logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తొలిసారిగా కార్యాలయానికి విచ్చేసిన సిరి సహస్ర దంపతులకు ఎంపీటీసీలు, పార్టీ శ్రేణుల సత్కారం తెర్లాం మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తా: జడ్పీటీసీ సిరి సహస్ర తెర్లాం, నవంబర్ 9: బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండల జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన సిరి సహస్ర (సిరమ్మ), ఆమె భర్త ప్రదీప్ నాయుడు తొలిసారిగా తెర్లాం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. జడ్పీటీసీగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సిరి సహస్ర దంపతులకు పార్టీ శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలకడంతో కార్యాలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. అనంతరం సిరి సహస్ర దంపతులు కూడా తమను అభినందించేందుకు వచ్చిన తెర్లాం మండల ఎంపీటీసీ సభ్యులను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సిరి సహస్ర మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, అభిమానాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని అన్నారు. తెర్లాం మండల సర్వతోముఖాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన విజయానికి సహకరించి, అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ వెంకట నాయుడు, తెర్లాం మండల టీడీపీ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేష్, మండల మాజీ ఉపాధ్యక్షుడు వెలగవలస చేపేన సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

23 hrs ago
user_Giridhar singh
Giridhar singh
Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
23 hrs ago

తొలిసారిగా కార్యాలయానికి విచ్చేసిన సిరి సహస్ర దంపతులకు ఎంపీటీసీలు, పార్టీ శ్రేణుల సత్కారం తెర్లాం మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తా: జడ్పీటీసీ సిరి సహస్ర తెర్లాం, నవంబర్ 9: బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండల జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన సిరి సహస్ర (సిరమ్మ), ఆమె భర్త ప్రదీప్ నాయుడు తొలిసారిగా తెర్లాం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. జడ్పీటీసీగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సిరి సహస్ర దంపతులకు పార్టీ శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలకడంతో కార్యాలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. అనంతరం సిరి సహస్ర దంపతులు కూడా తమను అభినందించేందుకు వచ్చిన తెర్లాం మండల ఎంపీటీసీ సభ్యులను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సిరి సహస్ర మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, అభిమానాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని అన్నారు. తెర్లాం మండల సర్వతోముఖాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన విజయానికి సహకరించి, అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ వెంకట నాయుడు, తెర్లాం మండల టీడీపీ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేష్, మండల మాజీ ఉపాధ్యక్షుడు వెలగవలస చేపేన సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • విజయనగరం: శ్రీ పైడితల్లమ్మ దర్శనానికై బారులు తీరిన భక్తులు.. విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లమ్మ దేవస్థానం నందు మంగళవారం భక్తులు బారులు తీరారు. దేవాలయానికి ఇరువైపులా భక్తులు దర్శనార్థమై షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఆ షెల్టర్ ల చిరు వ్యాపారులు ఆక్రమణలు చేసి భక్తులకు షెల్టర్ ల వెళ్లే విధంగా లేకుండా ఇబ్బందులు పాలు చేశారు. దీంతో భక్తులు ఎండలనే అమ్మవారి దర్శనానికై క్యూ లైన్ కట్టి ఇబ్బందులు పడ్డారు.
    1
    విజయనగరం: శ్రీ పైడితల్లమ్మ దర్శనానికై బారులు తీరిన భక్తులు..
విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లమ్మ దేవస్థానం నందు మంగళవారం భక్తులు బారులు తీరారు. దేవాలయానికి ఇరువైపులా భక్తులు దర్శనార్థమై షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఆ షెల్టర్ ల చిరు వ్యాపారులు ఆక్రమణలు చేసి భక్తులకు షెల్టర్ ల వెళ్లే విధంగా లేకుండా ఇబ్బందులు పాలు చేశారు. దీంతో భక్తులు ఎండలనే అమ్మవారి దర్శనానికై క్యూ లైన్ కట్టి ఇబ్బందులు పడ్డారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులకు 41 రోజుల పాటు ఉచిత అన్నదానం పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రసాద వితరణ ప్రారంభించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల విజయనగరం, నవంబర్ 9: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయనగరం పట్టణంలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన 41 రోజుల ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) కార్యక్రమాన్ని సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు.
