logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, "గంజాయి వద్దు.. గెలుపే ముద్దు" అనే సందేశంతో యువతకు విలువైన సూచనలు చేశారు. దంతాలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి రహిత గ్రామ నిర్మాణ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారు ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సామాజికపరంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారని ఆయన స్పష్టం చేశారు. యువత తమ విలువైన జీవితాన్ని చెడు అలవాట్లకు బలిచేయకుండా విద్య, ఉపాధి, క్రీడలు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు. వ్యసనాల బారిన పడితే భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసు శాఖ ఎటువంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటోందని ఎస్పీ స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజల సహకారంతోనే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొంటూ, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి స్నేహితులు, అలవాట్లు మరియు రోజువారీ కార్యకలాపాలను గమనించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకన్న, ఉప సర్పంచ్ బొడపట్ల సతీష్, సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి, వార్డు సభ్యులు ఇండ్ల శ్రీలేఖ, ఎర్రబోయిన మమత, గువ్వ రోజా, జనిగల అంజయ్య, కొత్తపల్లి మధు, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తోపాటు పలువురు పాల్గొన్నారు.

1 hr ago
user_ఎర్రబోయిన మురళి యాదవ్
ఎర్రబోయిన మురళి యాదవ్
దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
1 hr ago
c54da9bf-4744-4539-9e8f-f60323f24969

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, "గంజాయి వద్దు.. గెలుపే ముద్దు" అనే సందేశంతో యువతకు విలువైన సూచనలు చేశారు. దంతాలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి రహిత గ్రామ నిర్మాణ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత జీవితాలను

b21b9d85-7089-4ecd-8907-720a71783308

అంధకారంలోకి నెట్టేస్తోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారు ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సామాజికపరంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారని ఆయన స్పష్టం చేశారు. యువత తమ విలువైన జీవితాన్ని చెడు అలవాట్లకు బలిచేయకుండా విద్య, ఉపాధి, క్రీడలు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు. వ్యసనాల బారిన పడితే భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై

44edef16-5705-43a2-9c77-06a4a7fd4feb

పోలీసు శాఖ ఎటువంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటోందని ఎస్పీ స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజల సహకారంతోనే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొంటూ, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి స్నేహితులు, అలవాట్లు మరియు రోజువారీ కార్యకలాపాలను గమనించాలని ఆయన సూచించారు. ఈ

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకన్న, ఉప సర్పంచ్ బొడపట్ల సతీష్, సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి, వార్డు సభ్యులు ఇండ్ల శ్రీలేఖ, ఎర్రబోయిన మమత, గువ్వ రోజా, జనిగల అంజయ్య, కొత్తపల్లి మధు, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తోపాటు పలువురు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తరగతి గదుల కొరతపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందిన విద్యార్థులు, పాఠశాల ఆవరణలో నేలపై కూర్చుని ఆందోళన చేపట్టారు. మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో తరగతి గదులు సరిపోకపోవడంతో విద్యార్థులు ఆరుబయట కూర్చొని చదువుకోవాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వం అదనపు తరగతి గదులు మంజూరు చేసినప్పటికీ, వాటి నిర్మాణం మధ్యలోనే కాంట్రాక్టర్ నిలిపివేశాడని విద్యార్థులు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం లేదా అధికారులు వెంటనే స్పందించి తరగతి గదులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
    1
    ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తరగతి గదుల కొరతపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందిన విద్యార్థులు, పాఠశాల ఆవరణలో నేలపై కూర్చుని ఆందోళన చేపట్టారు. మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో తరగతి గదులు సరిపోకపోవడంతో విద్యార్థులు ఆరుబయట కూర్చొని చదువుకోవాల్సి వస్తోందని తెలిపారు.

