Shuru
Apke Nagar Ki App…
ఇందిరానగర్‌లో మహంకాళి జాతర.............................. రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని శ్రీ కనకదుర్గాదేవి–శ్రీ మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 2, 3 తేదీలలో మహంకాళి జాతర నిర్వహించనున్నారు. తొలి రోజు పట్టువస్త్రాల సమర్పణ, రెండో రోజు బోనాలు, మహాభోగ నైవేద్యం, రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.
Krishna
ఇందిరానగర్‌లో మహంకాళి జాతర.............................. రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని శ్రీ కనకదుర్గాదేవి–శ్రీ మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 2, 3 తేదీలలో మహంకాళి జాతర నిర్వహించనున్నారు. తొలి రోజు పట్టువస్త్రాల సమర్పణ, రెండో రోజు బోనాలు, మహాభోగ నైవేద్యం, రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమం రాజ్యాంగం ద్వారా సమానత్వానికి మార్గదర్శి మున్సిపల్ కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 10 గంటలకు పట్టణంలో తహసిల్ చౌరస్తా వద్దు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యుడు, డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నర్మాత డా. అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ మెంబర్, జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆలోచనలు, ఆశయాలను సమాజంలో విస్తృతంగా వ్యాప్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్ మాట్లాడుతూ డా. అంబేద్కర్ భారతదేశానికి అందించిన సేవలు అపారమైనవని అన్నారు. దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు ఆయన జీవితాంతం పోరాటం చేశారని పేర్కొన్నారు.1
- తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో సర్పంచ్ ఉడుకు రకేష్ తో కలిసి.నిట్టెడి నగేష్,దొంతుల రామన్న,పిల్లి మహేందర్,సుంకిడి గ్రామంలో కుమ్మరి మహేందర్ లకు చెందిన నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో ముఖ్యఅతిథిగా తలమడుగు మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి హాజరై గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకన్న,సొసైటీ సీఈవో ఎం.శ్రీనివాస్,గోనెలగంగన్న,వార్డు సభ్యులు న్.అశోక్, డి.రమాకాంత్,నాయకులు ఎన్. గంగాధర్,ఎల్ ప్రవీణ్ రెడ్డి,జి.వెంకట్ రెడ్డి,ఎం. వెంకటరెడ్డి,జి రామ్ రెడ్డి,ఈ.గంగన్న, బి.రమాకాంత్,బాలాజీ,విలాస్,కె నడిపెన్న,గణేష్.తదితరులు పాల్గొన్నారు1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి కలకలం రేపింది. మండలంలోని గంగారం తండాకు చెందిన రైతు తేజావత్ నరహరి లేగదూడపై పెద్దపులి దాడి చేసి చంపింది. ఉదయం పశువులను చూసేందుకు వెళ్లిన రైతులు ఈ ఘటనను గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. వరుసగా పెద్దపులి సంచారం వార్తలు వెలువడుతుండటంతో గ్రామస్థుల్లో భయం నెలకొంది2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు సోమవారం తనిఖీ చేశారు.లడ్డు ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను ఆమె పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్ క్యాప్స్, శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీల సమయంలో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఈవో రమాదేవి గారి వెంట పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు1
