Shuru
Apke Nagar Ki App…
సదాశివనగర్: పరీక్షల సమయంలో ఒత్తిడి వద్దు : డాక్టర్ రమణ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పరీక్షల సమయంలో ఒత్తిడి వద్దు: డా.రమణ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా మానసిక ఆరోగ్యాధికారి డాక్టర్ రమణ మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రణాళికబద్ధంగా చదవాలని సూచించారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు పలు సలహాలు ఇచ్చారు. హెచ్ఎం శోభారాణి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరీష్, సోషల్ వర్కర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Narmala Swapna
సదాశివనగర్: పరీక్షల సమయంలో ఒత్తిడి వద్దు : డాక్టర్ రమణ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పరీక్షల సమయంలో ఒత్తిడి వద్దు: డా.రమణ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా మానసిక ఆరోగ్యాధికారి డాక్టర్ రమణ మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రణాళికబద్ధంగా చదవాలని సూచించారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు పలు సలహాలు ఇచ్చారు. హెచ్ఎం శోభారాణి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరీష్, సోషల్ వర్కర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- విశ్వజ్జనకళా మండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఆరో తరగతి నుంచి చేర్చాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా నుండి రథయాత్ర ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా మీదుగా మెదక్ జిల్లాకు చేరుకుంది మెదక్ జిల్లాలో జై భీమ్ మహా సేన విశ్వజనకరమండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించి ఏడు డిమాండ్లను ప్రజలకు వివరించారు ఐదు ఏప్రిల్ లైవ్ నుంచి 11 నుంచి 13 వరకు ఏప్రిల్ నెల దీక్ష అప్పటికి రాజ్యాంగాన్ని చేర్పించకపోతే నాలుగు 14న అమ్మాయిల నిరాహార దీక్ష కోరుకుంటామని విశ్వ జన కళా మండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్ జి అంజన్న అశోక్ నాగేశ్వరరావు సురేష్ బాబు బాలస్వామి రాణి యాదమ్మ రమేష్ ఎల్లయ్య యాదన్న మొగులయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు1
- నందిపేట్ మండలం లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్, ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ రావుపై నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో అతనిపై దొంగనోట్లు, ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయని సీపీ దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కానిస్టేబుల్‌పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.1
- ధర్మపురి : బుగ్గారం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్ బుగ్గారం గ్రామంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని, నిర్మాణ పనులు నాణ్యతతో సాగాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న మిడ్ డే మీల్ కార్యక్రమాన్ని తనిఖీ చేసి భోజన నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, పోషకాహారం పంపిణీ, పరిశుభ్రతపై ఆదేశాలు జారీ చేశారు. బుగ్గారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి రాబోయే పరీక్షల కోసం కృషి చేయాలని ప్రోత్సహించారు. విద్యార్థులు సమయపాలనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, తమ భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం, బుగ్గారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 90 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపివో, ఎంఈఓ, బుగ్గారం సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.1
- ఉపాధి హామీ పనుల సమయంలో తేనెటీగల దాడి చోటుచేసుకుని ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి తవ్వే క్రమంలో ప్రమాదవశాత్తు తేనెటీగల గూడు తగిలింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలపై దాడి చేశాయి. తేనెటీగల కాటుకు గురైన ఏడుగురిని సహచరులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, పనుల సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.1
- సంగారెడ్డి పట్టణంలో హోలీ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డాన్సులు1
- మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ముడుచింతలపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అమ్మవారి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమాజ ఐక్యత కోసం ముదిరాజ్ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. గ్రామాభివృద్ధి మరియు సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ముదిరాజ్ సంఘం సభ్యులకు, గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు చింతపల్లి చైర్మన్ జామ్ రవి, ముడుచింతలపల్లి కౌన్సిలర్ నీరజ్ గౌడ్, నాగ్సెట్పల్లి కౌన్సిలర్ నవీన్ నాయక్, లక్ష్మాపూర్ కౌన్సిలర్ చినలచ్చి సరిత శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్ యాదవ్, మండల అధ్యక్షులు తప్పెట్ల నరేందర్ గౌడ్, జనరల్ సెక్రటరీ మరియు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీశైలం, ఉపాధ్యక్షురాలు సింగం విజయలక్ష్మి, రమ్య, వంగ రవీందర్ రెడ్డి, సుధాకర్ నాయక్, వీరేష్ నాయక్, రాయ్ శ్రీకాంత్ రెడ్డి, అరుణ్, నరేష్ పటేల్, గూగుల్ లోతు వెంకటేష్ నాయక్, మచ్చేందర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.4
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పరీక్షల సమయంలో ఒత్తిడి వద్దు: డా.రమణ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా మానసిక ఆరోగ్యాధికారి డాక్టర్ రమణ మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రణాళికబద్ధంగా చదవాలని సూచించారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు పలు సలహాలు ఇచ్చారు. హెచ్ఎం శోభారాణి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరీష్, సోషల్ వర్కర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.1
- 👉 పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి సమిండ్ల వాణి, బ్యాంకు అధికారులు,రోటరీ ప్రతినిధులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ నిధుల సహకారంతో, శక్తి ప్రాజెక్ట్ కింద రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ వారి నిర్వహణలో భాగంగా జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ లో రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ వారి ఆధ్వర్యంలో 824 మంది పాఠశాలల బాలికలకోసం పునర్వినియోగ శానిటరీ ప్యాడ్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి సమిండ్ల వాణిశ్రీనివాస్, మండల విద్యాధికారిణి శ్రీమతి చంద్రకళ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు మహేష్, తదితరులు మరియు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చారి, రాజు, ప్రతినిధులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యం, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి ఆరవ లక్ష్మి, పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్ రావు, అమర్నాథ్ రెడ్డి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సి ఎస్ ఆర్ నిధులను సక్రమమైన రీతిలో బాలికల ఆరోగ్య సంరక్షనకోసం వెచ్చిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుత ఆధునిక కాలంలో వైద్యుల సలహాలు సూచనల మేరకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాలికలు విద్యారంగంలో రాణిస్తారన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. ప్రధానంగా, బాలికలు , మహిళల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల, శానిటరీ పాడ్స్ ఉపయోగించకపోవడంతో పాటుగా వ్యక్తిగత పరిశుభ్రత వైపు ఆలోచించకపోవడంతో ప్రాణాంతకమైన కాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. కనుక ప్రతి బాలిక, మహిళా తమ ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.4
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా హోలీ వేడుకలు. నిన్న చంద్రగ్రహణం సందర్భంగా హోలీ వేడుకలు ఈరోజు నిర్వహించుకున్నారు. చిన్నా, పెద్దా కలిసి రంగులు చల్లుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని, అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు1