logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జగిత్యాల పట్టణ ఇందిరమ్మ అర్బన్ కాలనీలోనీ డంపింగ్ యార్డ్ తో ముంచుకొస్తున్న ఆరోగ్యముప్పు జగిత్యాల పట్టణ పరిధిలోని ఇందిరమ్మ అర్బన్ కాలనీ లో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన గృహాలలో వేలాది కుటుంబాలు ప్రశాంతంగా జీవించాలని ఆశతో గవర్నమెంట్ కేటాయించిన ఇళ్లలో నివసిస్తున్నారు కానీ ఇప్పుడు ఆ కాలనీ ప్రజల పాలిట ఒక నరకంగా మారింది దానికి కారణం కాలనీ కూతవేటు దూరంలో ఉన్న డంపింగ్ యార్డ్ జగిత్యాల పట్టణ నలుమూలల నుండి సేకరించిన టన్నులకొద్దీ చెత్తను ప్రతిరోజు ఇక్కడే పారబోస్తున్నారు. ఆ చెత్త కుప్పల నుండి వచ్చే విపరీతమైన దుర్వాసనతో స్థానికులు ఇళ్లలో కనీసం ప్రశాంతంగా కూర్చోని అన్నం తినలేని పరిస్థితి ఏర్పడింది పగలంతా ఈగలు దోమల గోల అయితే రాత్రిపూట ఈ చెత్త తగలబెట్టడంతో వచ్చే దట్టమైన పొగ కాలనీని కమ్మేస్తుంది ఈ ఘాటైన కాలుష్యం కారణంగా అర్బన్ కాలనీలో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు,వృద్ధులు శ్వాసకోస వ్యాధులు,ఆస్తమా, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు నిలిచిపోయిన వ్యర్ధాల వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి డెంగ్యూ మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు కాలనీని వనికిస్తున్నాయి ఇక్కడ నివసించడానికి స్థానికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు అధికారులు నాయకులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప ఈ సమస్యపై తమకు విముక్తి కల్పించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్బన్ కాలనీ అంటే ఒక మోడల్ కాలనీగా ఉండాలి కానీ అర్బన్ కాలనీ మాత్రం డంపింగ్ యార్డ్ కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి జనవాసాలకు దూరంగా తరలించాలని కాలనీవాసులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు పాలకులు ఇప్పటికైనా స్పందిస్తారా ఈ నరక యాతన నుండి అర్బన్ కాలనీ ప్రజలకు విముక్తి కలిగిస్తారా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు

1 hr ago
user_Sriramula srinivas
Sriramula srinivas
కోరట్ల, జగిత్యాల, తెలంగాణ•
1 hr ago

జగిత్యాల పట్టణ ఇందిరమ్మ అర్బన్ కాలనీలోనీ డంపింగ్ యార్డ్ తో ముంచుకొస్తున్న ఆరోగ్యముప్పు జగిత్యాల పట్టణ పరిధిలోని ఇందిరమ్మ అర్బన్ కాలనీ లో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన గృహాలలో వేలాది కుటుంబాలు ప్రశాంతంగా జీవించాలని ఆశతో గవర్నమెంట్ కేటాయించిన ఇళ్లలో నివసిస్తున్నారు కానీ ఇప్పుడు ఆ కాలనీ ప్రజల పాలిట ఒక నరకంగా మారింది దానికి కారణం కాలనీ కూతవేటు దూరంలో ఉన్న డంపింగ్ యార్డ్ జగిత్యాల పట్టణ నలుమూలల నుండి సేకరించిన టన్నులకొద్దీ చెత్తను ప్రతిరోజు ఇక్కడే పారబోస్తున్నారు. ఆ చెత్త కుప్పల నుండి వచ్చే విపరీతమైన దుర్వాసనతో స్థానికులు ఇళ్లలో కనీసం ప్రశాంతంగా కూర్చోని అన్నం తినలేని పరిస్థితి ఏర్పడింది పగలంతా ఈగలు దోమల గోల అయితే రాత్రిపూట ఈ చెత్త తగలబెట్టడంతో వచ్చే దట్టమైన పొగ కాలనీని కమ్మేస్తుంది ఈ ఘాటైన కాలుష్యం కారణంగా అర్బన్ కాలనీలో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు,వృద్ధులు శ్వాసకోస వ్యాధులు,ఆస్తమా, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు నిలిచిపోయిన వ్యర్ధాల వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి డెంగ్యూ మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు కాలనీని వనికిస్తున్నాయి ఇక్కడ నివసించడానికి స్థానికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు అధికారులు నాయకులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప ఈ సమస్యపై తమకు విముక్తి