Shuru
Apke Nagar Ki App…
కంది: చాకుతో యువకునిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు...! స్థానికులు మరియు క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం,ఆందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన అంజయ్య (32) ఇంటి వద్ద తన భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందామని కంది ఐఐటి ముందున్న చెరువు వద్దకు మంగళవారం సాయంత్రం రాగా అతనిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చాకులతో దాడి చేశారు.అతని పొట్టపై గాయాలయ్యాయి.వారి నుండి అతను తప్పించుకుని రోడ్డు పైకి రాగా గమనించిన స్థానికులు 108కి సమాచారమివ్వగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న కంది108 సిబ్బంది ఈఎంటి శశిధర్,పైలట్ జగదీష్ లు క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందిస్తూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
SRIRAMULA KIRANKUMAR
కంది: చాకుతో యువకునిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు...! స్థానికులు మరియు క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం,ఆందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన అంజయ్య (32) ఇంటి వద్ద తన భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందామని కంది ఐఐటి ముందున్న చెరువు వద్దకు మంగళవారం సాయంత్రం రాగా అతనిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చాకులతో దాడి చేశారు.అతని పొట్టపై గాయాలయ్యాయి.వారి నుండి అతను తప్పించుకుని రోడ్డు పైకి రాగా గమనించిన స్థానికులు 108కి సమాచారమివ్వగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న కంది108 సిబ్బంది ఈఎంటి శశిధర్,పైలట్ జగదీష్ లు క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందిస్తూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆర్డీవో ఆకస్మిక తనిఖీ.. ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలని ఆదేశం రామాయంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం మెదక్ ఆర్డీవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన ఆమె ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పనులను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పిస్తూ, ఎలాంటి పొరపాట్లు లేదా ఫిర్యాదులకు తావులేకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- పటాన్చెరు నుండి సంగారెడ్డి వరకు రోడ్డు విస్తరణ పనులు... దుమ్ములేస్తూ వాహనదాలకు ఇక్కట్లు ఇస్నాపూర్‌లో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనుల కారణంగా నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. ముఖ్యంగా భారీ వాహనాలు వెళ్లే సమయంలో ఎగిసిపడుతున్న దుమ్ము, దూళితో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి దుమ్ము నివారణకు నీరు చల్లాలని స్థానికులు కోరుతున్నారు.2
- *అరుదైన గుండె లోపాలతో బాధపడుతున్న 8 నెలల ఆఫ్రికా చిన్నారికి అత్యాధునిక గుండె శస్త్రచికిత్స ద్వారా పునర్జన్మ అందించిన మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైద్యులు*1
- ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు: శ్రీ చైతన్య యాజమాన్యానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరిక హైదరాబాద్ నారాయణగూడలోని శ్రీ చైతన్య కళాశాలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. పత్రికల్లో ర్యాంకుల పేరుతో ప్రకటనలు ప్రచురిస్తూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నేరుగా కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలు వెంటనే నిలిపివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.1
- ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ర్యాంకుల ప్రకటనల పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యాన్ని కలిసి హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన అంశాల్లో పారదర్శకత పాటించాలని, తప్పుడు ప్రచారాలతో తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ర్యాంకులు, ఫలితాల విషయంలో వాస్తవ సమాచారమే ప్రచారం చేయాలని ఆయన కోరారు. విద్యా రంగంలో నాణ్యమైన బోధన, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి తీన్మార్ మల్లన్న సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు.1
- కెసిఆర్ సీఎం అయినాకే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి వచ్చింది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యాక ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు 04 ఆగస్ట్ 2016లో నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది.. ఇవ్వాల్టితో పదేళ్లు పూర్తయింది ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు అప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది.. అయినా కూడా ఒప్పందం కుదుర్చుకోలేకపోయారు కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించి ఒప్పందం కుదుర్చుకున్నారు ఈరోజు కన్నెపల్లి దగ్గర నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి NDSAను సాకుగా చూపించి ఎత్తిపోయడం లేదు • మాజీ మంత్రి జీవన్ రెడ్డి1
- ప్రమాదం తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. ఆటో డ్రైవర్లకు కఠిన హెచ్చరిక రామాయంపేట జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన ఆటో–లారీ ప్రమాదంలో 14 మంది చిన్నారులు గాయపడిన ఘటన నేపథ్యంలో నిజాంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన నిజాంపేట ఎస్ఐ రాజేష్, ఆటోల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని డ్రైవర్లను హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అధిక లోడుతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని వివరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్ఐ రాజేష్ సూచించారు.1
- కంది: చాకుతో యువకునిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు...! స్థానికులు మరియు క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం,ఆందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన అంజయ్య (32) ఇంటి వద్ద తన భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందామని కంది ఐఐటి ముందున్న చెరువు వద్దకు మంగళవారం సాయంత్రం రాగా అతనిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చాకులతో దాడి చేశారు.అతని పొట్టపై గాయాలయ్యాయి.వారి నుండి అతను తప్పించుకుని రోడ్డు పైకి రాగా గమనించిన స్థానికులు 108కి సమాచారమివ్వగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న కంది108 సిబ్బంది ఈఎంటి శశిధర్,పైలట్ జగదీష్ లు క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందిస్తూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.4