ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభల నిర్వహణ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాష్ట్రంలో ప్రజాపాలన ప్రతిబింబించే విధంగా గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలు, ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణా రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఐ డి ఓ సి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణ ఒకే విధానంలో ఉండాలని, గ్రామ సభలకు వార్డు సభ్యుల నుండి ఎంపీ, ఎమ్మెల్యేల వరకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. గ్రామసభలో ముఖ్యమంత్రి సందేశంతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను చదివి వినిపించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, గిరిజన రైతులకు ఉచిత పంపు సెట్లు వంటి పథకాల లబ్ధిదారులను గ్రామసభలో మాట్లాడేలా చేయాలని తెలిపారు . జూన్ 2 నుండి ప్రారంభించనున్న ఇందిరమ్మ జీవిత భీమా పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, పాలు, రాగి జావా పంపిణీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజల నుండి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని, సాంస్కృతిక శాఖ కళాకారుల ద్వారా పథకాలపై అవగాహన పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. సీఎస్ కే. రామకృష్ణా రావు మాట్లాడుతూ మార్చి 6 నుండి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, పారిశుద్ధ్య కార్యక్రమాలకు మంచి స్పందన లభించిందని తెలిపారు. అదే స్పూర్తితో గ్రామ, వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని, ప్రతి జిల్లాలో గ్రామసభల నిర్వహణపై నివేదికలు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. గ్రామసభలలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు, గ్రామ సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను తెలియజేయాలని సూచించారు. మున్సిపాలిటీ వార్డుల్లో కూడా ఇలాంటి సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదించిన పథకాల మార్గదర్శకాలను కూడా ప్రజలకు వివరించాలని తెలిపారు. *జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ*గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి వారి నుంచి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. జిల్లా, డివిజన్, మండలం, గ్రామస్థాయి వరకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో చేపట్టిన పనులు ప్రజలకు వివరించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలను నిర్వహించి ప్రజలకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సభలకు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 2న అన్ని గ్రామపంచాయతీలలో గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని, ముందస్తు షెడ్యూల్ సిద్ధం చేసి సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు .గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించి, జాబితాలను ప్రజలకు చదివి వినిపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, జేడ్పిసిఈఓ నాగలక్ష్మి, సి పి ఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారిబాబురావు, వైద్య శాఖ అధికారులు తుకారాం రాథోడ్, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా, డి పి ఓ సుధీర్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభల నిర్వహణ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాష్ట్రంలో ప్రజాపాలన ప్రతిబింబించే విధంగా గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలు, ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణా రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఐ డి ఓ సి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణ ఒకే విధానంలో ఉండాలని, గ్రామ సభలకు వార్డు సభ్యుల నుండి ఎంపీ, ఎమ్మెల్యేల వరకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. గ్రామసభలో ముఖ్యమంత్రి సందేశంతో
పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను చదివి వినిపించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, గిరిజన రైతులకు ఉచిత పంపు సెట్లు వంటి పథకాల లబ్ధిదారులను గ్రామసభలో మాట్లాడేలా చేయాలని తెలిపారు . జూన్ 2 నుండి ప్రారంభించనున్న ఇందిరమ్మ జీవిత భీమా పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, పాలు, రాగి జావా పంపిణీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజల నుండి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని, సాంస్కృతిక శాఖ కళాకారుల ద్వారా పథకాలపై అవగాహన పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. సీఎస్ కే. రామకృష్ణా రావు మాట్లాడుతూ మార్చి 6 నుండి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, పారిశుద్ధ్య కార్యక్రమాలకు మంచి
స్పందన లభించిందని తెలిపారు. అదే స్పూర్తితో గ్రామ, వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని, ప్రతి జిల్లాలో గ్రామసభల నిర్వహణపై నివేదికలు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. గ్రామసభలలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు, గ్రామ సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను తెలియజేయాలని సూచించారు. మున్సిపాలిటీ వార్డుల్లో కూడా ఇలాంటి సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదించిన పథకాల మార్గదర్శకాలను కూడా ప్రజలకు వివరించాలని తెలిపారు. *జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ*గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి వారి నుంచి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. జిల్లా, డివిజన్, మండలం, గ్రామస్థాయి వరకు కేటాయించిన విధులు సక్రమంగా
నిర్వహించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో చేపట్టిన పనులు ప్రజలకు వివరించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలను నిర్వహించి ప్రజలకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సభలకు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 2న అన్ని గ్రామపంచాయతీలలో గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని, ముందస్తు షెడ్యూల్ సిద్ధం చేసి సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు .గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించి, జాబితాలను ప్రజలకు చదివి వినిపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, జేడ్పిసిఈఓ నాగలక్ష్మి, సి పి ఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారిబాబురావు, వైద్య శాఖ అధికారులు తుకారాం రాథోడ్, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా, డి పి ఓ సుధీర్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao2
- జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.4
- హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1
- నకిరేకల్ మున్సిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.3
- అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.1
- ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...1
- Post by V Ramarao1