కల్పించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్బన్ కాలనీ అంటే ఒక మోడల్ కాలనీగా ఉండాలి కానీ అర్బన్ కాలనీ మాత్రం డంపింగ్ యార్డ్ కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి జనవాసాలకు దూరంగా తరలించాలని కాలనీవాసులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు పాలకులు ఇప్పటికైనా స్పందిస్తారా ఈ నరక యాతన నుండి అర్బన్ కాలనీ ప్రజలకు విముక్తి కలిగిస్తారా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాల పట్టణ ఇందిరమ్మ అర్బన్ కాలనీలోనీ డంపింగ్ యార్డ్ తో ముంచుకొస్తున్న ఆరోగ్యముప్పు జగిత్యాల పట్టణ పరిధిలోని ఇందిరమ్మ అర్బన్ కాలనీ లో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన గృహాలలో వేలాది కుటుంబాలు ప్రశాంతంగా జీవించాలని ఆశతో గవర్నమెంట్ కేటాయించిన ఇళ్లలో నివసిస్తున్నారు కానీ ఇప్పుడు ఆ కాలనీ ప్రజల పాలిట ఒక నరకంగా మారింది దానికి కారణం కాలనీ కూతవేటు దూరంలో ఉన్న డంపింగ్ యార్డ్ జగిత్యాల పట్టణ నలుమూలల నుండి సేకరించిన టన్నులకొద్దీ చెత్తను ప్రతిరోజు ఇక్కడే పారబోస్తున్నారు. ఆ చెత్త కుప్పల నుండి వచ్చే విపరీతమైన దుర్వాసనతో స్థానికులు ఇళ్లలో కనీసం ప్రశాంతంగా కూర్చోని అన్నం తినలేని పరిస్థితి ఏర్పడింది పగలంతా ఈగలు దోమల గోల అయితే రాత్రిపూట ఈ చెత్త తగలబెట్టడంతో వచ్చే దట్టమైన పొగ కాలనీని కమ్మేస్తుంది ఈ ఘాటైన కాలుష్యం కారణంగా అర్బన్ కాలనీలో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు,వృద్ధులు శ్వాసకోస వ్యాధులు,ఆస్తమా, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు నిలిచిపోయిన వ్యర్ధాల వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి డెంగ్యూ మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు కాలనీని వనికిస్తున్నాయి ఇక్కడ నివసించడానికి స్థానికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు అధికారులు నాయకులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప ఈ సమస్యపై తమకు విముక్తి కల్పించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్బన్ కాలనీ అంటే ఒక మోడల్ కాలనీగా ఉండాలి కానీ అర్బన్ కాలనీ మాత్రం డంపింగ్ యార్డ్ కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి జనవాసాలకు దూరంగా తరలించాలని కాలనీవాసులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు పాలకులు ఇప్పటికైనా స్పందిస్తారా ఈ నరక యాతన నుండి అర్బన్ కాలనీ ప్రజలకు విముక్తి కలిగిస్తారా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు
    1
    జగిత్యాల పట్టణ ఇందిరమ్మ అర్బన్ కాలనీలోనీ డంపింగ్ యార్డ్ తో ముంచుకొస్తున్న ఆరోగ్యముప్పు 
జగిత్యాల పట్టణ పరిధిలోని ఇందిరమ్మ అర్బన్ కాలనీ లో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన గృహాలలో వేలాది కుటుంబాలు ప్రశాంతంగా జీవించాలని ఆశతో గవర్నమెంట్ కేటాయించిన ఇళ్లలో నివసిస్తున్నారు  కానీ ఇప్పుడు ఆ కాలనీ ప్రజల పాలిట ఒక నరకంగా మారింది దానికి కారణం కాలనీ కూతవేటు దూరంలో ఉన్న డంపింగ్ యార్డ్ జగిత్యాల పట్టణ నలుమూలల నుండి సేకరించిన టన్నులకొద్దీ చెత్తను ప్రతిరోజు ఇక్కడే పారబోస్తున్నారు. ఆ చెత్త కుప్పల నుండి వచ్చే విపరీతమైన దుర్వాసనతో స్థానికులు ఇళ్లలో కనీసం ప్రశాంతంగా కూర్చోని అన్నం తినలేని పరిస్థితి ఏర్పడింది పగలంతా ఈగలు దోమల గోల అయితే రాత్రిపూట ఈ చెత్త  తగలబెట్టడంతో వచ్చే దట్టమైన పొగ కాలనీని కమ్మేస్తుంది ఈ ఘాటైన కాలుష్యం కారణంగా అర్బన్ కాలనీలో రోగాల బారిన పడుతున్న వారి  సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు,వృద్ధులు శ్వాసకోస వ్యాధులు,ఆస్తమా, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు నిలిచిపోయిన వ్యర్ధాల వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి