Shuru
Apke Nagar Ki App…
నేడు అంబటి ధర్నా గుంటూరు: తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల్సిందిగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నారని నూరి ఫాతిమా తెలియజేశారు. కావున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు
SHOT NEWS
నేడు అంబటి ధర్నా గుంటూరు: తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల్సిందిగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నారని నూరి ఫాతిమా తెలియజేశారు. కావున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నేడు అంబటి ధర్నా గుంటూరు: తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల్సిందిగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నారని నూరి ఫాతిమా తెలియజేశారు. కావున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు1
- Post by Yekula lakshmanarao Yekula1
- Post by Syyed taher1
- నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుభాష్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ గత కొన్ని నెలలుగా పని చేయడం లేదు. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారుల వెంటనే స్పందించి సిగ్నల్స్ మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ ఒక నినాదంగానే ఉంది. ఇంతకాలానికి చట్టరూపం దాల్చుతోంది. ఇది దేశచరిత్రలో గొప్ప రోజు. మహిళాబిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. మహిళల అభ్యున్నతి దిశగా అడుగులు వేసిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా మహిళలనే ముందు వరుసలో నిలబెట్టిన నాయకుడు మా జగనన్నే. మహిళల మీద దా*డులు, అత్యా*చారాలు, ఆత్మహ*త్యలు ఇవే చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత. -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త #WomenReservationBill #YSRCPForWomen1
- జీవితమరణ సరిహద్దుల్లో నిలిచిన వేళ 108 అంబులెన్స్ సిబ్బంది చూపిన అప్రమత్తత, మానవత్వం ఓ తల్లి, శిశువుకు కొత్త జీవితం అందించింది. బయ్యారం మండలం నామాలపాడు గ్రామానికి చెందిన ఒడిశా కార్మికురాలు రశ్మిత (20)కు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే 108 సేవలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ మెరుపువేగంతో చేరుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగానే నొప్పులు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. పరిస్థితి అత్యంత కీలకంగా మారిన వేళ మెడికల్ టెక్నీషియన్ శ్రీను, పైలట్ ఉపేందర్ అప్రమత్తంగా వ్యవహరించి అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపారు. క్షణక్షణం కీలకమవుతున్న పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసి, అంబులెన్స్‌లోని డెలివరీ కిట్ సహాయంతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. వారి సమయస్ఫూర్తి ఫలితంగా రశ్మిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ కాసిరెడ్డి ఫోన్ ద్వారా నిరంతరం సూచనలు అందిస్తూ కీలక పాత్ర పోషించారు. అనంతరం తల్లికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించి, శిశువుకు ఆక్సిజన్ ఇచ్చి, ఇద్దరినీ సురక్షితంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రాణాల విలువను కాపాడుతూ అద్భుత సేవ అందించిన EMT శ్రీను, పైలట్ ఉపేందర్‌లపై స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.1
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *"స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర"* కార్యక్రమంలో భాగంగా ఈరోజు (శనివారం) కాకినాడ జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ ల నందు ఆయా స్టేషన్ సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కేంద్రమైన కాకినాడలో జిల్లా ఎంఎం*ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్, ఐపీఎస్* ఏ ఆర్ క్వార్టర్స్ ప్రాంతంలో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని, మొక్కను నాటి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సిబ్బంది మరియు అధికారులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి శ్రమ దానం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) శ్రీ S. శ్రీనివాసరావు, ఎస్బి డిఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ, డిఎస్పీ (ఏ ఆర్) శ్రీ వి జి శ్రీహరి రావు, MT రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె వెంకటరావు, కంపెనీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎమ్ నరసింహ మూర్తి, కాకినాడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం అప్పలనాయుడు, పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీ పి సునీల్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. @జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ.1
- rentapalla2