ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్‌లో మరో సారి ఉద్యోగాల కోత మొదలైంది. లేఆఫ్ జాబితాలో ఉన్న సిబ్బందికి ఉదయం ఆరు గంటల నుంచే లేఆఫ్స్ మెయిల్స్ *ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్‌లో మరో సారి ఉద్యోగాల కోత మొదలైంది. లేఆఫ్ జాబితాలో ఉన్న సిబ్బందికి ఉదయం ఆరు గంటల నుంచే లేఆఫ్స్ మెయిల్స్ రావడం మొదలైనట్లు బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించింది.* కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు పేర్కొంది. తాజా లేఆఫ్‌లో ఉద్యోగాలు కోల్పోయిన పలువురు ఉద్యోగులు తమ అనుభవాలను లింక్డ్‌ఇన్, రెడిట్, బ్లైండ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నారు. ఈ తాజా రౌండ్‌లో ప్రభావితమైన ముగ్గురు ఉద్యోగులతో మాట్లాడినట్లు, అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన నోటిఫికేషన్‌ను పరిశీలించినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపింది. అయితే తాజా లేఆఫ్స్‌లో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయాన్ని ఒరాకిల్ అధికారికంగా వెల్లడించలేదు. *ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే'..!!* ఇవాళ ఉదయం 6 గంటల నుంచే ఉద్యోగులకు ఒరాకిల్ సంస్థ మెయిల్స్ పంపడం ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. "Today is your last working day" అంటూ ఆ మెయిల్స్ ప్రారంభమైనట్లు ఉద్యోగులు తెలిపారు. ఒరాకిల్ ప్రస్తుత వ్యాపార అవసరాలను పరిగణనలోకి తీసుకుని సంస్థలో విస్తృత పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నామని, అందులో భాగంగా సంబంధిత ఉద్యోగుల పోస్టులను తొలగించినట్లు ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఉద్యోగి పనితీరు లేదా వ్యక్తిగత కారణాలను ప్రస్తావించకుండా.. "Oracle's current business needs" ఆధారంగా ఉద్యోగాన్ని తొలగిస్తున్నట్లు మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు వారి సేవలకు, కృషికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం.. టెర్మినేషన్ పత్రాలపై సంతకం చేసిన తర్వాత కంపెనీ సెవరెన్స్ ప్లాన్ నిబంధనలకు లోబడి పరిహారం అందుతుందని వివరించినట్లు సమాచారం.
ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్‌లో మరో సారి ఉద్యోగాల కోత మొదలైంది. లేఆఫ్ జాబితాలో ఉన్న సిబ్బందికి ఉదయం ఆరు గంటల నుంచే లేఆఫ్స్ మెయిల్స్ *ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్‌లో మరో సారి ఉద్యోగాల కోత మొదలైంది. లేఆఫ్ జాబితాలో ఉన్న సిబ్బందికి ఉదయం ఆరు గంటల నుంచే లేఆఫ్స్ మెయిల్స్ రావడం మొదలైనట్లు బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించింది.* కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు పేర్కొంది. తాజా లేఆఫ్‌లో ఉద్యోగాలు కోల్పోయిన పలువురు ఉద్యోగులు తమ అనుభవాలను లింక్డ్‌ఇన్, రెడిట్, బ్లైండ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో పంచుకున్నారు. ఈ తాజా రౌండ్‌లో ప్రభావితమైన ముగ్గురు ఉద్యోగులతో మాట్లాడినట్లు, అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన నోటిఫికేషన్‌ను పరిశీలించినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపింది. అయితే తాజా లేఆఫ్స్‌లో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయాన్ని ఒరాకిల్ అధికారికంగా వెల్లడించలేదు. *ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే'..!!* ఇవాళ ఉదయం 6 గంటల నుంచే ఉద్యోగులకు ఒరాకిల్ సంస్థ మెయిల్స్ పంపడం ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. "Today is your last working day" అంటూ ఆ మెయిల్స్ ప్రారంభమైనట్లు ఉద్యోగులు తెలిపారు. ఒరాకిల్ ప్రస్తుత వ్యాపార అవసరాలను పరిగణనలోకి తీసుకుని సంస్థలో విస్తృత పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నామని, అందులో భాగంగా సంబంధిత ఉద్యోగుల పోస్టులను తొలగించినట్లు ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఉద్యోగి పనితీరు లేదా వ్యక్తిగత కారణాలను ప్రస్తావించకుండా.. "Oracle's current business needs" ఆధారంగా ఉద్యోగాన్ని తొలగిస్తున్నట్లు మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు వారి సేవలకు, కృషికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం.. టెర్మినేషన్ పత్రాలపై సంతకం చేసిన తర్వాత కంపెనీ సెవరెన్స్ ప్లాన్ నిబంధనలకు లోబడి పరిహారం అందుతుందని వివరించినట్లు సమాచారం.
- నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు.. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ... భద్రాచలం: నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. శిక్షణలో భాగంగా హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, బ్యూటీషియన్, ఎలక్ట్రికల్, ఆటోమోటివ్, బేసిక్ గ్రాఫిక్ డిజైన్, షోరూమ్ హోస్ట్, టూర్ గైడ్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యూటీషియన్ కోర్సు భద్రాచలంలో 30 రోజుల పాటు, ఎలక్ట్రికల్ కోర్సు బూర్గంపాడు, హైదరాబాద్, మెదక్ ప్రాంతాల్లో 45 రోజులు, హెల్త్‌కేర్ కోర్సు హైదరాబాద్‌లో 50 రోజులు, హాస్పిటాలిటీ కోర్సు షాద్‌నగర్‌లో 65 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల, కోర్సును బట్టి 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్/ఎస్‌ఎస్‌సీ మెమో, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు అవసరమని తెలిపారు. శిక్షణలో 80 శాతం ప్రాక్టికల్, 20 శాతం థియరీతో పాటు ప్రీ, పోస్ట్ పరీక్షలు నిర్వహిస్తామని, అర్హత కలిగిన వారికి ఉద్యోగ మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. సంప్రదించండి: కో-ఆర్డినేటర్ ఆర్. గోపాల్ – 8231821693. టోల్‌ఫ్రీ: 1800-12-000-4007.1
- భద్రాచలానికి మూడో వంతెన పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి రైల్వే లైన్‌కు కృతజ్ఞతగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం భద్రాచలం ప్రాంత ప్రజల చిరకాల రైల్వే కలను సాకారం చేసే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి 173.61 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్‌ను మంజూరు చేయడాన్ని* స్వాగతిస్తూ భద్రాచలంలో బీజేపీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ సెంటర్‌లో రాజ్యాంగ నిర్మాత *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.* ముఖ్య అతిథిగా పాల్గొన్న *బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి* మాట్లాడుతూ.. భద్రాచలం ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న రైల్వే కనెక్టివిటీ కోసం గతంలో *పాండురంగాపురం–సారపాక వరకు సుమారు 8 కి.మీ. రైల్వే లైన్‌ను* కోరుకున్నామని, అయితే మోదీ ప్రభుత్వం *పాండురంగాపురం నుంచి భద్రాచలం మీదుగా మల్కాన్‌గిరి వరకు 2864 కోట్లతో 2031లోగా పూర్తి చేసేలా 173.61 కి.మీ. రైల్వే లైన్‌ను మంజూరు చేయడం* గొప్ప విషయమన్నారు. ఈ ప్రాజెక్టులో *భద్రాచలం వద్ద గోదావరిపై మూడో రైల్వే వంతెన నిర్మాణం* జరగడం ద్వారా భద్రాచలం నేరుగా రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుందని తెలిపారు. ఇది *దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం* ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచడంతో పాటు, ఏజెన్సీ గిరిజన ప్రాంతాల *విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అభివృద్ధికి* ఎంతో దోహదపడుతుందన్నారు. ఇప్పటికే మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి *భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసి, ఎలాంటి జాప్యం లేకుండా రైల్వే శాఖకు భూమిని అప్పగించాలని* బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో *బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, కందుల రాంకిషోర్, పసుమర్తి సతీష్, అట్లూరి రఘురామ్, ములిశెట్టి రాంమోహన్ రావు, ముత్యాల శ్రీనివాస్, కండ్రపు త్రినాథ్ రెడ్డి, నూప రమేష్, రామెళ్ళ రాజశేఖర్, పెద్ది జగపతి బాబు, నిడదవోలు నాగబాబు, తాటిపాముల ఐలయ్య, ముత్యాల చంద్రశేఖర్, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ములిశెట్టి నిఖిల్, షేర్ శ్రీను, జీవా, మాలోత్ సాయి, కారం చిన్నయ్య, కోర్స గంగరాజు, సోలం చంటిబాబు* తదితరులు పాల్గొన్నారు.1
- ఖమ్మం నగరం 27 డివిజన్ శ్రీనివాస్ నగర్ ఏరియాలో ఇల్లులు కూలగొట్టడానికి వస్తున్న వారిని అడ్డుకొని శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి పై ధర్నా చేస్తున్న బాధితులు....మాకు ఇచ్చిన నోటీసులు వెంటనే ఉపసంహారించు కొని ఇళ్ళు కూల్చే పనిని మానుకోవాలని డిమాండ్ చెస్తున్నారు, వీరికి మద్దతు గా బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు....1
- మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం: మారుమూల గిరిజన గూడెంలో పుట్టినప్పటికీ.. తన ఆలోచనలతో, సేవా కార్యక్రమాలతో వేలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా స్ఫూర్తి డా. రవి బాదావత్. పుట్టింది గిరిజన ప్రాంతంలో కావచ్చు.. కానీ సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ఎంతో విశాలమైనవి. పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వమనే నమ్మకంతో డా. రవి బాదావత్ ముందుకు సాగుతున్నారు. తనకు సాధ్యమైన రీతిలో ప్రజలకు సేవ చేస్తూ, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి తోడుగా నిలుస్తూ.. సేవను ఒక బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి సేవా మార్గంలో సాగుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. డా. రవి బాదావత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆయన సేవా స్ఫూర్తిని అభినందించడం విశేషంగా నిలిచింది. ఒక నాయకుడు స్వయంగా ఒక సేవా కార్యకర్తను అభినందించే స్థాయికి ఎదగడం.. ఆయన చేస్తున్న సేవకు లభించిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు. సేవే ఆయనకు బలం.. ప్రజలే ఆయన కుటుంబం మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఈ ఆణిముత్యం.. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన చేస్తున్న కృషి యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. “పదవి కోసం చేసే పని తాత్కాలికం.. ప్రజల కోసం చేసే సేవ మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అనే ఆలోచనతో డా. రవి బాదావత్ సాగిస్తున్న సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవా మార్గంలో సాగుతున్న సేవా సైనికుడు డా. రవి బాదావత్ అని పలువురు కొనియాడుతున్నారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.1
- హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు 🤔రూమ్ ఫ్రీ. జీతం :20,000₹. below 10th. #hyderabad #security1
- ఇబ్రహీంపట్నంలో గంజాయి నిర్మూలనకు ఖాకీ నిఘా: సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ అవగాహన ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలో మత్తుపదార్థాల రహిత ర్యాలీ. సమాజమే లక్ష్యంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గంజాయి నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గంజాయి మూలాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే, *ఇబ్రహీంపట్నం సర్కిల్* *ఇన్‌స్పెక్టర్ (సీఐ)* *సుబ్రహ్మణ్యంఆధ్వర్యంలో* పట్టణవ్యాప్తంగా శనివారం ఒక భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు.పట్టణంలోని ముఖ్య కూడళ్ల గుండా సాగిన ఈ ర్యాలీ అనంతరం, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద పోలీసులు ప్రజలను, యువతను ఉద్దేశించి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిస కావడం వల్ల జీవితాలు ఏ విధంగా నాశనమవుతాయో సీఐ సుబ్రహ్మణ్యం క్షేత్రస్థాయి ఉదాహరణలతో వివరించారు.యువతే లక్ష్యంగా అవగాహన:ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యువత క్షణికానందం కోసం మత్తు వైపు మళ్లీ తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని హితవు పలికారు. గంజాయి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను, చట్టపరమైన దుష్ఫలితాలను యువతకు స్పష్టంగా వివరించారు. విద్యార్థులు, యువత చదువుపై, కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరారు.ప్రజలు సమాచారం అందించాలి:ఇబ్రహీంపట్నం పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయించినా, రవాణా చేసినా లేదా నిల్వ ఉంచినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. సమాజ సంక్షేమం కోసం ప్రజలందరూ పోలీసులతో చేతులు కలిపి, గంజాయి రహిత ఇబ్రహీంపట్నంగా మార్చడానికి సహకరించాలని కోరారు.1
- మేడే కాలనీలో డ్రైనేజీ, రోడ్డు సమస్యలు.. స్కూల్ ఎదుట అధ్వానంగా ఉన్న పరిస్థితులపై సర్పంచ్ పరిశీలన... సారపాక: మేడే కాలనీలోని పాఠశాల ఎదుట అధ్వానంగా ఉన్న డ్రైనేజీ, రహదారి సమస్యలను సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు, స్థానికులు రాకపోకలు సాగించే ప్రాంతంలో డ్రైనేజీ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు స్థానికులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. రహదారి పరిస్థితిని కూడా పరిశీలించిన ఆయన సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థల హద్దులకు సంబంధించిన విషయంలో సర్పంచ్, కొందరు స్థానికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పాఠశాల ఎదుట ఉన్న స్థలం తమ పరిధిలోకి వస్తుందనే విషయంలో ఇరువర్గాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ సమస్యతో మురుగునీరు సక్రమంగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, రహదారి సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు. పాఠశాల పరిసరాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే స్థల హద్దుల విషయంలో తలెత్తిన వివాదానికి సంబంధించి సంబంధిత రికార్డులను పరిశీలించి, అధికారుల సమక్షంలో హద్దులను నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమస్యపై అధికారులు స్పందించి పాఠశాల పరిసరాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరుతున్నారు.4