స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర" కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ జిల్లా పోలీసులు - ఏ ఆర్ పోలీస్ క్వార్టర్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *"స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర"* కార్యక్రమంలో భాగంగా ఈరోజు (శనివారం) కాకినాడ జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ ల నందు ఆయా స్టేషన్ సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కేంద్రమైన కాకినాడలో జిల్లా ఎంఎం*ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్, ఐపీఎస్* ఏ ఆర్ క్వార్టర్స్ ప్రాంతంలో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని, మొక్కను నాటి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సిబ్బంది మరియు అధికారులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి శ్రమ దానం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) శ్రీ S. శ్రీనివాసరావు, ఎస్బి డిఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ, డిఎస్పీ (ఏ ఆర్) శ్రీ వి జి శ్రీహరి రావు, MT రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె వెంకటరావు, కంపెనీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎమ్ నరసింహ మూర్తి, కాకినాడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం అప్పలనాయుడు, పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీ పి సునీల్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. @జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ.

- పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- Post by Rai Narendra1
- పెదకూరపాడు : వేసవి తాపానికి ప్రధాన వీధులు రోడ్లన్నీ నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం కి 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీ వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ వాహనదారులు ప్రయాణాలు కొనసాగించలేకపోయారు. వ్యవసాయ కూలీలు 12 గంటలకి తమ పనుల ముగించుకొని ఇంటి బాట పట్టారు.1
- నేడు అంబటి ధర్నా గుంటూరు: తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల్సిందిగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నారని నూరి ఫాతిమా తెలియజేశారు. కావున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు1
- డుంబ్రిగూడ మండలంలోని కించుమండలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణం యజమాని సాకేరి అర్జున్ ఇంటికి వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పాడేరు నుంచి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.1
- విజయనగరం జిల్లా, రాజాంలో మాదకద్రవ్యాల మత్తులో యువకులు రెచ్చిపోతున్నారు. గంజాయి సేవించి మనుషులపై కర్కశంగా దాడి చేస్తున్నారు. తాజాగా గత రాత్రి గంజాయి మత్తులో తూగుతున్న ఓ యువకుడు మరో యువకుడి పై పైశాచికంగా బ్లేడుతో దాడి చేసి, శరీరమంతా గాయపరచిన ఘటన నగరవాసుల్ని ఉలిక్కిపడేలా చేసింది. శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న మురళి గంజాయి కి బానిసై వీరంగం సృష్టించాడు. కుటుంబ సభ్యులతో గొడవపడుతున్న సమయంలో అక్కడే ఉన్న కిరణ్ వారించే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన మురళి అతనిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన కిరణ్ ను స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్ పై మురళి మరోసారి దాడికి యత్నించాడు. దీంతో మురళిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బాధితులు ఫిర్యాదు మేరకు మద్యం సేవించి అల్లర్లు సృష్టించినందుకు మురళి పై కేసు నమోదు చేశారు పోలీసులు.1
- పెదకూరపాడు : పోలీస్ స్టేషన్ ఆవరణమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. ఎస్సై గిరిబాబు ఆధ్వర్యంలో రోజూ సిబ్బందితో ఆవరణమంతా మొక్కలు నాటి పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. మొక్కలు నాటడం ద్వారా ఆక్సిజన్ అధికంగా లభించి కాలుష్యం దూరం చేయవచ్చని ఎస్సై గిరిబాబు అన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి ఇంటికి ఒక మొక్క నాటి వాతావరణాన్ని కాపాడాలని కోరారు.1
- Post by Yekula lakshmanarao Yekula1
- “Inside the knitting process. Precision circular knitting turns yarn into the soft fabric used in MGM Vests.” #KnittingProcess #TextileManufacturing #MGMBanians1