ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రిలో చేరిన చిన్నారులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, సెప్టెంబర్ 2, 2026: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు ఫుడ్ పాయిజన్ కారణంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని, వారిని పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం, అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, పార్టీ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, రత్నం రమాకాంత్, చింతీరాల రవి కుమార్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, చింతాడి చిట్టిబాబు, పెద్దినేని శ్రీనివాస్, యండి జిందా, చాట్ల రవి, రసమళ్ల రాము, బషీర్, యూత్ నాయకులు గాడి విజయ్, మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు.
ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రిలో చేరిన చిన్నారులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, సెప్టెంబర్ 2, 2026: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు ఫుడ్ పాయిజన్ కారణంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని, వారిని పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం, అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, పార్టీ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, రత్నం రమాకాంత్, చింతీరాల రవి కుమార్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, చింతాడి చిట్టిబాబు, పెద్దినేని శ్రీనివాస్, యండి జిందా, చాట్ల రవి, రసమళ్ల రాము, బషీర్, యూత్ నాయకులు గాడి విజయ్, మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు.
- కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు మరియు ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు మరియు ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు.1
- భరణిపాడులో యూరియా కోసం రైతుల ఆందోళన.. యాప్ బుకింగ్‌పై అధికారులను నిలదీత ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడులో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీకి వచ్చిన 20 టన్నుల యూరియా ఇతర గ్రామాల రైతులకు యాప్‌లో బుకింగ్ అయిందని.. తమ గ్రామ రైతులకు మాత్రం బుక్ కావడం లేదంటూ నిరసన చేపట్టారు. యాప్‌లో బుకింగ్ చేసుకోవడం తెలియని రైతుల పరిస్థితి ఏంటని అధికారులను నిలదీశారు. వేంసూరు మండలం భరణిపాడులో యూరియా కొరతపై రైతులు ఆందోళన చేపట్టారు. భరణిపాడు సొసైటీకి 20 టన్నుల యూరియా వచ్చినప్పటికీ.. యాప్‌లో తమ గ్రామ రైతులకు బుకింగ్ కావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇతర గ్రామాల రైతులకు యూరియా బుకింగ్ అవుతున్నప్పుడు.. తమకు ఎందుకు బుక్ కావడం లేదంటూ అధికారులను ప్రశ్నించారు. యాప్‌లో బుకింగ్ చేసుకోవడం రాని రైతుల పరిస్థితి ఏంటని అధికారిని నిలదీశారు.యూరియా బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారి రైతులకు వివరించారు. మరో 20 టన్నుల యూరియాను తెప్పించి రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు.1
- యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ కే స్కిల్ లేదు ఆయనకు పిహెచ్డీ లేదు,డాక్టరేట్ లేదు యూనివర్సిటీలో వందల మంది స్టాఫ్ యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ కే స్కిల్ లేదు ఆయనకు పిహెచ్డీ లేదు,డాక్టరేట్ లేదు యూనివర్సిటీలో వందల మంది స్టాఫ్ ఉండాలి కానీ ఉన్నది కేవలం ఆరుగురు పాలిటెక్నిక్ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తే ఊరుకోను చెల్లెమ్మ.... అది జరగకుండా చూస్తా ఇది తీన్మార్ మల్లన్నగా నా హామీ1
- ఖమ్మంలో బీఆర్ఎస్ ధర్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పువ్వాడ అజయ్ ఫైర్ ఖమ్మం జడ్పీ సెంటర్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే దగా, మోసం అని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ ముందే కాంగ్రెస్ వస్తే మోసపోవడం ఖాయమని గతంలో చెప్పారని గుర్తుచేశారు. వాయిస్ ఓవర్: వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అరకొరగా అమలు చేస్తోందని, రైతు రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని.. రైతాంగం పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారని, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు కూడా న్యాయం చేయకుండా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఘోరంగా విఫలమైందని ఆరోపించిన పువ్వాడ.. కాంగ్రెస్ నేతలు భూ కబ్జాలు, భూ దోపిడీలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో గతంలో ఒక్క మంత్రిగా చేసిన పనులను ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉండి కూడా చేయలేకపోతున్నారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కనీస నిర్వహణపై కూడా దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. అలాగే ఖమ్మం జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 23 ఎకరాల భూమిని జర్నలిస్టులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణలో రామరాజ్యం రావడం పక్కా అని పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జడ్పీ సెంటర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- వైయస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జోగి, అప్పిడి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని మైలవరంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. మైలవరం లోని లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద, మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.💐💐 జోహార్ వైస్సార్1
