Shuru
Apke Nagar Ki App…
గుడిహత్నూర్ లో వరద ప్రభావిత కాలనీల్లో ముమ్మర పరిశుద్ధ పనులు గుడిహత్నూర్, ఆగస్టు 1: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీటితో ప్రభావితమైన మండల కేంద్రంలోని కాలనీల్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పరిశుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షపు నీటితో పూడిక, చెత్త పేరుకుపోయిన మహంకాళి గల్లి, సునార్ గల్లీల్లోని కాలువలను శనివారం ప్రత్యేకంగా శుభ్రం చేశారు. గ్రామ సర్పంచ్ ఆడే శిలా స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి, నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. వర్షాల అనంతరం వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తగా పరిశుభ్రత చర్యలను మరింత వేగవంతం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్షద్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Shaik Mahmood
గుడిహత్నూర్ లో వరద ప్రభావిత కాలనీల్లో ముమ్మర పరిశుద్ధ పనులు గుడిహత్నూర్, ఆగస్టు 1: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీటితో ప్రభావితమైన మండల కేంద్రంలోని కాలనీల్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పరిశుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షపు నీటితో పూడిక, చెత్త పేరుకుపోయిన మహంకాళి గల్లి, సునార్ గల్లీల్లోని కాలువలను శనివారం ప్రత్యేకంగా శుభ్రం చేశారు. గ్రామ సర్పంచ్ ఆడే శిలా స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి, నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. వర్షాల అనంతరం వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తగా పరిశుభ్రత చర్యలను మరింత వేగవంతం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్షద్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- ఎన్నికల సమరానికి టీఆర్పీ సై.. తొలి బీసీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన! రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జనగామ నియోజకవర్గానికి పార్టీ తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ కల్నల్ బిక్షపతి ముదిరాజ్‌ను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధికారికంగా ప్రకటించారు. బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పించాలనే లక్ష్యంతో తొలి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కల్నల్ బిక్షపతి ముదిరాజ్‌ను ఎంపిక చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బిక్షపతి ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. జనగామ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, తెలంగాణ రాజ్యాధికార సాధన కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.1
- కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.2
- సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."1
- ఆర్మూర్‌లో SIR అవగాహనా సదస్సు - 100% ఓటర్ల ఎన్రోల్‌మెంట్ పూర్తి ఆర్మూర్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై అవగాహనా సదస్సు నిర్వహించారు. డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, తెలంగాణ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఓటర్ల ఎన్రోల్‌మెంట్ 100% పూర్తి చేశామని, 25,800 డబుల్ ఓట్లను తొలగించామని వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఎల్ఏలు, సూపర్‌వైజర్లకు ధన్యవాదాలు తెలిపారు. సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు వేడుక కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నుడా చైర్మన్ కేశ వేణు, మండల అధ్యక్షులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.1
- korutla pattanam lo thrishakthimatha devalayam lo varahi navarathrulu varahi navarathri lo bhakti shradhala tho kalakaladuthunna korutla thrishakthi devalayam4
- సరైన ధ్రువపత్రాలను కలిగి ఉండాలి: ఎస్ఐ మహేందర్ రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌక్ లో ట్రాఫిక్ ఎస్ఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తో పాటు అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.1
- Promise made ✅ Promise delivered ✅ As promised, the Modi government has stood firmly with students against paper leaks and exam fraud. With the passage of the Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026, India has taken a decisive step towards a fair, transparent and credible examination system.1
- బంబారాలో కుల దూషణల ఆరోపణలు.. దళితుల నిరసన........... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.2
- *జిల్లావ్యాప్తంగా నాకాబంది* *నేరాల నియంత్రణకు వాహన తనిఖీలు.* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, జూలై 31 :- *మహారాష్ట్ర సరిహద్దులు, పట్టణాల్లో ప్రత్యేక నిఘా.* *డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై చర్యలు.* *అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రల తనిఖీలు* *20 పోలీస్ స్టేషన్లో పరిధిలో నాకాబంది.* *ప్రత్యేకంగా 25 చెక్పోస్టుల ఏర్పాటు.* జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణాలను అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా నాకాబంది నిర్వహించడం జరిగింది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పట్టణాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ, నంబర్ ప్లేట్ లేకుండా, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్ వద్ద చెక్‌పోస్టును పరిశీలించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్క సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1