logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హిందూ కుటుంబ సమ్మేళనం విజయవంతం ఐక్యత సాంప్రదాయ పరిరక్షణపై దృష్టి బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల పాఠశాల ప్రాంగణంలో హిందువుల వికాస జాతీయ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ కుటుంబ సమ్మేళనం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, యువత హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన గీతాశ్రమ పీఠాధిపతి, బెజ్జంకి వాసి శ్రీ చిదానందగిరి స్వామి హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సంప్రదాయాల పరిరక్షణ ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు సంస్కృతి వారసత్వాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. వక్తలు గంట తిరుమల్ జి, గంప రాణి ప్రియాంక మాట్లాడుతూ సమాజంలో విభేదాలు తొలగించి అందరూ ఒకటిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మం, ఆచార వ్యవహారాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. అనంతరం యువత ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై శ్రీరామ్ నినాదాలతో సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. రాత్రి జరిగిన సమావేశంలో హిందూ సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, సామాజిక సమరస్యతపై విస్తృత చర్చలు జరిగాయి. సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి ఉత్సవ కమిటీ చైర్మన్ బొల్లం శ్రీధర్ అధ్యక్షత వహించగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ అమరేంద్ర ప్రసాద్, మండల బాధ్యులు బెజుగం సురేష్, వ్యాఖ్యాత పుల్లూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ మాల ధరించిన భక్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమం ముగింపులో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. మొత్తం మీద ఈ సమ్మేళనం సామాజిక ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు వేదికగా నిలిచింది.

3 hrs ago
user_ప్రభాకర్
ప్రభాకర్
Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
3 hrs ago

హిందూ కుటుంబ సమ్మేళనం విజయవంతం ఐక్యత సాంప్రదాయ పరిరక్షణపై దృష్టి బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల పాఠశాల ప్రాంగణంలో హిందువుల వికాస జాతీయ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ కుటుంబ సమ్మేళనం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, యువత హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన గీతాశ్రమ పీఠాధిపతి, బెజ్జంకి వాసి శ్రీ చిదానందగిరి స్వామి హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సంప్రదాయాల పరిరక్షణ ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.

భవిష్యత్ తరాలకు సంస్కృతి వారసత్వాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. వక్తలు గంట తిరుమల్ జి, గంప రాణి ప్రియాంక మాట్లాడుతూ సమాజంలో విభేదాలు తొలగించి అందరూ ఒకటిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మం, ఆచార వ్యవహారాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. అనంతరం యువత ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై శ్రీరామ్ నినాదాలతో సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. రాత్రి జరిగిన సమావేశంలో హిందూ

సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, సామాజిక సమరస్యతపై విస్తృత చర్చలు జరిగాయి. సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి ఉత్సవ కమిటీ చైర్మన్ బొల్లం శ్రీధర్ అధ్యక్షత వహించగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ అమరేంద్ర ప్రసాద్, మండల బాధ్యులు బెజుగం సురేష్, వ్యాఖ్యాత పుల్లూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ మాల ధరించిన భక్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమం ముగింపులో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. మొత్తం మీద ఈ సమ్మేళనం సామాజిక ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు వేదికగా నిలిచింది.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దుకై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పోతిరెడ్డిపేట నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. దాదాపు 10 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు, పలుగ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వద్దంటే వద్దు డంపింగ్ యార్డ్ వద్దు అని నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర హుజరాబాదుకె పరిమితం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించే హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, బీమదేవరపల్లి మండలాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో శంకరపట్నం మానకొండూర్ మండలాల్లో పాదయాత్ర చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే లు రాజీనామా చేయడమో, డంపింగ్ యార్డు రద్దు కావడమో జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
    3
    కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దుకై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పోతిరెడ్డిపేట నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. దాదాపు 10 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర 
లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు, పలుగ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వద్దంటే వద్దు డంపింగ్ యార్డ్ వద్దు అని నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర హుజరాబాదుకె పరిమితం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించే హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, బీమదేవరపల్లి మండలాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో శంకరపట్నం మానకొండూర్ మండలాల్లో పాదయాత్ర  చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే లు రాజీనామా చేయడమో, డంపింగ్ యార్డు రద్దు కావడమో జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
  • కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పరిశీలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్ లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.
