రామకోటి రామరాజు కృషి వల్లే మన ప్రాంతానికి గోటి తలంబ్రాలు ● భద్రాచలం దేవస్థానం అందించిన వడ్లకు స్వాగతం పలికిన ● గజ్వేల్ ఎసిపి నర్సింలు ● రామయ్య కల్యానానికి 4వ సారి 3క్వింటాల్ల తలంబ్రాలకు శ్రీకారం గజ్వేల్ నియోజకవర్గం, ఫిబ్రవరి 17 (ప్రజా ప్రతిభ): భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన వడ్లనే వాడడం ఆనవాయితీ. యంత్రాలను వాడరు. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థకు 4వ సారి చోటు కల్పించి 3క్వింటాల్ల వడ్లను రామకోటి రామారాజు భక్తికి మెచ్చి అందజేశారు. మంగళవారం నాడు ప్రజ్ఞాపూర్ పార్తివేశ్వర స్వామి దేవాలయంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు వడ్లకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే రామనామ స్మరణ చేయించి గోటితో వడ్లను ఓలిపించి భక్తితో 3సార్లు కల్యానానికి అందించడం హర్షనీయం అన్నారు. 4వ సారి 3క్వింటాళ్లు అందించాలన్న రామకోటి రామరాజు దృఢ సంకల్పం గొప్పదన్నారు. గోటి తలంబ్రాలు అందజేసే బృహత్తర కార్యక్రమం చేబట్టి పలువురుకు ఆదర్శంగా నిలుస్తున్న రామకోటి రామరాజును అభినందించారు. సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ గోటి తలంబ్రాల కార్యక్రమంలో మమ్మల్ని బాగా స్వాములుగా చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మ శ్రీను, ప్రొద్దుటూరి భాస్కర్, టెంటు నర్సింలు, నంగునూరి సత్యనారాయణ, ఉమేష్ పాల్గొన్నారు.
రామకోటి రామరాజు కృషి వల్లే మన ప్రాంతానికి గోటి తలంబ్రాలు ● భద్రాచలం దేవస్థానం అందించిన వడ్లకు స్వాగతం పలికిన ● గజ్వేల్ ఎసిపి నర్సింలు ● రామయ్య కల్యానానికి 4వ సారి 3క్వింటాల్ల తలంబ్రాలకు శ్రీకారం గజ్వేల్ నియోజకవర్గం, ఫిబ్రవరి 17 (ప్రజా ప్రతిభ): భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన వడ్లనే వాడడం ఆనవాయితీ. యంత్రాలను వాడరు. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థకు 4వ సారి చోటు కల్పించి 3క్వింటాల్ల వడ్లను రామకోటి రామారాజు భక్తికి మెచ్చి అందజేశారు. మంగళవారం నాడు ప్రజ్ఞాపూర్ పార్తివేశ్వర స్వామి దేవాలయంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు వడ్లకు స్వాగతం
పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే రామనామ స్మరణ చేయించి గోటితో వడ్లను ఓలిపించి భక్తితో 3సార్లు కల్యానానికి అందించడం హర్షనీయం అన్నారు. 4వ సారి 3క్వింటాళ్లు అందించాలన్న రామకోటి రామరాజు దృఢ సంకల్పం గొప్పదన్నారు. గోటి తలంబ్రాలు అందజేసే బృహత్తర కార్యక్రమం చేబట్టి పలువురుకు ఆదర్శంగా నిలుస్తున్న రామకోటి రామరాజును అభినందించారు. సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ గోటి తలంబ్రాల కార్యక్రమంలో మమ్మల్ని బాగా స్వాములుగా చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మ శ్రీను, ప్రొద్దుటూరి భాస్కర్, టెంటు నర్సింలు, నంగునూరి సత్యనారాయణ, ఉమేష్ పాల్గొన్నారు.