ప్రభుత్వం అదనపు తరగతి గదులు మంజూరు చేసినప్పటికీ, వాటి నిర్మాణం మధ్యలోనే కాంట్రాక్టర్ నిలిపివేశాడని విద్యార్థులు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం లేదా అధికారులు వెంటనే స్పందించి తరగతి గదులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • విజయవాడ, విద్యాధరపురంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో కులం, మతం ప్రస్తావన సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతూ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలలో కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయతను విస్మరించని జాతీయ భావన, దేశ సమగ్రత మరియు శాంతి-సౌభాగ్యాలకు ప్రాధాన్యత వంటి అంశాలు బలమైన పునాదులుగా ఉన్నాయని సామినేని ఉదయభాను తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, వివిధ సంఘటనలు దేశ ఐక్యత, సామాజిక సామరస్యాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ లౌకికవాద విలువలను ప్రపంచానికి చాటుతోందని ఆయన వివరించారు. దేశం పట్ల ప్రేమ పెరిగినప్పుడు సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత కూడా పెరుగుతుందని పవన్ కళ్యాణ్ సందేశం యువతలో సానుకూల ఆలోచనలకు దారి తీస్తోందన్నారు. నేటి రాజకీయాల్లో ప్రజా సమస్యలను పక్కనపెట్టి కులాలు, మతాల పేరుతో విభజించే ధోరణి పెరగడం ఆందోళనకరమని పేర్కొన్న ఉదయభాను, “నేను ఏ ఒక్క కులం కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం పనిచేసే విశ్వనరుడిగా ఉండాలనుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా జనసేన నాయకులు, జనసైనికులు పనిచేస్తూ రాజకీయాల్లో విలువలతో కూడిన మార్పును తీసుకురావడానికి కృషి చేస్తారని సామినేని ఉదయభాను తెలిపారు. దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారనే భావనతో యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, విజయవాడ నగర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    3
    విజయవాడ, విద్యాధరపురంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో కులం, మతం ప్రస్తావన సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతూ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు.

జనసేన పార్టీ సిద్ధాంతాలలో కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయతను విస్మరించని జాతీయ భావన, దేశ సమగ్రత మరియు శాంతి-సౌభాగ్యాలకు ప్రాధాన్యత వంటి అంశాలు బలమైన పునాదులుగా ఉన్నాయని సామినేని ఉదయభాను తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, వివిధ సంఘటనలు దేశ ఐక్యత, సామాజిక సామరస్యాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నాయని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ లౌకికవాద విలువలను ప్రపంచానికి చాటుతోందని ఆయన వివరించారు.

దేశం పట్ల ప్రేమ పెరిగినప్పుడు సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత కూడా పెరుగుతుందని పవన్ కళ్యాణ్ సందేశం యువతలో సానుకూల ఆలోచనలకు దారి తీస్తోందన్నారు. నేటి రాజకీయాల్లో ప్రజా సమస్యలను పక్కనపెట్టి కులాలు, మతాల పేరుతో విభజించే ధోరణి పెరగడం ఆందోళనకరమని పేర్కొన్న ఉదయభాను, “నేను ఏ ఒక్క కులం కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం పనిచేసే విశ్వనరుడిగా ఉండాలనుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు.

పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా జనసేన నాయకులు, జనసైనికులు పనిచేస్తూ రాజకీయాల్లో విలువలతో కూడిన మార్పును తీసుకురావడానికి కృషి చేస్తారని సామినేని ఉదయభాను తెలిపారు. దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారనే భావనతో యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, విజయవాడ నగర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Kakaraparthi someswarao
    Kakaraparthi someswarao
    జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మూతపడిన బి- పవర్ హౌస్ విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో డిస్మెటల్ చేయనున్నారు. ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జెన్కో ట్రాన్స్ కో సీఎండి హరీష్ రెడ్డి అధికారులతో కలిసి ఈ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ పర్యటనలో, వారు ప్రస్తుత విద్యుత్ ప్లాంట్ స్థితిగతులను గురించి స్థానిక అధికారులతో చర్చించారు. నూతనంగా నిర్మించబోయే విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం సంబంధించిన వనరులపైనా స్థానిక అధికారులతో ప్రస్తావించారు. త్వరలోనే డిస్మెటల్ పనులు చేపట్టడం జరుగుతుందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా, ప్లాంట్‌కు సంబంధించిన అధికారులు ఆయనను ఆత్మీయంగా సన్మానించారు.
    2
    పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మూతపడిన బి- పవర్ హౌస్ విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో డిస్మెటల్ చేయనున్నారు. ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జెన్కో ట్రాన్స్ కో సీఎండి హరీష్ రెడ్డి అధికారులతో కలిసి ఈ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ పర్యటనలో, వారు ప్రస్తుత విద్యుత్ ప్లాంట్ స్థితిగతులను గురించి స్థానిక అధికారులతో చర్చించారు.