డెంగ్యూ మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు కాలనీని వనికిస్తున్నాయి ఇక్కడ నివసించడానికి స్థానికులు కన్నీరుమున్నీరు  అవుతున్నారు అధికారులు నాయకులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప ఈ సమస్యపై  తమకు విముక్తి కల్పించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్బన్ కాలనీ అంటే ఒక మోడల్ కాలనీగా ఉండాలి కానీ అర్బన్ కాలనీ మాత్రం డంపింగ్ యార్డ్ కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి జనవాసాలకు దూరంగా తరలించాలని కాలనీవాసులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు పాలకులు ఇప్పటికైనా స్పందిస్తారా ఈ నరక యాతన నుండి అర్బన్ కాలనీ ప్రజలకు విముక్తి కలిగిస్తారా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు
    user_Sriramula srinivas
    Sriramula srinivas
    కోరట్ల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • కోరుట్లలో పెరుగుతున్న కుక్కల బెడద పట్టించుకోని అధికారులు.. భయాందోళనలో పట్టణ ప్రజలు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు, పాఠశాలల పరిసరాల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు కుక్కల కారణంగా భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు వాహనదారులను వెంబడిస్తుండటంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒంటరిగా వెళ్లే చిన్నారులు, మహిళలు కుక్కల దాడుల భయంతో బయటకు రావడానికి జంకుతున్నారు. కుక్కల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, ఆహార వ్యర్థాలు బహిరంగంగా పడేయడం కూడా వీధి కుక్కల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, కుక్కల నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. “కుక్కల బెడదతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు రక్షణ కల్పించాలి” అని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    కోరుట్లలో పెరుగుతున్న కుక్కల బెడద
పట్టించుకోని అధికారులు.. భయాందోళనలో పట్టణ ప్రజలు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు, పాఠశాలల పరిసరాల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు కుక్కల కారణంగా భయాందోళనకు గురవుతున్నారు.
రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు వాహనదారులను వెంబడిస్తుండటంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒంటరిగా వెళ్లే చిన్నారులు, మహిళలు కుక్కల దాడుల భయంతో బయటకు రావడానికి జంకుతున్నారు.
కుక్కల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. 
పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, ఆహార వ్యర్థాలు బహిరంగంగా పడేయడం కూడా వీధి కుక్కల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, కుక్కల నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
“కుక్కల బెడదతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజలకు రక్షణ కల్పించాలి” అని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    Insurance Agent జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • అనుబంధాలకు ప్రతీక.. రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల ఆత్మీయ బంధానికి వేడుక
    1
    అనుబంధాలకు ప్రతీక.. రాఖీ పౌర్ణమి
అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల ఆత్మీయ బంధానికి వేడుక
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి* రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు...
    1
    *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టిన సోదరి*

రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఆయన సోదరి లీల స్వగృహంలో రాఖీ కట్టారు. 
అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొంటూ, ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు...
    user_Sai
    Sai
    Local News Reporter వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో నూలు పౌర్ణమి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర అంగరంగ వైభవో పేతంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం శోభాయాత్రలో కన్నుల పండుగలా సాగిన రథయాత్రలో ఒకవైపు మార్కండేయ స్వామి, మరో రథంపై స్వామి ధరించడానికి రథయాత్రలో నేతన్న మొగ్గంపై వస్త్రం నేస్తూ సాగడం భక్తులను ప్రజలను అలరించింది. అంతకు ముందు శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం లో ఉదయం "రక్షాబంధన్" , అలాగే నేతన్నల సామూహిక యజ్ఞోపవీతధారణ (జంజీరమలు ధరించుట) కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర ప్రారంభమైంది. సిరిసిల్ల పద్మశాలి సంఘం, పద్మశాలి యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శుక్రవారం శ్రీ మార్కండేయ దేవస్థానంలో ఉదయం నుంచి రాత్రి వరకు వేడుకలు జరిగాయి. శ్రీ మార్కండేయుని శోభాయాత్రను వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, డిఎస్పి నాగేంద్ర చారీలు ప్రత్యేక పూజలు చేసి శ్రీ మార్కండేయ స్వామి శోభాయాత్రను ప్రారంభించారు. వందలాది మంది పాల్గొన్న ఈ రథయాత్ర లో నేతన్న చౌక్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ లు నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసంగించారు. అనంతరం పట్టణంలోని గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా వెంకటేశ్వర దేవస్థానం నుంచి మళ్లీ తిరిగి మార్కండేయ దేవస్థానానికి చేరుకుంది. జై మార్కండేయ, జై జై మార్కండేయ అంటూ భక్తుల నినాదాలతో మారు మోగింది. కోలాటాలు, భజనలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. రథంపై శ్రీ మార్కండేయుని ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. మరో రథంపై చేనేత మగ్గం పై నేత కార్మికుడు వస్త్రాన్ని తయారుచేసి శ్రీ మార్కండేయునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, పద్మశాలి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పద్మశాలి సంఘం, యువజన సంఘం నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య మార్కండేయుని శోభాయాత్ర సాగింది.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో నూలు పౌర్ణమి వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర అంగరంగ వైభవో పేతంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం శోభాయాత్రలో కన్నుల పండుగలా సాగిన రథయాత్రలో ఒకవైపు మార్కండేయ స్వామి, మరో రథంపై స్వామి ధరించడానికి రథయాత్రలో నేతన్న మొగ్గంపై వస్త్రం  నేస్తూ  సాగడం భక్తులను ప్రజలను అలరించింది. అంతకు ముందు శ్రీ మార్కండేయ స్వామి దేవస్థానం లో ఉదయం  "రక్షాబంధన్" , అలాగే నేతన్నల సామూహిక యజ్ఞోపవీతధారణ  (జంజీరమలు ధరించుట) కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర  ప్రారంభమైంది. సిరిసిల్ల పద్మశాలి సంఘం, పద్మశాలి యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శుక్రవారం శ్రీ మార్కండేయ దేవస్థానంలో ఉదయం నుంచి రాత్రి వరకు వేడుకలు జరిగాయి. శ్రీ మార్కండేయుని శోభాయాత్రను వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, డిఎస్పి నాగేంద్ర చారీలు ప్రత్యేక పూజలు చేసి శ్రీ మార్కండేయ స్వామి శోభాయాత్రను ప్రారంభించారు. వందలాది మంది పాల్గొన్న ఈ రథయాత్ర లో నేతన్న చౌక్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ లు నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసంగించారు. అనంతరం పట్టణంలోని గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా వెంకటేశ్వర దేవస్థానం నుంచి మళ్లీ తిరిగి మార్కండేయ దేవస్థానానికి చేరుకుంది. జై మార్కండేయ, జై జై మార్కండేయ అంటూ భక్తుల నినాదాలతో మారు మోగింది. కోలాటాలు, భజనలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. రథంపై శ్రీ మార్కండేయుని ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. మరో రథంపై చేనేత మగ్గం పై నేత కార్మికుడు వస్త్రాన్ని తయారుచేసి శ్రీ మార్కండేయునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, పద్మశాలి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పద్మశాలి సంఘం, యువజన సంఘం నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య మార్కండేయుని శోభాయాత్ర సాగింది.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    24 min ago
  • భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు 9 మంది యువకుల అరెస్ట్ – ప్రభుత్వ అంచనా ప్రకారం మత్తు పదార్థాల విలువ రూ.6.50 లక్షలు కరీంనగర్ రూరల్ పోలీసులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ అలాం మరియు రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు మరియు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డికి అందిన నమ్మదగిన సమాచారం మేరకు, బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందింది. దీంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ అలాం గారు మరియు రూరల్ ఏసీపీ శ్రీ ఏ. విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం, రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా గుమిగూడి ఉన్న తొమ్మిది మంది వ్యక్తులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల మరియు సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన మొర్రి ఆకాశ్, పుట్టపాక విష్ణు సాయి, భైనవేని నితీష్, కోసిని బాలచంద్ర్, గుండు మనోహర్, విస్కుమల్లి విశాల్, గుండు కృష్ణగిరి, సిరిసిల్ల ప్రభాస్, మాకుల శివప్రసాద్గా తమ వివరాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో సుమారు రూ.7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అలాగే గంజాయిని వినియోగించడంతో పాటు, హాష్ ఆయిల్‌ను ప్రత్యేక పరికరాల ద్వారా పొగ రూపంలో తీసుకుంటున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు నిందితుల వద్ద తనిఖీ నిర్వహించగా: సుమారు 500 గ్రాములు/మిల్లీలీటర్ల హాష్ ఆయిల్ సుమారు 500 గ్రాముల గంజాయి 60 డ్రగ్ ట్యాబ్లెట్లు 14 సిరంజీలు హాష్ ఆయిల్ వినియోగానికి ఉపయోగించే పరికరాలు 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల ప్రభుత్వ అంచనా విలువ సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్వాధీనం ప్రక్రియను పంచుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేస్తూ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు విచారణలో నిందితుల్లో ఒకరు డీమార్ట్ సమీపంలోని మెడికల్ షాప్ నుంచి డ్రగ్ ట్యాబ్లెట్లను తరచుగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర అంశాలపై సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. NDPS Act తదితర చట్టాల కింద కేసులు నిందితులపై NDPS Act, Drugs Act మరియు వర్తించే ఇతర చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన ప్రక్రియ అనంతరం రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు తదితర పదార్థాలను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం FSLకు పంపించి, పరీక్షా నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత కూడా మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళనకరమైన విషయమని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలను విక్రయించే లేదా సరఫరా చేసే వ్యక్తుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కేసులో నమ్మదగిన సమాచారం సేకరించి, చాకచక్యంగా దాడి నిర్వహించి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్న కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలాం మరియు రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ అభినందించారు.
    1
    భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు 
9 మంది యువకుల అరెస్ట్ – ప్రభుత్వ అంచనా ప్రకారం మత్తు పదార్థాల విలువ రూ.6.50 లక్షలు

కరీంనగర్ రూరల్ పోలీసులు
కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ అలాం మరియు రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు మరియు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేశారు.
ఈరోజు ఉదయం కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డికి అందిన నమ్మదగిన సమాచారం మేరకు, బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందింది.
దీంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ అలాం గారు మరియు రూరల్ ఏసీపీ శ్రీ ఏ. విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం, రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా గుమిగూడి ఉన్న తొమ్మిది మంది వ్యక్తులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో వారు కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల మరియు సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన మొర్రి ఆకాశ్, పుట్టపాక విష్ణు సాయి, భైనవేని నితీష్, కోసిని బాలచంద్ర్, గుండు మనోహర్, విస్కుమల్లి విశాల్, గుండు కృష్ణగిరి, సిరిసిల్ల ప్రభాస్, మాకుల శివప్రసాద్గా తమ వివరాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం
పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో సుమారు రూ.7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం
నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
అలాగే గంజాయిని వినియోగించడంతో పాటు, హాష్ ఆయిల్‌ను ప్రత్యేక పరికరాల ద్వారా పొగ రూపంలో తీసుకుంటున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు
నిందితుల వద్ద తనిఖీ నిర్వహించగా:
సుమారు 500 గ్రాములు/మిల్లీలీటర్ల హాష్ ఆయిల్
సుమారు 500 గ్రాముల గంజాయి
60 డ్రగ్ ట్యాబ్లెట్లు
14 సిరంజీలు
హాష్ ఆయిల్ వినియోగానికి ఉపయోగించే పరికరాలు
8 మొబైల్ ఫోన్లు
స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల ప్రభుత్వ అంచనా విలువ సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
స్వాధీనం ప్రక్రియను పంచుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేస్తూ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు
విచారణలో నిందితుల్లో ఒకరు డీమార్ట్ సమీపంలోని మెడికల్ షాప్ నుంచి డ్రగ్ ట్యాబ్లెట్లను తరచుగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర అంశాలపై సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
NDPS Act తదితర చట్టాల కింద కేసులు
నిందితులపై NDPS Act, Drugs Act మరియు వర్తించే ఇతర చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన ప్రక్రియ అనంతరం రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు తదితర పదార్థాలను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం FSLకు పంపించి, పరీక్షా నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత కూడా మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళనకరమైన విషయమని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలను విక్రయించే లేదా సరఫరా చేసే వ్యక్తుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ఈ కేసులో నమ్మదగిన సమాచారం సేకరించి, చాకచక్యంగా దాడి నిర్వహించి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్న కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలాం మరియు రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ అభినందించారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ అర్బన్ ఎమ్మార్వో ఆఫీసు వద్ద చెత్తలో జాతీయ జెండాలు కరీంనగర్ లోని స్థానిక అర్బన్ రెవెన్యూ (ఎమ్మార్వో) కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద జాతీయ జెండాలు చెత్తకుప్పలో దర్శనమివ్వడం కలకలం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ఉపయోగించిన జెండాలను ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిపి పారవేశారు. కొబ్బరి పీచుతో పాటు పడివున్న కొన్ని జెండాలు పాక్షికంగా కాలిన స్థితిలో ఉన్నట్లు ఆఫీసు పనిమీద వచ్చిన చంద్రశేఖర్ అనే యువకుడు, ఇతర పౌరులు గమనించారు. 'ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002' ప్రకారం దెబ్బతిన్న జెండాలను గౌరవప్రదంగా నిర్వీర్యం చేయాల్సి ఉండగా, ప్రభుత్వ కార్యాలయం వద్దే ఇలా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
    3
    కరీంనగర్ అర్బన్ ఎమ్మార్వో ఆఫీసు వద్ద చెత్తలో జాతీయ జెండాలు
కరీంనగర్ లోని స్థానిక అర్బన్ రెవెన్యూ (ఎమ్మార్వో) కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద జాతీయ జెండాలు చెత్తకుప్పలో దర్శనమివ్వడం కలకలం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ఉపయోగించిన జెండాలను ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిపి పారవేశారు.
కొబ్బరి పీచుతో పాటు పడివున్న కొన్ని జెండాలు పాక్షికంగా కాలిన స్థితిలో ఉన్నట్లు ఆఫీసు పనిమీద వచ్చిన చంద్రశేఖర్ అనే యువకుడు, ఇతర పౌరులు గమనించారు. 'ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002' ప్రకారం దెబ్బతిన్న జెండాలను గౌరవప్రదంగా నిర్వీర్యం చేయాల్సి ఉండగా, ప్రభుత్వ కార్యాలయం వద్దే ఇలా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రీజినల్ మేనేజర్ చి. రాజా నరేంద్ర ఈ వాహనాన్ని ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రతాప నవీన్ కుమార్, ఈ ఈ శ్రీ రాజేష్‌లకు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు రూ.7.25 లక్షల విలువైన ఈ వాహనం ఆలయ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ సి. ప్రతాప్ రెడ్డి, రీజినల్ మేనేజర్ శ్రీ చి. రాజా నరేంద్రతో పాటు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రీజినల్ మేనేజర్ చి. రాజా నరేంద్ర ఈ వాహనాన్ని ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రతాప నవీన్ కుమార్, ఈ ఈ  శ్రీ రాజేష్‌లకు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు రూ.7.25 లక్షల విలువైన ఈ వాహనం ఆలయ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ సి. ప్రతాప్ రెడ్డి, రీజినల్ మేనేజర్ శ్రీ చి. రాజా నరేంద్రతో పాటు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.