Shuru
Apke Nagar Ki App…
సిరిసిల్లలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన బి ఆర్ ఎస్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
Satheesh gangu
సిరిసిల్లలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన బి ఆర్ ఎస్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
More news from తెలంగాణ and nearby areas
- బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల పాఠశాల ప్రాంగణంలో హిందువుల వికాస జాతీయ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ కుటుంబ సమ్మేళనం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, యువత హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన గీతాశ్రమ పీఠాధిపతి, బెజ్జంకి వాసి శ్రీ చిదానందగిరి స్వామి హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సంప్రదాయాల పరిరక్షణ ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు సంస్కృతి వారసత్వాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. వక్తలు గంట తిరుమల్ జి, గంప రాణి ప్రియాంక మాట్లాడుతూ సమాజంలో విభేదాలు తొలగించి అందరూ ఒకటిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మం, ఆచార వ్యవహారాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. అనంతరం యువత ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై శ్రీరామ్ నినాదాలతో సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. రాత్రి జరిగిన సమావేశంలో హిందూ సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, సామాజిక సమరస్యతపై విస్తృత చర్చలు జరిగాయి. సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి ఉత్సవ కమిటీ చైర్మన్ బొల్లం శ్రీధర్ అధ్యక్షత వహించగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ అమరేంద్ర ప్రసాద్, మండల బాధ్యులు బెజుగం సురేష్, వ్యాఖ్యాత పుల్లూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ మాల ధరించిన భక్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమం ముగింపులో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. మొత్తం మీద ఈ సమ్మేళనం సామాజిక ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు వేదికగా నిలిచింది.3
- గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీ వేంకటేశ్వర కల్యాణ మండపం వరకు కొనసాగింది. హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో భక్తులు, యువకులు, మహిళలు పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు చేశారు. కార్యక్రమం భక్తి వాతావరణంలో శాంతియుతంగా సాగింది.1
- జగిత్యాల జిల్లా.... ఈరోజు జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ గా చేతన్ నితిన్ (ఐపీఎస్) జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించారు.అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ (ఐపీఎస్) ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను ను అందజేయడం జరిగింది.చేతన్ నితిన్ ఐపిఎస్., 2022 బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో జనగామ ఏఎస్పి గా విధులు నిర్వర్తించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణలోని మూత్రశాలలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు ఆడపసికందును చేరదీసి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు పాపను సురక్షితంగా రక్షించి, మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పసికందును అక్కడ వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు.3
- Post by User4017 Budhiya Kan ke2
- సిద్దిపేట పట్టణం లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు గురు వారం అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ళ వాన కురిసింది. ఈ నేపథ్యంలో, రైతులు ధాన్యరాశులను భద్రపరుచుకోవాలని, ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడేటప్పుడు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించారు1
- బెజ్జంకి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, మక్క మరియు ప్రొద్దుతిరుగుడు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. తూకం ప్రక్రియలో ఆలస్యం, కోటా పేరుతో పరిమిత కొనుగోళ్లు, మాయిశ్చర్ కారణంగా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్‌లో త్రాగునీరు, విశ్రాంతి గదులు వంటి కనీస వసతులు లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి పక్షాన నిలుస్తామని తెలిపారు.1
- జగిత్యాల తెలంగాణ రాష్ట్ర పొర సరఫరాల సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జగిత్యాల వారి ఆద్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం చల్గల్ వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్....అదనపు కలెక్టర్ బి ఎస్ లతతో కలిసి గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, DCO మనోజ్ కుమార్, Dcso జితేందర్ రెడ్డి, తహసీల్దార్ హకీం, DMO ప్రకాష్, సెక్రటరీ శ్రీనివాస్ రావు, ఏఎంసి డైరెక్టర్లు జయరాం, సురేష్, సత్తిరెడ్డి, నరేష్, గంగారెడ్డి, రాజన్న, సుర శ్రీనివాస్, పోచయ్య, అంజలి, రాజిరెడ్డి, రమేష్, శ్రీకాంత్, జిల్లా మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు గంగారెడ్డి, కట్ట రాజేందర్, dcc అధ్యక్షులు గాజంగి నందయ్య, నాయకులు బాల ముకుందం,చల్గల్ గ్రామ నాయకులు అబ్బూరి మల్లేశం గౌడ్,దాసరి సతీష్, శ్రీనివాస్, సర్పంచులు, నాయకులు,రైతులు,అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దుకై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పోతిరెడ్డిపేట నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. దాదాపు 10 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు, పలుగ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వద్దంటే వద్దు డంపింగ్ యార్డ్ వద్దు అని నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర హుజరాబాదుకె పరిమితం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించే హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, బీమదేవరపల్లి మండలాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో శంకరపట్నం మానకొండూర్ మండలాల్లో పాదయాత్ర చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే లు రాజీనామా చేయడమో, డంపింగ్ యార్డు రద్దు కావడమో జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.3