- 1000 రోజులైనా ప్రజా సంక్షేమం శూన్యం:మాజీ MLA కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. పాలేరు రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలంటూ ఓట్ల నాటకాలాడారని మండిపడ్డారు. తన తుది శ్వాస వరకు పాలేరు ప్రజల కోసమే జీవిస్తానన్నారు. ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి హామీలు నెరవేర్చకపోతే పాలేరు గడ్డపై పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- పోడు భూమి కావలసినంత నరుక్కోవడమే...? ఇక్కడి కొందరు అటవీ శాఖ అధికారులు పట్టించుకోరు...? అశ్వాపురం రేంజి కృష్ణ సాగర్, బీట్ లో అక్రమంగా సుమారు రెండు హెక్టార్లు పోడు నరికిన గుర్తు తెలియని వ్యక్తులు ...? మణుగూరు క్రాస్ రోడ్డు నుంచి అశ్వాపురం వెళ్లే రోడ్డు కి సుమారు 150 మీటర్ల దూరంలోనే లోపల అడవిని నరికారు అంటే? కొందరు అధికారులు అండదండలు లేకుండానే నరికారా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి...?* *ఈ ఫారెస్ట్ బీట్ లో సుమారు రెండు హెక్టార్లు పోడు కొడుతుంటే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు...?* *ఓ వైపు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చదనం పెంపునకు పలు రకాల విధివిధానాలు చేస్తున్నాయి.. ప్రజలను మొక్కలు నాటి అవి వృక్షాలు అయ్యేదాకా సంరక్షించండి అని వేడుకుంటుంటే...* *ఇక్కడ అటవీ శాఖ అధికారుల కొందరు తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది.. ఇలాంటి వారిని చట్టం ముందు నించిపెట్టాలి అంటూ ప్రశ్నిస్తున్న వృక్ష ప్రేమికులు...* *రాష్ట్ర స్థాయి అటవీ శాఖ ఉన్నత అధికారులు దృష్టి పెడితే నిజ నిజాలు బయటపడతాయని అంటున్న కొందరు...* ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలో1
- నర్సంపేట గడ్డపై 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ సమరభేరి 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులుఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై నిరసన6 గ్యారెంటీల అమలు ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేసిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పరిశీలకలుగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగల రాకేష్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ అటకెక్కిన ఆరు గ్యారెంటీలు ఎగవేసిన హామీలు. అతీగతీ లేనిడిక్లరేషన్లు మాట మార్చిన మేనిఫెస్టో! అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ఏరుదాటాకతెప్ప తగలేసింది. 420 హామీలు నెరవేర్చకపోగా పలు సంక్షేమ పథకాలను నీరుగార్చింది. ఆరు గ్యారంటీలు ఇచ్చి 1000 రోజులు దాటినా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు దాటినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఇందిరమ్మ ఇళ్ల హామీ వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలన లో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు.... రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అసమర్థ కాంగ్రెస్ 1000 రోజుల పాలనను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట లో సమరభేరి నిర్వహించడం జరిగింది. దగాకోరు కాంగ్రెస్ విధానాలను 1000 రోజుల విధ్వంసాన్ని నర్సంపేట గులాబీ సైనికులు నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసి కథం తొక్కినారు. 100 తప్పులతో శిశుపాలుని తల తెగిపడినట్టు, ఈ రోజు 1000 రోజుల కాంగ్రెస్ విధ్వంస పాలనతో 420 అబద్ధాల కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయం. మూడేళ్ల పాలనలోనే ముప్పై ఏళ్ళు తెలంగాణను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టడానికి ప్రతీ గులాభి సైనికుడు కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.1
- పాలేరు లో కాంగ్రెస్1000 రోజుల వైఫల్య పాలన పై BRS పార్టీ ఏర్పాటు చేసిన సమరభేరీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు లో కాంగ్రెస్1000 రోజుల వైఫల్య పాలన పై BRS పార్టీ ఏర్పాటు చేసిన సమరభేరీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు.పాలేరు రిజర్వాయర్ లో నీళ్లను ఇక్కడ రైతులకు సాగు నీటి కోసం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.త్రాగునీటి కోసం మరోసారి సాగర్ నుంచి నీరు విడుదల చేయాలని ఆయన అన్నారు.ఒక్క పంటకైనా నీరు ఇవ్వకుండా రైతులను అన్యాయం చేయొద్దన్నారు. పాలేరు ప్రజలు మరొకసారి మోసపోవద్దని ఎవరికి అన్యాయం జరిగినా ముందుండి పోరాటం చేస్తానని ఆయన తెలిపారు1