    1
    కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులకు 41 రోజుల పాటు ఉచిత అన్నదానం
పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రసాద వితరణ ప్రారంభించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
విజయనగరం, నవంబర్ 9: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయనగరం పట్టణంలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన 41 రోజుల ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) కార్యక్రమాన్ని సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • విజయనగరం జిల్లా మెంటాడ మండలం టిడిపి ఎంపీపీగా చలుమూరి వెంకట్రావు.. మెంటాడ ఎంపిపిగా 'చలుమూరి' విజయనగరం జిల్లా మెంటాడమండలంలోని 13 ఎంపిటిసి స్థానాలకు గాను టిడిపి 9 స్థానాలు జనసేన ఒక స్థానం కైవసం చేసుకున్నాయి. ఎంపిపి స్థానం గత 15 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తూ, పార్టీ బలోపేతానికి కృషిచేసిన టిడిపి మండల అధ్యక్షుడిగా చలుమూరు వెంకటరావుకు దక్కేలా ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం గెలుపొందిన ఎంపిటిసిలతో ఆయన సమావేశం నిర్వహించారు. మండల ప్రజలు ఎంతో నమ్మకంతో పార్టీపై ఉన్న అభిమానంతో తమకు ఓటు వేసి గెలిపించారని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎనలేని కృషి చేస్తామని, మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎంపిటిసిలంతా ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను వెలబుచ్చారు. ఇప్పటివరకు వైస్ ఎంపిపి పదవి విషయం తేలలేదని అధిష్టానం ఎవరిని సూచిస్తే వారికే ఆ పదవిని కేటాయిస్తామని చెప్పారు. టిడిపి మండల అధ్యక్షులు చలుమూరు వెంకటరావు మాట్లాడుతూ రానున్న పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో 31 గ్రామ పంచాయతీలో పార్టీ సభ్యులు విజయ ఢంకా మోగించాలన్నారు. గ్రామాలలో పట్టింపులకు పోకుండా ప్రజలు ఏ వ్యక్తిపై మొగ్గు చూపుతారో వారిని సర్పంచ్ బరిలో దింపాలని కూటమి సభ్యులంతా ఐకమత్యంగా చర్చించుకుని గెలుపే ముఖ్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో టిడిపి పోలిట్ బ్యూరో అధికార ప్రతినిధి గొర్లె ముసలినాయుడు, జిల్లా ప్రాదేశిక సభ్యులు గుమ్మడి నారాయణమ్మ, ఎంపిటిసిలు పాండ్రంకి సత్యవతి దేవి, పరదేశి రమ్య, కొనిశ విష్ణు గోవింద, ఆరంగి శంకర్రావు, అంటిపర్తి అజయ్ కుమార్, సారిక పైడిరాజు, తాటిపూడి రామకృష్ణ, బాయి వెంకట్రావు, పార్టీ నాయకులు సిరిపురం గురునాయుడు, రెడ్డి ఆదినారాయణ, సూరెడ్డి కృష్ణమూర్తి, చొక్కాకు సన్యాసినాయుడు, పడాల గంగునాయుడు, పల్లి సింహాద్రి పాల్గొన్నారు.
    1
    విజయనగరం జిల్లా మెంటాడ మండలం టిడిపి ఎంపీపీగా చలుమూరి వెంకట్రావు..
