మూల్యాంకన విధుల పారితోషికం చెల్లింపులో జాప్యం తగదు. -యుటిఎఫ్ కడప జిల్లా శాఖ విమర్శ. బద్వేలు, మే11: పదవ తరగతి పరీక్షలు, మూల్యాంకన విధుల నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికాన్ని చెల్లించడంలో జాప్యం తగదని, తక్షణమే చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబులు డిమాండ్ చేశారు. సోమవారం కడపలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డిఇఓ షేక్ శంషుద్దీన్ ను కలిసి యుటిఎఫ్ జిల్లా శాఖ పక్షాన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల పరీక్షలు, మూల్యాంకనం పూర్తయి రెండు మాసాలు కావస్తున్నా, పరీక్షల విధులు నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్స్ కు అలాగే మూల్యాంకన విధులు నిర్వహించిన చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్, స్పెషల్ అసిస్టెంట్లకు చెల్లించాల్సిన పారితోషికాన్ని చెల్లించకపోవడం తగదన్నారు. ఉపాధ్యాయులు వేసవి తీవ్రతను ఎదుర్కొంటూ సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి విధులు నిర్వహించినప్పటికీ వారికి చెల్లించాల్సిన పారితోషికాన్ని సకాలంలో చెల్లించకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి నిధులు విడుదల అయినప్పటికీ పారితోషికం చెల్లించకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పదవ తరగతి విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికాన్ని చెల్లించారని పేర్కొన్నారు. కడప జిల్లాలో మాత్రం చెల్లింపులు లేవన్నారు. అలాగే గత ఏడాది పదవ తరగతి పరీక్షా విధులు నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పారితోషికాన్ని చెల్లించలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యా శాఖాధికారి స్పందించి తక్షణం చెల్లింపులకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి విడుదలైన బడ్జెట్ మేరకు తక్షణమే ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని, రెండు మూడు రోజుల్లోనే ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తామని, గత ఏడాదికి సంబంధించిన పరీక్షా విధుల పారితోషికం చెల్లింపుకు సంబంధించి బడ్జెట్ కొరకు ప్రభుత్వానికి లేఖ రాశామని, నిధులు రాగానే వాటిని కూడా చెల్లిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, ఎస్.ఎజాస్ అహ్మద్, ఎ.డి.దేవదత్తం, జె.వి.సుబ్బారెడ్డి, ఎస్.మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
మూల్యాంకన విధుల పారితోషికం చెల్లింపులో జాప్యం తగదు. -యుటిఎఫ్ కడప జిల్లా శాఖ విమర్శ. బద్వేలు, మే11: పదవ తరగతి పరీక్షలు, మూల్యాంకన విధుల నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికాన్ని చెల్లించడంలో జాప్యం తగదని, తక్షణమే చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబులు డిమాండ్ చేశారు. సోమవారం కడపలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డిఇఓ షేక్ శంషుద్దీన్ ను కలిసి యుటిఎఫ్ జిల్లా శాఖ పక్షాన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల పరీక్షలు, మూల్యాంకనం పూర్తయి రెండు మాసాలు కావస్తున్నా, పరీక్షల విధులు నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్స్ కు అలాగే మూల్యాంకన విధులు నిర్వహించిన చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్, స్పెషల్ అసిస్టెంట్లకు చెల్లించాల్సిన పారితోషికాన్ని చెల్లించకపోవడం తగదన్నారు. ఉపాధ్యాయులు వేసవి తీవ్రతను ఎదుర్కొంటూ సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి విధులు నిర్వహించినప్పటికీ వారికి చెల్లించాల్సిన పారితోషికాన్ని సకాలంలో చెల్లించకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుండి నిధులు విడుదల అయినప్పటికీ పారితోషికం చెల్లించకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పదవ తరగతి విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికాన్ని చెల్లించారని పేర్కొన్నారు. కడప జిల్లాలో మాత్రం చెల్లింపులు లేవన్నారు. అలాగే గత ఏడాది పదవ తరగతి పరీక్షా విధులు నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పారితోషికాన్ని చెల్లించలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యా శాఖాధికారి స్పందించి తక్షణం చెల్లింపులకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి విడుదలైన బడ్జెట్ మేరకు తక్షణమే ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని, రెండు మూడు రోజుల్లోనే ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తామని, గత ఏడాదికి సంబంధించిన పరీక్షా విధుల పారితోషికం చెల్లింపుకు సంబంధించి బడ్జెట్ కొరకు ప్రభుత్వానికి లేఖ రాశామని, నిధులు రాగానే వాటిని కూడా చెల్లిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, ఎస్.ఎజాస్ అహ్మద్, ఎ.డి.దేవదత్తం, జె.వి.సుబ్బారెడ్డి, ఎస్.మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
- వైభవంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి. బద్వేలు: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు సుమిత్ర నగర్ లో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి వారికి సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా విశేష అభిషేకం నిర్వహించారు. స్వామి వారి కృపా కటాక్షాల కోసం భక్తులందరూ తమ శక్తి కొలది కాయ, కర్పూరం, పూలు మరియు పండ్లతో సకాలంలో విచ్చేసి, ఈ దివ్య అభిషేక సేవలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ నిర్వాహకులు వి వి రమణ కోరారు. ఆ మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా ఆశిస్తూ...అందరికీ ఆహ్వానం! పలికారు, జై శ్రీరామ్! జై శ్రీమన్నారాయణ!!,2
- ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం పార్కింగ్ స్థలంగా మారడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభమవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రద్దీ మధ్య నడవలేక, గంటల తరబడి వేచి చూడలేక వృద్ధులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- అమరావతిలో మొదటి ఫేజ్ లో భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేదు. ఇప్పుడు రెండో ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. భూములు ఇవ్వము అన్న రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడతాం అని బెదిరిస్తున్నారు. సెకండ్ ఫేజ్ పేరుతో రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న బలవంతపు ల్యాండ్ పూలింగ్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. -పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు1
- అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.1
- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.1