Shuru
Apke Nagar Ki App…
కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం.......... చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
ఆజాద్
కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం.......... చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం.......... చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు1
- పాత ఫోన్లు అమ్మితే జాగ్రత్త.. సైబర్ నేరాల ముప్పు తప్పదు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో పాత మొబైల్ ఫోన్ల కొనుగోలు పేరుతో కొందరు వ్యక్తులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతున్నట్లు సమాచారం. పాత ఫోన్ రూ.500కు.. పనికిరాని ఫోన్‌కు రూ.వెయ్యి ఇస్తామంటూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. అయితే పాత ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించకుండా ఇతరులకు విక్రయిస్తే.. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులకు పాత మొబైల్ ఫోన్లు విక్రయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పాత ఫోన్ అమ్మే ముందు డేటాను పూర్తిగా తొలగించి, ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది.2
- అర్ధరాత్రి వేళ లక్ష్మీ నగరం పిహెచ్ సి కి ఐటీసీ అంబులెన్స్ పంపించిన ఐటిసి యజమాన్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగరం ప్రభుత్వ వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ అయిన పిల్లలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడానికి అర్ధరాత్రి వేళ లక్ష్మీ నగరం పిహెచ్ సి కి ఐటీసీ అంబులెన్స్ పంపించి ప్రాణ దాతలు అయిన ఐటిసి యజమాన్యం సరైన ఏర్పాట్లు లేకపోవడంతో సుదూర ప్రాంతానికి తరలించడానికి అంబులెన్స్ వాహనం లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో జిల్లా ప్రభుత్వ వైద్యాధికారి ఐటిసి పిఎస్పీడీ యాజమాన్యానికి సమస్యను విన్నవించిన వెంటనే స్పందించి అంబులెన్స్ ను ఉన్నఫలంగా లక్ష్మీ నగరం పంపించి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పిల్లలను హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించడం జరిగినది ఈ సందర్భంగా ఐటీసీ యాజమాన్యం చేసిన సహకారానికి ప్రభుత్వ వైద్యాధికారులు మరియు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసినారు. సమయానికి అమల్లేశ్వరి పంపించి పసిపిల్లల ప్రాణాలను రక్షించిన ఐటీసీ యాజమాన్యం వారికి రుణపడి ఉంటామని అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో వైద్యరంగంలో వారు అందిస్తున్న సేవలను గుర్తించి జిల్లా వైద్యాధికారి అంబులెన్స్ పంపించాలని కోరిన వెంటనే వేరే ఆలోచించకుండానే అంబులెన్స్ ను పంపటం చాలా సంతోషకరమనీ అన్నారు. ఎమర్జెన్సీ సేవలకై ఐటిసి అందించడం భద్రాద్రి జిల్లా ప్రజలు గౌరవించదగిన పరిణామమని తెలిపారు.1
- ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రిలో చేరిన చిన్నారులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, సెప్టెంబర్ 2, 2026: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు ఫుడ్ పాయిజన్ కారణంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని, వారిని పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం, అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, పార్టీ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, రత్నం రమాకాంత్, చింతీరాల రవి కుమార్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, చింతాడి చిట్టిబాబు, పెద్దినేని శ్రీనివాస్, యండి జిందా, చాట్ల రవి, రసమళ్ల రాము, బషీర్, యూత్ నాయకులు గాడి విజయ్, మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు.1
- వైయస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జోగి, అప్పిడి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని మైలవరంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. మైలవరం లోని లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద, మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.💐💐 జోహార్ వైస్సార్1
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మైలవరం జనసేన పార్టీ ర్యాలీ రంగ రంగ వైభవంగా నిర్వహించారు మైలవరం జనసేన పార్టీ కార్యాలయం నుండి ఘనంగామైలవరం పుర వీధుల గుండా లాకిరెడ్డి బాలిరెడ్డి కాలేజీ నుండి మైలవరం బైపాస్ రోడ్డు నుండి నూజివీడు రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించి జనసేన కార్యకర్త తన షాపు వద్ద ఏర్పాటు కేకును కట్ చేసిన అనంతరం మైలవరం గ్రామపంచాయితీ వద్ద ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన అనంతరం మైలవరం గ్రామ శివారులో ఉన్న మారుతి కళ్యాణమండపం నందు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) మరియు మైలవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య అధ్యక్షతన బైకులతో ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు మరియు జనసైనికులు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు4
- ఖమ్మంలో బీఆర్ఎస్ ధర్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పువ్వాడ అజయ్ ఫైర్ ఖమ్మం జడ్పీ సెంటర్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే దగా, మోసం అని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ ముందే కాంగ్రెస్ వస్తే మోసపోవడం ఖాయమని గతంలో చెప్పారని గుర్తుచేశారు. వాయిస్ ఓవర్: వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అరకొరగా అమలు చేస్తోందని, రైతు రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని.. రైతాంగం పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారని, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు కూడా న్యాయం చేయకుండా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఘోరంగా విఫలమైందని ఆరోపించిన పువ్వాడ.. కాంగ్రెస్ నేతలు భూ కబ్జాలు, భూ దోపిడీలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో గతంలో ఒక్క మంత్రిగా చేసిన పనులను ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉండి కూడా చేయలేకపోతున్నారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కనీస నిర్వహణపై కూడా దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. అలాగే ఖమ్మం జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 23 ఎకరాల భూమిని జర్నలిస్టులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణలో రామరాజ్యం రావడం పక్కా అని పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జడ్పీ సెంటర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- భరణిపాడులో యూరియా కోసం రైతుల ఆందోళన.. యాప్ బుకింగ్‌పై అధికారులను నిలదీత ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడులో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీకి వచ్చిన 20 టన్నుల యూరియా ఇతర గ్రామాల రైతులకు యాప్‌లో బుకింగ్ అయిందని.. తమ గ్రామ రైతులకు మాత్రం బుక్ కావడం లేదంటూ నిరసన చేపట్టారు. యాప్‌లో బుకింగ్ చేసుకోవడం తెలియని రైతుల పరిస్థితి ఏంటని అధికారులను నిలదీశారు. వేంసూరు మండలం భరణిపాడులో యూరియా కొరతపై రైతులు ఆందోళన చేపట్టారు. భరణిపాడు సొసైటీకి 20 టన్నుల యూరియా వచ్చినప్పటికీ.. యాప్‌లో తమ గ్రామ రైతులకు బుకింగ్ కావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇతర గ్రామాల రైతులకు యూరియా బుకింగ్ అవుతున్నప్పుడు.. తమకు ఎందుకు బుక్ కావడం లేదంటూ అధికారులను ప్రశ్నించారు. యాప్‌లో బుకింగ్ చేసుకోవడం రాని రైతుల పరిస్థితి ఏంటని అధికారిని నిలదీశారు.యూరియా బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారి రైతులకు వివరించారు. మరో 20 టన్నుల యూరియాను తెప్పించి రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు.1