    1
    కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పరిశీలన
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్ లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 day ago
  • జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం రోజున భారత రాష్ట్ర సమితి కొడిమ్యాల మండల శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇట్టి విలేకరుల సమావేశంలో మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, బిఆరెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, స్వార్థ రాజకీయ అవసరాలకు కాలేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ప్రచారం చేసి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ కు హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిది అన్నారు. ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై హర్షం వ్యక్తం చేస్తూ కాళీశ్వరం ముక్తీశ్వర స్వామి దయతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రివర్యులు కడిగిన ముత్యంలా వస్తారని, నిజం నిప్పులాంటిది, నిజం అనేది కొంత ఆలస్యంగా అయినా విజయం సాధిస్తుందని ఈ తీర్పుతో తేటతెల్లమైందన్నారు. రానున్న రోజుల్లో బిఆరెస్ ప్రభుత్వం రావడం ఖాయం అన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శోభమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, మండల యువజన అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు అబ్దుల్ సుకుర్, మాజీ రైతుబంధు అధ్యక్షులు అంకం రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యులు సురుగు శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్, మాజీ సర్పంచ్ మల్యాల మహిపాల్, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెల్లా లక్ష్మణ్, హిమ్మత్రావ్ పేట గ్రామ శాఖ అధ్యక్షులు ఆకునూరి మల్లయ్య , యువ నాయకులు రాచకొండ చంద్రమోహన్, నేరెళ్ల రాజయ్య, రామంచ లక్ష్మణ్, మోహన్, గణేష్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
    3
    జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం రోజున భారత రాష్ట్ర సమితి కొడిమ్యాల మండల శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇట్టి విలేకరుల సమావేశంలో మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, బిఆరెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, స్వార్థ రాజకీయ అవసరాలకు కాలేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ప్రచారం చేసి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ కు హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిది అన్నారు. ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై హర్షం వ్యక్తం చేస్తూ కాళీశ్వరం ముక్తీశ్వర స్వామి దయతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రివర్యులు కడిగిన ముత్యంలా వస్తారని, నిజం నిప్పులాంటిది, నిజం అనేది కొంత ఆలస్యంగా అయినా విజయం సాధిస్తుందని ఈ తీర్పుతో తేటతెల్లమైందన్నారు.
రానున్న రోజుల్లో బిఆరెస్ ప్రభుత్వం రావడం ఖాయం అన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శోభమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, మండల యువజన అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు అబ్దుల్ సుకుర్, మాజీ రైతుబంధు అధ్యక్షులు అంకం రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యులు సురుగు శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్, మాజీ సర్పంచ్ మల్యాల మహిపాల్, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెల్లా లక్ష్మణ్, హిమ్మత్రావ్ పేట గ్రామ శాఖ అధ్యక్షులు ఆకునూరి మల్లయ్య , యువ నాయకులు రాచకొండ చంద్రమోహన్, నేరెళ్ల రాజయ్య, రామంచ లక్ష్మణ్, మోహన్, గణేష్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
    user_Kattekola raju
    Kattekola raju
    Television repair service కోడిమ్యాల్, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • వాట్సప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేయవచ్చు 🤝🤝🤝
    1
    వాట్సప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేయవచ్చు 🤝🤝🤝
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Ghanpur (Station), Jangoan•
    2 hrs ago
  • గజ్వేల్ లో మల్లన్న సాగర్ డ్యాం
    1
    గజ్వేల్ లో మల్లన్న సాగర్ డ్యాం