మెంటాడ ఎంపిపిగా 'చలుమూరి'
విజయనగరం జిల్లా మెంటాడమండలంలోని 13 ఎంపిటిసి స్థానాలకు గాను టిడిపి 9 స్థానాలు జనసేన ఒక స్థానం కైవసం చేసుకున్నాయి. ఎంపిపి స్థానం గత 15 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తూ, పార్టీ బలోపేతానికి కృషిచేసిన టిడిపి మండల అధ్యక్షుడిగా చలుమూరు వెంకటరావుకు దక్కేలా ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం గెలుపొందిన ఎంపిటిసిలతో ఆయన సమావేశం నిర్వహించారు. మండల ప్రజలు ఎంతో నమ్మకంతో పార్టీపై ఉన్న అభిమానంతో తమకు ఓటు వేసి గెలిపించారని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎనలేని కృషి చేస్తామని, మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎంపిటిసిలంతా ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను వెలబుచ్చారు. ఇప్పటివరకు వైస్ ఎంపిపి పదవి విషయం తేలలేదని అధిష్టానం ఎవరిని సూచిస్తే వారికే ఆ పదవిని కేటాయిస్తామని చెప్పారు. టిడిపి మండల అధ్యక్షులు చలుమూరు వెంకటరావు మాట్లాడుతూ రానున్న పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో 31 గ్రామ పంచాయతీలో పార్టీ సభ్యులు విజయ ఢంకా మోగించాలన్నారు. గ్రామాలలో పట్టింపులకు పోకుండా ప్రజలు ఏ వ్యక్తిపై మొగ్గు చూపుతారో వారిని సర్పంచ్ బరిలో దింపాలని కూటమి సభ్యులంతా ఐకమత్యంగా చర్చించుకుని గెలుపే ముఖ్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో టిడిపి పోలిట్ బ్యూరో అధికార ప్రతినిధి గొర్లె ముసలినాయుడు, జిల్లా ప్రాదేశిక సభ్యులు గుమ్మడి నారాయణమ్మ, ఎంపిటిసిలు పాండ్రంకి సత్యవతి దేవి, పరదేశి రమ్య, కొనిశ విష్ణు గోవింద, ఆరంగి శంకర్రావు, అంటిపర్తి అజయ్ కుమార్, సారిక పైడిరాజు, తాటిపూడి రామకృష్ణ, బాయి వెంకట్రావు, పార్టీ నాయకులు సిరిపురం గురునాయుడు, రెడ్డి ఆదినారాయణ, సూరెడ్డి కృష్ణమూర్తి, చొక్కాకు సన్యాసినాయుడు, పడాల గంగునాయుడు, పల్లి సింహాద్రి పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • బాపూజీ కళామందిరంలో అలరించిన 'స్వర వంశధార' సినీ సంగీత విభావరి... శ్రీకాకుళం : కళలకు పుట్టినిల్లు సిక్కోలు గడ్డ అని, ఇక్కడి కళాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. స్థానిక బాపూజీ కళామందిరంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో 'స్వర వంశధార' సినీ సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అతిథులు, నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సిక్కోలు నేలలో సంగీత ప్రియులకు, కళాకారులకు కొదవలేదని కొనియాడారు. ఇక్కడి నుంచి ఎందరో కళాకారులు ఉన్నత స్థానాలకు ఎదిగి జిల్లా ఖ్యాతిని చాటారని గుర్తుచేశారు. మధురమైన సినీ గీతాలతో శ్రోతల మనసులను ముగ్ధులను చేయడం ఒక అరుదైన కళ అని పేర్కొంటూ, కార్యక్రమాన్ని విజయవంతంగా తీర్చిదిద్దిన లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు లయన్ నటుకుల మోహన్ బృందంతో పాటు నిర్వాహకులు బగాది కూర్మారావు, పైడి హరిప్రసాద్‌ల కృషిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు నటుకుల మోహన్, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్, జోన్ చైర్మన్ డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ.. స్థానిక కళాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే సంకల్పంతోనే జీవనది ప్రేరణతో 'స్వర వంశధార' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. బిజీ షెడ్యూల్‌లోనూ కార్యక్రమానికి విచ్చేసి తమకు అండగా నిలిచిన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో తమ గాత్ర ఆధ్వర్యంలో శ్రోతలను అలరించిన కళాకారులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు
    2
    బాపూజీ కళామందిరంలో అలరించిన 'స్వర వంశధార' సినీ సంగీత విభావరి...
