Shuru
Apke Nagar Ki App…
ఆడే గజేందార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సాజిద్ ఖాన్ ఆడే గజేందార్‌కు జన్మదిన శుభాకాంక్షలు ఆదిలాబాద్: బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో గజేందార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
AlluriMahesh
ఆడే గజేందార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సాజిద్ ఖాన్ ఆడే గజేందార్‌కు జన్మదిన శుభాకాంక్షలు ఆదిలాబాద్: బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో గజేందార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆటో బంద్‌ను విజయవంతం చేయండి ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24న చేపట్టనున్న ఆటో బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ముంజం ఆనంద్‌కుమార్ పిలుపునిచ్చారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్లపై పన్నులు, లైసెన్స్, ఫిట్‌నెస్ తదితర చార్జీల భారాన్ని తగ్గించాలని, రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు సవరించాలని, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వేధింపులను అరికట్టాలని కోరారు. బంద్‌లో డ్రైవర్లు, కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.1
- *అంగన్వాడీ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన* *జువ్వడి కృష్ణారావు* *మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్*1
- నల్లగొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో వంట పనులు చేపిస్తున్న హాస్టల్ వార్డెన్ విద్యార్థినులతో వంట పనులు చేయిస్తున్న హాస్టల్ సిబ్బంది నల్గొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినులతో చపాతీలు, వంట పనులు చేయిస్తున్న హాస్టల్ వార్డెన్, సిబ్బంది1
- బాసర అమ్మవారికి ఒక్కరోజే 11లక్షల 79 వేల 350 రూపాయల ఆదాయం... *బాసర: ఒక్కరోజే రూ.11.79 లక్షల ఆదాయం* ఆదివారం సెలవు దినం, శ్రావణ మాసం ఏకాదశి సందర్భంగా బాసర అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. అక్షరాభ్యాసం, కుంకుమార్చన, చండీహోమం, సత్యనారాయణ వ్రతం తదితర అర్జిత సేవల ద్వారా ఒక్కరోజే రూ.11,79,350 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ అంజనాదేవి తెలిపారు.1
- కాలేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడానికి కల్వకుంట్ల కుటుంబ అవినీతే కారణం: జువ్వాడి కృష్ణారావు జగిత్యాల జిల్లా కోరుట్ల: కాలేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడానికి కల్వకుంట్ల కుటుంబ అవినీతే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కృష్ణారావు అన్నారు. ప్రాజెక్టులోని పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో నీటిని నిల్వ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు నీటిని విజయవంతంగా సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మేడిగడ్డ ప్రాజెక్టుపై మాట్లాడే ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బినామీల ద్వారా నాసిరకం పనులు చేయించారంటూ ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంక్రీట్ నాణ్యతకు సంబంధించి 54 శాతం నాణ్యత మాత్రమే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. అవినీతి, ప్రజల సొమ్ము దుర్వినియోగం వంటి అంశాల్లో కల్వకుంట్ల కుటుంబంపై అనేక ఆరోపణలు ఉన్నాయని కృష్ణారావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ, రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శిస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం మానుకోవాలని సంజయ్‌కు కృష్ణారావు సూచించారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఈ అంశంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ సమావేశంలో కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెజ్జారపు శ్రీనివాస్, మసీద్ ముజ్బిత్, పిజర్ ఖయ్యూం, చుమ్ము హర్షత్ తదితరులు పాల్గొన్నారు.1
- జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* *జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* పెద్దపల్లి, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మరియు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గార్ల అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గార్కి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేసేందుకు జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, తెలంగాణ రక్షణ సేన నాయకులు సిరవేన స్వప్న, బొల్లబత్తుల భూమయ్య,బొడిగె మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ఇతర రంగాల్లో తగిన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.1
- తాంసి: కప్పర్ల రోడ్డును బాగు చేయండి కలెక్టర్ సార్..... తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి వచ్చే రోడ్డు మార్గం పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామానికి నూతన రోడ్డు మంజూరైనప్పటికీ కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేయడంతో కంకర రాళ్లు తేలి, గుంతలలో నీరు నిండి ప్రయాణం నరకప్రాయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కప్పర్ల గ్రామానికి కలెక్టర్ రాజర్షి షా రానున్న నేపథ్యంలో రోడ్డును బాగు చేయాలని ఆయన్ను గ్రామస్తులు వేడుకుంటున్నారు.1
- కోరుట్ల 17 వ వార్డు లో అంగన్వాడీ పిల్లలకు ఉచిత డ్రెస్సుల పంపిణి చేసిన జువ్వాడి కృష్ణారావు1
- *బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం* *-- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *మృతులకు నివాళు అర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే* చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల్లా కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రక్తసంబంధీకులు నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో షాదుల్లాతో పాటు ఆయన భార్య హాసీనా, మరో హాసీనా, పదో తరగతి చదువుతున్న చిన్నారి మృతి చెందడం బాధాకరమని విప్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఒక్కొక్కరుగా మృతి చెందారని తెలిపారు. వేములవాడ పట్టణంలోనీ ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పరామర్శించి, ఓదార్చారు. మృతదేహాలకు నివాళి అర్పించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారు.. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు ముందు, వెనుక సీట్లలో ఉన్నప్పటికీ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. రాష్ట్ర పోలీసు శాఖ ప్రయాణికుల భద్రత పై అవగాహన కల్పించడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు...ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తసంబంధీకులు మృతి చెందడం అత్యంత బాధాకరమైనoదన్నారు., మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవండుతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు... ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి, వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి అని విప్ విజ్ఞప్తి చేశారు..4