logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నల్లగొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో వంట పనులు చేపిస్తున్న హాస్టల్ వార్డెన్ విద్యార్థినులతో వంట పనులు చేయిస్తున్న హాస్టల్ సిబ్బంది నల్గొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినులతో చపాతీలు, వంట పనులు చేయిస్తున్న హాస్టల్ వార్డెన్, సిబ్బంది

2 hrs ago
user_Golem Venkatesham Patel
Golem Venkatesham Patel
Salesperson కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
2 hrs ago

నల్లగొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో వంట పనులు చేపిస్తున్న హాస్టల్ వార్డెన్ విద్యార్థినులతో వంట పనులు చేయిస్తున్న హాస్టల్ సిబ్బంది నల్గొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినులతో చపాతీలు, వంట పనులు చేయిస్తున్న హాస్టల్ వార్డెన్, సిబ్బంది

More news from తెలంగాణ and nearby areas
  • నల్లగొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో వంట పనులు చేపిస్తున్న హాస్టల్ వార్డెన్ విద్యార్థినులతో వంట పనులు చేయిస్తున్న హాస్టల్ సిబ్బంది నల్గొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినులతో చపాతీలు, వంట పనులు చేయిస్తున్న హాస్టల్ వార్డెన్, సిబ్బంది
    1
    నల్లగొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో వంట పనులు చేపిస్తున్న హాస్టల్ వార్డెన్
విద్యార్థినులతో వంట పనులు చేయిస్తున్న హాస్టల్ సిబ్బంది
నల్గొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినులతో చపాతీలు, వంట పనులు చేయిస్తున్న హాస్టల్ వార్డెన్, సిబ్బంది
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Salesperson కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • కొండచిలువను సురక్షితంగా పట్టుకున్న అటవీ శాఖ సిబ్బంది..... కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ గ్రామంలో ఒక ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించడంతో అటవీ శాఖ రెస్క్యూ బృందం తక్షణమే స్పందించింది. రెస్క్యూ పరికరాల సహాయంతో ఎలాంటి హాని కలగకుండా కొండచిలువను సురక్షితంగా బంధించారు. అనంతరం దీనిని సమీప రక్షిత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కొండచిలువలు కనిపిస్తే హాని చేయకుండా వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ రేంజ్ అధికారి అస్మా, ఫారెస్ట్ బీట్ అధికారి సతీష్, యానిమల్ ట్రాకర్స్ రాజు, రామయ్య, నందు నాయక్, వసంత్ పాల్గొన్నారు
    1
    కొండచిలువను సురక్షితంగా పట్టుకున్న అటవీ శాఖ సిబ్బంది.....
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ గ్రామంలో ఒక ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించడంతో అటవీ శాఖ రెస్క్యూ బృందం తక్షణమే స్పందించింది. రెస్క్యూ పరికరాల సహాయంతో ఎలాంటి హాని కలగకుండా కొండచిలువను సురక్షితంగా బంధించారు. అనంతరం దీనిని సమీప రక్షిత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
ఈ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కొండచిలువలు కనిపిస్తే హాని చేయకుండా వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డివిజనల్ రేంజ్ అధికారి అస్మా, ఫారెస్ట్ బీట్ అధికారి సతీష్, యానిమల్ ట్రాకర్స్ రాజు, రామయ్య, నందు నాయక్, వసంత్ పాల్గొన్నారు
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. _తెలంగాణా_ తెల్లవారుజామున సోమవారం ఉదయం, పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. పోలీసు సైరన్లు మోగిస్తూ ఆరు వాహనాలు కాలనీలోని ఒక ఇంటి వద్దకు రావడంతో స్థానికుల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఆ ఇంటి లోపల ఏం జరుగుతోందో ఎవరికీ తెలియలేదు. బయట ఢిల్లీకి చెందిన వాహనాలు, స్థానిక పోలీసు వాహనాలు ఉన్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), సైబర్ క్రైమ్ యూనిట్, స్థానిక పోలీసుల బృందాలు హఠాత్తుగా ఆ ఇంట్లో సోదాలు నిర్వహించాయి. NIA అధికారులు దంతవైద్యుడి కుమారుడైన ముజామిల్‌ను ప్రశ్నించారు. ఉగ్రవాద లింకులు, సైబర్ నేరాల్లో ప్రమేయం ఉందన్న అనుమానంతో దాదాపు నాలుగు గంటల పాటు విచారణ జరిపారు. ఆ తర్వాత ముజామిల్ ఇంటి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, పెద్దపల్లి ట్రినిటీ కాలేజీలో ట్రైబల్ ఇంజనీరింగ్ చదువుతున్న ముజామిల్, ఏడాది క్రితం తాను ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేరడం వల్లే ఈ వ్యవహారం మొదలైందని, ఆ గ్రూప్‌లో సైబర్ నేరం జరిగిందని చెబుతున్నాడు. తాను వెంటనే ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేశానని చెబుతున్నాడు. ఏడాది క్రితం జరిగిన ఆ ఘటనకు సంబంధించి విచారణకు అధికారులు వచ్చి, వివరాలు సేకరించి వెళ్లిపోయారని అతను, అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత చిన్న ఘటన కోసం ఢిల్లీ నుంచి NIA బృందం వస్తుందా అని స్థానికులు ఆందోళన చెందుతూ ప్రశ్నిస్తున్నారు. గతంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మilitants ఉనికి ఉందని భావించి, ఢిల్లీ నుంచి NIA, గుజరాత్ పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. దాదాపు పదేళ్ల తర్వాత, ఉగ్రవాద కార్యకలాపాల అనుమానంతో NIA బృందం రావడం బొగ్గు బెల్ట్ ప్రాంతాన్ని కుదిపేసింది. అధికారులు ముజామిల్ నుంచి ల్యాప్‌టాప్, ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తదుపరి విచారణ కోసం తర్వాత మళ్లీ రావాలని అతడిని కోరినట్లు సమాచారం. ఏదేమైనా, ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు, ముజామిల్‌కు సంబంధించిన ఖాతా నుంచి విదేశాలకు నిధులు బదిలీ అయి ఉండవచ్చని NIA పోలీసు బృందం అనుమానిస్తోంది.
    1
    పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది.
_తెలంగాణా_
తెల్లవారుజామున సోమవారం ఉదయం, పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది.
పోలీసు సైరన్లు మోగిస్తూ ఆరు వాహనాలు కాలనీలోని ఒక ఇంటి వద్దకు రావడంతో స్థానికుల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఆ ఇంటి లోపల ఏం జరుగుతోందో ఎవరికీ తెలియలేదు. బయట ఢిల్లీకి చెందిన వాహనాలు, స్థానిక పోలీసు వాహనాలు ఉన్నాయి.
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), సైబర్ క్రైమ్ యూనిట్, స్థానిక పోలీసుల బృందాలు హఠాత్తుగా ఆ ఇంట్లో సోదాలు నిర్వహించాయి.
NIA అధికారులు దంతవైద్యుడి కుమారుడైన ముజామిల్‌ను ప్రశ్నించారు. ఉగ్రవాద లింకులు, సైబర్ నేరాల్లో ప్రమేయం ఉందన్న అనుమానంతో దాదాపు నాలుగు గంటల పాటు విచారణ జరిపారు.
ఆ తర్వాత ముజామిల్ ఇంటి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అయితే, పెద్దపల్లి ట్రినిటీ కాలేజీలో ట్రైబల్ ఇంజనీరింగ్ చదువుతున్న ముజామిల్, ఏడాది క్రితం తాను ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేరడం వల్లే ఈ వ్యవహారం మొదలైందని, ఆ గ్రూప్‌లో సైబర్ నేరం జరిగిందని చెబుతున్నాడు.
తాను వెంటనే ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేశానని చెబుతున్నాడు.
ఏడాది క్రితం జరిగిన ఆ ఘటనకు సంబంధించి విచారణకు అధికారులు వచ్చి, వివరాలు సేకరించి వెళ్లిపోయారని అతను, అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత చిన్న ఘటన కోసం ఢిల్లీ నుంచి NIA బృందం వస్తుందా అని స్థానికులు ఆందోళన చెందుతూ ప్రశ్నిస్తున్నారు.
గతంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మilitants ఉనికి ఉందని భావించి, ఢిల్లీ నుంచి NIA, గుజరాత్ పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. దాదాపు పదేళ్ల తర్వాత, ఉగ్రవాద కార్యకలాపాల అనుమానంతో NIA బృందం రావడం బొగ్గు బెల్ట్ ప్రాంతాన్ని కుదిపేసింది.
అధికారులు ముజామిల్ నుంచి ల్యాప్‌టాప్, ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తదుపరి విచారణ కోసం తర్వాత మళ్లీ రావాలని అతడిని కోరినట్లు సమాచారం. ఏదేమైనా, ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు, ముజామిల్‌కు సంబంధించిన ఖాతా నుంచి విదేశాలకు నిధులు బదిలీ అయి ఉండవచ్చని NIA పోలీసు బృందం అనుమానిస్తోంది.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    2 hrs ago
  • జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* *జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* పెద్దపల్లి, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మరియు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గార్ల అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గార్కి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేసేందుకు జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, తెలంగాణ రక్షణ సేన నాయకులు సిరవేన స్వప్న, బొల్లబత్తుల భూమయ్య,బొడిగె మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ఇతర రంగాల్లో తగిన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.
