logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పిఠాపురంలో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు: ఆర్చిడ్ గ్లోబల్ స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన పిఠాపురం: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పిఠాపురం పట్టణంలోని ఆర్చిడ్ గ్లోబల్ స్కూల్ నందు 4వ రోజు విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు మరియు మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక అధికారి రామకృష్ణరాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా, తమను తాము కాపాడుకుంటూ ఇతరులను ఎలా రక్షించాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. గృహాలలో గ్యాస్ మరియు విద్యుత్ వల్ల కలిగే ప్రమాదాల నివారణ, ​షాపింగ్ మాళ్లు, ఆస్పత్రులు, అపార్ట్‌మెంట్‌లలో పాటించాల్సిన భద్రతా నియమాలు ​ప్రమాదం జరిగినప్పుడు ఎవరికి సమాచారం అందించాలి మరియు సురక్షితంగా బయటపడే మార్గాలు కోసం వివరించారు. ​విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అగ్నిమాపక సిబ్బందిని స్మరించుకుంటూ ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక అధికారీ రామకృష్ణరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండే ఇటువంటి భద్రతా నియమాలపై అవగాహన ఉండాలని,అత్యవసర సమయంలో వారు స్పందించే తీరుపైనే ప్రాణ నష్టం ఆధారపడి ఉంటుందని అన్నారు. ​స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రఘు కిషోర్ రెడ్డి మాట్లాడుతూ... అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులకు చాలా విశ్లేషణాత్మకంగా విషయాలను వివరించారని, ప్రతి ఏటా తమ పాఠశాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఎల్.ఎఫ్. హరి ప్రసాద్, ఫైర్ మాన్ సురేష్, డ్రైవర్ శ్రీను బాబు, స్కూల్ ప్రతినిధి అనూష, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Local News Reporter Pithapuram, Kakinada•
2 hrs ago
462e341a-8fe1-462b-ab9d-a9497b899059

పిఠాపురంలో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు: ఆర్చిడ్ గ్లోబల్ స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన పిఠాపురం: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పిఠాపురం పట్టణంలోని ఆర్చిడ్ గ్లోబల్ స్కూల్ నందు 4వ రోజు విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు మరియు మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక అధికారి రామకృష్ణరాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా, తమను తాము కాపాడుకుంటూ ఇతరులను ఎలా రక్షించాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. గృహాలలో గ్యాస్ మరియు విద్యుత్ వల్ల కలిగే ప్రమాదాల నివారణ, ​షాపింగ్ మాళ్లు, ఆస్పత్రులు, అపార్ట్‌మెంట్‌లలో పాటించాల్సిన భద్రతా నియమాలు ​ప్రమాదం జరిగినప్పుడు ఎవరికి సమాచారం అందించాలి మరియు సురక్షితంగా బయటపడే మార్గాలు కోసం వివరించారు. ​విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అగ్నిమాపక సిబ్బందిని స్మరించుకుంటూ ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక అధికారీ రామకృష్ణరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండే ఇటువంటి భద్రతా నియమాలపై అవగాహన ఉండాలని,అత్యవసర సమయంలో వారు స్పందించే తీరుపైనే ప్రాణ నష్టం ఆధారపడి ఉంటుందని అన్నారు. ​స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రఘు కిషోర్ రెడ్డి మాట్లాడుతూ... అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులకు చాలా విశ్లేషణాత్మకంగా విషయాలను వివరించారని, ప్రతి ఏటా తమ పాఠశాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఎల్.ఎఫ్. హరి ప్రసాద్, ఫైర్ మాన్ సురేష్, డ్రైవర్ శ్రీను బాబు, స్కూల్ ప్రతినిధి అనూష, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    1
    ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    1
    గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • “Inside the knitting process. Precision circular knitting turns yarn into the soft fabric used in MGM Vests.” #KnittingProcess #TextileManufacturing #MGMBanians
    1
    “Inside the knitting process.
Precision circular knitting turns yarn into the soft fabric used in MGM Vests.”
#KnittingProcess #TextileManufacturing #MGMBanians
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    5 min ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    22 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పెదకూరపాడు : జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్ ఫీల్డ్ కు వెళ్లి జనగణన సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ యొక్క వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు క్లుప్తంగా వివరించాలని కోరారు.
    1
    పెదకూరపాడు : జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్  ఫీల్డ్ కు వెళ్లి జనగణన   సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ యొక్క వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు క్లుప్తంగా వివరించాలని కోరారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.