logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెదక్: ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి సాధ్యం.... జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఆయన ఆశయమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, ప్రధాన కార్యదర్శి రాజకుమార్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

1 day ago
user_MERCY
MERCY
Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
1 day ago

మెదక్: ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి సాధ్యం.... జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఆయన ఆశయమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, ప్రధాన కార్యదర్శి రాజకుమార్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో యేసయ్య ను దర్శించుకునేందుకు భక్తులు విచ్చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, తమ మొక్కలను చెల్లించుకున్నారు.
    1
    ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో యేసయ్య ను దర్శించుకునేందుకు భక్తులు విచ్చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, తమ మొక్కలను చెల్లించుకున్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • కౌడిపల్లి బట్టమ్మ గుడి దగ్గర ఆధార్ కార్డు మరియు స్పీడ్ పోస్ట్ వృధాగా పడి ఉన్నవి. వచ్చిన పోస్టులు ఎవరి వారికి ఇవ్వక వాటిని నిర్లక్ష్యంగా కౌడిపల్లి అడవి ప్రాంతంలో పడవేసిన వైన్యం
    4
    కౌడిపల్లి బట్టమ్మ గుడి దగ్గర ఆధార్ కార్డు మరియు స్పీడ్ పోస్ట్ వృధాగా పడి ఉన్నవి. వచ్చిన పోస్టులు ఎవరి వారికి ఇవ్వక వాటిని నిర్లక్ష్యంగా కౌడిపల్లి అడవి ప్రాంతంలో పడవేసిన వైన్యం
    user_Vishwanath Goud
    Vishwanath Goud
    Grocer కౌడిపల్లి, మెదక్, తెలంగాణ•
    22 hrs ago
  • కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఆదివారం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, సీనియర్ మేట్లకు ఏపీడీ వామన్ రావు సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి పనులకు వచ్చిన కూలీల ఫోటోలు క్యాప్చరింగ్ జాగ్రత్తగా చేయాలని, చేసిన పనికి తగ్గట్లు కూలి పడే విధంగా చూడాలని సూచించారు. తికమక పడితే కూలీలు నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ తులసిరాం తదితరులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఆదివారం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, సీనియర్ మేట్లకు ఏపీడీ వామన్ రావు సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి పనులకు వచ్చిన కూలీల ఫోటోలు క్యాప్చరింగ్ జాగ్రత్తగా చేయాలని, చేసిన పనికి తగ్గట్లు కూలి పడే విధంగా చూడాలని సూచించారు. తికమక పడితే కూలీలు నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ తులసిరాం తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    56 min ago
  • గొల్లగూడెం లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం లో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
    1
    గొల్లగూడెం లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం లో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    22 min ago
  • సంగారెడ్డి పట్టణంలోని గొల్లగూడెంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, మల్లేశం పాల్గొన్నారు
    1
    సంగారెడ్డి పట్టణంలోని గొల్లగూడెంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, మల్లేశం పాల్గొన్నారు
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్ తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్ పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్
తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్  పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు, తల్లిదండ్రులకు కీలక సందేశం ఇచ్చారు. పరీక్షల్లో ఆశించిన మార్కులు రాని విద్యార్థులు నిరాశ చెందవద్దని, ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించలేదని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా ఉండి ధైర్యం చెప్పాలని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.
    1
    కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు, తల్లిదండ్రులకు కీలక సందేశం ఇచ్చారు. పరీక్షల్లో ఆశించిన మార్కులు రాని విద్యార్థులు నిరాశ చెందవద్దని, ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించలేదని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా ఉండి ధైర్యం చెప్పాలని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    57 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.