకాడి మహేష్,నక్క రాజేందర్, మామిడి శ్రీనివాస్ ,అక్కనపెల్లి సురేందర్, చల్ల రవి,కాశెట్టి విజయ్,వేముల నరేష్, కళ్ళెం రిషిరెడ్డి,ఎండీ రావుఫ్ మొలుగూరి రాజన్న, చిపిరిశెట్టి రాజన్న, కనకుల స్వామి,మొలగూరి ప్రశాంత్,అంబటి లక్ష్మణ్,,మామిడి శివసాయి,మూటపెల్లి రాజేందర్,ఎడ్ల రాజేశం,ఎండీ అలీ, మూటపెల్లి రాహుల్, అప్పాల శివ,దుర్గం రవి, ముత్తునూరి మహేష్, కొండాపురం యశ్వంత్, చల్ల మున్నా,గడిపెల్లి నరేందర్ తదితరులు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది...
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • గన్నేరువరం పోలీస్ స్టేషన్‌లో నాగుపాము కలకలం రేపింది. స్టేషన్ ఎస్సై నరేందర్ రెడ్డి తన గదిలో కుర్చీలో కూర్చొని వచ్చిన వారితో మాట్లాడుతుండగా, వెనుక భాగంలోని కిటికీ ద్వారా నాగుపాము లోపలికి ప్రవేశించింది. పాము ఎస్సై భుజం వైపు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి అప్రమత్తం చేయడంతో ఎస్సై వెంటనే టేబుల్‌పైకి ఎగబాకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో స్టేషన్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న గ్రామానికి చెందిన పాములు పట్టే నైపుణ్యం కలిగిన కళ్ళెం పోచయ్యను పిలిపించారు. ఆయన స్టేషన్ గదిలో టేబుల్ కింద దాగి ఉన్న నాగుపామును పట్టుకుని చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
    1
    గన్నేరువరం పోలీస్ స్టేషన్‌లో నాగుపాము కలకలం రేపింది. స్టేషన్ ఎస్సై నరేందర్ రెడ్డి తన గదిలో కుర్చీలో కూర్చొని వచ్చిన వారితో మాట్లాడుతుండగా, వెనుక భాగంలోని కిటికీ ద్వారా నాగుపాము లోపలికి ప్రవేశించింది.
పాము ఎస్సై భుజం వైపు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి అప్రమత్తం చేయడంతో ఎస్సై వెంటనే టేబుల్‌పైకి ఎగబాకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో స్టేషన్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న గ్రామానికి చెందిన పాములు పట్టే నైపుణ్యం కలిగిన కళ్ళెం పోచయ్యను పిలిపించారు. ఆయన స్టేషన్ గదిలో టేబుల్ కింద దాగి ఉన్న నాగుపామును పట్టుకుని చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల సాయి సత్య ఫ్యాబ్రిక్ షెడ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగి షెడ్‌ను కమ్మేశాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఒక ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
    1
    కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్‌లో గల సాయి సత్య ఫ్యాబ్రిక్ షెడ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగి షెడ్‌ను కమ్మేశాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఒక ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    14 hrs ago
  • గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, కావాలని దాష్టీకాన్ని ప్రదర్శించే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈదుల్ అజ్ఞ బక్రీద్ పండుగ నిర్వహణకై సహకరించాలని, ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో.. నగర ఇస్లామీయ ధార్మిక పండితులు, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు సోమవారం కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రాకి, సీపీ గౌష్ ఆలం లను వారి కార్యాలయాల్లో కలిసి వినతిపత్రములు అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఈ వినతి పత్రాలను అందజేసినట్లు గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. బక్రీద్ లో ఖుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవులు, చిన్న చిన్న దూడలు వంటివి లేకుండా జాగ్రత్తలు వహించాలని.. వెటర్నరీ డాక్టర్లు ధృవీకరించిన సర్టిఫైడ్ జంతువులను మాత్రమే కొనుగోలు చేయాలని, వారసంతల్లో ఆవులు వెళ్లకుండా ఈ బక్రీద్ మాసం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖుర్బానీ కోసం ఆరోగ్య కరమైన జంతువులు ఉండేట్లు చూసుకోవాలని, చట్ట పరిధిలో ఉండి పండుగ జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే పనులు చేయొద్దని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. జంతువులు రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు ఆపితే వారికి సహకరించాలని, గోరక్షకుల ముసుగులో దుండగులు ఆపినచో తక్షణమే 100కు కాల్ చేయాలని, సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అల్లరి మూకలపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడిజిల్లాలోని పశువుల సంతల్లో వెటర్నరీ డాక్టర్లను అందుబాటులో ఉంచాలని, వెటర్నరీ డాక్టర్ల చేత సర్టిఫైడ్ చేయబడిన పశువులను మాత్రమే సంతల్లోకి అనుమతించాలని కోరారు. ఈఅంశంపై అన్ని పార్టీలతో కలిసి జిల్లా స్థాయిలో కలెక్టర్, సీపీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఈకార్యక్రమంలో జమియతుల్ ఉలమా జిల్లా ఉపాధ్యక్షుడు ముఫ్తీ ఘియాస్ మొహియుద్దీన్, జిల్లా సున్నీ ఉలమా బోర్డు అధ్యక్షుడు మౌలానా అలీమోద్దీన్ నిజామీ, జమియత్ ఆహిలే హాదీస్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సమీ, సదర్ ఖాజీ హఫీజ్ మన్కబత్ షాఖాన్, సున్నీ మర్కజి మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, సిటీ జమియతుల్ ఉలమా ఉపాధ్యక్షుడు హాఫిజ్ సయ్యద్ రిజ్వాన్, ముఫ్తీ నదీమ్, హఫీజ్ అస్గర్ అలీ, హఫీజ్ అబ్దుల్ జబ్బార్, ఎంఐఎం కార్పొరేటర్లు ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, నాయకులు అసదుల్లా బేగ్, బాబుజానీ, లయన్ గఫ్ఫార్, లింగంపల్లి శ్రీనివాస్, అసిమ్, మజారోద్దీన్, గాలి రాజు, సురేశ్, అక్బర్ అలీ, వాజిద్ అలీఖాన్, సాజిద్, మెరాజ్, షబ్బీర్, ఖాలీద్, ఖదీర్ ఖాన్, కౌసర్ మజీద్ అధ్యక్షుడు డాక్టర్ యునూస్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
    3
    గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, కావాలని దాష్టీకాన్ని ప్రదర్శించే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈదుల్ అజ్ఞ బక్రీద్ పండుగ నిర్వహణకై సహకరించాలని, ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో.. నగర ఇస్లామీయ ధార్మిక పండితులు, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు సోమవారం కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రాకి, సీపీ గౌష్ ఆలం లను వారి కార్యాలయాల్లో కలిసి వినతిపత్రములు అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఈ వినతి పత్రాలను అందజేసినట్లు గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. బక్రీద్ లో ఖుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవులు, చిన్న చిన్న దూడలు వంటివి లేకుండా జాగ్రత్తలు వహించాలని.. వెటర్నరీ డాక్టర్లు ధృవీకరించిన సర్టిఫైడ్ జంతువులను మాత్రమే కొనుగోలు చేయాలని, వారసంతల్లో ఆవులు వెళ్లకుండా ఈ బక్రీద్ మాసం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖుర్బానీ కోసం  ఆరోగ్య కరమైన జంతువులు ఉండేట్లు చూసుకోవాలని, చట్ట పరిధిలో ఉండి పండుగ జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే పనులు చేయొద్దని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. జంతువులు రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు ఆపితే వారికి సహకరించాలని, గోరక్షకుల ముసుగులో దుండగులు ఆపినచో తక్షణమే 100కు కాల్ చేయాలని, సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అల్లరి మూకలపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడిజిల్లాలోని పశువుల  సంతల్లో వెటర్నరీ డాక్టర్లను అందుబాటులో ఉంచాలని, వెటర్నరీ డాక్టర్ల చేత సర్టిఫైడ్ చేయబడిన పశువులను మాత్రమే సంతల్లోకి అనుమతించాలని కోరారు. ఈఅంశంపై అన్ని పార్టీలతో కలిసి జిల్లా స్థాయిలో కలెక్టర్, సీపీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఈకార్యక్రమంలో జమియతుల్ ఉలమా జిల్లా ఉపాధ్యక్షుడు ముఫ్తీ ఘియాస్ మొహియుద్దీన్, జిల్లా సున్నీ ఉలమా బోర్డు అధ్యక్షుడు మౌలానా అలీమోద్దీన్ నిజామీ, జమియత్ ఆహిలే హాదీస్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సమీ, సదర్ ఖాజీ  హఫీజ్ మన్కబత్ షాఖాన్, సున్నీ మర్కజి మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, సిటీ జమియతుల్ ఉలమా ఉపాధ్యక్షుడు హాఫిజ్ సయ్యద్ రిజ్వాన్, ముఫ్తీ నదీమ్, 