నూతనంగా నిర్మించబోయే విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం సంబంధించిన వనరులపైనా స్థానిక అధికారులతో ప్రస్తావించారు. త్వరలోనే డిస్మెటల్ పనులు చేపట్టడం జరుగుతుందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, ప్లాంట్‌కు సంబంధించిన అధికారులు ఆయనను ఆత్మీయంగా సన్మానించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ సీపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం లో భాగంగా వీణవంక ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించారు. ఎస్సై ఆవుల తిరుపతి ఈ మ్యాచ్ ను ప్రారంభించగా, జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో పోలీస్, ప్రెస్ యూత్ టీంలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. నేటి సమాజంలో డ్రగ్స్ కు బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచడానికి, వారి ఆలోచనలను ఆటల వైపు మళ్లించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. యువత విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ పులి వెంకట్ ఈ సందర్భంగా కోరారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రెడ్డిపల్లి, వీణవంక, నర్సింగాపూర్, వల్బపూర్, భేతిగల్ గ్రామాలకు చెందిన యువకులకు క్రికెట్ బ్యాట్లు, షటిల్స్, ఫుట్ బాల్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రెస్ మిత్రులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ సీపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం లో భాగంగా వీణవంక ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించారు. ఎస్సై ఆవుల తిరుపతి ఈ మ్యాచ్ ను ప్రారంభించగా, జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో పోలీస్, ప్రెస్ యూత్ టీంలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

