logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజల ఆశీస్సులతో బిజెపి గెలిచింది: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రజల ఆశీస్సులతో బీజేపీ గెలిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు అన్నారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన నూతన మున్సిపల్ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు ఖానాపూర్ పట్టణ శివారులోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుండి మున్సిపల్ కార్యాలయం వరకు బిజెపి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పదవీ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు పడిన ధర్మం గెలిచిందన్నారు. ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి బిజెపి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

20 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
20 hrs ago

ప్రజల ఆశీస్సులతో బిజెపి గెలిచింది: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రజల ఆశీస్సులతో బీజేపీ గెలిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు అన్నారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన నూతన మున్సిపల్ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు ఖానాపూర్ పట్టణ శివారులోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుండి మున్సిపల్ కార్యాలయం వరకు బిజెపి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పదవీ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు పడిన ధర్మం గెలిచిందన్నారు. ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి బిజెపి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • పత్రిక ప్రకటన ఏప్రిల్ 14, 2026_ఆదిలాబాదు: చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బాబా సాహెబ్ డా.బిఆర్.అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి, జెండాను ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహ్వానితులను అలరించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి, వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రం, బహుమతులను కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్ లు అందజేశారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆరైవ్-అలైవ్ రోడ్డు భద్రత పోస్టర్ లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రాణాదత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, స్టాంపులతో రూపొందిస్తున్న అంబేద్కర్ చిత్రపటంపై కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు జైభీమ్ స్టాంప్ ను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వాక్ స్వాతంత్ర్యం, సమానత్వం కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమయ్యాయని కొనియాడారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ శాంతియుతంగా కలిసి ఉండడానికి రాజ్యాంగమే దిక్సూచి అని సూచించారు. ముఖ్యంగా విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, "బోధించు, సమీకరించు, పోరాడు" అనే అంబేద్కర్ పిలుపును గుర్తుచేశారు. జిల్లాలో విద్యా ఫలితాలను పరిశీలిస్తే బాలికలు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారని, బాలురు సైతం చదువుపై మరింత దృష్టి సారించి సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యువతకు కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ వృత్తులే కాకుండా డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇందులో భాగంగా 10 పాఠశాలల్లో 'లెర్న్ స్మార్ట్ విత్ AI' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సంక్షేమ రంగంలో భాగంగా ఎస్సీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, ఆరో వాటర్ ప్లాంట్లు, గీజర్ల ఏర్పాటు వంటి పనులు పూర్తి చేశామని వివరించారు. అలాగే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం మూడు 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నిజాయితీతో కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వం, సమన్యాయం సాధించడమే మన లక్ష్యం కావాలని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్ విచ్ఛిన్నం అవుతుందని భావించినా, అంబేద్కర్ అందించిన అద్భుతమైన రాజ్యాంగమే నేడు మనల్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టిందని కొనియాడారు. రాజ్యాంగంలోని సామాజిక సూత్రాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అమలు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ సూచనల మేరకు శాంతిభద్రతలను కాపాడటంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 60 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరుస్తున్నామని వివరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించడమే తమ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ,అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్పూర్తి వల్లే నేడు భారతదేశం ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకుందని కొనియాడారు. కేవలం హక్కులకే పరిమితం కాకుండా పౌరుల బాధ్యతలను కూడా గుర్తెరగాలని సూచించారు. దళిత వర్గాలు కేవలం రిజర్వేషన్లపైనే ఆధారపడకుండా, జనరల్ కోటాలో కూడా అవకాశాలు సాధించి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విద్యే అసలైన ఆయుధమని, అంబేద్కర్ కష్టపడి చదివి సాధించిన ప్రగతి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు సాధారణ బ్యాంకింగ్ పథకాలను సైతం సద్వినియోగం చేసుకోవాలని, దళిత జాతి అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి ఫలాలు లభిస్తున్నాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొంది గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన జైనథ్ మండలం ఆడ గ్రామానికి చెందిన అవినాష్ ను శాలువాతో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీలు సన్మానించి, వనిత డైరెక్టర్ గా అంబేద్కర్ జీవిత చరిత్ర పై రూపొందించిన వీడియో సిడిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారి, బిసి సంక్షేమ అధికారి సోనియా, ఆర్డీఓ స్రవంతి, ఈడి మనోహర్, రవాణా శాఖ అధికారులు రవీందర్, శ్రీనివాస్, హరింద్ర, వార్డుల కౌన్సిలర్లు, కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
    4
    పత్రిక ప్రకటన
ఏప్రిల్ 14, 2026_ఆదిలాబాదు:
చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బాబా సాహెబ్ డా.బిఆర్.అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి, జెండాను ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. 
ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహ్వానితులను అలరించారు. 
కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి, వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రం, బహుమతులను కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్ లు అందజేశారు.
అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆరైవ్-అలైవ్ రోడ్డు భద్రత పోస్టర్ లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రాణాదత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, స్టాంపులతో రూపొందిస్తున్న అంబేద్కర్ చిత్రపటంపై కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు జైభీమ్ స్టాంప్ ను వేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వాక్ స్వాతంత్ర్యం, సమానత్వం కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమయ్యాయని కొనియాడారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ శాంతియుతంగా కలిసి ఉండడానికి రాజ్యాంగమే దిక్సూచి అని సూచించారు. ముఖ్యంగా విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, "బోధించు, సమీకరించు, పోరాడు" అనే అంబేద్కర్ పిలుపును గుర్తుచేశారు. జిల్లాలో విద్యా ఫలితాలను పరిశీలిస్తే బాలికలు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారని, బాలురు సైతం చదువుపై మరింత దృష్టి సారించి సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యువతకు కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ వృత్తులే కాకుండా డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇందులో భాగంగా 10 పాఠశాలల్లో 'లెర్న్ స్మార్ట్ విత్ AI' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సంక్షేమ రంగంలో భాగంగా ఎస్సీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, ఆరో వాటర్ ప్లాంట్లు, గీజర్ల ఏర్పాటు వంటి పనులు పూర్తి చేశామని వివరించారు. అలాగే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం మూడు 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నిజాయితీతో కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వం, సమన్యాయం సాధించడమే మన లక్ష్యం కావాలని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్ విచ్ఛిన్నం అవుతుందని భావించినా, అంబేద్కర్ అందించిన అద్భుతమైన రాజ్యాంగమే నేడు మనల్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టిందని కొనియాడారు. రాజ్యాంగంలోని సామాజిక సూత్రాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అమలు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ సూచనల మేరకు శాంతిభద్రతలను కాపాడటంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 60 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరుస్తున్నామని వివరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించడమే తమ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ,అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్పూర్తి వల్లే నేడు భారతదేశం ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకుందని కొనియాడారు. కేవలం హక్కులకే పరిమితం కాకుండా పౌరుల బాధ్యతలను కూడా గుర్తెరగాలని సూచించారు. దళిత వర్గాలు కేవలం రిజర్వేషన్లపైనే ఆధారపడకుండా, జనరల్ కోటాలో కూడా అవకాశాలు సాధించి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విద్యే అసలైన ఆయుధమని, అంబేద్కర్ కష్టపడి చదివి సాధించిన ప్రగతి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు సాధారణ బ్యాంకింగ్ పథకాలను సైతం సద్వినియోగం చేసుకోవాలని, దళిత జాతి అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి ఫలాలు లభిస్తున్నాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొంది గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన జైనథ్ మండలం ఆడ గ్రామానికి చెందిన అవినాష్ ను శాలువాతో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీలు సన్మానించి, వనిత డైరెక్టర్ గా అంబేద్కర్ జీవిత చరిత్ర పై రూపొందించిన వీడియో సిడిని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారి, బిసి సంక్షేమ అధికారి సోనియా, ఆర్డీఓ స్రవంతి, ఈడి మనోహర్, రవాణా శాఖ అధికారులు రవీందర్, శ్రీనివాస్, హరింద్ర, వార్డుల కౌన్సిలర్లు, కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    2 hrs ago
  • *డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తో ఎమ్మెల్యే అయ్యాను* అంబెడ్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు.ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ గారు సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు.భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    *డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తో ఎమ్మెల్యే అయ్యాను*
అంబెడ్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు.ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ గారు సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు.భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    6 hrs ago
  • భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.
    1
    భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • జగిత్యాల కాంగ్రెస్ లో సరికొత్త లొల్లి తెరపైకి వచ్చింది. సీనియర్, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి ఈనెల 20న బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో సీనియర్లతో సీఎం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ లో చేరుతుండగా జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో సీనియర్, జూనియర్ అనే అంశం తెరపైకి వచ్చింది. కో అప్షన్ పదవులు సీనియర్లకే ఇవ్వాలని ఇంతకాలం జీవన్ రెడ్డితో నడిచిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారితో భర్తీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవులు రాకుంటే సీనియర్లు జీవన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని, వారు చేజారి పోకుండా ఉండాలంటే సీఎంతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నారు. నిన్న జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలవల్ల ఈరోజు జరగడంతో డిసిసి అధ్యక్షులు నందయ్య నేతృత్వంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణంతో పాటు 50 మంది నాయకులు సీఎం వద్దకు వెళ్లారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, సీనియర్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని సీనియర్లు అంటున్నారు. సీఎం నుండి తమకు ఎలాంటి భరోసా లభిస్తుందో చూస్తామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోపాటు డిసిసి అధ్యక్షులు మాత్రం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అందరం కలిసే సీనియర్ లను సీఎం వద్దకు తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిపారు.
