పెదపాడు గ్రామంలో పాఠశాల భవనం వెంటనే పూర్తి చేయాలి – గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని పెదపాడు గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద మాధవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెడపాడు గ్రామంలోని ఈ పాఠశాలలో సుమారు 26 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాల భవనం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో పిల్లలు పాఠాలు నేర్చుకోవడానికి, ఉపాధ్యాయులు బోధించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాడు–నేడు పథకం కింద పాఠశాల భవనం మంజూరు అయినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో పిల్లలు సరైన సౌకర్యాలు లేకుండా చదువుకుంటున్న పరిస్థితి నెలకొంది. పిల్లలు కూర్చోవడానికి సరైన స్థలం లేక చిప్స్ రాళ్లపై కూర్చోవాల్సి వస్తోందని, వేసవిలో ఎండ నేరుగా పడటం, వర్షాకాలంలో వర్షం పడటం వలన చదువుకు ఆటంకం కలుగుతోందని గ్రామస్తులు తెలిపారు. అలాగే వర్షాకాలంలో సుమారు నాలుగు నెలలపాటు పాఠశాల మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు పాఠశాలకు రావడానికి ఒక వాగు దాటి రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే గ్రామ ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం, పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకెళ్లడం, గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలించడం వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన రహదారి లేక అనేక సందర్భాల్లో సమయానికి ఆసుపత్రికి చేరుకోలేక మరణాలు కూడా సంభవించాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కావున అధికారులు వెంటనే గ్రామాన్ని పర్యవేక్షించి పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు రహదారి మరియు బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు చంటిబాబు, నాగరాజు, మాధవరావు, గ్రామ ప్రజలు వినాయకరావు, అంజిరావు, అప్పలనాయుడు, చిన్నమ్మి, బొంజునాయుడు, హరి తదితరులు పాల్గొన్నారు.

- Post by Shyam1
- అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని పెదపాడు గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద మాధవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెడపాడు గ్రామంలోని ఈ పాఠశాలలో సుమారు 26 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాల భవనం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో పిల్లలు పాఠాలు నేర్చుకోవడానికి, ఉపాధ్యాయులు బోధించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాడు–నేడు పథకం కింద పాఠశాల భవనం మంజూరు అయినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో పిల్లలు సరైన సౌకర్యాలు లేకుండా చదువుకుంటున్న పరిస్థితి నెలకొంది. పిల్లలు కూర్చోవడానికి సరైన స్థలం లేక చిప్స్ రాళ్లపై కూర్చోవాల్సి వస్తోందని, వేసవిలో ఎండ నేరుగా పడటం, వర్షాకాలంలో వర్షం పడటం వలన చదువుకు ఆటంకం కలుగుతోందని గ్రామస్తులు తెలిపారు. అలాగే వర్షాకాలంలో సుమారు నాలుగు నెలలపాటు పాఠశాల మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు పాఠశాలకు రావడానికి ఒక వాగు దాటి రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే గ్రామ ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం, పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకెళ్లడం, గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలించడం వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన రహదారి లేక అనేక సందర్భాల్లో సమయానికి ఆసుపత్రికి చేరుకోలేక మరణాలు కూడా సంభవించాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కావున అధికారులు వెంటనే గ్రామాన్ని పర్యవేక్షించి పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు రహదారి మరియు బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు చంటిబాబు, నాగరాజు, మాధవరావు, గ్రామ ప్రజలు వినాయకరావు, అంజిరావు, అప్పలనాయుడు, చిన్నమ్మి, బొంజునాయుడు, హరి తదితరులు పాల్గొన్నారు.1
- చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ భీమాసింగి గ్రామంలో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సెగ్గే గురుబాబు అనే యువకుడు పల్సర్ బైక్‌పై ప్రయాణిస్తుండగా బోధకొండమ్మ తల్లి ఆలయం సమీపంలో బ్రేకులు పనిచేయకపోవడంతో సుమారు 30 అడుగుల లోతులోకి పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఎంతో శ్రమతో లోయలోకి దిగి యువకుడిని పైకి తీసుకొచ్చారు. అనంతరం అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సహాయానికి ముందుకొచ్చిన చింతపల్లి వాసులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఎమ్మెల్యే మత్యారాస విశ్వేశ్వరరాజు మానవత్వంతో స్పందించాలని కోరారు.1
- *//విజయనగరం జిల్లా పోలీసు//* *//మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలవాలి//* *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు ముస్లిం పోలీసు అధికారులు మరియు సిబ్బందిని మార్చి 17న జిల్లా కేంద్రానికి పిలిపించి, జిల్లా పోలీసు కార్యాలయంలో వారితో సమావేశం అయి, వారితో ముచ్చటించి, ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - రంజాన్ మాసం శాంతి, సహనం, సేవా భావానికి ప్రతీక అని అన్నారు. మనమందరం భారతియులమని, ఒకటే కులం అని అది పోలీసు కులం అని, అన్ని మతాల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పోలీసు విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సమానంగా గౌరవించబడతారని ఆయన అన్నారు. తదుపరి వారితో మాట్లాడి వారి ఆచార సాంప్రదాయాల గురించి జిల్లా ఎస్పీ గారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్లిం పోలీసు అధికారులు మరియు సిబ్బంది జిల్లా ఎస్పీ గారిని వారి మత సాంప్రదయ పద్దతిలో సత్కరించారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బందికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పరస్పర ఐక్యత, స్నేహభావం మరింత బలపడిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బంది, సిఐలు ఎ.వి.లీలరావు, టి.శ్రీనివాసరావు, ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. *//జిల్లా పోలీసు కార్యాలయం//* *//విజయనగరం//*1