నేటి సమాజంలో డ్రగ్స్ కు బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచడానికి, వారి ఆలోచనలను ఆటల వైపు మళ్లించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. యువత విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ పులి వెంకట్ ఈ సందర్భంగా కోరారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా రెడ్డిపల్లి, వీణవంక, నర్సింగాపూర్, వల్బపూర్, భేతిగల్ గ్రామాలకు చెందిన యువకులకు క్రికెట్ బ్యాట్లు, షటిల్స్, ఫుట్ బాల్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రెస్ మిత్రులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_T. sridhar✍️
    T. sridhar✍️
    వీణవంక, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో విత్తన మేళా నిర్వహించారు. ఏడాది ఏడు రకాల సన్న వరి రకాలకు అదనపు బోనస్ ఇవ్వాలని యోచిస్తున్న నేపథ్యంలో, ఈ మేళా ద్వారా రైతులకు సన్న వరి సాగుపై అవగాహన కల్పించారు. తెలంగాణ సోనా, సాంబా మసూరి, కేఎన్ఎం-1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం, వీజీఎల్-44, కేఎన్ఎం-7715 రకాల వరికి మార్కెట్ మద్దతు ధరకు (MSP) అదనంగా రూ.500 బోనస్ అందించే అవకాశముందని ఆత్మ కమిటీ సభ్యులు రైతులకు తెలియజేశారు.
    1
    మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో విత్తన మేళా నిర్వహించారు. ఏడాది ఏడు రకాల సన్న వరి రకాలకు అదనపు బోనస్ ఇవ్వాలని యోచిస్తున్న నేపథ్యంలో, ఈ మేళా ద్వారా రైతులకు సన్న వరి సాగుపై అవగాహన కల్పించారు. తెలంగాణ సోనా, సాంబా మసూరి, కేఎన్ఎం-1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం, వీజీఎల్-44, కేఎన్ఎం-7715 రకాల వరికి మార్కెట్ మద్దతు ధరకు (MSP) అదనంగా రూ.500 బోనస్ అందించే అవకాశముందని ఆత్మ కమిటీ సభ్యులు రైతులకు తెలియజేశారు.
    user_MOHD AKTHAR
    MOHD AKTHAR
    ఏటూరునాగారం, ములుగు, తెలంగాణ•
    7 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీవో వెంకన్న మృతి చెందడం అత్యంత బాధాకరమని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. విధి పట్ల నిబద్ధతతో పనిచేసే అధికారిగా వెంకన్న గుర్తింపు పొందారని ఆయన కొనియాడారు. ఈ విషాదకర ఘటనను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు జేటీసీ తెలిపారు. పోలీసులు ఈ ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారని, మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని చంద్రశేఖర్ గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీటీసీలు రవీందర్ కుమార్, సురేశ్ కూడా పాల్గొన్నారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీవో వెంకన్న మృతి చెందడం అత్యంత బాధాకరమని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. విధి పట్ల నిబద్ధతతో పనిచేసే అధికారిగా వెంకన్న గుర్తింపు పొందారని ఆయన కొనియాడారు. ఈ విషాదకర ఘటనను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు జేటీసీ తెలిపారు. పోలీసులు ఈ ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారని, మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని చంద్రశేఖర్ గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీటీసీలు రవీందర్ కుమార్, సురేశ్ కూడా పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి మాదకద్రవ్యాల వ్యసనంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుమలయపాలెంలో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ, మాదకద్రవ్యాలకు బానిసలైతే శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కన్నవారి కలలు, కుటుంబ భవిష్యత్తు పూర్తిగా నాశనమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు క్షణికానందం కోసం తమ జీవితాలను పాడుచేసుకోవద్దని ఆయన కోరారు. చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, నిరంతర శ్రమ, క్రమశిక్షణతో వాటిని సాధించడంపైనే దృష్టి సారించాలని ఏసీపీ సూచించారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని, మంచి లక్షణాలతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు.
    1
    ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి మాదకద్రవ్యాల వ్యసనంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుమలయపాలెంలో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ, మాదకద్రవ్యాలకు బానిసలైతే శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కన్నవారి కలలు, కుటుంబ భవిష్యత్తు పూర్తిగా నాశనమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు క్షణికానందం కోసం తమ జీవితాలను పాడుచేసుకోవద్దని ఆయన కోరారు. చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, నిరంతర శ్రమ, క్రమశిక్షణతో వాటిని సాధించడంపైనే దృష్టి సారించాలని ఏసీపీ సూచించారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని, మంచి లక్షణాలతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • విజయవాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అధ్యక్షతన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో పాటు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, మరియు రాబోయే కార్యక్రమాల కార్యాచరణపై నాయకులు విస్తృతంగా చర్చించారు. షేక్ నాగుల్ మీరా, చావల దేవధత్, నలమోలు శివరామకృష్ణ ప్రసాద్, జామ ఆనందరావు, కృష్ణా జిల్లా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సమావేశంలోని నాయకులు సూచించారు.
    1
    విజయవాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అధ్యక్షతన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో పాటు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, మరియు రాబోయే కార్యక్రమాల కార్యాచరణపై నాయకులు విస్తృతంగా చర్చించారు. షేక్ నాగుల్ మీరా, చావల దేవధత్, నలమోలు శివరామకృష్ణ ప్రసాద్, జామ ఆనందరావు, కృష్ణా జిల్లా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు.

పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సమావేశంలోని నాయకులు సూచించారు.
    user_Kakaraparthi someswarao
    Kakaraparthi someswarao
    జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని మోటమర్రి గ్రామంలో ఓ ఇంటి ముందు అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామానికి చెందిన విజయమ్మ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో కొన్ని వస్తువులను ఉంచినట్లు గుర్తించారు. ఈ వస్తువుల్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మలు ఉన్నాయని సమాచారం. వీటిని చూసిన గ్రామస్తులు క్షుద్రపూజలు చేసి ఉంటారని తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, స్థానికులు వెంటనే సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    1
    ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని మోటమర్రి గ్రామంలో ఓ ఇంటి ముందు అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామానికి చెందిన విజయమ్మ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో కొన్ని వస్తువులను ఉంచినట్లు గుర్తించారు.

ఈ వస్తువుల్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మలు ఉన్నాయని సమాచారం. వీటిని చూసిన గ్రామస్తులు క్షుద్రపూజలు చేసి ఉంటారని తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, స్థానికులు వెంటనే సంబంధిత అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    user_Romeet
    Romeet
    న్యాయవాది బోనకల్, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.