Shuru
Apke Nagar Ki App…
స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో హిందీ ప్రాధాన్యత పై కార్యక్రమం పాల్వంచ: స్టార్ చిల్డ్రన్ హై స్కూల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం 'హిందీ అవుట్ రీచ్' వేడుక ఘనంగా జరిగింది. హిందీ రాజభాష దినోత్సవ సందర్భంగా డిగ్రీ కళాశాల హిందీ విభాగ అధ్యక్షురాలు డాక్టర్ టి. అరుణ కుమారి ముఖ్య అతిథిగా హాజరై, భాషా ప్రాముఖ్యతపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కరస్పాండెంట్ జి. భాస్కరరావు, ప్రిన్సిపాల్ జి. శ్రీనివాసరెడ్డి, అధ్యాపకురాలు జి. రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
GUMMALLA BHASKAR RAO
స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో హిందీ ప్రాధాన్యత పై కార్యక్రమం పాల్వంచ: స్టార్ చిల్డ్రన్ హై స్కూల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం 'హిందీ అవుట్ రీచ్' వేడుక ఘనంగా జరిగింది. హిందీ రాజభాష దినోత్సవ సందర్భంగా డిగ్రీ కళాశాల హిందీ విభాగ అధ్యక్షురాలు డాక్టర్ టి. అరుణ కుమారి ముఖ్య అతిథిగా హాజరై, భాషా ప్రాముఖ్యతపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కరస్పాండెంట్ జి. భాస్కరరావు, ప్రిన్సిపాల్ జి. శ్రీనివాసరెడ్డి, అధ్యాపకురాలు జి. రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- గంగాదేవిపాడు నుండి లింగుగూడెం వాయల్పాడు వైపు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది పట్టించుకోని అధికారులు రోడ్లో మరమ్మత్తులు చేయించాలని ప్రజల ఆవేదన చెందుతున్నారు పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా గంగదేవి పాడు గ్రామం లింగుగూడెం వాయలపాడు వైపు వెళ్లే రోడ్డు రోడ్డులో వాహనాలు రైతులు పంట పొలాల మీదికి వెళ్లే రోడ్డు కాస్త గుంతలు గుంతల మయంగా మారింది రైతులు పొలాలకు వెళ్లాలన్న ప్రయాణికులు ప్రయాణించాలన్న గుంతలోలు భయంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు అధికారులకు తెలియపరిచిన పట్టించుకునే నాధుడే లేడు వెంటనే రోడ్లు మరమ్మత్తులు చేయించాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు...1
- చింతలపూడి నగర పంచాయతీ నాలుగవ సచివాలయ పరిధిలో వృధా అవుతున్న త్రాగునీరు. చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో త్రాగునీరు వృధా అవుతుంది. ఐదవ సచివాలయం పరిధిలోని బోయగూడెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వెనుక త్రాగునీరు వృధా అవుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు.1
- స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఈరోజు రేగూరి వాసవి హనుమంతరావు కుమార్తె అల్లుడు పారేపల్లి తేజ వెంకట సీతారాం సాయి స్నేహిత దంపతులు మరియు దేవరశెట్టి లక్ష్మణరావు ఉదయలక్ష్మి దంపతులు స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య మహిళలు 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ ,కమిటీ సభ్యులు అయ్యప్ప శ్రీను, రాయపూడి శ్రీను, కనుమలపూడి శ్రీధర్, బుస శీను, భవనాసి వెంకటేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, అత్తులూరి సుబ్బయ్య, రేగూరి వాసవి, దోసపాటి కల్పన, దోసపాటి ఉషారాణి, కొత్త కరుణ, కొత్త భవాని, గెల్లా సువర్ణ, నాగలక్ష్మి, వసంత, సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు1
- 🕉️ రాపత్రి నగర్‌లో కొలువుదీరిన శ్రీ సిద్ధి వినాయకుడు.. ఘనంగా పూజలు, అన్నదానం! రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజలు ఖమ్మం నగరంలోని రాపత్రి నగర్ రోడ్ నెంబర్ 5లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక స్వామి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు మరియు స్థానికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులు యశ్వంత్, దీపక్, సోయల్, యువరాజు, శ్యాము, విజ్జు, మాలతి, రేణుక, వెన్నెల, రేఖ, కవిత తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేయడంతో రాపత్రి నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.2
- మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి మూడో రైల్వే లైన్ మహబూబాబాద్ జిల్లా: కాజీపేట నుండి విజయవాడకు219 కిలోమీటర్ల రైల్వే మూడో లైన్ అందుబాటులోకి వచ్చింది.. నూతనంగా నిర్మించిన మూడో రైల్వే లైన్ పై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.. న్యూఢిల్లీ-చెన్నై మధ్య ఉన్న ఈ గ్రాండ్ ట్రంక్ లైన్ పై విపరీతమైన రైళ్ల రద్దీ ఉండడంతో ప్రస్తుతం ఉన్న రెండు రైల్వే ట్రాక్‌ల లైన్లు సరిపోకపోవడంతో మూడో లైన్ నిర్మాణ పనులను పదేళ్ల క్రితం ప్రారంభించింది .. ఇందులో మహబూబాబాద్ నుండి కాజీపేట సెక్షన్‌ల మధ్య ఉన్న పనులు ఈ పనులు పూర్తయ్యాయి. దీంతో మూడో లైన్‌పై నుంచి రైళ్ల రాకపోకలను కొనసాగించనున్నారు.. . ఇక రైళ్ల రాకపోకలు నిర్ణీత సమయంలో కొనసాగేందుకు అవకాశం ఉందని రైల్వేశాఖ భావిస్తోంది...1