హఫీజ్ అస్గర్ అలీ, 
హఫీజ్ అబ్దుల్ జబ్బార్, ఎంఐఎం కార్పొరేటర్లు ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, నాయకులు అసదుల్లా బేగ్, బాబుజానీ, లయన్ గఫ్ఫార్, లింగంపల్లి శ్రీనివాస్, అసిమ్, మజారోద్దీన్, గాలి రాజు, సురేశ్, అక్బర్ అలీ, వాజిద్ అలీఖాన్, సాజిద్, మెరాజ్, షబ్బీర్, ఖాలీద్, ఖదీర్ ఖాన్, కౌసర్ మజీద్ అధ్యక్షుడు డాక్టర్ యునూస్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం 'ప్రజావాణి' నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మొత్తం 143 దరఖాస్తులను ఆయన స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, చట్టప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
    1
    కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం 'ప్రజావాణి' నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మొత్తం 143 దరఖాస్తులను ఆయన స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, చట్టప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • బాలల భద్రత, రక్షణ సంక్షేమం పై జిల్లా అగ్రగామిగా నిలవాలి కలెక్టర్ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు బాలల హక్కుల దర్శిని ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ బాలల హక్కుల సంరక్షణ పోస్టర్స్ ఆవిష్కరణ, మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారంలో కలెక్టర్ వెల్లడి కౌన్సిలర్స్, యూత్ వెల్ఫేర్ అందించిన స్పోర్ట్స్ కిట్స్ క్రీడాకారులకు అందజేత బాలల భద్రత, రక్షణ సంక్షేమం పై జిల్లా అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్ అన్నారు. బాలల భద్రత & రక్షణ మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సంక్షేమ శాఖ, పోలీస్ ఆధ్వర్యంలో యువతకు సంరక్షణ అనంతరం మద్దతు " చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ (CCI's) నుండి బయటకు వచ్చే 18 సంవత్సరాలు పై బడిన యువతకు మార్గదర్శనం, నివాసం, నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి అవకాశాల కల్పన అనే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ బాలల హక్కుల దర్శని ఎగ్జిబిషన్ ని ప్రారంభించి, అనంతరం పరిశీలించారు. బాలల సంరక్షణ భద్రతపై ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా బాలల హక్కుల పరిరక్షణ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ బాలల భద్రత సంరక్షణ మరియు మత్తు పదార్థాల నివారణ పై జిల్లాను అగ్రగామిగా నిలపాలని తెలిపారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ కలిగి ఉండాలని, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ బాలల రక్షణకు కట్టుబడి ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను చరవాణిలకు దూరంగా పెట్టాలని , ఈ సంక్షేమ వారంలో మున్సిపాలిటీలో. వార్డులలో గ్రామాలలో ఈ కార్యక్రమం పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంలో పోలీస్ యంత్రాంగం విశేష కృషి చేస్తుందని- యువత చెడు వ్యసనాలతో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు బాలికలు చిన్నారులపై ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ బాలల సంరక్షణ భద్రత అనేది మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. పురాతన కాలంలో ఉమ్మడి కుటుంబాలలో అమ్మమ్మలు