Shuru
Apke Nagar Ki App…
Ramzan Iftar MLA attend Khanapur Ramzan Iftar MLA vid ma Bujja Patel
KR NEWS 369
Ramzan Iftar MLA attend Khanapur Ramzan Iftar MLA vid ma Bujja Patel
More news from తెలంగాణ and nearby areas
- నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(GGH) ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ నాగ మోహన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ నాగరాజ్‌తో పాటు సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంత వరకు ఇక్కడ ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తూ విధులు నిర్వహిస్తున్న పి.శ్రీనివాస్ నల్గొండ GGHకు బదిలీ అయ్యారు.1
- *డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తో ఎమ్మెల్యే అయ్యాను* అంబెడ్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు.ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ గారు సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు.భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు. గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి.. విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.2
- ప్రజల ఆశీస్సులతో బీజేపీ గెలిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు అన్నారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన నూతన మున్సిపల్ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు ఖానాపూర్ పట్టణ శివారులోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుండి మున్సిపల్ కార్యాలయం వరకు బిజెపి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పదవీ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు పడిన ధర్మం గెలిచిందన్నారు. ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి బిజెపి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కోలాం PVTG ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. సోమవారం ఉట్నూర్ ITDA కార్యాలయం ఎదుట ఆదివాసీలతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సాత్నాల ఆదిలాబాద్ బేల మండలాల 9 గ్రామాల (సదల్ పూర్, దుబ్బగూడ, జున్నపని,జంగు గూడా, చిన్నూగూడ, సుందరగిరి, మామిడి కోరి, దత్తగూడ ఆదివాసీలు కోలాం ఆదివాసులు అత్యంత వెనుకబడి ఉన్నారు. మీరు అనేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలపై అనేకసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న లాభం లేకుండా ఉన్నది కనీస మౌలిక సమస్యలు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎన్ని నిధులైన కానీ సమస్యల వీరికి లేకుండా చూస్తామని పాలకులు చెబుతున్నారు మేము ఆదివాసీ గిరిజన సంఘంగా చేసిన గ్రామాల సర్వేలో అనేక సమస్యలు గుర్తించాము ఈ సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం 1)పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి అలాగే గతంలో పుణ్యభూమి కంటే తక్కువ భూమికి పట్టాలిచ్చారు వాటిని సరిచేసి ఇవ్వాలి విరాసత్ పట్టాల సమస్య తీవ్రంగా ఉంది పరిష్కరించాలి 2) ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి 3) కోలాం ఆదివాసీ లకు అంతో దయ రేషన్ కార్డులు ఇవ్వాలి ఆదివాసీలందరికీ అంతోదయ కార్డులు ఇవ్వాలి 4) ఆదివాసి గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో తక్షణమే యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి వేల మండలం సదల్పూర్ గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది పరిష్కరించాలి 5) జంగుగూడ గ్రామం వరద ముంపు నుండి కోలామాదివాసులకు కాపాడేందుకు ఒకవైపు గోడ బ్రిడ్జి కట్టాలి 6) సోలార్ మోటార్స్ బోర్వెల్స్ ద్వారా ఆదివాసీల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించాలి 7) ఆదివాసి యువకులకు ఉపాధి కల్పించి వలసలను ఆపాలి ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం ఐటీడీఏ నుంచి ఆర్థిక రుణాలు ఇవ్వడం స్కిల్స్ పెంచే శిక్షణ ఇవ్వడం కోలాం వారికి తడకలు గుల్లలు బొంగు సరఫరా మార్కెట్ సౌకర్యం కల్పించాలి 8) వతందారుల(భూస్వాముల )భూములు సాగు చేస్తున్న ఆదివాసీలకు పట్టాలి ఇవ్వాలి 9) వ్యవసాయ రుణాలను బ్యాంకులకు నుండి ఇప్పించాలి 10) దళారుల వడ్డీ వ్యాపారం నుండి ఆదివాసులను కాపాడాలి 11) పింఛన్లు రేషన్ కార్డులు