ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి : ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య : 46 జగిత్యాల. పలు సమస్యలపై ప్రజలనుండి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్, అధికారులు ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ....పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 46 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి : ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య : 46 జగిత్యాల. పలు సమస్యలపై ప్రజలనుండి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్, అధికారులు ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ....పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 46 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
- ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. జన్నారం మండల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం జన్నారం ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆయన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న తిప్పాపూర్ గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి పరిశీలించారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గోశాలలో గోవులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.గోవులకు ఎండ వేడి తాకకుండా ఉండేందుకు షెడ్డు చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు చేయడం, కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయడం, చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలను పరిశీలించారు. అలాగే గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్,(పశువులకు ఇచ్చే ప్రత్యేక ఆహారం) సరైన విధంగా అందుతున్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా పరిశీలించి, వాటికి పెట్టి గోవులు తింటున్నాయా లేదా అని కూడా ఈవో రమాదేవి గారు చూశారు. గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోవులకు ఎలాంటి లోటు రాకుండా పూర్తి స్థాయిలో సంరక్షణ కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామపంచాయతీ పరిధిలోని నర్సింహులపల్లేలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రామంచ గ్రామ పంచాయతీ పరిధిలోని నరసింహులపల్లే వాసులు పోచమ్మ బోనాలు నిర్వహించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా పెద్దసంఖ్యలో ర్యాలీగా అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. పాడిపంటలతో ప్రజలందరిని చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. బోనాల వేడుకల్లో సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, రెడ్డి సంఘం ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, సాగర్ రెడ్డి, సమ్మిరెడ్డి, విజేందర్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.2
- కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. 'వృక్షో రక్షతి రక్షితః' అని ఉమారాణి పేర్కొంటూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్ఓ నిఖిత, ఆర్డీవో వీణ పాల్గొన్నారు.1
- సంక్షేమ పథకాల అమలుకై ఈనెల 30న ఇందిరా పార్క్ వద్ద జరిపే నిరాహార దీక్షలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనిలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయ వంతం చేయండి ఈనెల 30 తారీఖున నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం నాడు పాపన్నపేట్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 30న తలపెట్టిన నిరాహార దీక్షను విజయవంతం కోసం జిల్లా నుండి భారీగా తరలివెళ్దామని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అల్లారం సుమన్ పిలుపునిచ్చారుఈకార్యక్రమంలో జిల్లా ,మండల నాయకులు ,కార్యకర్తలు ఉన్నారు.జిల్లా దండోరా ప్రధాన కార్యదర్శి అల్లరాంసుమన్ ఎన్నికలప్పుడు దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అమీలు నెరవేర్చడం లో జాప్యం చేస్తున్నాదని ఆరోపించారు.మంగళవారం పాపన్నపేటలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఏం ఆర్ పిఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాపయ్య ,వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ పిలుపుమేరకు హమీల అమలుకోసంఇందిరాపార్కువద్దతలపెట్టినధర్నవిజయవంతంచేయాలనిళ్లఉ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర లింగం మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లారం సుమన్ మాదిగ బాచుపల్లి ఎల్లం బాచుపల్లి శరత్ మహిళా అధ్యక్షురాలు బాచుపల్లి లక్ష్మి మాదిగ గుల్ల ప్రసాద్ గుడికి చంద్రం కుంట ప్రకాష్ కుంట బిక్షపతి వడ్ల భూషణం బూస మహేష్ వట్టెం శివయ్య వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గం కార్యకర్తలు అధిక సంఖ్యలోపాల్గోనివిజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు.1
- Post by Solanke Ravi8
- జగిత్యాల : రూరల్ మండలం తాటిపల్లి గ్రామంలో 20 లక్షలతో రెండు మహిళా సంఘల భవన నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి,సర్పంచ్ బొలిశెట్టి గంగారెడ్డి ,ఉపసర్పంచ్ మాధురి రమేష్,మండల నాయకులు నక్కల రవీందర్ రెడ్డి,బాల ముకుందం ,Ae రాజ మల్లయ్య, మాజీ సర్పంచ్ నాడెం శంకర్, బక్కశెట్టి అంజన్న, నీరటీ గంగారెడ్డి,వార్డు సభ్యులు,గ్రామ నాయకులు, మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27-03-2026 శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.ఈసారి ఆలయ పార్కింగ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు సౌకర్యంగా కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు 15 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.కార్యక్రమాన్ని భక్తులు స్పష్టంగా వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే భద్రతా దృష్ట్యా బ్యారికేడ్లు, ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు నడవడానికి గ్రీన్ మ్యాట్లు పరచనున్నారు.భక్తుల కోసం త్రాగునీరు, మజ్జిగ వంటి పానీయాలు అందుబాటులో ఉంచనున్నారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.అదేవిధంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, టెంట్లు, విద్యుత్ దీపాలు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు స్వామివారి అన్నప్రసాదం పంపిణీ కూడా నిర్వహించనున్నారు.శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి ఆలయ ఉద్యోగులకు సూచించారు.1
- యుద్ధాలు, బాంబుల దాడుల నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని, ఐక్యరాజ్య సమితి తక్షణమే చర్యలు తీసుకోవాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ చొరవ చూపాలని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశానికి చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు జరుపుతున్న బాంబుల దాడుల రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయని,దాని వల్ల అంతర్జాతీయ స్థాయిలో చమురు,గ్యాస్ కొరత ఏర్పడుతుందని,వంట గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలించి కొరత సృష్టించి ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం పడుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ల కొరత లేకుండా చేయాలని,ప్రధాని నరేంద్ర మోడీ కూడా బాంబుల దాడుల నియంత్రణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సంప్రదింపులు చరపాలని వెంకటరెడ్డి హితవు పలికారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు అందె స్వామి, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సమ్మయ్య, కేదారి, రాజిరెడ్డి, పాల్గొన్నారు.3