తుప్పలు పిచ్చి మొక్కలతో రోడ్ ప్రమాదాలు... పోలీస్ ఆర్ అండ్ బి శాఖల ఆధ్వర్యంలో తొలగింపు... మండపేట న్యూస్... మండపేట మండలం కేశవరం నుండి అనపర్తి వరకు కెనాల్ రోడ్ లో ఓ వైపు తుప్పలు, పిచ్చి మొక్కలతో నిండి పోతుంది. ఇవి కొన్ని ప్రధాన మలులుపులు వద్ద ఉండటం తో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సమస్యను గుర్తించిన రూరల్ సి ఐ దొరరాజు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిష్కరించారు. ప్రాక్లైన్ తో ఆయా చోట్ల తుప్పలు పిచ్చి మొక్కలు మంగళ వారం తొలగించారు. ఈ సందర్భంగా సి ఐ దొరరాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్ల ను గుర్తించి నట్లు తెలిపారు.అక్కడ పెరిగిన పొదలను తొలగించే ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ క్రమంలో ఆర్ అండ్ బి డీఈ సూర్యనారాయణ మండపేట రూరల్ ఎస్.ఐ వి. కిశోర్ లతో సమన్వయంతో సంబంధిత ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. వెంటనే బుష్ క్లియరెన్స్ చేశామని చెప్పారు. దీని వల్ల వల్ల రహదారులపై క్లియరెన్స్ మెరుగుపడి, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సహకరించాలని కోరారు.
తుప్పలు పిచ్చి మొక్కలతో రోడ్ ప్రమాదాలు... పోలీస్ ఆర్ అండ్ బి శాఖల ఆధ్వర్యంలో తొలగింపు... మండపేట న్యూస్... మండపేట మండలం కేశవరం నుండి అనపర్తి వరకు కెనాల్ రోడ్ లో ఓ వైపు తుప్పలు, పిచ్చి మొక్కలతో నిండి పోతుంది. ఇవి కొన్ని ప్రధాన మలులుపులు వద్ద ఉండటం తో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సమస్యను గుర్తించిన రూరల్ సి ఐ దొరరాజు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిష్కరించారు. ప్రాక్లైన్ తో ఆయా చోట్ల తుప్పలు పిచ్చి మొక్కలు మంగళ వారం తొలగించారు. ఈ సందర్భంగా సి ఐ దొరరాజు
మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్ల ను గుర్తించి నట్లు తెలిపారు.అక్కడ పెరిగిన పొదలను తొలగించే ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ క్రమంలో ఆర్ అండ్ బి డీఈ సూర్యనారాయణ మండపేట రూరల్ ఎస్.ఐ వి. కిశోర్ లతో సమన్వయంతో సంబంధిత ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. వెంటనే బుష్ క్లియరెన్స్ చేశామని చెప్పారు. దీని వల్ల వల్ల రహదారులపై క్లియరెన్స్ మెరుగుపడి, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సహకరించాలని కోరారు.
- ఈ నెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు నర్మెట్టలో వ్యవసాయ,మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో రైతు మహోత్సవం నిర్వహించబడుతున్నది..ప్రత్యేక ఆకర్షణగా వ్యవసాయ, ఉద్యానవన మరియు పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్,బ్యాంకులు, FPOలు, స్టార్టప్‌లు మరియు ప్రైవేట్ కంపెనీల ప్రదర్శనలు మరియు అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు ప్రత్యేక ముఖాముఖీ కార్యక్రమాలు.. 22వ తేదీ సాయంత్రం 4.00 గం లకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం మరియు రైతు భరోసా నిధుల విడుదల.. కావున ఈ వేడుకలో ప్రజాప్రతినిధులు, ఆదర్శ రైతులు, మరియు రైతు బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి1
- ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి బట్టి , రాష్ట్ర మంత్రి తుమ్మల , శ్రీ పొంగులేటి ధన్యవాదములు తెలియజేసిన ... డాక్టర్ మట్టా దయానంద్.ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, మున్సిపల్ కమీషనర్, అడిషనల్ డి ఎం హెచ్ ఓ చందు నాయక్, గంగారాం పిహెచ్సి డాక్టర్స్, సిబ్బంది, ఆషా వర్కర్స్,మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని పెదపాడు గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద మాధవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెడపాడు గ్రామంలోని ఈ పాఠశాలలో సుమారు 26 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాల భవనం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో పిల్లలు పాఠాలు నేర్చుకోవడానికి, ఉపాధ్యాయులు బోధించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాడు–నేడు పథకం కింద పాఠశాల భవనం మంజూరు అయినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో పిల్లలు సరైన సౌకర్యాలు లేకుండా చదువుకుంటున్న పరిస్థితి నెలకొంది. పిల్లలు కూర్చోవడానికి సరైన స్థలం లేక చిప్స్ రాళ్లపై కూర్చోవాల్సి వస్తోందని, వేసవిలో ఎండ నేరుగా పడటం, వర్షాకాలంలో వర్షం పడటం వలన చదువుకు ఆటంకం కలుగుతోందని గ్రామస్తులు తెలిపారు. అలాగే వర్షాకాలంలో సుమారు నాలుగు నెలలపాటు పాఠశాల మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు పాఠశాలకు రావడానికి ఒక వాగు దాటి రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే గ్రామ ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం, పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకెళ్లడం, గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలించడం వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన రహదారి లేక అనేక సందర్భాల్లో సమయానికి ఆసుపత్రికి చేరుకోలేక మరణాలు కూడా సంభవించాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కావున అధికారులు వెంటనే గ్రామాన్ని పర్యవేక్షించి పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు రహదారి మరియు బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు చంటిబాబు, నాగరాజు, మాధవరావు, గ్రామ ప్రజలు వినాయకరావు, అంజిరావు, అప్పలనాయుడు, చిన్నమ్మి, బొంజునాయుడు, హరి తదితరులు పాల్గొన్నారు.1
- *తాడేపల్లి:* *నా భర్త నాకు కావాలి.... భర్త కోసం భార్య పోరాటం.* *కుంచనపల్లిలోని భర్త నివాసం ముందు కుటుంబ సభ్యులతో కలసి భార్య నిరసన.* *కాపురానికి తీసుకువెళ్లాలని భర్త ఇంటి ముందు ధర్నా.* *కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన చైతన్య అనే యువతితో గుంటూరు జిల్లా మందడంకు చెందిన యర్రంనేనీ విజయ్ తో 2017లో వివాహం* *ప్రెగ్నెన్సీ రావడంతో తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ... పెళ్లి అయిన 8 నెలలకే భార్య చైతన్యను వదిలేసిన భర్త విజయ్.* *భర్త కోసం 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తనకు అత్తమామలు న్యాయం చేయడం లేదని భార్య ఆవేదన.* *తమకు పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ధర్నా.* *భార్యను కాపురానికి తీసుకువెళ్లాలని న్యాయస్థానం నుంచి ఆర్డర్ వచ్చిన కోర్టు ఆర్డర్ ను పట్టించుకోని, భర్త, అత్తమామలు.* *వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనని , బిడ్డని పట్టించుకోవడం లేదని ఆరోపణ.*1
- చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ భీమాసింగి గ్రామంలో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సెగ్గే గురుబాబు అనే యువకుడు పల్సర్ బైక్‌పై ప్రయాణిస్తుండగా బోధకొండమ్మ తల్లి ఆలయం సమీపంలో బ్రేకులు పనిచేయకపోవడంతో సుమారు 30 అడుగుల లోతులోకి పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఎంతో శ్రమతో లోయలోకి దిగి యువకుడిని పైకి తీసుకొచ్చారు. అనంతరం అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సహాయానికి ముందుకొచ్చిన చింతపల్లి వాసులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఎమ్మెల్యే మత్యారాస విశ్వేశ్వరరాజు మానవత్వంతో స్పందించాలని కోరారు.1
- విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అధికార–ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదికైంది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ పాలన, ప్రస్తుతం కొనసాగుతున్న టీడీపీ ప్రభుత్వ పరిపాలనపై ఇరు పక్షాల కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే అభివృద్ధి పనులు, మున్సిపల్ నిధుల వినియోగం, పట్టణంలో మౌలిక వసతుల పరిస్థితి వంటి అంశాలపై చర్చ వేడెక్కింది. అధికార పార్టీ కౌన్సిలర్లు గత వైసీపీ ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. అనేక పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లేదని పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందించిన ప్రతిపక్ష సభ్యులు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, పట్టణ ప్రజలకు సరైన సేవలు అందడం లేదని ఆరోపించారు. అభివృద్ధి పనుల పేరుతో రాజకీయ ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో సమావేశం కొంతసేపు ఉద్రిక్తంగా మారింది.1
- పాము1
- రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట బయటాయించి ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆశా కార్యకర్తలకు నెలవారీ వేతనం 18వేలు చెల్లించాలని, ఆశా రంగానికి సరిపడా నిధులు కేటాయించాలని తదితర సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... ఆశా కార్యకర్తలకు శ్రమకు దగ్గ వేతనం చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న సర్వే డబ్బులు ఇవ్వాలని, కేంద్రం పెంచిన 15 వందల పారితోషకం తక్షణమే అమలు చేయాలని కోరారు. అన్ని పనులకు ఆశాలను ఉపయోగించుకుని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే మరిన్ని ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.4
- దమ్మపేట మండల పరిధిలోని గొర్రె గుట్ట గ్రామములో ఈరోజు ఉదయం జరిగిన లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మల యుగంధర్ తో పాటు దొడ్డ ప్రసాద్ కాసాని నాగప్రసాద్ మంగేశ్వర తో పాటు దమ్మపేట మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు1