కొత్తగూడెం : రీ-సర్వే పనులను నెలన్నరలో పూర్తి చేయాలి.. కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (MK న్యూస్24): కొత్తగూడెం మండలం రామవరం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుజాతనగర్–రామవరం–గరీబ్‌పేట ట్రైజంక్షన్ వద్ద జరుగుతున్న సర్వే పనులను పరిశీలించి, సర్వే పురోగతి, భూ హద్దులు, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామవరం పరిధిలో సుమారు 1,950 ఎకరాల భూమికి రీ-సర్వే చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. ఇప్పటికే గ్రామ సరిహద్దుల నిర్ధారణతో పాటు అటవీ భూముల హద్దులను పరిశీలించినట్లు తెలిపారు. సర్వే పరిధిలో సుమారు 146 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు వెల్లడించారు. సర్వే నంబర్లు 23, 30, 31 తదితర ప్రాంతాల్లో పనులను కలెక్టర్ పరిశీలించారు. సర్వే నంబర్ 20లో పట్టా, అసైన్‌మెంట్, అటవీ భూములు కలిసివున్నందున రికార్డులను ఆధారంగా చేసుకుని ఆయా భూముల హద్దులను స్పష్టంగా నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అటవీ హద్దులు నిర్ధారించిన ప్రాంతాల్లో మిగిలిన రీ-సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పోడు సాగు భూముల్లో అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ కింద హక్కులు కల్పించినట్లు అధికారులు తెలిపారు. సర్వే పరిధిలో 420 మందికి పైగా పట్టాదారులు ఉన్నారని వివరించారు. రీ-సర్వే ద్వారా భూ హద్దులు స్పష్టమై, హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా రికార్డులను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ సూచించారు. సమ్మక్క గద్దె సమీపంలో సుమారు 2.3 నుంచి 2.5 కిలోమీటర్ల మేర సరిహద్దు సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పాత సరిహద్దు రాళ్లు, మ్యాప్‌లు, రికార్డులను పరిశీలించి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. రీ-సర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేసి నెలన్నరలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ భూ రికార్డుల్లో ఎలాంటి అయోమయానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ పుల్లయ్య, సర్వేయర్ అశోక్, ఆర్‌ఐ గణపతి, లైసెన్సుడ్ సర్వేయర్లు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తగూడెం : రీ-సర్వే పనులను నెలన్నరలో పూర్తి చేయాలి.. కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (MK న్యూస్24): కొత్తగూడెం మండలం రామవరం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుజాతనగర్–రామవరం–గరీబ్‌పేట ట్రైజంక్షన్ వద్ద జరుగుతున్న సర్వే పనులను పరిశీలించి, సర్వే పురోగతి, భూ హద్దులు, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామవరం పరిధిలో సుమారు 1,950 ఎకరాల భూమికి రీ-సర్వే చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. ఇప్పటికే గ్రామ సరిహద్దుల నిర్ధారణతో పాటు అటవీ భూముల హద్దులను పరిశీలించినట్లు తెలిపారు. సర్వే పరిధిలో సుమారు 146 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు వెల్లడించారు. సర్వే నంబర్లు 23, 30, 31 తదితర ప్రాంతాల్లో పనులను కలెక్టర్ పరిశీలించారు. సర్వే నంబర్ 20లో పట్టా, అసైన్‌మెంట్, అటవీ భూములు కలిసివున్నందున రికార్డులను ఆధారంగా చేసుకుని ఆయా భూముల హద్దులను స్పష్టంగా నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అటవీ హద్దులు నిర్ధారించిన ప్రాంతాల్లో మిగిలిన రీ-సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పోడు సాగు భూముల్లో అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ కింద హక్కులు కల్పించినట్లు అధికారులు తెలిపారు. సర్వే పరిధిలో 420 మందికి పైగా పట్టాదారులు ఉన్నారని వివరించారు. రీ-సర్వే ద్వారా భూ హద్దులు స్పష్టమై, హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా రికార్డులను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ సూచించారు. సమ్మక్క గద్దె సమీపంలో సుమారు 2.3 నుంచి 2.5 కిలోమీటర్ల మేర సరిహద్దు సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పాత సరిహద్దు రాళ్లు, మ్యాప్‌లు, రికార్డులను పరిశీలించి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. రీ-సర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేసి నెలన్నరలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ భూ రికార్డుల్లో ఎలాంటి అయోమయానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ పుల్లయ్య, సర్వేయర్ అశోక్, ఆర్‌ఐ గణపతి, లైసెన్సుడ్ సర్వేయర్లు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- కొత్తగూడెం : రీ-సర్వే పనులను నెలన్నరలో పూర్తి చేయాలి.. కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (MK న్యూస్24): కొత్తగూడెం మండలం రామవరం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుజాతనగర్–రామవరం–గరీబ్‌పేట ట్రైజంక్షన్ వద్ద జరుగుతున్న సర్వే పనులను పరిశీలించి, సర్వే పురోగతి, భూ హద్దులు, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామవరం పరిధిలో సుమారు 1,950 ఎకరాల భూమికి రీ-సర్వే చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. ఇప్పటికే గ్రామ సరిహద్దుల నిర్ధారణతో పాటు అటవీ భూముల హద్దులను పరిశీలించినట్లు తెలిపారు. సర్వే పరిధిలో సుమారు 146 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు వెల్లడించారు. సర్వే నంబర్లు 23, 30, 31 తదితర ప్రాంతాల్లో పనులను కలెక్టర్ పరిశీలించారు. సర్వే నంబర్ 20లో పట్టా, అసైన్‌మెంట్, అటవీ భూములు కలిసివున్నందున రికార్డులను ఆధారంగా చేసుకుని ఆయా భూముల హద్దులను స్పష్టంగా నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అటవీ హద్దులు నిర్ధారించిన ప్రాంతాల్లో మిగిలిన రీ-సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పోడు సాగు భూముల్లో అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ కింద హక్కులు కల్పించినట్లు అధికారులు తెలిపారు. సర్వే పరిధిలో 420 మందికి పైగా పట్టాదారులు ఉన్నారని వివరించారు. రీ-సర్వే ద్వారా భూ హద్దులు స్పష్టమై, హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా రికార్డులను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ సూచించారు. సమ్మక్క గద్దె సమీపంలో సుమారు 2.3 నుంచి 2.5 కిలోమీటర్ల మేర సరిహద్దు సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పాత సరిహద్దు రాళ్లు, మ్యాప్‌లు, రికార్డులను పరిశీలించి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. రీ-సర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేసి నెలన్నరలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ భూ రికార్డుల్లో ఎలాంటి అయోమయానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ పుల్లయ్య, సర్వేయర్ అశోక్, ఆర్‌ఐ గణపతి, లైసెన్సుడ్ సర్వేయర్లు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- స్వచ్ఛ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సారపాక సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ సారపాక సెప్టెంబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం పరిధిలోని సారపాక మేజర్ గ్రామపంచాయతీ గాంధీనగర్ సంత ఏరియాలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీని స్వచ్ఛ, హరిత గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ పిఎస్పిడి భద్రాచలం యూనిట్ డీజీఎం చెంగల్రావు, ఉపసర్పంచ్ కన్నెదార రమేష్, ఈఓ జి. రవికుమార్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. అలాగే, పాలకమండలి సభ్యులు మువ్వా వెంకటేశ్వరరావు, ఏసోబు, కొమరం సావిత్రి, గౌరి, లక్ష్మీప్రసన్నలతో పాటు స్థానిక నాయకులు దామెర ఆదినారాయణ, చుక్కపల్లి బాలాజీ, లకావత్ చందు, నాగరాజు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.1
