జనగామ జిల్లాకు చేరుకున్న 'గీతన్నల చైతన్య యాత్ర' వృత్తి సంఘాల సంఘీభావం జనగామ: తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం (KGKS) ఆధ్వర్యంలో అమరుల స్మారకార్థం చేపట్టిన "గీతన్నల చైతన్య యాత్ర" జనగామ జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని నెల్లుట్ల గ్రామానికి విచ్చేసిన యాత్ర బృందానికి స్థానిక గీత కార్మికులు, వృత్తి సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా జరిగిన కార్యక్రమాలు మరియు ముఖ్య విశేషాలు: మహానేతలకు నివాళులు: గ్రామంలోని బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరియు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు KGKS రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యాత్ర ముఖ్య ఉద్దేశం: గీత కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన మరియు అమరుల ఆశయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ చైతన్య యాత్ర కొనసాగుతోందని సంఘ నాయకులు తెలిపారు. వృత్తి సంఘాల సంఘీభావం: ఈ యాత్రకు రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి మదర్ హాజరై పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రామస్వామి గౌడ్, స్థానిక గీత కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను జయప్రదం చేశారు.
జనగామ జిల్లాకు చేరుకున్న 'గీతన్నల చైతన్య యాత్ర' వృత్తి సంఘాల సంఘీభావం జనగామ: తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం (KGKS) ఆధ్వర్యంలో అమరుల స్మారకార్థం చేపట్టిన "గీతన్నల చైతన్య యాత్ర" జనగామ జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని నెల్లుట్ల గ్రామానికి విచ్చేసిన యాత్ర బృందానికి స్థానిక గీత కార్మికులు, వృత్తి సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా జరిగిన కార్యక్రమాలు
మరియు ముఖ్య విశేషాలు: మహానేతలకు నివాళులు: గ్రామంలోని బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరియు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు KGKS రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యాత్ర ముఖ్య ఉద్దేశం: గీత కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన మరియు అమరుల ఆశయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే
లక్ష్యంగా ఈ చైతన్య యాత్ర కొనసాగుతోందని సంఘ నాయకులు తెలిపారు. వృత్తి సంఘాల సంఘీభావం: ఈ యాత్రకు రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి మదర్ హాజరై పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రామస్వామి గౌడ్, స్థానిక గీత కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను జయప్రదం చేశారు.
- పెద్ది విగ్రహ ప్రతిష్ఠను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఉద్రిక్తత ల మధ్య బీఆర్ఎస్ నాయకులు నర్సంపేటలో ప్రతిష్ఠించారు. సోమవారం నిర్వహించిన ఈ విగ్రహ ప్రతిష్ఠ స్థలానికి చేరుకున్న డీసీపీ, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ప్రైవేట్ భూమిలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మీకేంటని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వెనక్కి తగ్గడంతో విగ్రహ ఏర్పాటును ఘనంగా నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు *కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా* *ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు* *కాటారం మండల పరిషత్ కార్యాలయంలో కాటారం, మహాదేవపూర్, మలహర్రావు, పలిమెలకు సంబంధించిన 240 కల్యాణ లక్ష్మి మరియు CMRF చెక్కులను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.* *ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.*. *పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. ఆడపిల్లల వివాహం తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.* *ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.* *కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.* *ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు*2
- యాదగిరిగుట్ట: ఏకశిఖరవాసుడి సన్నిధిలో ఏకాదశి విశేష పర్వాలు ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేషపూజలు కొనసాగాయి. ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చనలు, సువర్ణ పుష్పార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు నిజాభిషేకం, సుదర్శన హోమం, నిత్య కళ్యాణం జరిపారు. అలాగే పాతగుట్ట శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.1
- దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనీ జిల్లా ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో.. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ ప్రభుత్వ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- సోమవారం సువర్ణ శివలింగానికి అభిషేకాలు.. పెరిగిన భక్తుల రద్దీ సోమవారం సందర్భంగా రమణేశ్వర మహాక్షేత్రంలో సువర్ణ శివలింగానికి భక్తులు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.1
- బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ ఈ రోజు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జైలు భరో కార్యక్రమంలో రసవత్తరంగా సాగింది. కార్మికులు,కర్షికులు ప్రజలు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి పాల్గొన్నారు.మహబూబాబాద్ పట్టణంలో పోలీసులకు పార్టీ శ్రేణులకు మధ్య భారీగా తోపులాట జరగటంతో కార్యకర్తలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదలతో హోరేత్తించారు. అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు. పార్టీ నాయకులను నిర్భంధింది అరెస్టులు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు తహసీల్దార్ కార్యాలయం ఏరియాలో సిపిఎం పార్టీ శ్రేణులకు పోలీసుల మధ్య భారీ ఉదృక్తత్త జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ అనుకూల విధానాలను శరా వేగంగా అమలు చేయడానికి పూనుకోవడం బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నేడు జైల్ భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ’ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరముందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని, సంపదను, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. అనేక దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దుచేసి వాటన్నింటినీ నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకరావడం అంటే కార్మికుల మౌలిక హక్కులను పూర్తిగా హరించివేయడమే విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్న 32 దేశాల వ్యవసాయ దిగుమతులను అనుమతులను రద్దు చేయాలి. స్వదేశి ఉత్పత్తులను ప్రొత్సహించాలి. మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రోజు వేతనం 600కు, పని దినాలు ఏడాదికి 200 రోజులకు పెంచాలని,పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి. లేబర్ కోడ్లు రద్దుచేసి కనీస వేతనం 31,000 /-ఇవ్వాలని , భవన నిర్మాణం, హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్,సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌలి,కుమ్మరి కుంట్ల నాగన్న,పట్ల మధు,గుండు సులోచన,కంపల్లి శ్రీనివాస్,కరుణ,నీలం కృష్ణ వేణి,కందునురి కవిత, బానోత్ వెంకన్న నాయక్,యమగాని వెంకన్న,బత్తుల వెంకన్న,గారే కోటేశ్వరావు,వెంకట్ నారాయణ,దేవత్ హేమనాయక్ ,బానోత్ ప్రకాష్ నాయక్,రావుల రాజు తదితరులు పాల్గున్నారు.1
- జనగామ జిల్లాకు చేరుకున్న 'గీతన్నల చైతన్య యాత్ర' వృత్తి సంఘాల సంఘీభావం జనగామ: తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం (KGKS) ఆధ్వర్యంలో అమరుల స్మారకార్థం చేపట్టిన "గీతన్నల చైతన్య యాత్ర" జనగామ జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని నెల్లుట్ల గ్రామానికి విచ్చేసిన యాత్ర బృందానికి స్థానిక గీత కార్మికులు, వృత్తి సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా జరిగిన కార్యక్రమాలు మరియు ముఖ్య విశేషాలు: మహానేతలకు నివాళులు: గ్రామంలోని బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరియు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు KGKS రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యాత్ర ముఖ్య ఉద్దేశం: గీత కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన మరియు అమరుల ఆశయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ చైతన్య యాత్ర కొనసాగుతోందని సంఘ నాయకులు తెలిపారు. వృత్తి సంఘాల సంఘీభావం: ఈ యాత్రకు రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి మదర్ హాజరై పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రామస్వామి గౌడ్, స్థానిక గీత కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను జయప్రదం చేశారు.3