కరీంనగర్ లో ఆశావర్కర్లు 48 గంటల ధర్నా...రాత్రి కలెక్టరేట్ ముందు దర్నా శిబిరంలోనే బస...వేతనం 18 వేలు ఇవ్వాలని డిమాండ్. కరీంనగర్ లో ఆశా వర్కర్స్ 48 గంటల ధర్నా చేపట్టారు. రాత్రి కలెక్టరేట్ ముందు ధర్నా శిబిరంలోనే నిద్రించారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఫిక్స్డ్ వేతనం రూ.18000 పై నిర్ణయం తీసుకోవాలని, ఇతర సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. CITU ఆద్వర్యంలో చేపట్టిన ధర్నాలో జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత, CITU జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాల్వ సారిక పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి తమ మేనిఫెస్టో లో ఆశా వర్కర్స్ లకు ఫిక్స్డ్ వేతనం రూ.18000 చెల్లిస్తామని ఓట్లు వేయించుకొని మోసం చేసిందని ఆరోపించారు. ఆశాలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50వేలు మట్టి ఖర్చులు, ప్రమోషన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రసూతి సెలవులు, ఆదివారం, పండగ సెలవులు నిర్ణయిస్తూ వెంటనే జి.ఓ లను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎ.ఎన్.సి., పి.ఎన్.సి టార్గెట్స్ ను రద్దు చేస్తూ వెంటనే జి.ఓ. లను జారీ చేయాలన్నారు. ఆశాలకు పెండింగ్ పారితోషికాలు, పి.ఆర్.సి ఏరియర్స్, లేప్రసి సర్వే, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ తదితర పెండింగ్ డబ్బులు తక్షణమే చెల్లించాలని కోరారు. ఆశాలతో ఎన్.సి.డి ఆన్లైన్ పని చేయించకూడదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కరీంనగర్ లో ఆశావర్కర్లు 48 గంటల ధర్నా...రాత్రి కలెక్టరేట్ ముందు దర్నా శిబిరంలోనే బస...వేతనం 18 వేలు ఇవ్వాలని డిమాండ్. కరీంనగర్ లో ఆశా వర్కర్స్ 48 గంటల ధర్నా చేపట్టారు. రాత్రి కలెక్టరేట్ ముందు ధర్నా శిబిరంలోనే నిద్రించారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఫిక్స్డ్ వేతనం రూ.18000 పై నిర్ణయం తీసుకోవాలని, ఇతర సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. CITU ఆద్వర్యంలో చేపట్టిన ధర్నాలో జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత, CITU జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాల్వ సారిక పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్
పార్టీ అధికారంలోకి రావటానికి తమ మేనిఫెస్టో లో ఆశా వర్కర్స్ లకు ఫిక్స్డ్ వేతనం రూ.18000 చెల్లిస్తామని ఓట్లు వేయించుకొని మోసం చేసిందని ఆరోపించారు. ఆశాలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50వేలు మట్టి ఖర్చులు, ప్రమోషన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రసూతి సెలవులు, ఆదివారం, పండగ సెలవులు నిర్ణయిస్తూ వెంటనే జి.ఓ లను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎ.ఎన్.సి., పి.ఎన్.సి టార్గెట్స్ ను రద్దు చేస్తూ వెంటనే జి.ఓ. లను జారీ చేయాలన్నారు. ఆశాలకు పెండింగ్ పారితోషికాలు, పి.ఆర్.సి ఏరియర్స్, లేప్రసి సర్వే, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ తదితర పెండింగ్ డబ్బులు తక్షణమే చెల్లించాలని కోరారు. ఆశాలతో ఎన్.సి.డి ఆన్లైన్ పని చేయించకూడదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
- ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఆదివారం సుడిగాలి విధ్వంసం సృష్టించింది, ఈ సుడిగాలి భీభత్సానికి 70 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఒకరు మృత్యువాత పడగా పలువురు గాయాలపాలయ్యారు. అత్యంత ప్రభావితమైన ప్రాంతం కరంజియాలోని కియా గ్రామంలో బలమైన గాలులు నివాసితులలో భయాందోళనలను సృష్టించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు సోమవారం తనిఖీ చేశారు.లడ్డు ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను ఆమె పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్ క్యాప్స్, శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీల సమయంలో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఈవో రమాదేవి గారి వెంట పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో రైతు వేదికలో గీసుగొండ, సంగెం మండలాల రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యాంత్రీకరణ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.1
- పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య కీలక సముద్ర మార్గమైన Strait of Hormuz ను విజయవంతంగా దాటి భారతదేశానికి చెందిన LPG ట్యాంకర్ Shivalik సురక్షితంగా గుజరాత్‌లోని Mundra Port కు చేరుకుంది. ఈ నౌక సుమారు 45 వేల మెట్రిక్ టన్నుల LPG ను తీసుకువచ్చింది. � The Economic Times +1 పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ సముద్ర మార్గంలో నౌకాయానానికి ప్రమాదం ఉన్నప్పటికీ, భారతదేశం చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసింది. � Reuters ఈ LPG సరుకు దేశంలోని గృహ వినియోగానికి ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ విజయవంతమైన ప్రయాణంతో గ్యాస్ సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంతవరకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. � The Economic Times ప్రధానమంత్రి Narendra Modi నాయకత్వంలో భారతదేశం దౌత్యపరంగా కీలక చర్యలు తీసుకుని ఇంధన సరఫరాను భద్రపరచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీకు కావాలంటే ఇదే వార్తను మరింత చిన్నగా (వాట్సాప్/సోషల్ మీడియా పోస్టు స్టైల్) కూడా తయారు చేసి ఇస్తాను.1
- అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది..1
- నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహుజనులకు రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షత వహించగా బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.2
- జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగించారు. ఇంటి ముందు, ఇంట్లో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటోలను తొలగించిన కార్యకర్తలు, జీవన్ రెడ్డి ఫోటోతో కొత్త ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల తొలగింపుతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చేప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 24 లేదా 25న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.1
- వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం – భీమేశ్వర స్వామి మండపంలో పోస్టర్ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ మరియు ఆహ్వాన పత్రికను సోమవారం భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి భక్తుల సమక్షంలో విడుదల చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు మరియు భక్తులు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి, కుంటపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.1