- స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో హిందీ ప్రాధాన్యత పై కార్యక్రమం పాల్వంచ: స్టార్ చిల్డ్రన్ హై స్కూల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం 'హిందీ అవుట్ రీచ్' వేడుక ఘనంగా జరిగింది. హిందీ రాజభాష దినోత్సవ సందర్భంగా డిగ్రీ కళాశాల హిందీ విభాగ అధ్యక్షురాలు డాక్టర్ టి. అరుణ కుమారి ముఖ్య అతిథిగా హాజరై, భాషా ప్రాముఖ్యతపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కరస్పాండెంట్ జి. భాస్కరరావు, ప్రిన్సిపాల్ జి. శ్రీనివాసరెడ్డి, అధ్యాపకురాలు జి. రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.4
- బెస్తగూడెం గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. ఇకనైనా సమస్యకు పరిస్కారం చూపాలి ప్రజలు డిమాండ్ కుక్కునూరు మండలంలోని బెస్తగూడెం గ్రామంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ముఖ్యంగా డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల పక్కనే మురుగు నీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నీటి నిల్వల కారణంగా దోమలు విపరీతంగా పెరిగి స్థానికులు జ్వరాల బారిన పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- సత్తుపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి పూజలు – మండపాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ వివిధ గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తల్లాడ, కల్లూరు ఖాన్‌ఖాన్‌పేట, పెనుబల్లి మండపాలతో పాటు సత్తుపల్లి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేసి, భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- పెనుబల్లి మండలం లో లింగుగూడెం వెళ్లే రోడ్లో ఈరోజు కోతులు ఆహారం లేక రోడ్లమీద ఇండ్లలో చేరి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాధుడు లేరు అధికారులు నిర్లక్ష్యం.. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా, పెనుబల్లి గ్రామపంచాయతీలో లింగగూడెం రూట్ లో కోతులు హడేవుడి చేస్తున్నాయి కోతులకు ఆహారం లేక రోడ్లమీద స్టోర్లో వేస్ట్ రైస్ ప్రాబ్లం ఇండ్ల పక్కన పోయటం వలన గ్రామంలో ప్రజల మీద కోతులు ఇబ్బందులు కలగజేస్తున్నాయి గ్రామపంచాయతీ అధికారులు కోతులు బంధించి వాటి మీద చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వలన పిల్లల మీద పెద్దదల మీద కోతులు దాడి చేస్తున్నాయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఆవేదన చెందుతున్నారు కాబట్టి గ్రామపంచాయతీ అధికారులు వెంటనే కోతుల మీద చర్యలు తీసుకొని వాటిని నిర్బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు...4
- చేతబడి పేరుతో వృద్ధ మహిళకు చిత్ర హింసలు బూర్గంపాడు మండలం జింకల గూడెం గ్రామంలో మూఢనమ్మకం పేరుతో చెట్టుకు మేకులు కొట్టి మేకులు పై వృద్ధ మహిళను ఎక్కించారు *చేతబడి పేరుతో వృద్ధ మహిళకు చిత్రహింసలు* *మూఢనమ్మకం పేరుతో చెట్టుకు కట్టి కొట్టిన వైనం.. సమాజం ఎటు వెళ్తోంది?* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో చేతబడి చేశారనే అనుమానంతో ఓ వృద్ధ మహిళను గ్రామస్తులు చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SK సకినా బీ అనే వృద్ధ మహిళపై కొందరు గ్రామస్తులు చేతబడి చేసిందన్న అనుమానంతో దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలిని తాళ్లతో కొట్టడంతో పాటు చెట్టుకు మేకులు కొట్టి, ఆమెను పైకి ఎక్కించినట్లు స్థానికంగా సమాచారం వెలువడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. *అసలు చేతబడులు ఉన్నాయా?