- Pure Cotton Comfort that surrounds You - MGM Vests. #MGM. #Cotton. #Vest. #Hosiery #Vizianagaram. #Comfort.1
- వైసీపీ హయాంలో ఆమోదం పొందిన పనులనే చేస్తున్నారు1
- మండపేట న్యూస్... మండపేట మండలం కేశవరం నుండి అనపర్తి వరకు కెనాల్ రోడ్ లో ఓ వైపు తుప్పలు, పిచ్చి మొక్కలతో నిండి పోతుంది. ఇవి కొన్ని ప్రధాన మలులుపులు వద్ద ఉండటం తో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సమస్యను గుర్తించిన రూరల్ సి ఐ దొరరాజు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిష్కరించారు. ప్రాక్లైన్ తో ఆయా చోట్ల తుప్పలు పిచ్చి మొక్కలు మంగళ వారం తొలగించారు. ఈ సందర్భంగా సి ఐ దొరరాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్ల ను గుర్తించి నట్లు తెలిపారు.అక్కడ పెరిగిన పొదలను తొలగించే ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ క్రమంలో ఆర్ అండ్ బి డీఈ సూర్యనారాయణ మండపేట రూరల్ ఎస్.ఐ వి. కిశోర్ లతో సమన్వయంతో సంబంధిత ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. వెంటనే బుష్ క్లియరెన్స్ చేశామని చెప్పారు. దీని వల్ల వల్ల రహదారులపై క్లియరెన్స్ మెరుగుపడి, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సహకరించాలని కోరారు.2
- *//విజయనగరం జిల్లా పోలీసు//* *//నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సరులు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు//* *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* 📍*నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన 550 సైలెన్సరులను సీజ్ చేసిన పోలీసులు* 📍*జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఆధ్వర్యంలో రోడ్డు రోలరుతో సైలెన్సరులను ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు* 📍*వాహనాల సైలెన్సరును మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు, వాహనాదారులకు జరిమానా విధిస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు* విజయనగరం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సరులను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలెన్సరులను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మార్చి 17న హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన సైలెన్సరులను తొలగించి, వాటిని మళ్ళీ వాహనదారులు వినియోగించకుండా వాటిని రోడ్డు రోలరుతో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - ద్విచక్ర వాహనాలకు సంబంధిత వాహన తయారీ కంపెనీలు ప్రత్యేకంగా డిజైన్ చేసి, సైలెన్సరులను అమరుస్తారని, వీటిని మార్పు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఇటీవల కాలంలో యువత తమ ద్విచక్ర వాహనాల సైలెన్సరులను మార్పులు చేస్తూ, పెద్ద శబ్ధాలతో ఇతర వాహనదారులను, ప్రజలు, పాదచారులను, పిల్లలు, హృద్రోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారన్నారు. వీటిని నియంత్రించుటలో భాగంగా గత ఆరు మాసాల్లో ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో పలుమార్లు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన 550 సైలెన్సరులను మెకానిక్ సహకారంతో తొలగించామన్నారు. అంతే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సరులను అమర్చినందుకుగాను ఒక్కొక్కరికి రూ.1500/- చొప్పున జరిమానా విధించామన్నారు. తొలగించిన సైలెన్సరులను మళ్ళీ వాహనదారులు వినియోగించకుండా ఉండేందుకుగాను వీటిని రహదారిపై వేసి, రోడ్డు రోలరుతో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భవిష్యత్తులో ఇదే తరహా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ప్రత్యేక డ్రైవులు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు ఉన్న సైలెన్సరులను తొలగిస్తామన్నారు. అంతేకాకుండా, కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం ఈ తరహా సైలన్సరులను అమర్చిన వాహనాలను సీజ్ చేయడంతోపాటు, ఆయా వాహనదారులకు జరిమాన విధిస్తామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండే సైలన్సరులును అమ్మే షాపు యజమానులతో, బైక్ మెకానిక్ లతో సమావేశాలు ఏర్పాటు చేసి వారిని హెచ్చరించడం, నోటీసులు ఇవ్వడం కూడా జరిగిందని, ఎవరైనా అతిక్రమిస్తే వారిపై రౌడీ షీట్ తెరిచి నిఘా పెట్జటడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతీ వాహనదారుడు రహదారి భద్రతను పాటించాలని, వాహనాలను అతివేగంగా నడపకూడదని, హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, మన భద్రతతోపాటు ఇతరుల భద్రత కొరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సరులను అమర్చి పెద్ద శబ్ధాలతో ప్రజలను ఇబ్బంది పెడితే వెంటనే డయిల్ 100/112 లేదా స్థానిక పోలీసు స్టేషనుకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, ట్రాఫిక్ సిఐ సూరినాయుడు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు, ఎస్ఐలు శంభాన రవి, ఎస్. భాస్కరరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. *//జిల్లా పోలీసు కార్యాలయం//* *//విజయనగరం//*1