Shuru
Apke Nagar Ki App…
ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింప చేసేలా చూడాలి: బిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కార్మికుల సమయం ప్రభుత్వం నిర్వహింప చేయాలని బిఆర్ఎస్ పార్టీ జన్నారం మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, బిఆర్ఎస్ నాయకులు శ్రీధర్ కోరారు. బుధవారం ఉదయం జన్నారంలో వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజా జీవనం స్తంభించి పోయిందన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
P.G. Murthy
ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింప చేసేలా చూడాలి: బిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కార్మికుల సమయం ప్రభుత్వం నిర్వహింప చేయాలని బిఆర్ఎస్ పార్టీ జన్నారం మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, బిఆర్ఎస్ నాయకులు శ్రీధర్ కోరారు. బుధవారం ఉదయం జన్నారంలో వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజా జీవనం స్తంభించి పోయిందన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల జిల్లా కోరుట్ల గడిబురుజుల స్థలాల రక్షణ కోసం రెండవ రోజు నిరసన దీక్షకు విస్తృత మద్దతు* జగిత్యాల జిల్లా కోరుట్లలో గడిబురుజుల (గ్రామకంఠ / ఆబాది) ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన దీక్ష కొనసాగింది. ఈ భూములపై విధించిన VLTలను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుదవారం రోజు దీక్షకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండి మోసిన్ 19వ వార్డ్ కౌన్సిలర్, పొట్ట సురేందర్ 16వ వార్డు కౌన్సిలర్. 30 వార్డు మాజీ కౌన్సిలర్లు ఎండి ముజఫర్ అహ్మద్ సజ్జు, సయ్యిద్ ఆన్వర్ లు సంఘీభావం తెలపడమే కాకుండా ఉద్యమంలో నేరుగా పాల్గొంటామని అధికారపక్షం కాంగ్రెస్ పార్టీ గడి స్థలాల విషయంలో గొంతు ఎత్తుకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఇకనైనా స్పందించి విఎల్టీలు రద్దు చేయాలని కోరారు. అంతకుముందు బిజేపి నాయకులు కూడా మద్దతు తెలిపారు. దీంతో ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, కన్వీనర్ మొహమ్మద్ ముజాహిద్, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ గడిబురుజుల భూములు ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిని అక్రమాల నుండి కాపాడాలని అన్నారు. గడిబురుజుల చారిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడాలని, కోనేరును సంరక్షించాలని, మైసమ్మ తల్లికి దేవాలయం నిర్మించాలని, అలాగే ఆ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ మరియు పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిషాసుర మర్దిని ఉత్సవాల స్థలాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. VLTలు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల కో - కన్వీనర్ లు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, సయ్యద్ అన్వర్, ఎం.ఏ. ముజీబుర్ రహ్మాన్, చింతా భూమేశ్వర్, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్,, ఎన్. గంగాధర్, జక్కుల శంకర్, గణేష్, ఎం. రాజయ్య, షేక్ సిరాజ్. ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.4
- భీంపూర్ : మండల కేంద్రంలోని రైతు వేధికలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమం అంగన్ వాడిలకు ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ఆయా మండలాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేశారు. అదేవిధంగా మండలంలోని అంగన్ వాడి టీచర్లకు ఫొన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... కళ్యాణ లక్ష్మీ రూ. 1 లక్ష రూపాయల చెక్కుతో పాటు తుళం బంగారం అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- Post by KR NEWS 3691
- This cowardly act was met with the courage and resolve of our Armed Forces. With #OperationSindoor, Modi Govt ensured that no one dares to stand against India.1
