Shuru
Apke Nagar Ki App…
ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి 32 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. సాధారణంగా కురవాల్సిన 587.1 మి.మీ వర్షపాతానికిగాను ఇప్పటివరకు 400 మి.మీ మాత్రమే కురిసింది. దీంతో భూగర్భజలం 5.02 మీటర్ల లోతుకు పడిపోయింది. రానున్న రోజుల్లో వేసవిలో తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంది.
ARUNKUMAR
ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి 32 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. సాధారణంగా కురవాల్సిన 587.1 మి.మీ వర్షపాతానికిగాను ఇప్పటివరకు 400 మి.మీ మాత్రమే కురిసింది. దీంతో భూగర్భజలం 5.02 మీటర్ల లోతుకు పడిపోయింది. రానున్న రోజుల్లో వేసవిలో తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంది.
More news from తెలంగాణ and nearby areas
- ఉద్యానవన శాఖ అధికారుల విస్తృత అవగాహన, ప్రచారంతో పాలేరు రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లుతున్నారు ఉద్యానవన శాఖ అధికారుల విస్తృత అవగాహన, ప్రచారంతో పాలేరు రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లుతున్నారు. అధికారుల మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలో సాగు 4,576 ఎకరాలకు చేరింది. ఈ ఏడాదే కొత్తగా 800 ఎకరాల్లో రైతులు తోటలు వేశారు. వచ్చే సీజన్ నాటికి మరి కొన్ని ఎకరాల్లో సాగు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధికారుల ప్రోత్సాహంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు1
- సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి1
- ఘనంగా గణపయ్య పూజలు... ఆటపాటలతో మహిళలు సందడి, సంస్కృతి సాంప్రదాయాలు, ఉట్టి పడేలా ఘనంగా పూజలు. తండాలో ఘనంగా గణపయ్య పూజలు.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని మంగాపురంలో, నాయక్ యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ఆటపాటలతో, మహిళలు పలు సంస్కృతి సాంప్రదాయాల పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిరావత్ బాలాజీ నాయక్, గడ్డ వెంకటేష్, రామలాల్ నాయక్, గిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- గౌరవరంలో వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు గౌరవరం జగ్గయ్యపేట నియోజకవర్గం లో గౌరవం గ్రామస్తులు వినాయకుడి నిమజ్జనం ఘన ఘన నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు1
- ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై పువ్వాడ ఫైర్..! | పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం | Puvvada Ajay Kumar ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమన్వయ లోపం, పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్, వెలుగుమట్ల తదితర ప్రాంతాల్లో పేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం బాధాకరమని పువ్వాడ అజయ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి, GO-58 ద్వారా అర్హులైన పేదలకు స్థల క్రమబద్ధీకరణ పట్టాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రీనివాసనగర్ పరిసర ప్రాంతాల్లో 696 మంది పేద కుటుంబాలు లబ్ధి పొందిన విషయాన్ని అధికారులు గుర్తించారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేసి, బాధిత పేదలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. అలాగే బాధిత కుటుంబాలతో పువ్వాడ అజయ్ కుమార్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలు కట్టుకున్న ఇళ్లకు రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని, అధికారులను చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, పాలడుగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, మండడుపు రామకృష్ణ, ఖయ్యూమ్, మెంతుల శ్రీశైలం, దడాల రఘు, మస్తాన్, వెంకటేశ్వర్లు, మాటూరి లక్ష్మీనారాయణ, లీగల్ సెల్ నిరోషా, తిరుమల్ రావు, సుగుణరావు తదితరులు పాల్గొన్నారు.1
- ఖమ్మం: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం... సీసీ ఫుటేజ్ ఇదే! ఖమ్మం- హైదరాబాద్ హైవేపై పిల్లలమర్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన వైద్యుడు జగదీష్ మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ పోలీసులు విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఖమ్మం నగరంలో మమత హాస్పిటల్‌లో న్యూరో సర్జన్‌గా సేవలు అందిస్తున్న న్యూరో సర్జన్ జగదీశ్ సజీవ దహనమయ్యారు.1
- ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి 32 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. సాధారణంగా కురవాల్సిన 587.1 మి.మీ వర్షపాతానికిగాను ఇప్పటివరకు 400 మి.మీ మాత్రమే కురిసింది. దీంతో భూగర్భజలం 5.02 మీటర్ల లోతుకు పడిపోయింది. రానున్న రోజుల్లో వేసవిలో తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంది.1
- కారు ప్రమాదం.. ఖమ్మం మమతా హాస్పిటల్ వైద్యుడి సజీవదహనం. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఖమ్మం మమతా హాస్పిటల్కు చెందిన న్యూరోసర్జన్ కాసకుర్తి జగదీశ్ సజీవదహనమైనట్లు పోలీసులు గుర్తించారు. కారులో మరెవరైనా ఉన్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఎస్సై అనిల్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.2