తాతయ్యలు చిన్నపిల్లలకు చేదోడుగా ఉంటూ మంచి చెడు బోధించేవారని తద్వారా సరైన అవగాహనలో క్రమశిక్షణ గల జీవన శైలిలో మేమందరం పెరిగి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నామన్నారు ప్రస్తుత సమాజంలో భిన్నమైన మార్పులు కనబడుతున్నాయని తల్లి తండ్రులు ఇరువురు ఉద్యోగ బాధ్యతలలో ఉండి పిల్లల సంరక్షణలో వెనుకబాటుతనం కనపడుతుందని తద్వారా వారి జీవితాలలో ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి అన్నారు తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ విషయంలో వారికి సమయం కేటాయించి, మంచి విషయాలు బోధించి క్రమశిక్షణగా పెంచి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో కలెక్టర్, ఎస్పీ ముచ్చటించారు వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున బాలల సంరక్షణ కేంద్రంలో అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుందని మీరు మంచిగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. బాలల సంరక్షణ కేంద్రంలో బాల్య వివాహం పై చిన్నారుల నృత్య ప్రదర్శనతో అవగాహన కల్పించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడలపై ఆసక్తి చూపుతున్న బాలికలకు స్పోర్ట్స్ కిట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, ఆర్టీసీ డిఎం సురేఖ, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్జీవో సునీత, సంబంధిత అంగన్వాడి, సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    బాలల భద్రత, రక్షణ సంక్షేమం పై జిల్లా అగ్రగామిగా నిలవాలి  కలెక్టర్ 
యువత మత్తు పదార్థాలకు  దూరంగా ఉండాలి జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు
బాలల హక్కుల దర్శిని ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
బాలల హక్కుల సంరక్షణ పోస్టర్స్ ఆవిష్కరణ,
మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారంలో  కలెక్టర్  వెల్లడి
కౌన్సిలర్స్, యూత్ వెల్ఫేర్  అందించిన స్పోర్ట్స్ కిట్స్  క్రీడాకారులకు అందజేత 
బాలల భద్రత, రక్షణ సంక్షేమం పై జిల్లా అగ్రగామిగా నిలపాలని  జిల్లా కలెక్టర్ 
ప్రతి మాసింగ్ అన్నారు. 
బాలల భద్రత & రక్షణ మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పురస్కరించుకొని  సోమవారం జిల్లా కేంద్రంలోని  జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సంక్షేమ శాఖ, పోలీస్  ఆధ్వర్యంలో యువతకు సంరక్షణ అనంతరం మద్దతు " చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ (CCI's) నుండి బయటకు వచ్చే 18 సంవత్సరాలు పై బడిన యువతకు మార్గదర్శనం, నివాసం, నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి అవకాశాల కల్పన
అనే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ బాలల హక్కుల దర్శని 
ఎగ్జిబిషన్ ని ప్రారంభించి, అనంతరం పరిశీలించారు. బాలల సంరక్షణ భద్రతపై 
ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
ముందుగా బాలల హక్కుల పరిరక్షణ పోస్టర్స్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ బాలల భద్రత సంరక్షణ మరియు మత్తు పదార్థాల నివారణ పై జిల్లాను అగ్రగామిగా నిలపాలని తెలిపారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ కలిగి ఉండాలని, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ బాలల రక్షణకు కట్టుబడి ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను చరవాణిలకు దూరంగా పెట్టాలని , ఈ సంక్షేమ వారంలో మున్సిపాలిటీలో. వార్డులలో గ్రామాలలో 
ఈ కార్యక్రమం పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ 
పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంలో పోలీస్ యంత్రాంగం విశేష కృషి చేస్తుందని- యువత చెడు వ్యసనాలతో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు  బాలికలు చిన్నారులపై ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. 
గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ బాలల సంరక్షణ భద్రత అనేది మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. పురాతన కాలంలో ఉమ్మడి కుటుంబాలలో అమ్మమ్మలు తాతయ్యలు 
చిన్నపిల్లలకు చేదోడుగా ఉంటూ  మంచి చెడు బోధించేవారని తద్వారా సరైన అవగాహనలో క్రమశిక్షణ గల జీవన శైలిలో 
మేమందరం పెరిగి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నామన్నారు ప్రస్తుత సమాజంలో భిన్నమైన మార్పులు కనబడుతున్నాయని తల్లి తండ్రులు ఇరువురు ఉద్యోగ బాధ్యతలలో ఉండి పిల్లల సంరక్షణలో వెనుకబాటుతనం కనపడుతుందని తద్వారా వారి జీవితాలలో 
ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి అన్నారు 
తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ విషయంలో వారికి సమయం కేటాయించి,
మంచి విషయాలు బోధించి  క్రమశిక్షణగా పెంచి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో కలెక్టర్, ఎస్పీ   ముచ్చటించారు వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం తరఫున బాలల సంరక్షణ కేంద్రంలో అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుందని మీరు మంచిగా చదువుకుని భవిష్యత్తులో 
ఉన్నత స్థానాలలో ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. బాలల సంరక్షణ కేంద్రంలో బాల్య వివాహం పై చిన్నారుల నృత్య ప్రదర్శనతో అవగాహన కల్పించారు. 
అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడలపై ఆసక్తి చూపుతున్న బాలికలకు స్పోర్ట్స్ కిట్స్ అందించారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, ఆర్టీసీ డిఎం సురేఖ, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ 
ఎన్జీవో సునీత, సంబంధిత అంగన్వాడి, సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    4 hrs ago
  • మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామంలో సోమవారం కోరుట్ల సీఐ కే లక్ష్మీనారాయణ సిసి కెమెరాలు ప్రారంభించారు. బెహరన్ లో నివాసముంటున్న గ్రామానికి చెందిన కొందరు యువకులు సంఘంగా ఏర్పడి గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాల అవసరాన్ని వారు గుర్తించి సుమారు లక్షా 50 వేల రూపాయల విలువగల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వల్లంపల్లి గ్రామ సర్పంచ్ సట్ట భూమేష్ నేతృత్వంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం సిఐ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. విదేశాలలో ఉన్న గ్రామస్తులు సచ్చందంగా ముందుకొచ్చి ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన పనులు నిర్వర్తించడం సంతోషకరమైన విషయమని అన్నారు. తన సర్కిల్ పరిధిలోని మిగతా గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన బహరేన్ నివాస గ్రామస్తులు, గ్రామ ప్రజలను మనస్పూర్తిగా అభినందిస్తున్నాననని తెలిపారు. అనంతరం మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటే పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో మరింత గొప్పగా సేవలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో పాటుగా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    1
    మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామంలో సోమవారం కోరుట్ల సీఐ కే లక్ష్మీనారాయణ సిసి కెమెరాలు ప్రారంభించారు.
బెహరన్ లో నివాసముంటున్న గ్రామానికి చెందిన కొందరు యువకులు సంఘంగా ఏర్పడి గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాల అవసరాన్ని వారు గుర్తించి సుమారు లక్షా 50 వేల రూపాయల విలువగల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో వల్లంపల్లి గ్రామ సర్పంచ్ సట్ట భూమేష్ నేతృత్వంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం సిఐ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. విదేశాలలో ఉన్న గ్రామస్తులు సచ్చందంగా ముందుకొచ్చి ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన పనులు నిర్వర్తించడం సంతోషకరమైన విషయమని అన్నారు. తన సర్కిల్ పరిధిలోని మిగతా గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన బహరేన్ నివాస గ్రామస్తులు, గ్రామ ప్రజలను మనస్పూర్తిగా అభినందిస్తున్నాననని తెలిపారు. అనంతరం మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటే పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో మరింత గొప్పగా సేవలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో పాటుగా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.