శ్రీకాకుళం : కళలకు పుట్టినిల్లు సిక్కోలు గడ్డ అని, ఇక్కడి కళాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని  కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. స్థానిక బాపూజీ కళామందిరంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో 'స్వర వంశధార' సినీ సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అతిథులు, నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సిక్కోలు నేలలో సంగీత ప్రియులకు, కళాకారులకు కొదవలేదని కొనియాడారు. ఇక్కడి నుంచి ఎందరో కళాకారులు ఉన్నత స్థానాలకు ఎదిగి జిల్లా ఖ్యాతిని చాటారని గుర్తుచేశారు. మధురమైన సినీ గీతాలతో శ్రోతల మనసులను ముగ్ధులను చేయడం ఒక అరుదైన కళ అని పేర్కొంటూ, కార్యక్రమాన్ని విజయవంతంగా తీర్చిదిద్దిన లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు లయన్ నటుకుల మోహన్ బృందంతో పాటు నిర్వాహకులు బగాది కూర్మారావు, పైడి హరిప్రసాద్‌ల కృషిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు నటుకుల మోహన్, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్, జోన్ చైర్మన్ డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ.. స్థానిక కళాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే సంకల్పంతోనే జీవనది ప్రేరణతో 'స్వర వంశధార' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. బిజీ షెడ్యూల్‌లోనూ కార్యక్రమానికి విచ్చేసి తమకు అండగా నిలిచిన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో తమ గాత్ర ఆధ్వర్యంలో శ్రోతలను అలరించిన కళాకారులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • సింహాచలం: కనుల పండువగా గోవిందరాజ స్వామివారి తిరువీధి మహోత్సవం....శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి సన్నిధిలో అమావాస్యనీ పురస్కరించుకుని సోమవారం గోవిందరాజ స్వామివారి తిరువీధి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది సింహాచల శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి సన్నిధిలో అమావాస్యనీ పురస్కరించుకుని సోమవారం గోవిందరాజ స్వామివారి తిరువీధి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది.అర్చకులు గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దివ్య మంగళ రూపాన్ని దర్శింపజేశారు.ఉత్సవంలో వేద పండితులు వేద విన్నపాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరువీధిలో పాల్గొన్నారు.
    1
    సింహాచలం: కనుల పండువగా గోవిందరాజ స్వామివారి తిరువీధి మహోత్సవం....శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి సన్నిధిలో అమావాస్యనీ పురస్కరించుకుని సోమవారం గోవిందరాజ స్వామివారి తిరువీధి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది
సింహాచల శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి సన్నిధిలో అమావాస్యనీ పురస్కరించుకుని సోమవారం గోవిందరాజ స్వామివారి తిరువీధి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది.అర్చకులు గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దివ్య మంగళ రూపాన్ని దర్శింపజేశారు.ఉత్సవంలో వేద పండితులు వేద విన్నపాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరువీధిలో పాల్గొన్నారు.
    user_B krishnamraju
    B krishnamraju
    విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • నర్సీపట్నం చైర్మన్ పద్మమ్మకు మెకానిక్ యూనియన్ ఘన సన్మానం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించిన చింతకాయల పద్మమ్మ ని శ్రీ వరసిద్ధి వినాయక బైక్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.యూనియన్ అధ్యక్షుడు యాకా రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యులు పద్మమ్మ గారిని కలిసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెకానిక్‌ల ఐక్యతను చాటుతూ "జై మెకానిక్... జై జై మెకానిక్, మెకానిక్ ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినాదాలు చేశారు.
