Shuru
Apke Nagar Ki App…
పట్టాభిషేకం అనంతరం భద్రాచలంలో విలేకరులతో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో విలేకరులతో మాట్లాడిన మంత్రి తుమ్మల రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి రామభక్తుల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ.350 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించినట్లు తెలిపారు. భద్రాచలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.
VANAMA SRINIVAS RAO
పట్టాభిషేకం అనంతరం భద్రాచలంలో విలేకరులతో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో విలేకరులతో మాట్లాడిన మంత్రి తుమ్మల రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి రామభక్తుల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ.350 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించినట్లు తెలిపారు. భద్రాచలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి హాజరుకావడానికి భద్రాచలం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లకు సారపాకలోని ఐటిసి హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘనస్వాగతం పలికారు.3
- Post by Venkata laxmi Kothapalli8
- హైదరాబాద్‌లో ఆశా కార్యకర్తలు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకుని పలువురిని అక్రమంగా అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశాలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయలేరని, పోరాటం మరింత ఉద్ధృతం అవుతుందని నాయకులు హెచ్చరించారు.3
- నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అధికారులు ముఖ్య సూచనలు చేశారు. భవన నిర్మాణ కార్మిక శాఖ ద్వారా లభించే క్లెయిమ్ డబ్బుల విషయంలో కార్మికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరికైనా క్లెయిమ్ డబ్బులు రావాల్సి ఉంటే, వారు తప్పనిసరిగా స్వయంగా సమీపంలోని లేబర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొంటూ, కొంతమంది బ్రోకర్లు క్లెయిమ్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి కార్మికులను మోసం చేసే అవకాశం ఉందని తెలిపారు. “మేము చేస్తేనే డబ్బులు వస్తాయి”, “అధికారులకు డబ్బులు ఇవ్వాలి” వంటి అబద్ధపు మాటలను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఇలాంటి బ్రోకర్ల మాటలకు మోసపడి డబ్బులు కోల్పోవద్దని హెచ్చరించారు. అదేవిధంగా, కొన్ని సందర్భాల్లో కార్మికులకు రావాల్సిన డబ్బులను వారి అకౌంట్లలో వేసుకుని, కొంత మాత్రమే ఇవ్వడం జరుగుతుందని సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా బ్రోకర్లు లేదా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలాగే అవినీతి నిరోధక శాఖ హెల్ప్‌లైన్ 1064 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.1
- మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ వెంటనే సిద్ధం చేయాలని, స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సందర్శించి అభివృద్ధి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి దర్శనం కోసం అనేకమంది భక్తులు వస్తుంటారని, వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల వసతులు సౌలభ్యాలు ఆలయ అభివృద్ధి పై వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆర్చి నిర్మాణం, రోడ్డు విస్తరణ, కళ్యాణ కట్ట, కళ్యాణ మండపం, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, ఇతర ఆలయ అభివృద్ధి పనులపై త్వరితగతిన నివేదికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఆచార సాప్రదాయాలకు ఆటంకం కలగకుండా ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్కిటెక్ బృందం, దేవాదాయ శాఖ డి ఈ రమేష్ బాబు, తాసిల్దార్ తోట రవీందర్, ఆలయ ఈవో మహేష్, ఎంపీడీవో బద్రు నాయక్, ఆలయ అర్చకులు, సంబంధిత అధికారులు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు2
- వరంగల్ జిల్లాలో:గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో శనివారం పాము కలకలం రేపింది. జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్ పక్కనున్న బాత్రూంలో పామును గుర్తించిన ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనతో కొంతసేపు కార్యాలయంలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న స్నాక్ క్యాచర్‌ను అక్కడికి చేరుకొని పామును పట్టుకోవడంతో ఉద్యోగులు ఊపిరిపించుకున్నారు.1
- కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచులపై వివక్ష: మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మండిపాటు నకిరేకల్: నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య గారు ఆరోపించారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.నిధుల నిలిపివేత గ్రామాల్లో ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను నిలిపివేస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని లింగయ్య గారు విమర్శించారు. అధికారులపై ఒత్తిడి చేస్తూ పంచాయతీ రాజ్ కార్యదర్శులు, ఎంపీడీవోలు మరియు ఇతర అధికారులపై స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాల్లో ఎంబీ (MB) రికార్డింగ్ కాకుండా, పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో వలె పాత పద్ధతులే పునరావృతం 2014 నుండి 19 వరకు ఉన్న అరాచక పాలన మళ్లీకనిపిస్తోందని, గతంలో తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం క్యాన్సిల్ మరొక దగ్గర శిలాఫలకాలు వేసి అటువంటి పనులను చేయాలని చూడ్డం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతోంది ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కక్షపూరిత నిర్ణయాల వల్ల గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "సర్పంచులు ఎంతో ఆశతో గ్రామ సేవ కోసం ఎన్నికయ్యారు. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వారిని పనిచేయనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. నిధులు రాకుండా చేయడం, అధికారులతో బెదిరించడం వంటి చర్యలను మానుకోవాలి." బీఆర్ఎస్ సర్పంచులకు పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వ వివక్షపై అవసరమైతే పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నకిరేకల్ కుప్పల ప్రదీప్ రెడ్డి నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ రావు మారం వెంకటరెడ్డి గ్రామాల సర్పంచులు కొండేటి సైదిరెడ్డి వీరు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు 1
- భద్రాచలంలో విలేకరులతో మాట్లాడిన మంత్రి తుమ్మల రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి రామభక్తుల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ.350 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించినట్లు తెలిపారు. భద్రాచలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.1