    4
    జగిత్యాల కాంగ్రెస్ లో సరికొత్త లొల్లి తెరపైకి వచ్చింది. సీనియర్, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి ఈనెల 20న బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో సీనియర్లతో సీఎం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  చెప్పి బిఆర్ఎస్ లో చేరుతుండగా జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి.  మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో సీనియర్, జూనియర్ అనే అంశం తెరపైకి వచ్చింది. కో అప్షన్ పదవులు సీనియర్లకే ఇవ్వాలని ఇంతకాలం జీవన్ రెడ్డితో నడిచిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారితో భర్తీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవులు రాకుంటే  సీనియర్లు జీవన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని, వారు చేజారి పోకుండా ఉండాలంటే సీఎంతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నారు. నిన్న జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలవల్ల ఈరోజు జరగడంతో డిసిసి అధ్యక్షులు నందయ్య నేతృత్వంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణంతో పాటు 50 మంది నాయకులు సీఎం వద్దకు వెళ్లారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, సీనియర్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని సీనియర్లు అంటున్నారు. సీఎం నుండి తమకు ఎలాంటి భరోసా లభిస్తుందో చూస్తామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోపాటు డిసిసి అధ్యక్షులు మాత్రం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అందరం కలిసే సీనియర్ లను సీఎం వద్దకు తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    53 min ago
  • పత్రిక ప్రకటన తేది: 13-04-2026 కామారెడ్డి జిల్లా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 135 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై తమ వినతిపత్రాలను సమర్పించగా, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, మేడంమోహన్, సీఈఓ జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    పత్రిక ప్రకటన
తేది: 13-04-2026
కామారెడ్డి జిల్లా
సోమవారం
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 135 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై తమ వినతిపత్రాలను సమర్పించగా, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ విక్టర్, మేడంమోహన్, సీఈఓ జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • హుస్నాబాద్ మండలం పరిసర గ్రామాల్లో యాసంగి వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో ముందస్తుగా సాగు చేసిన రైతులు.. వాతావరణ మార్పుల భయంతో పంటను త్వరగా కోత చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది మోగి పురుగు ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    హుస్నాబాద్ మండలం పరిసర గ్రామాల్లో యాసంగి వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో ముందస్తుగా సాగు చేసిన రైతులు.. వాతావరణ మార్పుల భయంతో పంటను త్వరగా కోత చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది మోగి పురుగు ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • ప్రజల ఆశీస్సులతో బీజేపీ గెలిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు అన్నారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన నూతన మున్సిపల్ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు ఖానాపూర్ పట్టణ శివారులోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుండి మున్సిపల్ కార్యాలయం వరకు బిజెపి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పదవీ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు పడిన ధర్మం గెలిచిందన్నారు. ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి బిజెపి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ప్రజల ఆశీస్సులతో బీజేపీ గెలిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు అన్నారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన నూతన మున్సిపల్ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు ఖానాపూర్ పట్టణ శివారులోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుండి మున్సిపల్ కార్యాలయం వరకు బిజెపి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పదవీ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు పడిన ధర్మం గెలిచిందన్నారు. ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి బిజెపి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • . మాజీ మంత్రి మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒక్కరికి సమాన ఫలాలను అందుకోగలుగుతున్నమ్మన్నారు.ప్రపంచ దేశాలలో సైతం అంబేద్కర్ కు ఘన నివాళులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క 125 అడుగుల అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని నివాళులు అర్పించకుండా సంకెళ్లతో బంధించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.. అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ చూపిన మార్గం నేటికీ ప్రాసంగికమని పేర్కొన్నారు. అంబేద్కర్ గారి ఆశా సాధనలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో దళిత అభ్యున్నతికి పాటుపడిందన్నారు ఉన్నతమైన విద్యా విధానంతో పాటు దళిత కుటుంబాలు ఆర్థికంగా ముందుకు పోయేలా దళిత బస్తీ దళిత బంధు కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరిగిందన్నారు.
    2
    .