- కలియుగ ది దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం భక్తుల ఆధ్వర్యంలో పల్లెకిసేవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు పల్లకిని మోస్తూ ఐదు ప్రదిక్షణాలు చేశారు. అరేయ్ పూజారి నరేంద్ర శర్మ భక్తుల పేర్ల గోత్రనామాలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ కంచి మధు తీర్థప్రసాద విథరణ గావించారు.1
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్ర ముగిసింది. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు చేపట్టిన పాదయాత్ర ఆరు కిలోమీటర్లు ముందే దొంగలమర్రి వద్ద పాదయాత్రను ముగించి కారులో అంజన్న సన్నిధికి బండి సంజయ్ చేరారు. అప్పటికే రాత్రి 10 కావడంతో ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గుడి ముందే బండి సంజయ్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు పలువురు కార్పొరేటర్లతో కలిసి మొక్కలు చెల్లించారు. ఎన్నికల్లో తమకు అవకాశం ఇస్తే అంజన్న ఆశీర్వాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానని, అంజన్న దయతో కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుని ముక్కు చెల్లించేందుకు యాత్ర చేపట్టామని సంజయ్ తెలిపారు. నిబంధన ప్రకారం ఆలయాన్ని మూసివేశారని నిబంధనలు ఉల్లంఘించకుండా మూసివేసిన ఆలయం ముందే మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన అంజన్న ఆశీర్వాదయాత్ర రాత్రి 10 గంటలకు సాగింది. 15 గంటల పాటు చెప్పులు వేసుకోకుండా సాక్సులతో పాదయాత్ర చేసిన బండి సంజయ్ అలసిపోయారు. ఎండవేడితో అలసిపోయి మార్గమధ్యలో కొండన్నపల్లి వద్ద చెట్టు కింద 45 నిమిషాల పాటు సేద తీరారు. మార్గమధ్యలో రామడుగు మండలం కోనరావు పేట వద్ద డ్రోన్ కెమెరాతో తేనెటీగలు లేచి అంజన్న ఆశీర్వాద యాత్ర పై దాడి చేశాయి. యాత్ర వెనకలో ఉన్న పలువురు తేనెటీగల దాడిలో అస్వస్థతకు గురికాగ నలుగురిని ఆసుపత్రికి తరలించారు. అపశృతి అలసిపోయి అంజన్న సన్నిధికి చేరుకున్న బండి సంజయ్, కార్పొరేటర్లతో కలిసి అంజన్న గుడి ముందు మొక్కులు చెల్లించి అర్చకుల అశిర్వచనం తీసుకున్నారు.4
- సంగారెడ్డి పట్టణంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన జగ్గారెడ్డి, పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట, చివరకు మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు1
- కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాజు తెలిపారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,117 మంది పరీక్షకు హాజరుకాగా, 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.1
- గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు.మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.1
- పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు. 3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.1
- శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామం సమీపంలోని చాకరిమెట్లలో ఉన్న శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. నర్సాపూర్–తూప్రాన్ రహదారి మార్గంలో అడవి మధ్యలో కొలువై ఉన్న ఈ ఆలయానికి ఈరోజు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.1
- ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సర్పంచులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్ అధికారులకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కోసం సర్పంచ్ లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన సమావేశంలో అధికారులు 10 అంశాలపై సవివరంగా వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు చెప్పిందే చెబుతున్నారని తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ సర్పంచ్ మూర నిర్మల అధికారులను నిలదీశారు. ప్రభుత్వ అధికారులు నాలుగు గంటలు పనిచేసినా 8 గంటలు పనిచేసిన నెల జీతం వస్తుందని, కానీ సర్పంచ్లు 24 గంటలు పనిచేసిన గ్రామపంచాయతీలో ఏ పని చేయాలన్న నిధులు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సర్పంచిగా ఎన్నికై పెద్దిరికానికి వచ్చామా?.. పనిచేయడానికి వచ్చామా అని ప్రశ్నించారు. పంది చచ్చిన, కుక్క చచ్చిన ఎలుక చచ్చిన సర్పంచ్ అని గ్రామస్తులు అంటున్నారని, ఏ పని చేయాలన్నా నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే అధికారులు చెప్పిందే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాలకు ఏమిస్తారో చెబితే తాము గ్రామాల్లో అన్ని పనులు చేస్తామని తెలిపారు. సర్పంచ్ ఆవేదనతో అధికారులు అవాక్కయ్యారు. సర్పంచులు చెప్పింది అధికారులు విని త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేందుకే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగిందని అధికారులు వివరించారు.1
- కామారెడ్డి చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం 500 కోట్లతో, అలాగే CRIF (సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్) కింద 50 కోట్ల నిధులు కేటాయించాలని *కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి* నితిన్ గడ్కారీ గారిని కలిసి విన్నవించిన కామారెడ్డి *శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేయటం జరిగింది.. గతంలో 550 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల పొడవు తో కామారెడ్డి చుట్టు ఔటర్ రింగు రోడ్డు విషయమై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారిని కలసి స్థల పరిశీలన మరియు వ్యయం ప్రణాళికలు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రహదారుల పొడిగింపు, అభివృద్ధి గురించి మరియు నూతన రహదారుల ఏర్పాటు గురించి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్ కింద లింగపూర్ నుండి టెక్రియల్ వరకు 50 కోట్ల నిధులు కేటాయించాలని మంత్రి గారికి విన్నవించినట్టు తెలిపారు. రింగు రోడ్డు పనుల ప్రణాళిక వేగవంతం చేయటానికి అధికారులకు ఆదేశించినట్టు, 50 కోట్ల నిధుల కేటాయింపు విషయమై కూడా సానుకులంగా స్పందించినట్టు తెలిపారు.1