* తెలంగాణలో చేతబడి/బ్లాక్ మ్యాజిక్‌ను ప్రత్యేకంగా శిక్షించే చట్టం లేదని 2025లో తెలంగాణ హైకోర్టు తీర్పులో పేర్కొన్నప్పటికీ, అలాంటి పేరుతో వ్యక్తిపై గాయాలు చేయడం మాత్రం శిక్షార్హమైన నేరాలకు దారితీయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. చేతబడి వల్ల ఒక వ్యక్తికి మరో వ్యక్తి అనారోగ్యం కలిగించడం, ప్రమాదం చేయడం లేదా ప్రాణహాని కలిగించడం జరుగుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారం లేదు. అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర అనుకోని సంఘటనలకు కారణాలను వైద్య, శాస్త్రీయ, సామాజిక కోణాల్లో పరిశీలించాలి. అయితే చేతబడి పేరుతో జరిగే హింస మాత్రం నిజమైన ప్రమాదం. తెలంగాణలో గతంలో కూడా మూఢనమ్మకాల కారణంగా మహిళలను ‘చేతబడివాళ్లు’గా ముద్రవేసి వేధించిన ఘటనలు నమోదయ్యాయి. మహిళలపై జరిగే హింసలో witch-hunting కూడా ఒక రూపంగా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. *సమాజం ఎటు వెళ్తోంది?* సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తున్న సమయంలో కూడా ఒక వృద్ధ మహిళను చేతబడి చేసిందనే అనుమానంతో చెట్టుకు కట్టి హింసించడం మన సమాజం ఆలోచనా విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మూఢనమ్మకం ఒక నమ్మకం మాత్రమే కావచ్చు.. కానీ ఆ నమ్మకం పేరుతో ఒక మనిషిపై చేయి చేసుకోవడానికి ఎవరికీ హక్కు లేదు. ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగితే గ్రామంలోనే తీర్పు చెప్పడం, వ్యక్తులను కొట్టడం, అవమానించడం కాకుండా పోలీసులను, వైద్యులను, సంబంధిత అధికారులను ఆశ్రయించాలి. సమస్యకు పరిష్కారం హింసలో కాదు.. నిజాన్ని తెలుసుకోవడంలో ఉంది. చేతబడి పేరుతో ఎవరినీ అనుమానించవద్దు.. మూఢనమ్మకాల ఆధారంగా ఎవరినీ నిందించవద్దు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని హింసించవద్దు. ప్రశ్నించండి.. పరిశీలించండి.. శాస్త్రీయంగా ఆలోచించండి. అనుమానాన్ని ఆధారంగా చేసుకుని శిక్షించకండి... ఒక మనిషిని రక్షించాల్సిన సమాజం, ఒక మనిషిని మూఢనమ్మకం పేరుతో హింసించే స్థితికి వెళ్లకూడదు. మూఢనమ్మకాలపై పోరాటం అంటే ఎవరి విశ్వాసాలను అవమానించడం కాదు.. ఆ విశ్వాసం పేరుతో మనిషికి హాని జరగకుండా చూడటమే నిజమైన సామాజిక బాధ్యత.1
- భుర్గంపహడ్: చేతబడి అనుమానంతో వృద్ధ మహిళకు చిత్రహింసలు... బూర్గంపాడు మండలం జింకలగూడెంలో మూఢనమ్మకాల పేరుతో ఓ వృద్ధ మహిళపై దాడి జరిగినట్లు సమాచారం. SK సకినా బీ అనే వృద్ధ మహిళ చేతబడి చేసిందనే అనుమానంతో కొందరు గ్రామస్తులు ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహిళను తాళ్లతో కొట్టడంతో పాటు చెట్టుకు కట్టి హింసించినట్లు తెలుస్తోంది. చెట్టుకు మేకులు కొట్టి, ఆమెను పైకి ఎక్కించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి పాల్పడిన వ్యక్తులపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. చేతబడి, బ్లాక్ మ్యాజిక్ పేరుతో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురిచేయడం, ప్రమాదం కలిగించడం లేదా ప్రాణహాని చేయడం జరుగుతుందనే వాదనలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. అనారోగ్యం లేదా ఇతర సమస్యలకు వైద్య, శాస్త్రీయ కారణాలను పరిశీలించడం అవసరం. మూఢనమ్మకాలు లేదా అనుమానాల ఆధారంగా ఎవరిపైనా దాడి చేయడం, అవమానించడం, గ్రామంలోనే శిక్ష విధించడం సరికాదని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద ఘటన ఎదురైతే పోలీసులను, వైద్యులను లేదా సంబంధిత అధికారులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు. వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని మూఢనమ్మకాల పేరుతో వేధింపులకు పాల్పడకుండా గ్రామీణ ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది.1