ఈనెల 19న కోదాడలో మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కరరావు ఈ నెల 19న కోదాడలో మెగా జాబ్ మేళా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లాఇంచార్జి కలెక్టర్ భాస్కర్ రావు నేడొక తెలిపారు. నిరుద్యోగ యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఈ నెల 19.09.2026న కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయని తెలిపారు. జిల్లాలోని చివరి సంవత్సరం విద్యార్థులు, డిగ్రీ/డిప్లొమా/ఐటీఐ/ఇతర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మరియు అర్హత కలిగిన ఇతర ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు. మెగా జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐలు, ఇతర విద్యాసంస్థలు మరియు పరిశ్రమలతో సమన్వయం చేస్తూ అభ్యర్థులను అధిక సంఖ్యలో సమీకరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగార్థులకు ఒకే వేదికపై వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని, అర్హత ఉన్న ప్రతి యువతీ యువకుడు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈనెల 19న కోదాడలో మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కరరావు ఈ నెల 19న కోదాడలో మెగా జాబ్ మేళా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లాఇంచార్జి కలెక్టర్ భాస్కర్ రావు నేడొక తెలిపారు. నిరుద్యోగ యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఈ నెల 19.09.2026న కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయని తెలిపారు. జిల్లాలోని చివరి సంవత్సరం విద్యార్థులు, డిగ్రీ/డిప్లొమా/ఐటీఐ/ఇతర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మరియు అర్హత కలిగిన ఇతర ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు. మెగా జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐలు, ఇతర విద్యాసంస్థలు మరియు పరిశ్రమలతో సమన్వయం చేస్తూ అభ్యర్థులను అధిక సంఖ్యలో సమీకరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగార్థులకు ఒకే వేదికపై వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని, అర్హత ఉన్న ప్రతి యువతీ యువకుడు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కోరారు.
- సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి సెప్టెంబర్ 17 భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం లభించలేదని మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి అన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై విమోచనం పొందిందని ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తార్నాక చౌరస్తాలో బండ కార్తిక రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించే పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు3
- గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....3
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- *తండాలకు గ్రామపంచాయతీ హోదా – కేసీఆర్‌కు కృతజ్ఞతగా పాలాభిషేకం* *“మా తండాలో మా పాలన – మా గూడెంలో మా పాలన”* తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల స్థానిక పాలనకు మార్గం సుగమం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నూతన గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం గంటలకు చిల్పూర్ మండలంలో మాజీ AMC వైస్ చైర్మన్ మాలోతు రమేష్ నాయకు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గార్లగడ్డ తండా, లింగంపల్లి దేవోజీ తండా, తీగల తండా* గ్రామాల్లో పాలాభిషేకం కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా లంబాడీ మహిళలు కేసీఆర్ ని స్మరించుకుంటూ నృత్యాలు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, భూక్యా గోపాల్ నాయక్, లింగంపల్లి సర్పంచ్ భూక్యా సునీత లాలు, కొండాపూర్ సర్పంచ్ గుగులోత్ దేవేందర్ నాయక్, ఉప సర్పంచ్ రాజు రాధిక, రమేష్, రాజేందర్, వార్డు మెంబర్లు, లింగంపల్లి మాజీ అధ్యక్షులు రచ్చ రవి, ఎల్లయ్య, శంకర్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ బాలరాజు, మాటూరి శ్రీను, కొండ కనకయ్య, లకావత్ బాగ్న, సంపత్, తిరుపతి, పతేపూర్ గ్రామ మాజీ అధ్యక్షులు ఉమ్లా, వెంకన్న, లింగన్న, మాజీ సర్పంచ్ వెంకటేష్, యూత్ అధ్యక్షులు భూక్యా విజయ్ నాయక్, మాజీ తీగల తండా అధ్యక్షులు వెంకటేష్, వార్డు మెంబర్ రవి, యూత్ నాయకులు సుధాకర్, రాజు తదితరులు, మహిళలు పాల్గొన్నారు.1
- మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వకర్మలు తమ వృత్తి, ఉపాధికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న మంత్రి.. ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- 51 ఏళ్ల బంధం 💚 విడాకుల దాకా వెళ్లి ఒక్కటైంది* UPలోని బులంద్హర్లో 51 ఏళ్ల వివాహ బంధం విడాకుల దాకా వెళ్లి పోలీసుల చొరవతో ఒక్కటైంది. కలిసుండాల్సిన వృద్ధాప్యంలో నలుగురు కొడుకులు తల్లిదండ్రులను పంచుకోవడంతో వారి మధ్య దూరం పెరిగింది *51 ఏళ్ల బంధం 💚 విడాకుల దాకా వెళ్లి ఒక్కటైంది* UPలోని బులంద్హర్లో 51 ఏళ్ల వివాహ బంధం విడాకుల దాకా వెళ్లి పోలీసుల చొరవతో ఒక్కటైంది. కలిసుండాల్సిన వృద్ధాప్యంలో నలుగురు కొడుకులు తల్లిదండ్రులను పంచుకోవడంతో వారి మధ్య దూరం పెరిగింది. ఇటీవల ఇద్దరూ కలిసుండగా మందులకు భర్త డబ్బివ్వకపోవడంతో ఆ భార్య కుమిలిపోయింది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని భార్యకు నెలకు రూ.5వేలు ఇవ్వాలని ఒప్పించి ఆ బంధాన్ని నిలబెట్టారు..1
- *బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతాం* కోరుకొప్పుల నాగేష్ గౌడ్ బిజెపి మండల అధ్యక్షులు జాఫర్ ఘడ్ మండలం ఈ రోజు జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి జాఫర్ ఘడ్ మండల కమిటి ఆధ్వర్యం లో దేశ తొలి ఉప ప్రధాని హోం శాఖ మంత్రి వర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ రజాకార్లను ఊచకోత కోసిన బత్తిన మొగిలయ్య గౌడ్ చిత్రపటాలకు నివాళాలు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వచించడం జరిగింది అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల స్వేచ్ఛ సమానత్వం పొందిన రోజు రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి పోరాటం చేసిన కూనూరు గ్రామానికి చెందిన నెల్లుట్ల సుశీలాదేవి అలియాస్ అచ్చమాంబ ఇప్పటికీ నాడు జరిగిన రాక్షసత్వానికి నిజాం నిరంకుశత్వానికి సజీవ సాక్ష్యం MIM పార్టీ మెప్పు పొందడం కోసమే నాటి BRS ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం లో విఫలం అయ్యాయి నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతం బానిసలుగా వెట్టి చాకిరి చేసి యంత్రాలు గా ఉండేవాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం లో అమరులైన జాఫర్ ఘడ్ మండలం లోని పోరాట యోదులు చాలా మంది బిజెపి ఆద్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పరేడ్ గ్రౌండ్ లో జరపడం తెలంగాణ పైన బిజెపి కి ఉన్న చిత్త శుద్ధి కి నిదర్శనం తెలంగాణ బిజెపి అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది అధికారం లోకి రాకముందు BRS పార్టీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని ప్రకటించి అధికారం లోకి రాగానే మాట మార్చాయి అని వివరించడం జరిగింది అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా జాఫర్ ఘడ్ మండల కేంద్రం లో అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సింగరాపు రమేష్ మారపల్లి రవి BJYM జిల్లా నాయకులు పల్లె సంతోష్ రెడ్డి OBC మోర్చా మండల కన్వీనర్ పందిబోయినా యాదగిరి మన్ కి బాత్ మండల కన్వీనర్ గిరగొని యాదగిరి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అబ్బరాబోయిన యాకస్వామీ మండల నాయకులు అశోక్ దాంశెట్టి సోమేశ్వర్ పళ్ళ దయాకర్ బూత్ అధ్యక్షులు చవనబోయిన శ్రీనివాస్ సంగ గోపాల్ తాటికాయల హరికృష్ణ రాపర్తి వినయ్ రాజు దినేష్ తో పాటుగా గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది1
- నిజాంపేట మండల కేంద్రంలో గుంపులుగా కోతుల బెడదతో ప్రజల ఇబ్బందులు నిజాంపేట మండల కేంద్రంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంపులుగా ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తూ పలువురిని వెంబడిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కిరాణా సరుకులు చేతిలో పట్టుకుని వెళ్తున్న వారిని కోతులు వెంబడిస్తూ భయపెడుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కోతుల బెడదను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.1