logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదానాలకంటె-అన్నదానం గొప్పది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్ జి ఒ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతగా నిర్వహించడం జరిగింది బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్విరామంగా కొనసాగించాలనే సదుద్దేశంతో 05/04/2020 రోజున ప్రారంభించబడి దానికి కొనసాగింపుగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఎందరో ఆకలి తీరుస్తూ బెల్లంపల్లి పట్టణంలో 399వ వారాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్ పుట్టినరోజు సందర్బంగా వారి స్నేహితులు అభిమానుల సహకారంతోఅన్నదాన కార్యక్రమము యాచకులకు నిరుపేదలకు,దినసరి అడ్డ కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్ టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 399వ వారల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు కార్యక్రమం లో రేణుకుంట్ల ప్రవీణ్ స్నేహితులు అభిమానులు దాసరి దుర్గారాజేష్ సొత్కు శ్రీనివాస్ తాటికొండ చంద్రమౌళి గజ్జేల్లి చంద్రశేఖర్ పాలేపు నర్సయ్య ఇరుగురాల రాజకుమార్ ఆకుల మల్లేష్ అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ గన్నేవరం తిరుమలచారి యం డి రేహన చెందుపట్ల లింగమూర్తి MD యుసుఫ్ భరత్ రుషి కేశబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.

7 hrs ago
user_పవన్ చారి
పవన్ చారి
బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
7 hrs ago

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదానాలకంటె-అన్నదానం గొప్పది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్ జి ఒ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతగా నిర్వహించడం జరిగింది బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్విరామంగా కొనసాగించాలనే సదుద్దేశంతో 05/04/2020 రోజున ప్రారంభించబడి దానికి కొనసాగింపుగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఎందరో ఆకలి తీరుస్తూ బెల్లంపల్లి పట్టణంలో 399వ వారాలు అన్నదాన

02914bac-d760-4c2d-ba7b-e5470fe369c8

కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్ పుట్టినరోజు సందర్బంగా వారి స్నేహితులు అభిమానుల సహకారంతోఅన్నదాన కార్యక్రమము యాచకులకు నిరుపేదలకు,దినసరి అడ్డ కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్ టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత

ed082fc6-f394-4a13-b1d8-aff33f54458d

ప్రాజెక్టులో భాగంగా 399వ వారల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు కార్యక్రమం లో రేణుకుంట్ల ప్రవీణ్ స్నేహితులు అభిమానులు దాసరి దుర్గారాజేష్ సొత్కు శ్రీనివాస్ తాటికొండ చంద్రమౌళి గజ్జేల్లి చంద్రశేఖర్ పాలేపు నర్సయ్య ఇరుగురాల రాజకుమార్ ఆకుల మల్లేష్ అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ గన్నేవరం తిరుమలచారి యం డి రేహన చెందుపట్ల లింగమూర్తి MD యుసుఫ్ భరత్ రుషి కేశబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రైతు ప్రజా సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేస్తాం: బిజెపి నాయకులు రైతులు, ప్రజా సమస్యలపై బిజెపి నిరంతరాయ ఉద్యమాలు చేస్తుందని బిజెపి లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని స్థానిక ఐబీలో మీడియా సమావేశం నిర్వహించారు. కడెం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ మాట్లాడితే ఆయనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతులు, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.
    1
    రైతు ప్రజా సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేస్తాం: బిజెపి నాయకులు
రైతులు, ప్రజా సమస్యలపై బిజెపి నిరంతరాయ ఉద్యమాలు చేస్తుందని బిజెపి లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని స్థానిక ఐబీలో మీడియా సమావేశం నిర్వహించారు. కడెం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ మాట్లాడితే ఆయనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతులు, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా :ధర్మపురి: ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ అమలు చేయాలని, ఈ అంశాన్ని రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫీల్డ్ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న తమకు పే స్కేల్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.వారి వినతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.
    1
    ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జిల్లా :ధర్మపురి: 
ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ అమలు చేయాలని, ఈ అంశాన్ని రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫీల్డ్ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న తమకు పే స్కేల్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.వారి వినతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం.. కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ  దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు  చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం..

కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ  దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు  చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Shankerreddy
    Shankerreddy
    కొత్తపల్లి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • చెరుకు ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలి రైతులకురవాణచార్జీలు చెల్లించాలని   మంత్రి శ్రీధర్ బాబును కోరిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జు వ్వడి కృష్ణారావు
    1
    చెరుకు ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలి రైతులకురవాణచార్జీలు చెల్లించాలని   మంత్రి శ్రీధర్ బాబును కోరిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జు వ్వడి కృష్ణారావు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • *బీజేపీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ* భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. పద్మనగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ తిరంగా బైక్ ర్యాలీ, పద్మనగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వీధుల గుండా సాగి చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ బైక్ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది. బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా చింతకుంటకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా బైక్ ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కార్పొరేటర్లు వాసల్ రమేష్, వేముల చంద్రశేఖర్... బిజెపి నాయకులు ముంజేటి శివ, ఆడిచర్ల రాజు, సత్తిరెడ్డి, సదానందం, పూస అనిల్, కిరణ్, రాచకొండ కొమరయ్య, శ్రీకాంత్ నాయక్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
    1
    *బీజేపీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ*
భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. 
పద్మనగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ తిరంగా బైక్ ర్యాలీ, పద్మనగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వీధుల గుండా సాగి చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ బైక్ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.
బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా చింతకుంటకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా బైక్ ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కార్పొరేటర్లు వాసల్ రమేష్, వేముల చంద్రశేఖర్... బిజెపి నాయకులు ముంజేటి శివ, ఆడిచర్ల రాజు, సత్తిరెడ్డి, సదానందం, పూస అనిల్, కిరణ్, రాచకొండ కొమరయ్య, శ్రీకాంత్ నాయక్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కుమార్ డిమాండ్ ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.
    1
    జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కుమార్ డిమాండ్
ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు.
​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • ప్రారంభమైన మదన పోచమ్మ దేవాలయం పైకప్పు నిర్మాణం * కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ గోదావరిఖని : మార్కండేయ కాలనీ రాజేష్ దియేటర్ ముందు నెలకొల్పిన మదన పోచమ్మ దేవాలయం మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ కమిటి నేతృత్వంలో జరుగుతున్న ఆలయ పైకప్పు (స్లాబ్) నిర్మాణానికి ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కి తన తోడ్పాటు ఉంటుందన్నారు. అమ్మ వారు నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్నారు. అలాగే ఈ కార్యమానికి స్థానిక ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ సాగి సంతోష్ రావు, ఆలయ కమిటి శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.
    1
    ప్రారంభమైన మదన పోచమ్మ దేవాలయం పైకప్పు నిర్మాణం
* కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాగూర్
గోదావరిఖని : మార్కండేయ కాలనీ రాజేష్ దియేటర్ ముందు నెలకొల్పిన మదన పోచమ్మ దేవాలయం మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ కమిటి నేతృత్వంలో జరుగుతున్న ఆలయ పైకప్పు (స్లాబ్) నిర్మాణానికి ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కి తన తోడ్పాటు ఉంటుందన్నారు. అమ్మ వారు నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్నారు. అలాగే ఈ కార్యమానికి స్థానిక ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ సాగి సంతోష్ రావు, ఆలయ కమిటి శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    14 hrs ago
  • సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల/ సారంగాపూర్  బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్  పరిశీలించారు. ఈ తనిఖీలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె. రాజ్ కుమార్, జిల్లా వైద్యాధికారి డా. సుజాత, మండల ఎమ్మార్వో, ఎంపిడివో, ఆస్పత్రి సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను పరిశీలించి, పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహంలోని విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా కిచెన్ షెడ్ నిర్మాణ పనులు నాణ్యతతో, వేగవంతంగా నిర్మించాలని నిర్మాణం పనులలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి O.P. సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు మెరుగు పరచాలని డాక్టర్లు సమయ పాలన పాటించాలని ఆదేశించారు.సామాజిక ఆరోగ్య కేంద్రంలో వర్షాకాలం వ్యాధుల పట్ల డెంగ్యూ, వైరల్ ఫీవర్లకు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.   ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ ఉండకుండా చూసుకోవాలన్నారు. పేషంట్లను వైద్యులు అందిస్తున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోని వున్న మంచినీటి సౌకర్యాలను కల్పించాలని అందించాలి ఆదేశించారు.
    1
    సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల/ సారంగాపూర్ 
బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్  పరిశీలించారు.
ఈ తనిఖీలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె. రాజ్ కుమార్, జిల్లా వైద్యాధికారి డా. సుజాత, మండల ఎమ్మార్వో, ఎంపిడివో, ఆస్పత్రి సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను పరిశీలించి, పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వసతి గృహంలోని విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా కిచెన్ షెడ్ నిర్మాణ పనులు నాణ్యతతో, వేగవంతంగా నిర్మించాలని నిర్మాణం పనులలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి O.P. సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి పరిశీలించారు.
ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వైద్య సేవలు మెరుగు పరచాలని డాక్టర్లు సమయ పాలన పాటించాలని ఆదేశించారు.సామాజిక ఆరోగ్య కేంద్రంలో వర్షాకాలం వ్యాధుల పట్ల డెంగ్యూ, వైరల్ ఫీవర్లకు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.  
ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ ఉండకుండా చూసుకోవాలన్నారు. పేషంట్లను వైద్యులు అందిస్తున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోని వున్న మంచినీటి సౌకర్యాలను కల్పించాలని అందించాలి ఆదేశించారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • కామన్ పల్లి పల్లె ప్రకృతి వనంలో చేతబడి కలకలం, ఆందోళనలో గ్రామస్తులు జన్నారం మండలంలోని కామన్ పల్లి గ్రామంలో ఉన్న పల్లె ప్రకృతివనంలో చేతబడి ఆనవాళ్లు కలకాలం రేపాయి. ప్రకృతి వనంలోని ఒక చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు రెండు బొమ్మలను ఉంచి వాటిపై జీడీ గింజలను పదునైన మొలలతో దిగ్గొట్టి కట్టివేసి ఉండటాన్ని గ్రామస్థులు గమనించారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేటి సైన్స్ ప్రపంచంలో చేతబడి లాంటి పనులు ఆందోళనకు గురి చేస్తున్నాయని వారన్నారు.
    1
    కామన్ పల్లి పల్లె ప్రకృతి వనంలో చేతబడి కలకలం, ఆందోళనలో గ్రామస్తులు
జన్నారం మండలంలోని కామన్ పల్లి గ్రామంలో ఉన్న పల్లె ప్రకృతివనంలో చేతబడి ఆనవాళ్లు కలకాలం రేపాయి. ప్రకృతి వనంలోని ఒక చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు రెండు బొమ్మలను ఉంచి వాటిపై జీడీ గింజలను పదునైన మొలలతో దిగ్గొట్టి కట్టివేసి ఉండటాన్ని గ్రామస్థులు గమనించారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేటి సైన్స్ ప్రపంచంలో చేతబడి లాంటి పనులు ఆందోళనకు గురి చేస్తున్నాయని వారన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.