- 🔥 రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక అన్నదానం.. భారీగా తరలివచ్చిన భక్తులు! 🙏 రాపత్రి నగర్‌లో శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. వినాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. భక్తి, సేవాభావంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.1
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,050, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.8,800, కొత్త పత్తి ధర రూ.8,850 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.50, కొత్త పత్తి ధర రూ.161 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు.1
- *ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం* చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో 5 రోజుల శిశువు మృతి, ఆందోళనకరంగా మరో 24 మంది చిన్నారుల పరిస్థితి అందులో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ ఘటన కలకలం రేపింది. చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 5 రోజుల శిశువు మృతి చెందగా మరో 24 మంది చిన్నారులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సిబ్బంది చిన్నారులను పక్క వార్డుకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కలెక్టర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.1
- చేతబడి పేరుతో వృద్ధ మహిళకు చిత్రహింసలు ,మూఢనమ్మకం పేరుతో చెట్టుకు కట్టి కొట్టిన వైనం.. సమాజం ఎటు వెళ్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో చేతబడి చేశారనే అనుమానంతో ఓ వృద్ధ మహిళను గ్రామస్తులు చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SK సకినా బీ అనే వృద్ధ మహిళపై కొందరు గ్రామస్తులు చేతబడి చేసిందన్న అనుమానంతో దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలిని తాళ్లతో కొట్టడంతో పాటు చెట్టుకు మేకులు కొట్టి, ఆమెను పైకి ఎక్కించినట్లు స్థానికంగా సమాచారం వెలువడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. *అసలు చేతబడులు ఉన్నాయా?* తెలంగాణలో చేతబడి/బ్లాక్ మ్యాజిక్‌ను ప్రత్యేకంగా శిక్షించే చట్టం లేదని 2025లో తెలంగాణ హైకోర్టు తీర్పులో పేర్కొన్నప్పటికీ, అలాంటి పేరుతో వ్యక్తిపై గాయాలు చేయడం మాత్రం శిక్షార్హమైన నేరాలకు దారితీయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. చేతబడి వల్ల ఒక వ్యక్తికి మరో వ్యక్తి అనారోగ్యం కలిగించడం, ప్రమాదం చేయడం లేదా ప్రాణహాని కలిగించడం జరుగుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారం లేదు. అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర అనుకోని సంఘటనలకు కారణాలను వైద్య, శాస్త్రీయ, సామాజిక కోణాల్లో పరిశీలించాలి. అయితే చేతబడి పేరుతో జరిగే హింస మాత్రం నిజమైన ప్రమాదం. తెలంగాణలో గతంలో కూడా మూఢనమ్మకాల కారణంగా మహిళలను ‘చేతబడివాళ్లు’గా ముద్రవేసి వేధించిన ఘటనలు నమోదయ్యాయి. మహిళలపై జరిగే హింసలో witch-hunting కూడా ఒక రూపంగా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. *సమాజం ఎటు వెళ్తోంది?* సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తున్న సమయంలో కూడా ఒక వృద్ధ మహిళను చేతబడి చేసిందనే అనుమానంతో చెట్టుకు కట్టి హింసించడం మన సమాజం ఆలోచనా విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మూఢనమ్మకం ఒక నమ్మకం మాత్రమే కావచ్చు.. కానీ ఆ నమ్మకం పేరుతో ఒక మనిషిపై చేయి చేసుకోవడానికి ఎవరికీ హక్కు లేదు. ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగితే గ్రామంలోనే తీర్పు చెప్పడం, వ్యక్తులను కొట్టడం, అవమానించడం కాకుండా పోలీసులను, వైద్యులను, సంబంధిత అధికారులను ఆశ్రయించాలి. సమస్యకు పరిష్కారం హింసలో కాదు.. నిజాన్ని తెలుసుకోవడంలో ఉంది. *బీ -అలెర్ట్ న్యూస్ ప్రజలకు సందేశం* చేతబడి పేరుతో ఎవరినీ అనుమానించవద్దు.. మూఢనమ్మకాల ఆధారంగా ఎవరినీ నిందించవద్దు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని హింసించవద్దు. ప్రశ్నించండి.. పరిశీలించండి.. శాస్త్రీయంగా ఆలోచించండి. అనుమానాన్ని ఆధారంగా చేసుకుని శిక్షించకండి... ఒక మనిషిని రక్షించాల్సిన సమాజం, ఒక మనిషిని మూఢనమ్మకం పేరుతో హింసించే స్థితికి వెళ్లకూడదు. మూఢనమ్మకాలపై పోరాటం అంటే ఎవరి విశ్వాసాలను అవమానించడం కాదు.. ఆ విశ్వాసం పేరుతో మనిషికి హాని జరగకుండా చూడటమే నిజమైన సామాజిక బాధ్యత.1