బద్వేలు అభివృద్ధి పనులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి. బద్వేలు, మే11: బద్వేలు అభివృద్ధి పనులలో భాగంగా పట్టణంలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ జివి సుబ్బారెడ్డి అన్నారు, ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహరెడ్డి, బద్వేలు అర్బన్ ఎస్ఐ చిరంజీవి లకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కాంట్రాక్టర్ జివీ సుబ్బారెడ్డి మాట్లాడుతు పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు నిబంధనల మేరకు టెండర్లు వేసి దక్కించుకోవడం జరిగిందని, క్షేత్ర స్థాయిలో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పనులు చేపట్టే క్రమంలో కొంతమంది అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. అభివృద్ధి పనులు జరుగకుండా అడ్డుకుంటున్న వారిపై చట్ట పరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీవీ సుబ్బారెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి ,షేక్ జహంగీర్ భాష, కొంకుల రాంబాబు, సిమెంట్ షరీఫ్ ,పఠాన్ మౌలాలి, ట్రావెల్స్ రసూల్, బిజివేముల చంద్రశేఖర్ రెడ్డి, శివరాం రెడ్డి ,పుష్ప రాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
బద్వేలు అభివృద్ధి పనులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి. బద్వేలు, మే11: బద్వేలు అభివృద్ధి పనులలో భాగంగా పట్టణంలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ జివి సుబ్బారెడ్డి అన్నారు, ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహరెడ్డి, బద్వేలు అర్బన్ ఎస్ఐ
చిరంజీవి లకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కాంట్రాక్టర్ జివీ సుబ్బారెడ్డి మాట్లాడుతు పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు నిబంధనల మేరకు టెండర్లు వేసి దక్కించుకోవడం జరిగిందని, క్షేత్ర స్థాయిలో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పనులు చేపట్టే క్రమంలో కొంతమంది అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. అభివృద్ధి పనులు జరుగకుండా
అడ్డుకుంటున్న వారిపై చట్ట పరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీవీ సుబ్బారెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి ,షేక్ జహంగీర్ భాష, కొంకుల రాంబాబు, సిమెంట్ షరీఫ్ ,పఠాన్ మౌలాలి, ట్రావెల్స్ రసూల్, బిజివేముల చంద్రశేఖర్ రెడ్డి, శివరాం రెడ్డి ,పుష్ప రాజ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
- వైభవంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి. బద్వేలు: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు సుమిత్ర నగర్ లో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి వారికి సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా విశేష అభిషేకం నిర్వహించారు. స్వామి వారి కృపా కటాక్షాల కోసం భక్తులందరూ తమ శక్తి కొలది కాయ, కర్పూరం, పూలు మరియు పండ్లతో సకాలంలో విచ్చేసి, ఈ దివ్య అభిషేక సేవలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ నిర్వాహకులు వి వి రమణ కోరారు. ఆ మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా ఆశిస్తూ...అందరికీ ఆహ్వానం! పలికారు, జై శ్రీరామ్! జై శ్రీమన్నారాయణ!!,2
- ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.1
- Post by Bondhu Suresh1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం... కార్యాలయమా? పార్కింగ్ స్థలమా? గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు – ఆలస్యంగా ప్రారంభమవుతున్న ఫిర్యాదుల స్వీకరణపై విమర్శలు. చంద్రగిరి మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందాల్సిన సేవలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులు కార్యాలయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.తహశీల్దార్ కార్యాలయ వరండా, ఆవరణ ప్రాంతం మొత్తం ద్విచక్ర వాహనాలతో నిండిపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వాహనాలను ఎటు పడితే అటు పార్కింగ్ చేయడంతో వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన చోట పూర్తిగా పార్కింగ్ స్థలంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం గత రెండు వారాలుగా 11 గంటల తర్వాత ప్రారంభమవుతుండటంపై కూడా ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుండి తెల్లవారుజామునే బయలుదేరి కార్యాలయానికి చేరుకున్న ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.ఈ ఆలస్యానికి కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమా..? లేక ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యమా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలి గానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ ప్రాంగణంలో సరైన పార్కింగ్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం... కార్యాలయమా? పార్కింగ్ స్థలమా? గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు – ఆలస్యంగా ప్రారంభమవుతున్న ఫిర్యాదుల స్వీకరణపై విమర్శలు. చంద్రగిరి మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందాల్సిన సేవలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులు కార్యాలయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.తహశీల్దార్ కార్యాలయ వరండా, ఆవరణ ప్రాంతం మొత్తం ద్విచక్ర వాహనాలతో నిండిపోవడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వాహనాలను ఎటు పడితే అటు పార్కింగ్ చేయడంతో వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణం ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన చోట పూర్తిగా పార్కింగ్ స్థలంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం గత రెండు వారాలుగా 11 గంటల తర్వాత ప్రారంభమవుతుండటంపై కూడా ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుండి తెల్లవారుజామునే బయలుదేరి కార్యాలయానికి చేరుకున్న ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.ఈ ఆలస్యానికి కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమా..? లేక ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యమా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలి గానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ ప్రాంగణంలో సరైన పార్కింగ్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- కొల్లు రవీంద్రా మీరు వేసుకున్న పచ్చ కళ్లజోడుని తీసేసి చూస్తే.. వైయస్ జగన్ గారు చేసిన మంచి కనిపిస్తుంది అభివృద్ధి పనులు చేయడం, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, పేదలకు పథకాలు ఇవ్వడం రాష్ట్రాన్ని నా*శనం చేయడమా కొల్లు రవీంద్రా? -వంగవీటి నరేంద్ర గారు, వైయస్‌ఆర్‌సీపీ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి1
- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.1