logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు *కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా* *ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు* *కాటారం మండల పరిషత్ కార్యాలయంలో కాటారం, మహాదేవపూర్, మలహర్రావు, పలిమెలకు సంబంధించిన 240 కల్యాణ లక్ష్మి మరియు CMRF చెక్కులను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.* *ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.*. *పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. ఆడపిల్లల వివాహం తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.* *ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.* *కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.* *ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు*

1 hr ago
user_SIRIPATI ARUNKUMAR
SIRIPATI ARUNKUMAR
Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
1 hr ago

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు *కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ – లబ్ధిదారులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా* *ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు* *కాటారం మండల పరిషత్ కార్యాలయంలో కాటారం, మహాదేవపూర్, మలహర్రావు, పలిమెలకు సంబంధించిన 240 కల్యాణ లక్ష్మి మరియు CMRF చెక్కులను రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.* *ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.*. *పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. ఆడపిల్లల వివాహం తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అలాగే

అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.* *ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.* *కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.* *ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు*

More news from తెలంగాణ and nearby areas
  • 56 ఏళ్ల రాహుల్ గాంధీ ఫిట్నెస్ సీక్రెట్............. ఇదే 56 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటం వెనుక సీక్రెట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. “ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం గంటపాటు మార్షల్ ఆర్ట్స్, ఈత, రన్నింగ్, యోగా, ఏరోబిక్ వంటివి చేస్తా. అనారోగ్యకరమైన అలవాట్లను వ్యాయామంతో సరిదిద్దలేం. క్రమశిక్షణతో కూడిన శ్రమ, ఆరోగ్యకర ఆహారంతో ఫిట్నెస్ సాధించవచ్చు. స్నాక్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. లిక్కర్ అలవాటు ఉంటే పరిమితంగా తీసుకోవాలి' అని సూచించారు.
    1
    56 ఏళ్ల రాహుల్ గాంధీ ఫిట్నెస్ సీక్రెట్............. ఇదే
56 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటం వెనుక సీక్రెట్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. “ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం గంటపాటు మార్షల్ ఆర్ట్స్, ఈత, రన్నింగ్, యోగా, ఏరోబిక్ వంటివి చేస్తా. అనారోగ్యకరమైన అలవాట్లను వ్యాయామంతో సరిదిద్దలేం. క్రమశిక్షణతో కూడిన శ్రమ, ఆరోగ్యకర ఆహారంతో ఫిట్నెస్ సాధించవచ్చు. స్నాక్స్ ఎక్కువగా తినడం మానుకోవాలి. లిక్కర్ అలవాటు ఉంటే పరిమితంగా తీసుకోవాలి' అని సూచించారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    41 min ago
  • ముక్కిస లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ముక్కిస లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రిలు పొంగులేటి, పొన్నం హన్మకొండ జిల్లా:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, మనేపల్లి తదితర గ్రామాల్లో 394 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లతో పాటు కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశామని, అనర్హులు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
    1
    పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రిలు పొంగులేటి, పొన్నం 
హన్మకొండ జిల్లా:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, మనేపల్లి తదితర గ్రామాల్లో 394 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇళ్లతో పాటు కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశామని, అనర్హులు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • నాణ్యమైన విద్య వైద్యానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి నాణ్యమైన విద్య, వైద్యానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట -ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) నూతన భవన ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
    1
    నాణ్యమైన విద్య వైద్యానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి 
నాణ్యమైన విద్య, వైద్యానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట
-ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) నూతన భవన ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దెను కూల్చివేసినట్లుతెలుస్తోంది. ఆదివారం రాత్రి విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేసినట్లుగా స్థానికులు తెలిపారు.ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా కూల్చివేసారంటూ అధికారులపై బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత...
ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దెను కూల్చివేసినట్లుతెలుస్తోంది. ఆదివారం రాత్రి విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు
కూల్చివేసినట్లుగా స్థానికులు తెలిపారు.ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా కూల్చివేసారంటూ అధికారులపై బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    21 hrs ago
  • అభివృద్ధి కార్యక్రమాల చిత్రాలతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గొడుగులు జనగాం జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ లోడంగి అశోక్ సొంత ఖర్చులతో 500 గొడుగులను తయారు చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి చిత్రాలు, నియోజకవర్గ అభివృద్ధి పనుల ఫొటోలతో ప్రత్యేక గొడుగులు సిద్ధమయ్యాయి.వినూత్న డిజైన్‌తో రూపొందించిన ఈ గొడుగులు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
    1
    అభివృద్ధి కార్యక్రమాల చిత్రాలతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గొడుగులు
జనగాం జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ లోడంగి అశోక్ సొంత ఖర్చులతో 500 గొడుగులను తయారు చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి చిత్రాలు, నియోజకవర్గ అభివృద్ధి పనుల ఫొటోలతో ప్రత్యేక గొడుగులు సిద్ధమయ్యాయి.వినూత్న డిజైన్‌తో రూపొందించిన ఈ గొడుగులు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    13 hrs ago
  • ధర్నాకు దిగిన మాజీమంత్రి ఎర్రబెల్లి : నర్సంపేటలో ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను ఆదివారం కూల్చివేయడంతో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులతో కల్సి ధర్నాకు దిగారు. సోమవారం అకస్మాత్తుగా చేస్తున్న ధర్నా స్థలం నుండి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    ధర్నాకు దిగిన మాజీమంత్రి ఎర్రబెల్లి :  నర్సంపేటలో ఉద్రిక్తత
ఉమ్మడి వరంగల్ నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను ఆదివారం కూల్చివేయడంతో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులతో కల్సి ధర్నాకు దిగారు. సోమవారం అకస్మాత్తుగా చేస్తున్న ధర్నా స్థలం నుండి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా  బీఆర్ఎస్  కార్యకర్తలు అడ్డుకున్నారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.