*నియోజకవర్గాల వారీగా '99 రోజుల ప్రగతి ప్రణాళిక'పై కలెక్టర్ రాజర్షి షా సమీక్ష* పత్రికా ప్రకటన ఏప్రిల్ 30, 2026_ఆదిలాబాదు: జిల్లాలో చేపట్టిన '99 రోజుల ప్రగతి ప్రణాళిక' పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నియోజకవర్గాల వారీగా సంబంధిత శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న పనుల పురోగతిని, నిధుల వినియోగం పై సమీక్షించి మాట్లాడుతూ, ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన ప్రతి పనిని అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని, ఇందులో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని హెచ్చరిస్తూ, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాను ప్రగతి పథంలో నిలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, డీఆర్‌డీఏ పీడీ రవీందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
*నియోజకవర్గాల వారీగా '99 రోజుల ప్రగతి ప్రణాళిక'పై కలెక్టర్ రాజర్షి షా సమీక్ష* పత్రికా ప్రకటన ఏప్రిల్ 30, 2026_ఆదిలాబాదు: జిల్లాలో చేపట్టిన '99 రోజుల ప్రగతి ప్రణాళిక' పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నియోజకవర్గాల వారీగా సంబంధిత శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న పనుల పురోగతిని, నిధుల వినియోగం పై సమీక్షించి మాట్లాడుతూ, ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన ప్రతి పనిని అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని, ఇందులో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయి అధికారులు
క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని హెచ్చరిస్తూ, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాను ప్రగతి పథంలో నిలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, డీఆర్‌డీఏ పీడీ రవీందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- హాస్పిటల్ లో ఉన్న సమస్యపై సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మిట్టింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే,డాక్టర్ల కొరతపై తన చేరణవాణి తో జిల్లా కలెక్టట్ తో మాట్లాడిన బోథ్ ఎమ్మెల్యే...అనంతరం హాసుపత్రిలో సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.బోథ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజు రోజుకు ఎండలు విపరీతంగా మండుతున్నాయి ప్రజలు ఎండలో పట్ల అప్రమతంగా ఉండలి అని అన్నారు అత్యవసరం అయితే కానీ ప్రజలు ఇంటి నుండి బయటికి రావద్దు అని దేశంలోనే మన జిల్లా 10వ స్థానంలో ఉంది తీవ్రమైన ఎండల దృశ్య ప్రజలు పనులు వీలైనంత తొరగా ముగించుకొని ఇంటికి చేరుకొవాలి అని అన్నారు అదేవిధంగా బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి తోరలోనే ప్రజలకు అందుబాటులో వస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమం సూపడెంట్ రవీంద్ర ప్రసాద్, డాక్టర్లు,ఎలక్ట్రిసిటీ AE, స్థానిక సర్పంచ్ ఉన్నారు.1
- ఖానాపూర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేడే జెండాను శుక్రవారం కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జావిద్, సురేష్,రమేష్ గౌడ్, జంగం రాజేశ్వర్, రాకేష్ శేఖర్, నగేష్, ఆమెర్, శెంకరమ్మ, లావణ్య, మున్సిపాలిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు1
- అన్నదాత ఆవేదన...1
- Post by Venu Gopal1
- ముధోల్ ప్రాజెక్ట్ లో ముదురుతున్న అంగన్వాడి టీచర్స్ వివాదం... " ముధోల్ అంగన్వాడి స్కామ్" CVR NEWS కథనం పై స్పందించిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్లు... బాసర అంగన్వాడీ సెక్టర్ లోని సూరెల్లి గ్రామ అంగన్వాడి ఆయమ్మ చనిపోతే మేమంతా డబ్బులు జమచేసి కుటుంబాన్ని ఆదుకున్నాం.. అది అవినీతి ఎలా అవుతుంది..?? కొందరు అంగన్వాడి టీచర్స్ లను కలుపుకుని కావాలనే మాపై పని గట్టుకుని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శ... కార్మిక సంఘం నేతల ఆదేశాలు పాటించకుంటే, మీటింగ్ లకు హాజరు కాకుంటే ఫైన్ లు వేస్తున్నారని..! మేము ఎలాంటి కార్మిక సంఘాలలో లేమని తేల్చి చెప్పిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్... కలసి కట్టుగా పనిచేసి అవినీతి కి తావు లేకుండా, అంగన్వాడి లను అభివృద్ధి చేసుకుందామని, ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చవద్దని తెలిపిన అంగన్వాడి టీచర్స్... జిల్లా కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ అధికారిణి కి తమ వినతి పత్రాన్ని అందించిన సుమారు 170 మంది ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్...4
- *అంతర్జాతీయ మ్యాప్‌లో మంచిర్యాల: తొలి ఇంటర్నేషనల్ ఫిష్‌పాండ్‌కు శ్రీకారం* :* 85 ఎకరాల కేటాయింపు... 150 మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగు *మంచిర్యాల:* మత్స్య రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ, దేశంలోనే ప్రథమంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఇంటర్నేషనల్ ఫిష్‌పాండ్’ ఏర్పాటుకు మంచిర్యాల జిల్లా వేదిక కానుంది. హాజీపూర్ మండలం గుడిపేట రెవెన్యూ పరిధిలో 85.10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక జీవో విడుదల చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్‌సాగర్‌రావు బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. "ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు... మత్స్యకార కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు వేసిన పునాది. ఈ మెగా ఫిష్‌పాండ్ ద్వారా ప్రత్యక్షంగా 150 మంది మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభించడంతో పాటు, పరోక్షంగా వందలాది కుటుంబాలకు జీవనోపాధి చేకూరనుంది" అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి స్థాయిలో చేపల ఉత్పత్తి, శాస్త్రీయ పద్ధతుల్లో పెంపకం, శిక్షణా కేంద్రం ఏర్పాటు ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు. దూరదృష్టితో నిధులు మంజూరు చేసి, భూమి కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మంచిర్యాల జిల్లా దేశ మత్స్య పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది.1
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తాలో హమాలీ కార్మికులు మేడే జెండాను ఎగరవేశారు అలాగే సిపిఎం, సిఐటియు, అనుబంధ సంఘాల నాయకులు స్థానిక మార్కెట్ కమిటీ, బస్టాండ్ ల వద్ద మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కులను కాపాడుకుందామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.1
- Post by Venu Gopal1
- *జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులను ప్రారంభించి, తొలి కార్డును మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి, టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్రఅద్యక్షులు విరాహత్ అలీ కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.*1