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • ఏప్రిల్ 24:జగిత్యాల ఇందిరమ్మ అర్బన్ కాలనీ డబుల్ బెడ్‌రూమ్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్‌లో ప్రతిరోజూ చెత్తను తగలబెడుతున్న నేపథ్యంలో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న దట్టమైన పొగ కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. రోజుకు పలువురు చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారని, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించిన కాలనీవాసులు, ఇందిరమ్మ అర్బన్ కాలనీ పరిధిలోని రోడ్ నెంబర్ 11 వద్ద డంపింగ్ యార్డ్‌కు వెళ్లే చెత్త వాహనాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. దీంతో కొంతసేపు రాకపోకలు అంతరాయం కలిగాయి. డంపింగ్ యార్డ్‌లో పనిచేసే సిబ్బంది ప్రజలతో వాగ్వాదాలకు దిగుతున్నారని ఆరోపించిన స్థానికులు, తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
    1
    ఏప్రిల్ 24:జగిత్యాల ఇందిరమ్మ అర్బన్ కాలనీ డబుల్ బెడ్‌రూమ్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్‌లో ప్రతిరోజూ చెత్తను తగలబెడుతున్న నేపథ్యంలో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న దట్టమైన పొగ కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. రోజుకు పలువురు చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారని, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించిన కాలనీవాసులు, ఇందిరమ్మ అర్బన్ కాలనీ పరిధిలోని రోడ్ నెంబర్ 11 వద్ద డంపింగ్ యార్డ్‌కు వెళ్లే చెత్త వాహనాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. దీంతో కొంతసేపు రాకపోకలు అంతరాయం కలిగాయి.
డంపింగ్ యార్డ్‌లో పనిచేసే సిబ్బంది ప్రజలతో వాగ్వాదాలకు దిగుతున్నారని ఆరోపించిన స్థానికులు, తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల పాఠశాల ప్రాంగణంలో హిందువుల వికాస జాతీయ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ కుటుంబ సమ్మేళనం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, యువత హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన గీతాశ్రమ పీఠాధిపతి, బెజ్జంకి వాసి శ్రీ చిదానందగిరి స్వామి హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సంప్రదాయాల పరిరక్షణ ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు సంస్కృతి వారసత్వాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. వక్తలు గంట తిరుమల్ జి, గంప రాణి ప్రియాంక మాట్లాడుతూ సమాజంలో విభేదాలు తొలగించి అందరూ ఒకటిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మం, ఆచార వ్యవహారాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. అనంతరం యువత ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై శ్రీరామ్ నినాదాలతో సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. రాత్రి జరిగిన సమావేశంలో హిందూ సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, సామాజిక సమరస్యతపై విస్తృత చర్చలు జరిగాయి. సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి ఉత్సవ కమిటీ చైర్మన్ బొల్లం శ్రీధర్ అధ్యక్షత వహించగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ అమరేంద్ర ప్రసాద్, మండల బాధ్యులు బెజుగం సురేష్, వ్యాఖ్యాత పుల్లూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ మాల ధరించిన భక్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమం ముగింపులో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. మొత్తం మీద ఈ సమ్మేళనం సామాజిక ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు వేదికగా నిలిచింది.
    3
    బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల పాఠశాల ప్రాంగణంలో హిందువుల వికాస జాతీయ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ కుటుంబ సమ్మేళనం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, యువత హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన  గీతాశ్రమ పీఠాధిపతి, బెజ్జంకి వాసి శ్రీ చిదానందగిరి స్వామి హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సంప్రదాయాల పరిరక్షణ ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు సంస్కృతి వారసత్వాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు.
వక్తలు గంట తిరుమల్ జి, గంప రాణి ప్రియాంక మాట్లాడుతూ సమాజంలో విభేదాలు తొలగించి అందరూ ఒకటిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మం, ఆచార వ్యవహారాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. అనంతరం యువత ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై శ్రీరామ్ నినాదాలతో సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది.