అందించాలి 12) కరెంటు సీసీ రోడ్లు నాలి సౌకర్యం కల్పించాలి 13) వ్యవసాయ భూములను చదును చేయించాలి 14) ఆదివాసులకు ఎడ్లబండ్ల సౌకర్యం కల్పించాలి 15) మెరుగైన విద్య వైద్యం అందించాలి రక్తహీనత నుండి రక్షించాలి 16) ఉపాధి కూలీలైన ఆదివాసీ మహిళలకు 2500 రుపాయలు కూలీలకు 12000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ హామీని అమలు చేయాలి 17) ఫారెస్ట్ అధికారుల వేధింపులను అభివృద్ధి పనులను అడ్డుకునేదాన్ని ఆపాలి అనంతరం AO రఘు గారికి వినతి పత్రం అందించారు. సమస్యలు అన్ని ఉన్నత అధికారులకు తక్షణమే నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు లంకా రాఘవులు జిల్లా నాయకులు కొట్నాక్ సక్కు, స్వామి, రామన్న,ఆత్రం రాము, టెకం లక్ష్మణ్, మడవి భీంరావు, పెందూర్ గోవింద్, ఆత్రం అయ్యు బాయి తదితరులు పాల్గొన్నారు TAGS జిల్లా కమిటీ3
- సహారా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన ఖాతాదారులు తమ డబ్బులు ఇప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కథలాపూర్, రాయికల్, కొడిమ్యాల, గొల్లపెల్లి, జగిత్యాల మండలాల నుంచి వచ్చిన బాధితులు కాలపరిమితి పూర్తై ఏళ్లైనా డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సీఆర్‌సీఎస్ పోర్టల్ ద్వారా కొంతమందికే చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. కట్ ఆఫ్ తేదీ తొలగించి అందరికీ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.1
- ఆదిలాబాద్ జిల్లా : బజార్ హత్నూర్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి,బిజెపి కి షాక్ తగిలింది. ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియా శీలకంగా మండలంలో పార్టీ బలోపేతానికి కష్టపడ్డ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పారు.చేరిన వారిలో కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు బజార్ హత్నూర్ గ్రామ మున్నూరుకాపు మాజీ అధ్యక్షులు కొత్త నర్సయ్య, మాజీ వార్డు మెంబెర్ జెన్నేపల్లి రమేష్,గడ్డల గజేందర్,హన్మంతు,గోసుల శేఖర్,యోగేష్,భగత్ సంతోష్,రాజు,ఎల్లయ్య ఉన్నారు. చేరిన వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రాక ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఊరు మండలం బాగుపడుతుందని అనుకున్నాం కానీ కేవలం కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే బాగు పడుతుందని పేదలు నష్టపోతున్నారని బాధతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీలో చేరమన్నారు. ముఖ్యమంత్రి మా మండలానికి వస్తే మండలానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఆశించాం కానీ సభ జరిగిన పిప్రి గ్రామ పేరును కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించకపోవడం మమ్మల్ని ఆశ్చర్యనికి గురి చేసిందన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఎంత క్షేమంగా ఉంటుందో, తెచ్చిన తెలంగాణ కేసీఆర్ చేతిలో అంతే క్షేమంగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం కుక్కలు చించిన ఇస్తారాకు లాగా మారిందన్నారు. ముఖ్యమంత్రి దత్తత జిల్లా ఆదిలాబాద్, ఉప ముఖ్యమంత్రి దత్తత గ్రామం పిప్రి వీటినే అభివృద్ధి చేయలేని వారు రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయన్న,ఉప సర్పంచ్ కొంగర్ల రాజన్న,బొర్ర రాజు, చట్ల వినీల్,కేసు సకేశ్,బత్తిని మురళి కృష్ణ,తడక శ్రీను తదితరులు పాల్గొన్నారు.1
- లక్షెట్టిపేట పట్టణంలోని బీట్ బజార్లో 80 ఫీట్ల రోడ్ల విస్తరణ జరుగుతుందని, అందరూ సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు. సోమవారం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షెట్టి పేట పట్టణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా బీట్ బజార్లో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ జరుగుతుందని, మార్కింగ్ చేసిన భవనాలను 30 లోగా వ్యాపారులు ప్రజలు స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు.1
- పత్రిక ప్రకటన తేది: 13-04-2026 కామారెడ్డి జిల్లా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 135 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై తమ వినతిపత్రాలను సమర్పించగా, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, మేడంమోహన్, సీఈఓ జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.1