logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అక్రమంగా జంతువులను తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్పీ రోహిత్ రాజు రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా అక్రమంగా జంతువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో అక్రమ జంతు రవాణాను అరికట్టడానికి పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతుందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తనిఖీలను చేపట్టడం జరుగుతుందని వివరించారు.జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పశువుల సంతలు,బక్రీద్ పండుగ దృష్ట్యా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల పనితీరు తదితర విషయాలపై అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేయడం జరిగిందని అన్నారు.జిల్లాలో ఎక్కడైనా చట్ట విరుద్ధంగా ఆవులు,దూడలను అక్రమంగా రవాణా చేసి,వధించడం పూర్తిగా నిషేధమని,అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇతర రాష్ట్రాలు,జిల్లాల నుండి జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు 02 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు,03అంతర్ జిల్లా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి,మొత్తం 05 చెక్‌పోస్టుల వద్ద 24/7 నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి చెక్‌పోస్టులో పోలీస్ సిబ్బందితో పాటు పశుసంవర్థక శాఖ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు కఠినంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. జంతువుల రవాణా సమయంలో సంబంధిత చట్టాలు,నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించారు.అలాగే అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని,వ్యక్తిగత దాడులు,గుంపులుగా దాడులు చేయడం కూడా శిక్షార్హమైన నేరాలని ఈ సందర్బంగా ప్రజలకు సూచించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి పశువుల అక్రమ రవాణా,అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ముఖ్యంగా యువత ఆవేశానికి లోనవకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని,మత పెద్దలు యువతకు శాంతి,సామరస్యాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్,ఫేస్‌బుక్ వంటి వాటిలో పశువుల అక్రమ రవాణాకు సంబంధించి విద్వేషాలను రెచ్చగొట్టేలా మార్ఫింగ్ ఫోటోలు,అసత్య ప్రచారాలు,ప్రేరేపిత పోస్టులు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇందుకోసం జిల్లా పోలీస్ మీడియా మానిటరింగ్ సెల్ నిరంతర నిఘా ఉంచిందని తెలిపారు.ప్రజల్లో భయాందోళనలు కలిగించే రూమర్లు వ్యాప్తి చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని,డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.ప్రతీ పండుగ సందర్బంగా ప్రజలు పరస్పరం మతాలను గౌరవించుకుంటూ,శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

1 hr ago
user_VANAMA SRINIVAS RAO
VANAMA SRINIVAS RAO
జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
1 hr ago
609b4aaa-2b3f-4110-a307-34c0483a54ca

