Shuru
Apke Nagar Ki App…
సాత్నాల మండలాన్ని ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి: TAGS... సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలని, 5వ షెడ్యూల్‌లో లేని ఆదివాసీ గ్రామాలను చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. 1/70, పిసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, జివో 3ని పునరుద్ధరించాలని నేతలు పూసం సచిన్, బి.రవికుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను 5వ షెడ్యూల్ భూభాగంలోనే నిర్మించాలని, లేకపోతే కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.
Mallaiah Potta
సాత్నాల మండలాన్ని ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి: TAGS... సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలని, 5వ షెడ్యూల్‌లో లేని ఆదివాసీ గ్రామాలను చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. 1/70, పిసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, జివో 3ని పునరుద్ధరించాలని నేతలు పూసం సచిన్, బి.రవికుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను 5వ షెడ్యూల్ భూభాగంలోనే నిర్మించాలని, లేకపోతే కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.
More news from తెలంగాణ and nearby areas
- అక్రమ వడ్డీ వ్యాపారి అరెస్ట్: టూ టౌన్ సీఐ నాగరాజు..... ADB: అధిక వడ్డీలకు అక్రమంగా రుణాలు ఇస్తున్న దినేష్ కుమార్ తో పాటు ఆయనకు సహకరిస్తున్న కిషోర్‌ను అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 20 మొబైల్ ఫోన్లు, 4 బైకులు, 6 ఆర్‌సీలు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై మనీ లెండర్స్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.1
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి మరియు ఆర్థిక పురోగతికి మోదీ ప్రభుత్వం నిరంతరం తోడ్పాటునందిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి ₹4,597 కోట్ల అదనపు పన్నుల వాటాను విడుదల చేసింది. సకాలంలో అందుతున్న ఈ కేంద్ర నిధులు రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనను మరియు వివిధ సంక్షేమ పథకాల అమలును మరింత వేగవంతం చేయనున్నాయి.1
- పార్టీ బలోపేతానికి ఐక్యత, క్రమశిక్షణ అవసరం: మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే 'సంఘటన్ శ్రీజన్ అభియాన్' కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ రూరల్, మావల, తాంసి, భీంపూర్ మండలాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15లోగా మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని, నియామకాల్లో వర్గ విభేదాలకు తావు లేకుండా సామాజిక న్యాయం పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి మండల కమిటీలో అధ్యక్షుడితో కలిపి 22 మంది సభ్యులు ఉండేలా, ఇద్దరు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మహిళా నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని, పార్టీ బలోపేతానికి ఐక్యత, క్రమశిక్షణ, సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. సమావేశాల్లో డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్,మాజీ ఎంపీ సోయం బాపూరావు,కంది శ్రీనివాస్ రెడ్డి,ఆడే గజేందర్,మల్లెపూల సత్యనారాయణ,సాజీద్ ఖాన్,అల్లూరి సంజీవ్ రెడ్డి,అడ్డి భోజారెడ్డి,గీమ్మ సంతోష్‌తో పాటు ప్రజాప్రతినిధులు,మండల అధ్యక్షులు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఖానాపూర్ మున్సిపాలిటీ రోడ్ల విస్తరణ పనులకు మోక్షం ఎప్పుడు కలుగును ఖానాపూర్ మున్సిపాలిటీ పేరుకే మున్సిపాలి టీ రోడ్ల విస్తరణ పనులు చేయకపోగా వాహనదారులకు ఇబ్బందిగా మారిన ఇరుకైన రోడ్లు గుంత గుంతలు ఇప్పుడు అ గుంతలో సిమెంట్తో పూతలు పూసి చేతులు అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు1
- వార్తకు స్పందించిన అటవీశాఖ.. కవ్వాల్ టైగర్ జోన్‌లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో బారికేడ్లు రాత్రివేళ కనిపించక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందంటూ ఇటీవల ప్రచురితమైన వార్తకు అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్ల వద్ద అవసరమైన సూచికలను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు. గతంలో బారికేడ్ల వద్ద ముందస్తు హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చీకటిలో బారికేడ్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై వార్త వెలువడిన వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ప్రధాన రహదారి వెంట "GO SLOW", "అడవి జంతువుల కోసం నెమ్మదిగా వెళ్లండి" వంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే బారికేడ్లు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ సూచికలు ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందని సమాచారం. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడంపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా టైగర్ జోన్ పరిధిలోని అన్ని బారికేడ్ల వద్ద భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రమాదాలకు అవకాశం లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.1
- అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలి నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భైంసా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సిందే కపిల్,బీజేపీ నాయకులు బాలాజీ సూత్రవే స్థానిక భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా వారూ మాట్లాడుతూ మిల్లర్లు ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకోని తిరిగి బియ్యం అప్పగించకుండా పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.బ్లాక్ లిస్టులో ఉన్న డిఫల్టర్ రైస్ మిల్లులకు సైతం అధికారులు ధాన్యం కేటాయిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు.1
- కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు1
- *వైద్యరోగ్య సౌకర్యాలను మెరుగుపరచాలి. రిమ్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి*. ప్రకటన *బండారు రవికుమార్ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు*. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో నెలకొని ఉన్న సమస్యల పైన అధ్యాయం చేయడానికి సిపిఎం పార్టీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సభ్యులు బండారు రవికుమార్ రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ లో ప్రొఫెసర్ పోస్టులు 5 అసోసియేట్ 44 ట్యూటర్ 25 అసిస్టెంట్ ప్రొఫెసర్ 13 సీనియర్ రెసిడెన్సి 21 సీఎంఓ 6 సి ఏ ఎస్ ఆర్ ఎం ఓ 4 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 115 ఖాళీలుగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలను అందించవచ్చు అని అన్నారు. ఎనిమిది లిఫ్టులలో రెండు మాత్రమే పని చేస్తున్నా యని పేషెంట్లకు డాక్టర్లకు వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇబ్బందిగా మారిందన్నారు. పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయకపోవడం 125 కేవీఏ జనరేటర్ పనిచేయకపోవడం రెండు అంబులెన్సులు పనిలో లేకపోవడం సరి కాదని అన్నారు. కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ప్రారంభించిన క్రిటికల్ కేర్ లో సిబ్బందిని నియమించకపోవడంతో క్రిటికల్ కేర్ సేవలు ప్రారంభం కాలేదని వెంటనే సిబ్బందిని నియమించి సేవలు అందించాలని డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీలో నెఫ్రాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలను వెంటనే ప్రారంభించాలని ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు పెరిగిన ఎంబిబిఎస్ 50 సీట్లకు సరిపడా ఫ్యాకల్టీని నియమించాలని విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే రిమ్స్ ను సందర్శించాలని నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం కార్యచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు వేతనాలు పెంచాలని అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రకటన *వైద్యరోగ్య సౌకర్యాలను మెరుగుపరచాలి. రిమ్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి*. *బండారు రవికుమార్ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు*. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో నెలకొని ఉన్న సమస్యల పైన అధ్యాయం చేయడానికి సిపిఎం పార్టీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సభ్యులు బండారు రవికుమార్ రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ లో ప్రొఫెసర్ పోస్టులు 5 అసోసియేట్ 44 ట్యూటర్ 25 అసిస్టెంట్ ప్రొఫెసర్ 13 సీనియర్ రెసిడెన్సి 21 సీఎంఓ 6 సి ఏ ఎస్ ఆర్ ఎం ఓ 4 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 115 ఖాళీలుగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలను అందించవచ్చు అని అన్నారు. ఎనిమిది లిఫ్టులలో రెండు మాత్రమే పని చేస్తున్నా యని పేషెంట్లకు డాక్టర్లకు వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇబ్బందిగా మారిందన్నారు. పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయకపోవడం 125 కేవీఏ జనరేటర్ పనిచేయకపోవడం రెండు అంబులెన్సులు పనిలో లేకపోవడం సరి కాదని అన్నారు. కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ప్రారంభించిన క్రిటికల్ కేర్ లో సిబ్బందిని నియమించకపోవడంతో క్రిటికల్ కేర్ సేవలు ప్రారంభం కాలేదని వెంటనే సిబ్బందిని నియమించి సేవలు అందించాలని డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీలో నెఫ్రాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలను వెంటనే ప్రారంభించాలని ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు పెరిగిన ఎంబిబిఎస్ 50 సీట్లకు సరిపడా ఫ్యాకల్టీని నియమించాలని విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే రిమ్స్ ను సందర్శించాలని నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం కార్యచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు వేతనాలు పెంచాలని అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్ జిల్లా కమిటీ సభ్యులు R మంజుల,బొజ్జ ఆశన్న నాయకులు ఆరిఫా తదితరులు పాల్గొన్నారు.జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్ జిల్లా కమిటీ సభ్యులు R మంజుల,బొజ్జ ఆశన్న నాయకులు ఆరిఫా తదితరులు పాల్గొన్నారు.2