    1
    నర్సీపట్నం చైర్మన్ పద్మమ్మకు మెకానిక్ యూనియన్ ఘన సన్మానం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించిన చింతకాయల పద్మమ్మ ని శ్రీ వరసిద్ధి వినాయక బైక్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.యూనియన్ అధ్యక్షుడు యాకా రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యులు పద్మమ్మ గారిని కలిసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెకానిక్‌ల ఐక్యతను చాటుతూ "జై మెకానిక్... జై జై మెకానిక్, మెకానిక్ ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినాదాలు చేశారు.
    user_సత్య ఆంధ్ర
    సత్య ఆంధ్ర
    Local News Reporter నాతవరం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • కాకినాడ: నత్తగుల్లలపై వివాదాన్ని అటవీ శాఖ పరిష్కరించేనా..? సముద్రంలో దొరికే నత్తగుల్లల కోసం మత్స్య కారులు ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. అయితే ఇది నిషేధమని కొత్తగా అటవీశాఖ చెబుతోంది. తాతలకాలం నుంచి లేని అభ్యంతరం ఇప్పుడు పెట్టడంపై మత్స్యకారులు వేట వదిలేసి ఆందోళనకు దిగారు. ఇది కోరింగ పరిధిలో మాత్రమే ఉందని మిగిలిన చోట ఆంక్షలు లేవని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అటవీశాఖకు ఇది తలనొప్పిగా మారింది.
    1
    కాకినాడ: నత్తగుల్లలపై వివాదాన్ని అటవీ శాఖ పరిష్కరించేనా..?
సముద్రంలో దొరికే నత్తగుల్లల కోసం మత్స్య కారులు ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. అయితే ఇది నిషేధమని కొత్తగా అటవీశాఖ చెబుతోంది. తాతలకాలం నుంచి లేని అభ్యంతరం ఇప్పుడు పెట్టడంపై మత్స్యకారులు వేట వదిలేసి ఆందోళనకు దిగారు. ఇది కోరింగ పరిధిలో మాత్రమే ఉందని మిగిలిన చోట ఆంక్షలు లేవని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అటవీశాఖకు ఇది తలనొప్పిగా మారింది.
    user_Peddapuram Updates
    Peddapuram Updates
    Photographer పెద్దాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • తొలిసారిగా కార్యాలయానికి విచ్చేసిన సిరి సహస్ర దంపతులకు ఎంపీటీసీలు, పార్టీ శ్రేణుల సత్కారం తెర్లాం మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తా: జడ్పీటీసీ సిరి సహస్ర తెర్లాం, నవంబర్ 9: బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండల జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన సిరి సహస్ర (సిరమ్మ), ఆమె భర్త ప్రదీప్ నాయుడు తొలిసారిగా తెర్లాం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. జడ్పీటీసీగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సిరి సహస్ర దంపతులకు పార్టీ శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలకడంతో కార్యాలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. అనంతరం సిరి సహస్ర దంపతులు కూడా తమను అభినందించేందుకు వచ్చిన తెర్లాం మండల ఎంపీటీసీ సభ్యులను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సిరి సహస్ర మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, అభిమానాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని అన్నారు. తెర్లాం మండల సర్వతోముఖాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన విజయానికి సహకరించి, అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ వెంకట నాయుడు, తెర్లాం మండల టీడీపీ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేష్, మండల మాజీ ఉపాధ్యక్షుడు వెలగవలస చేపేన సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    తొలిసారిగా కార్యాలయానికి విచ్చేసిన సిరి సహస్ర దంపతులకు ఎంపీటీసీలు, పార్టీ శ్రేణుల సత్కారం
తెర్లాం మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తా: జడ్పీటీసీ సిరి సహస్ర
తెర్లాం, నవంబర్ 9:
బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండల జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన సిరి సహస్ర (సిరమ్మ), ఆమె భర్త ప్రదీప్ నాయుడు తొలిసారిగా తెర్లాం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
జడ్పీటీసీగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సిరి సహస్ర దంపతులకు పార్టీ శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలకడంతో కార్యాలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. అనంతరం సిరి సహస్ర దంపతులు కూడా తమను అభినందించేందుకు వచ్చిన తెర్లాం మండల ఎంపీటీసీ సభ్యులను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ సిరి సహస్ర మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, అభిమానాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని అన్నారు. తెర్లాం మండల సర్వతోముఖాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన విజయానికి సహకరించి, అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ వెంకట నాయుడు, తెర్లాం మండల టీడీపీ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేష్, మండల మాజీ ఉపాధ్యక్షుడు వెలగవలస చేపేన సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.