- ఆర్టీసీ లో రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు అందులో 40 లక్షల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.వారు ఉద్యోగ రీత్యా,విద్యా,వైద్య అవసరాలకు ప్రయాణం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది మిగిలిన మూడు అంశాలపై చర్చిస్తున్నాం.. మేము రాగానే వేసిన మొట్ట మొదటి కమిటీ సీనియర్ ఐఏఏస్ లతో వేశాం.. అధికారుల కమిటీ తో ఐదు గంటలపైగా చర్చిస్తుండగానే సమ్మెకు పోతున్నామని మద్యలో వెళ్లిపోవడం ఇది కుట్ర లో భాగమే ఇటీవల జగిత్యాల సభలో మహా లక్ష్మీ ప్రయాణం కేసీఆర్ అవహేళన గా మాట్లాడారు ... వెంటనే ఆర్టీసీ పై కుట్రలో భాగంగానే గతంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గా ఉన్న హరీష్ రావు సమ్మె పై కార్మికులను ప్రోత్సహించారు.. మహా లక్ష్మీ పథకాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేరు ఆర్టీసీ డిమాండ్స్ పై చర్చిస్తున్నాని అధికారులు చెప్పారు.. అయిన వినకూడనే ఎవరితో ఫోన్ లో మాట్లాడి సమ్మె కి వెళ్ళారు ఆర్టీసీ కార్మికులకు 2013 బాండ్స్ 280 కోట్లు ఇచ్చాం..1134 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చాం.. రాష్ట్ర రవాణా శాఖ పక్షాన పని భారం లేకుండా కార్మిక చట్టాలు లోపలే చేశాం.. గతంలో 12 గంటలు వాహనం నడపడం వల్ల మరునాడు హాఫ్ ఉండేది.. వాళ్ళు ఎలా అంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. మేమే పని భారం లేకుండా చేయాలని చూస్తున్నాం.. మేము శ్రమ దోపిడి చేయదలచుకోలేదు విలీనం ,యూనియన్ ల అంశాలపై ప్రభుత్వం పరిగణన లో ఉంది ప్రభుత్వం నెలకి ఆర్టీసీకి 300 కోట్ల ,అవసరమైనప్పుడు 400 కోట్లు ఎంత అవసరం ఉంటే అంత ఇస్తుంది ఆర్టీసీ లో సర్వీసు నుండి రిమూవ్ అయిన వారికి 250 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తున్నాం.. పేద ప్రజల లైఫ్ లైన్ ఆర్టీసీ ..ఆర్టీసీ నిర్వీర్యం చేసే కుట్రలు చేయద్దు. పేద ప్రజల రవాణా వ్యవస్థ బాగుండాలి ,పని చేస్తున్న 40 వేల కుటుంబాల ఉద్యోగుల బాగుండాలి నిరసనలు చెప్పే వారు బస్ డిపో లు చేసుకోండి.. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు మేము ఏర్పడిన తరువాత మొదటి కమిటీ వేశాం..మేము కమిటీ కి 4 వారాల సమయం అడిగాం.. ప్రభుత్వం తో కూర్చొని మాట్లాడాల్సిన అంశాలు నాయకత్వం వహించిన వారు రిటైర్డ్ అయిన వారు ,ఉద్యోగాలు చేయని వారు ఉన్నారు.. గత ప్రభుత్వం ఆర్టీసీ నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించింది.. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఎండీ కి , ప్రిన్సిపల్ సెక్రటరీ కి తెలియకుండా ఆదరభదార గా విలీనం అంశాన్ని తెచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరకు రండి కూర్చొని మాట్లాడడం.. మహా లక్ష్మీ పథకం నచ్చినంత మాత్రాన మీరు ఆర్టీసీ పై కుట్రలు చేస్తున్నారు రాజకీయ వ్యూహంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. పేద ప్రజల ప్రయాణానికి సంబంధించి ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్న వారు సంస్థ పరిరక్షణ దృశ్య ,ప్రయోజన దృశ్య సమ్మె విరమించాలి. అధికారులు ఆర్టీసీ కార్మికులు సమ్మె కి పోతున్నారని ఊహించలేదు.. డిప్యూటీ సీఎం చెన్నై లో ఉండడం వల్ల మాట్లాడలేకపోయం.. డిపో వారిగా సమీక్ష చేసి పని ఒత్తిడి ఉన్న దగ్గర తగ్గించేందుకు సిద్ధం.. మేము కింది స్థాయి నుండి వచ్చాం..ఆర్టీసీ కుటుంబాల తో 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక సార్లు ఇంటరాక్ట్ అయ్యారు.. ఉద్యోగస్థులు అక్కా చెల్లెలు ,అన్న దమ్ములు ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలి.. 29 అంశాలపై వెంటనే మేము టేబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. ఇప్పటికిప్పుడు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం..ఆర్థిక పరమైన అంశాలను కూడా ప్రభుత్వం భారం మోయడానికి సిద్ధంగా ఉంది.. విలీనం ,సంఘాల ఏర్పాటు , పీఆర్సీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది..మూడు సాంకేతిక అంశాలపై కమిటి రిపోర్ట్ అందిస్తుంది అధికారుల సంప్రదింపులు కొనసాగుతుండగానే కమిటీ లోని వికాస్ రాజ్ ,దాన కిషోర్ ,సందీప్ కుమార్ సుల్తానియ మీ అంశాలపై సానుకూల దృక్పథంతో ఉండేవారు. ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాం.. పెండింగ్ బకాయిలు చెల్లిస్తున్నాం.. సమ్మె దృశ్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం.. గత ప్రభుత్వం యూనియన్ లను రద్దు చేసినప్పుడు ఎందుకు అడగలేదు ఈవీ బస్సులు 2018 లో స్టార్ట్ అయ్యాయి.. అది కేంద్ర ప్రభుత్వ స్కీమ్..ముఖ్యమంత్రి లేఖ రాశారు.. ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఆర్టిసి ఉద్యోగి నీ కూడా తొలగించం .. దేశ వ్యాప్తంగా 14 వేల బస్సులు ఇస్తుండగా తెలంగాణ కి 2 వేల బస్సులు ఇస్తున్నారు.. కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ బస్సులు తీసుకొస్తున్నారు.. ఆర్టీసీ అనేక సంస్కరణలు తీసుకొస్తుంది.. బేషరతుగా సమ్మె విరమించండి.. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధం ఉన్నాం.. ప్రతిపక్ష పార్టీకి కావాల్సింది దోపిడీ మేము వచ్చిన తర్వాత 2800 బస్సులు కొనుగోలు చేశాం.. 2017 పీఆర్సీ ఇచ్చాం.. 2013 బాండ్స్ 280 కోట్లు ఇచ్చాం.. సర్వీసు నుండి శాశ్వతంగా రిమూవ్ అయిన వారికి 250 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.. మూడు సంవత్సరాల పిరియడ్ ను 2 సంవత్సరాలకు తగ్గించాం.. ఆర్టీసీ డిపో లు ఎవరి సొత్తు కాదు .. హైదరాబాద్ లో ఇబ్బందులు కలగకుండా ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసులు ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పాం.. ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రి గా కోరుతున్న..మీ నిరసన ప్రజాస్వామికంగా ప్రభుత్వం గురించే విధంగా ఉండాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,హరీష్ రావు ఆర్టీసీ సమ్మె తో రాక్షసానందం పొందడం ,మహిళా ప్రయాణికులను ఇబ్బంది కలగజేయవద్దు.. తెలంగాణ అక్కా చెల్లలు దాదాపు 300 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసి 10 వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు.1
- దివ్యాంగుల అందరూ స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని యూత్ ఫోర్ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా 8 మండలాల ఇన్చార్జి మోరే కృష్ణ అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని యూత్ ఫోర్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ కేంద్రంలో బుధవారం దివ్యాంగులకు స్వయం ఉపాధి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గన్నేరువరం మండలంలోని చిన్న చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద దివ్యాంగులను గుర్తించి వారికి వారి ప్రతిభకు తగ్గట్లు వ్యాపారంలో రాణించేలా చేయూతనివ్వాలన్నారు. అర్హులైన 24 మంది దివ్యాంగులకు ఉచితంగా స్వయం ఉపాధి పరికరాలను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పాశం ఎల్లయ్య, ట్రైనర్ శివరాత్రి శారద, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కొలుపుల మహేందర్, దివ్యాంగులు, పేరెంట్స్ పాల్గొన్నారు1
- జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే సమ్మెతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో విద్యార్థులు మండల కేంద్రానికి చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఆటోల ద్వారా వారు పరీక్షా కేంద్రాలకు వెళ్తున్నారు.1
- ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె వలన ప్రజలకు ఆటంకాలు ఏర్పడకూడదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను నడుపుటకు అనుమతి ఇవ్వడం జరిగింది కానీ ఏ బస్సులోనైతే కండక్టర్ ఉండడో ఆ బస్సు ప్రయాణికులకు ఉచితంగా తమ గమ్యం వరకు చేర్చుటకు సహకరించడం జరుగుతుంది. కానీ మెట్పల్లి డిపో మేనేజర్ కల్పనాశీల కండక్టర్ లేకుండా నడిచే బస్సులలో కూడా ప్రయాణికుల వద్ద నుండి ఎలాంటి టికెట్ ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది2
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దత్తత మండలం బజార్ హత్నూర్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు రానున్నది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలుతున్న వైనం, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ గులాబీలో చేరికలే స్థానిక సంస్థల విజయ ఢంకా అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బజార్ హత్నూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల లక్ష్మణ్,గడ్డమేది గణేష్ గొర్ల గంగయ్య, పోటపడే మాధవ్,సాభిర్,మేకల దేవేందర్, గుమ్మిడ్యాల నర్సయ్య,ఆంబోరే దిలిప్ లతో పాటు తదితరులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన సంఘం అధ్యక్షులు డుబ్బుల చంద్రశేఖర్,స్థానిక సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ కొంగర్ల రాజన్న, నాయకులు చాట్ల వినిల్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.2