    1
    జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* 
*జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* 
పెద్దపల్లి, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మరియు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గార్ల అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గార్కి మెమోరాండం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేసేందుకు జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, తెలంగాణ రక్షణ సేన  నాయకులు సిరవేన స్వప్న, బొల్లబత్తుల భూమయ్య,బొడిగె మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ఇతర రంగాల్లో తగిన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలి బెల్లంపల్లి కాంట చౌరస్తాలో కాంట చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలని ఆటో యూనియన్ అధ్యక్షులు కట్ల రాంకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయుట నిమిత్తంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు చూపించిన స్థలంలో ఆటోలు నిలుపుకుంటున్నామని ఈ క్రమంలో అదే స్థలంలో కాంట రాత్రికి రాత్రే అక్రమంగా పాన్ షాప్ ఏర్పాటు చేశారన్నారు. దింతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించాలని కోరారు
    1
    ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలి 
బెల్లంపల్లి కాంట చౌరస్తాలో కాంట చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలని ఆటో యూనియన్ అధ్యక్షులు కట్ల రాంకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయుట నిమిత్తంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు చూపించిన స్థలంలో ఆటోలు నిలుపుకుంటున్నామని ఈ క్రమంలో అదే స్థలంలో కాంట రాత్రికి రాత్రే అక్రమంగా పాన్ షాప్  ఏర్పాటు చేశారన్నారు. దింతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించాలని కోరారు
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు...... జన్నారం మండలంలోని పోన్కల్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లపై వరదనీరు భారీగా నిలిచింది. బస్టాండ్ ఏరియా, అంగడి బజార్ ప్రాంతాలలో వరద నీరు పోయే మార్గం లేక రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
    1
    అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు......
జన్నారం మండలంలోని పోన్కల్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లపై వరదనీరు భారీగా నిలిచింది.
బస్టాండ్ ఏరియా, అంగడి బజార్  ప్రాంతాలలో వరద నీరు పోయే మార్గం లేక రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి లేదంటే పోరాటాలు తప్పవు. ___ఎస్.వీరయ్య, CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు. CITU పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, CITU కార్యాలయం, గోదావరిఖని లో నిర్వహిస్తున్న క్యాడర్ క్లాసులు రెండవ రోజు క్లాసుకు ముఖ్యఅతిథిగా CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య గారు హాజరై CITU నిర్మాణం - కర్తవ్యాలు. అంశం పై క్లాసు బోదించారు. క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలి పోయాయాని అన్నారు. కాంగ్రేస్ పార్టీ అధికారం లోకి వచ్చింది 3 సంవత్సరాలు దగ్గర పడుతుందని అన్నారు ఇప్పటికి హామీలు వేరవేర్చకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎం చేస్తుందని ప్రశ్నించారు. ఇంకా కాంగ్రేస్ ప్రభుత్వం కు రెండేళ్లు మాత్రమే అధికారం మిగిలి ఉందని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటలు తప్పవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ను హెచ్చరించారి. యూనియన్ గవర్నమెంట్ (మోడీ గవర్నమెంట్) కనీస వేతనాలను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఈ ప్రాంతం లో ఉన్న సింగరేణి, ఆర్ ఎఫ్ సి ఎల్, ఎన్ టి పి సి లాంటి కంపెనిల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు లేకుండా బానిస సాకిరీ చేయాల్సి వస్తుందని అన్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ లాంటి పేర్ల తో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు లేవు అన్నారు.మోడీ గవర్నమెంట్ 2017లో చేసిన కనీస వేతనాల చట్టం 2022 జనవరితో దాని పని అయిపొయింది అన్నారు.ఇప్పుడు నాలుగేండ్లు గడిచింది మోడీ దాని ఊసే మర్చిపోయారని ఇది అత్యంత దారుణం అన్నారు.ఇప్పటికైనా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిదంగా గోదావరిఖని ప్రాంతం లో ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ESI వంద పడకల హాస్పిటల్ ఏర్పాటుకు స్థలం సేకరించారు ఇంత జరిగాక కూడా హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించలేదు అన్నారు. ఈ విషయం లో కేంద్ర గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందొ చెప్పాలని అన్నారు.ప్రతి నెల ESI హాస్పిటల్ కు రెండు కోట్ల నలభై లక్షల ఆదాయం వస్తుంది. వంద పడకల హాస్పిటల్ ను నిర్మించడంలో కేంద్రం నిర్లక్ష్యం తాగదన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షం లో రానున్న రోజుల్లో కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా వేల్పుల కుమారస్వామి CITU జిల్లా అధ్యక్షులు వ్యవహరించగ జిల్లా కార్యదర్శి ఎ. ముత్యం రావు, కోశాధికారి ఎం. రామాచారీ, ఉపాధ్యక్షులు బిక్షపతి,కొమురయ్య, సహాయ కార్యదర్శులు జ్యోతి, రవీందర్,వనజా రాణి, ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు గణేష్,లక్ష్మారెడ్డి, శివ రామ్ రెడ్డి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
    1
    కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి లేదంటే పోరాటాలు తప్పవు.