రాత్రి జరిగిన సమావేశంలో హిందూ సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, సామాజిక సమరస్యతపై విస్తృత చర్చలు జరిగాయి. సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
కార్యక్రమానికి ఉత్సవ కమిటీ చైర్మన్ బొల్లం శ్రీధర్ అధ్యక్షత వహించగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ అమరేంద్ర ప్రసాద్, మండల బాధ్యులు బెజుగం సురేష్, వ్యాఖ్యాత పుల్లూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ మాల ధరించిన భక్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కార్యక్రమం ముగింపులో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. మొత్తం మీద ఈ సమ్మేళనం సామాజిక ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు వేదికగా నిలిచింది.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన వర్షం బీభత్సం సృష్టించింది. గోడ కూలి ఆరుగురు గాయపడగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అకాల వర్షం గాలివాన సిరిసిల్ల ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. ఒక్కసారి కురిసిన గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలికి చెట్లు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి, కరెంట్ వైరస్లు తెగి పవర్ సప్లై నిలిచిపోయింది. కటౌట్లు, బారీగేట్లు, ఫ్లెక్సీలు గాలికి కొట్టుకొచ్చి రోడ్లపై పడిపోయాయి. రోడ్లపై చెట్లు అస్తవ్యస్తంగా పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గాలివానకు ఓ ఇల్లు ధ్వంసమైంది. గోడ కూలి ఆరుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గాలివాన ధాటిక రేకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉధృతమైన గాలులకు పలు చోట్ల వృక్షాలు నేలకూలగా, మరికొన్ని చోట్ల భారీ చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మున్సిపల్, విపత్తు నిర్వహణ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లను, శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కాలి వానకు తోడు అకాల వర్షం అన్నదాతలు అందులో గురిచేస్తుంది. కల్లాల్లో దాన్యం తడిసిపోగా చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.‌ అకాల వర్షం ఆగం చేస్తుందని అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన వర్షం బీభత్సం సృష్టించింది. గోడ కూలి ఆరుగురు గాయపడగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అకాల వర్షం గాలివాన సిరిసిల్ల ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. ఒక్కసారి కురిసిన గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలికి చెట్లు విరిగిపడ్డాయి.  ఇంటి పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి, కరెంట్ వైరస్లు తెగి పవర్ సప్లై  నిలిచిపోయింది. కటౌట్లు, బారీగేట్లు, ఫ్లెక్సీలు గాలికి కొట్టుకొచ్చి రోడ్లపై పడిపోయాయి. రోడ్లపై చెట్లు అస్తవ్యస్తంగా పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గాలివానకు ఓ ఇల్లు ధ్వంసమైంది. గోడ కూలి ఆరుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గాలివాన ధాటిక రేకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉధృతమైన గాలులకు పలు చోట్ల వృక్షాలు నేలకూలగా, మరికొన్ని చోట్ల భారీ చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మున్సిపల్, విపత్తు నిర్వహణ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లను, శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కాలి వానకు తోడు అకాల వర్షం అన్నదాతలు అందులో గురిచేస్తుంది. కల్లాల్లో దాన్యం తడిసిపోగా చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.‌
అకాల వర్షం ఆగం చేస్తుందని అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    21 hrs ago
  • జగిత్యాల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వెల్ఫేర్ వీక్ సందర్భంగా గురువారం జగిత్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఉదయం అల్పాహారాన్ని పరిశీలించి, భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సమయానికి అందుతున్నదా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. డైట్ మెను, వంటగది పరిశుభ్రత, నీటి వినియోగం, నిల్వ విధానాలు, కిచెన్ షెడ్ నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జిల్లా సంక్షేమ అధికారి కె. రాజ్ కుమార్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దినేష్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, తహసీల్దార్, ఎంపిడివో, మండల విద్యాధికారి, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
    1
    జగిత్యాల
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వెల్ఫేర్ వీక్ సందర్భంగా గురువారం జగిత్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఉదయం అల్పాహారాన్ని పరిశీలించి, భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సమయానికి అందుతున్నదా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. డైట్ మెను, వంటగది పరిశుభ్రత, నీటి వినియోగం, నిల్వ విధానాలు, కిచెన్ షెడ్ నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జిల్లా సంక్షేమ అధికారి కె. రాజ్ కుమార్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దినేష్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, తహసీల్దార్, ఎంపిడివో, మండల విద్యాధికారి, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.