Shuru
Apke Nagar Ki App…
లింగంపేట్ : లింగంపల్లి పాముల వాగును పరిశీలిస్తున్న అధికారులు లింగంపేట మండలం లింగంపల్లి పాముల వాగును పరిశీలించడం జరిగిందని DE నారాయణతెలిపారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతి రోడ్డుపై నుంచి పారడంతో ప్రమాదాలు జరగకుండా రాకపోకలు బంద్ చేయడం జరిగిందని ఎస్ఐ దీపక్ కుమార్ అన్నారు. ఇప్పుడు కాస్త వరద ఉధృతి తగ్గడంతో రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
Akula Mahender
లింగంపేట్ : లింగంపల్లి పాముల వాగును పరిశీలిస్తున్న అధికారులు లింగంపేట మండలం లింగంపల్లి పాముల వాగును పరిశీలించడం జరిగిందని DE నారాయణతెలిపారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతి రోడ్డుపై నుంచి పారడంతో ప్రమాదాలు జరగకుండా రాకపోకలు బంద్ చేయడం జరిగిందని ఎస్ఐ దీపక్ కుమార్ అన్నారు. ఇప్పుడు కాస్త వరద ఉధృతి తగ్గడంతో రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఈరోజు కామారెడ్డి జిల్లా బివిపేట మండలం లో 9 ఫీట్ల నీళ్లు రావడం జరిగింది ఈ చెరువుకు 14 నుండి 16 వరకు నిండితే రైతులకు కరువు అన్నది ఉండదు కావున ఈ చెరువు పైన సంబంధిత అధికారులు ప్రాజెక్టులు కాలువలు బిబిపేట మండల్ కు తేవాలని ప్రభుత్వం కూడా బిబిపేట్ చెరువు 500 పైచిలుకు ఎకరాల ఉన్నందున ఒక్క టీఎంసీ వాటర్ ఉంటే ఏడు గ్రామాలకు కరువు లేకుండా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తూచా తప్పకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడే ఈ చెరువు నింపుతూ 500 విస్తీర్ణం రైతులు బాగుపడతారు కావున ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల తరఫున మాజీ ఎంపీటీసీ కోరి నరసింహులు మాట ముచ్చట మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈరోజు కామారెడ్డి జిల్లా బివిపేట మండలం లో 9 ఫీట్ల నీళ్లు రావడం జరిగింది ఈ చెరువుకు 14 నుండి 16 వరకు నిండితే రైతులకు కరువు అన్నది ఉండదు కావున ఈ చెరువు పైన సంబంధిత అధికారులు ప్రాజెక్టులు కాలువలు బిబిపేట మండల్ కు తేవాలని ప్రభుత్వం కూడా బిబిపేట్ చెరువు 500 పైచిలుకు ఎకరాల ఉన్నందున ఒక్క టీఎంసీ వాటర్ ఉంటే ఏడు గ్రామాలకు కరువు లేకుండా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తూచా తప్పకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడే ఈ చెరువు నింపుతూ 500 విస్తీర్ణం రైతులు బాగుపడతారు కావున ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల తరఫున మాజీ ఎంపీటీసీ కోరి నరసింహులు మాట ముచ్చట మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది2
- బ్రిచ్కు అడ్డంగా ఇరికిన చెత్తను తొలగింపు ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు భారీగా వరదరావడంతో కంగ్టి మండల బాన్సువాడ సమీపంలో ఉన్న బ్రిడ్జ్ భారీ వర్షాలు కురవడంతో చెట్లు కొమ్మలు వచ్చి తట్టుకోవడంతో నీళ్లు రోడ్డుపై నుంచి ప్రవహించిందని సర్పంచ్ సౌజన్య మాణిక్ రెడ్డి తెలిపారు. ఆ విషయాన్ని గమనించి జెసిపి ద్వారా చెత్త చెట్టుకొమ్ములను తీసివేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగారం,రాజిరెడ్డి,ఉల్బారావు తదితరులు ఉన్నారు.1
- ఆర్డీవో ఆకస్మిక తనిఖీ.. ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలని ఆదేశం రామాయంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం మెదక్ ఆర్డీవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన ఆమె ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పనులను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పిస్తూ, ఎలాంటి పొరపాట్లు లేదా ఫిర్యాదులకు తావులేకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మరియు డిప్యూటీ ఆర్ ఎం భూపతి రెడ్డి పవర్‌పాయింట్ ద్వారా డ్రైవర్లకు ప్రమాదాల నివారణ, సురక్షిత డ్రైవింగ్ విధానాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, వేగ నియంత్రణ, అలసటతో వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు మరియు ప్రయాణికుల భద్రతపై సమగ్రంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంవిఐ వంశీధర్, ఏఎంవిఐ పృథ్వీరాజ్, వర్మ సాగర్ , నిఖిల్ , సిరిసిల్ల ఆర్టీసీ డిఎం సిరిసిల్ల ప్రకాశ్ రావు, వేములవాడ ఆర్టీసీ డిఎం శ్రీనివాస్, రీజియన్ లోని 11 డిపోల ఆర్టీసీ డ్రైవర్లు,హైర్ బస్ డ్రైవర్స్ సిరిసిల్ల డిపో హైర్ బస్సు యజమానులు పాల్గొన్నారు.ఈ అవగాహన కార్యక్రమం డ్రైవర్లలో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం కలిగించేలా విజయవంతంగా నిర్వహించబడింది.4
- ప్రమాదం తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. ఆటో డ్రైవర్లకు కఠిన హెచ్చరిక రామాయంపేట జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన ఆటో–లారీ ప్రమాదంలో 14 మంది చిన్నారులు గాయపడిన ఘటన నేపథ్యంలో నిజాంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన నిజాంపేట ఎస్ఐ రాజేష్, ఆటోల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని డ్రైవర్లను హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అధిక లోడుతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని వివరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్ఐ రాజేష్ సూచించారు.1
- శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించిన విప్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సమీక్షలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధి పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పార్కును ఇటీవల ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అలాగే పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, బద్ది పోచమ్మ ఆలయాన్ని సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.త్వరలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటివరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు.బాసర నుంచి భద్రాచలం వరకు ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.రాజన్న ఆలయానికి ఇప్పటివరకు మొత్తం రూ.249.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు.1
- కంది: చాకుతో యువకునిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు...! స్థానికులు మరియు క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం,ఆందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన అంజయ్య (32) ఇంటి వద్ద తన భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందామని కంది ఐఐటి ముందున్న చెరువు వద్దకు మంగళవారం సాయంత్రం రాగా అతనిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చాకులతో దాడి చేశారు.అతని పొట్టపై గాయాలయ్యాయి.వారి నుండి అతను తప్పించుకుని రోడ్డు పైకి రాగా గమనించిన స్థానికులు 108కి సమాచారమివ్వగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న కంది108 సిబ్బంది ఈఎంటి శశిధర్,పైలట్ జగదీష్ లు క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందిస్తూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.4