___ఎస్.వీరయ్య,
CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు.
CITU పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, CITU కార్యాలయం, గోదావరిఖని లో నిర్వహిస్తున్న క్యాడర్ క్లాసులు రెండవ రోజు క్లాసుకు ముఖ్యఅతిథిగా CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య గారు హాజరై CITU నిర్మాణం - కర్తవ్యాలు. అంశం పై క్లాసు బోదించారు. క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలి పోయాయాని అన్నారు. కాంగ్రేస్ పార్టీ అధికారం లోకి వచ్చింది 3 సంవత్సరాలు దగ్గర పడుతుందని అన్నారు ఇప్పటికి హామీలు వేరవేర్చకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 
ఎం చేస్తుందని ప్రశ్నించారు. ఇంకా కాంగ్రేస్ ప్రభుత్వం కు రెండేళ్లు మాత్రమే అధికారం మిగిలి ఉందని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటలు తప్పవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ను   హెచ్చరించారి.
యూనియన్ గవర్నమెంట్ (మోడీ గవర్నమెంట్)
కనీస వేతనాలను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు.
ఈ ప్రాంతం లో ఉన్న సింగరేణి, ఆర్ ఎఫ్ సి ఎల్, ఎన్ టి పి సి లాంటి కంపెనిల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు లేకుండా బానిస సాకిరీ చేయాల్సి వస్తుందని అన్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఫిక్స్డ్  టర్మ్ లాంటి పేర్ల తో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు లేవు అన్నారు.మోడీ గవర్నమెంట్ 2017లో చేసిన కనీస వేతనాల చట్టం 2022 జనవరితో దాని పని అయిపొయింది అన్నారు.ఇప్పుడు నాలుగేండ్లు గడిచింది మోడీ దాని ఊసే మర్చిపోయారని ఇది అత్యంత దారుణం అన్నారు.ఇప్పటికైనా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
అదేవిదంగా గోదావరిఖని ప్రాంతం లో ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ  ESI వంద పడకల హాస్పిటల్ ఏర్పాటుకు స్థలం సేకరించారు ఇంత జరిగాక కూడా హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించలేదు అన్నారు.
ఈ విషయం లో కేంద్ర గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందొ చెప్పాలని అన్నారు.ప్రతి నెల ESI హాస్పిటల్ కు రెండు కోట్ల నలభై లక్షల ఆదాయం వస్తుంది. వంద  పడకల హాస్పిటల్ ను నిర్మించడంలో కేంద్రం నిర్లక్ష్యం తాగదన్నారు.
వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షం లో రానున్న రోజుల్లో కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.
ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా వేల్పుల కుమారస్వామి CITU జిల్లా అధ్యక్షులు వ్యవహరించగ జిల్లా కార్యదర్శి ఎ. ముత్యం రావు, కోశాధికారి ఎం. రామాచారీ, ఉపాధ్యక్షులు బిక్షపతి,కొమురయ్య,
సహాయ కార్యదర్శులు జ్యోతి, రవీందర్,వనజా రాణి, ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు గణేష్,లక్ష్మారెడ్డి, శివ రామ్ రెడ్డి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    23 hrs ago
  • ఆటో బంద్‌ను విజయవంతం చేయండి ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 24న చేపట్టనున్న ఆటో బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ముంజం ఆనంద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్లపై పన్నులు, లైసెన్స్‌, ఫిట్‌నెస్‌ తదితర చార్జీల భారాన్ని తగ్గించాలని, రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఆటో మీటర్‌ చార్జీలు సవరించాలని, ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల వేధింపులను అరికట్టాలని కోరారు. బంద్‌లో డ్రైవర్లు, కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
    1
    ఆటో బంద్‌ను విజయవంతం చేయండి

ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 24న చేపట్టనున్న ఆటో బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ముంజం ఆనంద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్లపై పన్నులు, లైసెన్స్‌, ఫిట్‌నెస్‌ తదితర చార్జీల భారాన్ని తగ్గించాలని, రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఆటో మీటర్‌ చార్జీలు సవరించాలని, ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల వేధింపులను అరికట్టాలని కోరారు. బంద్‌లో డ్రైవర్లు, కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.