- జగిత్యాల జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని ప్రజావాణిలో కలెక్టర్ కు మాజీమంత్రి జీవన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. రైతులతో కలిసి జీవన్ రెడ్డి కలెక్టరేట్ లో ప్రజావాణికి హాజరై మొక్కజొన్న రైతుల పక్షాన అడిషనల్ కలెక్టర్ ను కలిసి రైతుల ఇబ్బందులను ప్రస్తావించారు. వరి ధాన్యంతో పోలిస్తే మొక్కజొన్న పంటతో రైతులకు లాభం ఉందని తెలిపారు. మొక్కజొన్న పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని, కోతులు, పందులతో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. వరికి ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించే ప్రభుత్వం మొక్కజొన్న పంటకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోతులు, అడవి పందుల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కోతుల బెడదకు నివారణ ప్రభుత్వం ప్రత్యేకంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.3
- अन्नामय्या ज़िले में घर के अंदर कार्बन मोनोऑक्साइड का ख़तरा बाइक के धुएँ ने ली जान: छोटी सी लापरवाही के कारण चार लोगों का दुखद अंत; अन्नामय्या ज़िले में एक दुखद घटना घटी है। पुंगनूर के त्यागराजू स्ट्रीट में एक ही परिवार के चार सदस्यों की मौत हो गई। इस घटना का कारण लापरवाही बताया जा रहा है। त्यागराजू स्ट्रीट के रहने वाले मुरली एक हेयर सैलून चलाते हैं। मुरली और उनकी पत्नी रेवती के चार बच्चे हैं; यह परिवार—जिसमें मुरली के माता-पिता भी शामिल हैं—त्यागराजू स्ट्रीट पर एक साथ रहता है। चूँकि उनकी मोटरसाइकिल को मरम्मत की ज़रूरत थी, इसलिए मुरली ने कल एक मैकेनिक से उसका इंजन "बोर" (ओवरहॉल) करवाया। मैकेनिक ने उन्हें सलाह दी कि वे बाइक चालू करके रात भर चलने दें ताकि इंजन ठंडा हो सके; नतीजतन, बाइक घर लाने के बाद, मुरली ने पूरी रात इंजन चालू रखा। क्योंकि बाइक का इंजन बंद नहीं किया गया था, इसलिए चलते हुए वाहन से निकलने वाला ज़हरीला धुआँ पूरे घर में भर गया, जिससे अंदर सो रहे लोगों का दम घुटने लगा। इसके परिणामस्वरूप, मुरली के पिता—रामचंद्रैया—के साथ-साथ मुरली के बेटे और उनकी दो बेटियों ने भी उस ज़हरीली गैस को साँस में ले लिया और सोते-सोते ही बेजान होकर गिर पड़े। इस दुखद घटना के पीड़ितों में मुरली के पिता, रामचंद्रैया; उनके बेटे, कार्तिक; और उनकी जुड़वाँ बेटियाँ, चारिता और चंदना शामिल हैं। घटना के समय, मुरली और उनकी पत्नी, रेवती, घर की छत पर सो रहे थे, जबकि मुरली की माँ और सबसे बड़ी बेटी कथित तौर पर दो दिन पहले ही किसी रिश्तेदार के गाँव गई हुई थीं। घटना की सूचना मिलते ही पुलिस मौके पर पहुँची, वहाँ का मुआयना किया और घटना से जुड़ी जानकारी इकट्ठा की। शुरुआती रिपोर्टों से पता चलता है कि उन चारों लोगों की मौत सीधे तौर पर ज़हरीले धुएँ को साँस में लेने के कारण हुई है। शवों को पोस्टमार्टम के लिए पुंगनूर सरकारी अस्पताल भेज दिया गया है। पुलिस ने इस घटना के संबंध में एक मामला दर्ज कर लिया है और जाँच शुरू कर दी है। एक ही परिवार के चार सदस्यों की दुखद मौत के बाद, उस पूरी गली में—जो एक बेहद आपस में जुड़ा हुआ समुदाय है, जहाँ रहने वाले लोग एक ही सामाजिक समूह से आते हैं और अक्सर आपस में रिश्तेदार भी होते हैं—गहरे शोक का माहौल छा गया है। बताया जा रहा है कि एक छोटे से घर में खिड़कियों और हवा आने-जाने की उचित व्यवस्था न होने के कारण दम घुटने से चार लोगों की मौत हो गई; इसी वजह से मोटरसाइकिल के इंजन से निकलने वाला धुआँ पूरे घर में फैल गया था। इस घटना से पूरे इलाके में सनसनी फैल गई है।1
- వేములవాడలో శ్రీరామ నవమి వేడుకలకు శ్రీకారం – భీమేశ్వర స్వామి మండపంలో పోస్టర్ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ మరియు ఆహ్వాన పత్రికను సోమవారం భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి భక్తుల సమక్షంలో విడుదల చేశారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు మరియు భక్తులు పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాముల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని క్లాసులకు అనుమతించడంతో ఆందోళన సద్దుమణిగింది.1