రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్ జగిత్యాల జిల్లా.. 👉 బాధ్యతగల పౌరులను (గుడ్ సమారిటన్స్) ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ పథకం” ద్వారా రూ.25,000/- నగదు పారితోషికం మరియు ప్రశంసా పత్రం రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడే బాధ్యతగల పౌరులను (గుడ్ సమారిటన్స్) ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ పథకం” ద్వారా రూ.25,000/- నగదు పారితోషికం మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు. కానీ కొంతమంది పౌరులు పోలీస్ కేసులు ఉండొచ్చనే భయంతో గాయపడిన వారికి సహాయం చేయడానికి వెనుకంజ వేస్తున్నారని ఈ భయాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం “రహ్ వీర్ పథకం”ను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన వారికి ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తుంది. సహాయం చేసిన వ్యక్తిపై ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సేవలకు సమాచారం ఇవ్వాలని, సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించాలని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ప్రాణాలను కాపాడే కార్యంలో భాగస్వామి కావాలని ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా ప్రజలను, యువతను కోరారు.
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్ జగిత్యాల జిల్లా.. 👉 బాధ్యతగల పౌరులను (గుడ్ సమారిటన్స్) ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ పథకం” ద్వారా రూ.25,000/- నగదు పారితోషికం మరియు ప్రశంసా పత్రం రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడే బాధ్యతగల పౌరులను (గుడ్ సమారిటన్స్) ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ పథకం” ద్వారా రూ.25,000/- నగదు పారితోషికం మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు. కానీ కొంతమంది పౌరులు పోలీస్ కేసులు ఉండొచ్చనే భయంతో గాయపడిన వారికి సహాయం చేయడానికి వెనుకంజ వేస్తున్నారని ఈ భయాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం “రహ్ వీర్ పథకం”ను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన వారికి ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తుంది. సహాయం చేసిన వ్యక్తిపై ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సేవలకు సమాచారం ఇవ్వాలని, సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించాలని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ప్రాణాలను కాపాడే కార్యంలో భాగస్వామి కావాలని ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా ప్రజలను, యువతను కోరారు.
- జగిత్యాల జిల్లా.. 👉 బాధ్యతగల పౌరులను (గుడ్ సమారిటన్స్) ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ పథకం” ద్వారా రూ.25,000/- నగదు పారితోషికం మరియు ప్రశంసా పత్రం రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడే బాధ్యతగల పౌరులను (గుడ్ సమారిటన్స్) ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ పథకం” ద్వారా రూ.25,000/- నగదు పారితోషికం మరియు ప్రశంసా పత్రం అందజేయబడుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు. కానీ కొంతమంది పౌరులు పోలీస్ కేసులు ఉండొచ్చనే భయంతో గాయపడిన వారికి సహాయం చేయడానికి వెనుకంజ వేస్తున్నారని ఈ భయాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం “రహ్ వీర్ పథకం”ను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన వారికి ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తుంది. సహాయం చేసిన వ్యక్తిపై ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సేవలకు సమాచారం ఇవ్వాలని, సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించాలని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ప్రాణాలను కాపాడే కార్యంలో భాగస్వామి కావాలని ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా ప్రజలను, యువతను కోరారు.1
- సంప్రోక్షణ అనంతరం దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం మళ్లీ తెర్చుకుంది. చంద్రగ్రహణం కావడంతో మంగళవారం ఉదయం వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మూసివేశారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున దేవాలయంలో వేద పండితులు సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. పలు ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి స్వామివారికి పూజలు చేస్తున్నారు.1
- ఉపాధి హామీ పనుల సమయంలో తేనెటీగల దాడి చోటుచేసుకుని ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి తవ్వే క్రమంలో ప్రమాదవశాత్తు తేనెటీగల గూడు తగిలింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలపై దాడి చేశాయి. తేనెటీగల కాటుకు గురైన ఏడుగురిని సహచరులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, పనుల సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.1
- జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం… డోలోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించారు. శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తుల సేవను మంగళ వాయిద్యాలతో స్థానిక బ్రహ్మపుష్కరినిలోకి తీసుకొని వెళ్లి హంస వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి ఐదు ప్రదక్షిణలు అనంతరం డోలోత్సవ మండపంలో స్వామివారికి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు క్యూ పద్ధతిలో డోలోత్సవ స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మ పుష్కరిణి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.1
- ఒకప్పుడు గురువు అంటే భయభక్తులు ఉండేవి, కానీ నేడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విద్యార్థులు క్రమశిక్షణ తప్పడం, ఉపాధ్యాయులపైనే దాడులకు దిగడం సమాజం ఎటు వెళ్తోందో అన్న ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా వీరవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరిగిన ఈ ఘటన నిజంగా కలచివేసేలా ఉంది. పాఠశాలల్లో "కౌన్సెలింగ్" విధిగా ఉండాలి పరీక్షల ఒత్తిడి లేదా వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు కోపానికి లోనవుతుంటారు. ప్రతి పాఠశాలలో ఒక ప్రొఫెషనల్ కౌన్సెలర్ ఉండాలి. విద్యార్థుల మానసిక స్థితిని గమనించి వారికి ఎప్పటికప్పుడు ధైర్యం, క్రమశిక్షణ నేర్పాలి. 2. ఉపాధ్యాయులకు రక్షణ - స్పష్టమైన చట్టాలు అధికారుల నుండి లేదా విద్యార్థుల నుండి ఉపాధ్యాయులు వేధింపులకు గురైనప్పుడు వారికి అండగా నిలిచే "టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్" లాంటి కఠిన నిబంధనలు ఉండాలి. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలి. 3. తల్లిదండ్రుల బాధ్యత (Parents' Role) పిల్లలు ఇంట్లో ఎలా ఉంటున్నారు, బయట ఎవరితో తిరుగుతున్నారు అనేది తల్లిదండ్రులు గమనించాలి. "నా కొడుకును కొడతావా?" అని టీచర్‌తో గొడవకు వెళ్లే బదులు, "మా వాడు ఎందుకు ఇలా ప్రవర్తించాడు?" అని విశ్లేషించుకోవాలి. బడిలో టీచర్, ఇంట్లో తల్లిదండ్రులు సమన్వయంతో ఉంటేనే విద్యార్థి దారిలోకి వస్తాడు. 4. అధికారుల వేధింపులు తగ్గాలి 2026 నాటి పరిస్థితుల్లో మీరు అన్నట్లు యాప్‌లు, అటెండెన్స్, ర్యాంకుల ఒత్తిడితో టీచర్లు నలిగిపోతున్నారు. అధికారుల లక్ష్యం కేవలం ఫలితాలు మాత్రమే కాకుండా, టీచర్లు ప్రశాంతంగా బోధించే వాతావరణాన్ని కల్పించడం మీద కూడా ఉండాలి 5.క్రమశిక్షణా చర్యలు (Zero Tolerance) ఉపాధ్యాయుడిపై చేయి చేసుకున్న విద్యార్థి విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇది మిగిలిన వారికి కూడా అలవాటుగా మారుతుంది. పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థి అయినా సరే, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. ముఖ్య గమనిక: గురువుకి ఇచ్చే గౌరవం కేవలం ఆ వ్యక్తికి ఇచ్చేది కాదు, అది మనం నేర్చుకునే విద్యకు ఇచ్చే గౌరవం. ఈ విలువలు మళ్ళీ బడిలో ప్రాణం పోసుకోవాలి.1
- కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ కు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం -2026 ను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ సహకరించడం జరుగుతుందని,పాఠశాల అంటే కేవలం విద్య మాత్రమే కాదని విద్యతో పాటుగా సామాజిక సేవలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడం ఎంతగానో అభినందనీయమని అన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించాలంటే చాలామంది సహయ, సహకారాలు అవసరం అవుతాయని,రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న వారందరికీ అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు.తల సేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.ఈ శిబిరాలను విజయవంతం చేయడానికి సామాజిక సేవకులు,రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.1
- అంతర్ రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు CP సాయిచైతన్య తెలిపారు. ముధోల్, భైంసాకు చెందిన 10 మంది ముఠా సభ్యులు పంట పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరు 10 క్వింటాళ్ల కాపర్ కాల్స్ చోరీ చేయగా, 1.20 క్వింటాళ్ల కాపర్ కాయిల్స్, 2 లక్షల రూ.75 వేలను స్వాధీనం చేసుకున్నామన్నారు.1
- ధర్మపురి : బుగ్గారం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్ బుగ్గారం గ్రామంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని, నిర్మాణ పనులు నాణ్యతతో సాగాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న మిడ్ డే మీల్ కార్యక్రమాన్ని తనిఖీ చేసి భోజన నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, పోషకాహారం పంపిణీ, పరిశుభ్రతపై ఆదేశాలు జారీ చేశారు. బుగ్గారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి రాబోయే పరీక్షల కోసం కృషి చేయాలని ప్రోత్సహించారు. విద్యార్థులు సమయపాలనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, తమ భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం, బుగ్గారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 90 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపివో, ఎంఈఓ, బుగ్గారం సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.1