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం లో బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి : BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు
    1
    ఖమ్మం లో బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి : BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • గోదావరి బాధిత కుటుంబాలకు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పరామర్శ MLG: కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గోదావరి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం పరామర్శించారు. రోయ్యూరు గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    గోదావరి బాధిత కుటుంబాలకు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పరామర్శ
MLG: కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గోదావరి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం పరామర్శించారు. రోయ్యూరు గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    5 hrs ago
  • ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
    1
    ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
    user_Jayateja
    Jayateja
    Hotel Vijayawada (Rural), Ntr•
    11 hrs ago
  • గుప్తనిధుల వేట కోసమే అశోక్‌నగర్ శివాలయం కూల్చివేత : మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో మట్టికోట శివాలయం ముందు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం దేవాలయాలపై భక్తి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుప్తనిధుల వేట కోసమే శివాలయాన్ని కూల్చారని విమర్శించారు. శివాలయం కూల్చివేతపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని, గర్భగుడి కింద ఎందుకు తవ్వకాలు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కూల్ నిర్మాణానికి తమకు వ్యతిరేకం లేదని, అయితే చుట్టుపక్కల స్థలం ఉండగా శివాలయాన్ని ఎందుకు కూల్చారో స్పష్టం చేయాలని అన్నారు. శివాలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని కోరారు.
    1
    గుప్తనిధుల వేట కోసమే అశోక్‌నగర్ శివాలయం కూల్చివేత : మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో మట్టికోట శివాలయం ముందు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం దేవాలయాలపై భక్తి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుప్తనిధుల వేట కోసమే శివాలయాన్ని కూల్చారని విమర్శించారు.
శివాలయం కూల్చివేతపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని, గర్భగుడి కింద ఎందుకు తవ్వకాలు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కూల్ నిర్మాణానికి తమకు వ్యతిరేకం లేదని, అయితే చుట్టుపక్కల స్థలం ఉండగా శివాలయాన్ని ఎందుకు కూల్చారో స్పష్టం చేయాలని అన్నారు. శివాలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని కోరారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • పల్నాడు జిల్లా :- నరసరావుపేటలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన కంచర్ల సుజాత అనే మహిళ... నరసరావుపేట. సమైక్య లీడర్ మల్లెల అనిల నాకు తెలియకుండా నా పేరు మీద నాలుగు దొంగ డ్వాక్రా గ్రూపులు చేసి 10లక్షలు నగదు తీసుకుందని బాధితురాలు సుజాత ఆరోపణ... బ్యాంకు వాళ్లు నోటీసులు ఇవ్వగా నాకు నా పేరు మీద లోను ఉందని నాకు విషయం తెలిసింది... సమైక్య లీడర్ అనిల అని నేను తీసుకున్న లోను నేను క్లియర్ చేస్తాను అంటూ రెండు సంవత్సరాలు నుంచి కాలం గడుపుకుంటూ వచ్చిందని బాధితురాలు సుజాత ఆవేదన... ఇప్పుడు లీడర్ అనిల ని లోను కట్టమని అడిగితే నన్ను ఎలా పడితే అలా అసభ్య పదజాలతో మాట్లాడుతుందని సుజాత ఆరోపణ... సమైక్య లీడర్ అనిల మీద తగు చర్యలు తీసుకొని,నాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కృష్ణారావుని వేడుకున్న బాధితురాలు సుజాత.
    1
    పల్నాడు జిల్లా :- నరసరావుపేటలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన కంచర్ల సుజాత అనే మహిళ...
నరసరావుపేట.
సమైక్య లీడర్ మల్లెల అనిల నాకు తెలియకుండా నా పేరు మీద నాలుగు దొంగ డ్వాక్రా గ్రూపులు చేసి 10లక్షలు నగదు తీసుకుందని బాధితురాలు సుజాత ఆరోపణ...
బ్యాంకు వాళ్లు నోటీసులు ఇవ్వగా నాకు నా పేరు మీద లోను ఉందని నాకు విషయం తెలిసింది...
సమైక్య లీడర్ అనిల అని నేను తీసుకున్న లోను నేను క్లియర్ చేస్తాను అంటూ రెండు సంవత్సరాలు నుంచి కాలం గడుపుకుంటూ వచ్చిందని బాధితురాలు సుజాత ఆవేదన...
ఇప్పుడు లీడర్ అనిల ని లోను కట్టమని అడిగితే నన్ను ఎలా పడితే అలా అసభ్య పదజాలతో మాట్లాడుతుందని సుజాత ఆరోపణ...
సమైక్య లీడర్ అనిల మీద తగు చర్యలు తీసుకొని,నాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కృష్ణారావుని వేడుకున్న బాధితురాలు సుజాత.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
    1
    బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం: రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో భారీ నిరసన

మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
    1
    కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు అందగా, వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. అర్జిదారులు రసీదు ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.
    1
    ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు
MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు అందగా, వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. అర్జిదారులు రసీదు ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    5 hrs ago
  • బండి భగీరథ్ కేసుపై ఎస్‌ఐటీ ఏర్పాటు అంటే కేసును నీరుగార్చడమే : హరీష్ రావు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్‌పై ఫిర్యాదు వచ్చి నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. “మా క్రిశాంక్, నల్లబాలు రీట్వీట్ చేసినా వెంటనే ఇంటికి వెళ్లి ఎత్తుకెళ్లారు. మరి రేప్ కేసులో ఫిర్యాదు వచ్చిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పది ఎస్‌ఐటీలు వేసిందని, ముందుగా వాటి నివేదికలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు లీకులు ఇస్తూ అసలు విషయాన్ని ప్రజలు చర్చించకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
    1
    బండి భగీరథ్ కేసుపై ఎస్‌ఐటీ ఏర్పాటు అంటే కేసును నీరుగార్చడమే : హరీష్ రావు
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్‌పై ఫిర్యాదు వచ్చి నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
“మా క్రిశాంక్, నల్లబాలు రీట్వీట్ చేసినా వెంటనే ఇంటికి వెళ్లి ఎత్తుకెళ్లారు. మరి రేప్ కేసులో ఫిర్యాదు వచ్చిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పది ఎస్‌ఐటీలు వేసిందని, ముందుగా వాటి నివేదికలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు లీకులు ఇస్తూ అసలు విషయాన్ని ప్రజలు చర్చించకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.