మాజీ మంత్రి మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒక్కరికి సమాన  ఫలాలను అందుకోగలుగుతున్నమ్మన్నారు.ప్రపంచ దేశాలలో సైతం అంబేద్కర్ కు ఘన నివాళులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో  ఒక్క 125 అడుగుల అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని  నివాళులు అర్పించకుండా సంకెళ్లతో బంధించడం  తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు..  
అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ చూపిన మార్గం నేటికీ ప్రాసంగికమని పేర్కొన్నారు. అంబేద్కర్ గారి ఆశా సాధనలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో  దళిత అభ్యున్నతికి పాటుపడిందన్నారు ఉన్నతమైన విద్యా విధానంతో పాటు  దళిత కుటుంబాలు ఆర్థికంగా ముందుకు  పోయేలా దళిత బస్తీ దళిత బంధు కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరిగిందన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    5 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా : బజార్ హత్నూర్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి,బిజెపి కి షాక్ తగిలింది. ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియా శీలకంగా మండలంలో పార్టీ బలోపేతానికి కష్టపడ్డ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పారు.చేరిన వారిలో కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు బజార్ హత్నూర్ గ్రామ మున్నూరుకాపు మాజీ అధ్యక్షులు కొత్త నర్సయ్య, మాజీ వార్డు మెంబెర్ జెన్నేపల్లి రమేష్,గడ్డల గజేందర్,హన్మంతు,గోసుల శేఖర్,యోగేష్,భగత్ సంతోష్,రాజు,ఎల్లయ్య ఉన్నారు. చేరిన వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రాక ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఊరు మండలం బాగుపడుతుందని అనుకున్నాం కానీ కేవలం కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే బాగు పడుతుందని పేదలు నష్టపోతున్నారని బాధతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీలో చేరమన్నారు. ముఖ్యమంత్రి మా మండలానికి వస్తే మండలానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఆశించాం కానీ సభ జరిగిన పిప్రి గ్రామ పేరును కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించకపోవడం మమ్మల్ని ఆశ్చర్యనికి గురి చేసిందన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఎంత క్షేమంగా ఉంటుందో, తెచ్చిన తెలంగాణ కేసీఆర్ చేతిలో అంతే క్షేమంగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం కుక్కలు చించిన ఇస్తారాకు లాగా మారిందన్నారు. ముఖ్యమంత్రి దత్తత జిల్లా ఆదిలాబాద్, ఉప ముఖ్యమంత్రి దత్తత గ్రామం పిప్రి వీటినే అభివృద్ధి చేయలేని వారు రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయన్న,ఉప సర్పంచ్ కొంగర్ల రాజన్న,బొర్ర రాజు, చట్ల వినీల్,కేసు సకేశ్,బత్తిని మురళి కృష్ణ,తడక శ్రీను తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా : బజార్ హత్నూర్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి,బిజెపి కి షాక్ తగిలింది. ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియా శీలకంగా మండలంలో పార్టీ బలోపేతానికి కష్టపడ్డ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పారు.చేరిన వారిలో కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు బజార్ హత్నూర్ గ్రామ మున్నూరుకాపు మాజీ అధ్యక్షులు కొత్త నర్సయ్య, మాజీ వార్డు మెంబెర్ జెన్నేపల్లి రమేష్,గడ్డల గజేందర్,హన్మంతు,గోసుల శేఖర్,యోగేష్,భగత్ సంతోష్,రాజు,ఎల్లయ్య ఉన్నారు. చేరిన వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రాక ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఊరు మండలం బాగుపడుతుందని అనుకున్నాం కానీ కేవలం కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే బాగు పడుతుందని పేదలు నష్టపోతున్నారని బాధతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీలో చేరమన్నారు. ముఖ్యమంత్రి మా మండలానికి వస్తే మండలానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఆశించాం కానీ సభ జరిగిన పిప్రి గ్రామ పేరును కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించకపోవడం మమ్మల్ని ఆశ్చర్యనికి గురి చేసిందన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఎంత క్షేమంగా ఉంటుందో, తెచ్చిన తెలంగాణ కేసీఆర్ చేతిలో అంతే క్షేమంగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం కుక్కలు చించిన ఇస్తారాకు లాగా మారిందన్నారు. ముఖ్యమంత్రి దత్తత జిల్లా ఆదిలాబాద్, ఉప ముఖ్యమంత్రి దత్తత గ్రామం పిప్రి వీటినే అభివృద్ధి చేయలేని వారు రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయన్న,ఉప సర్పంచ్ కొంగర్ల రాజన్న,బొర్ర రాజు, చట్ల వినీల్,కేసు సకేశ్,బత్తిని మురళి కృష్ణ,తడక శ్రీను తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.