Shuru
Apke Nagar Ki App…
కామోల్‌లో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి కామోల్ గ్రామంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ మాతకు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తి గీతాలు, మంగళహారతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. అనంతరం తులసీ మాత, గోమాతలకు పూజలు నిర్వహించి భక్తులు తమ కోరికలు తీర్చాలని ప్రార్థించారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు. ప్రతిరోజూ వివిధ పూజలు, భజనలు, కీర్తనలు నిర్వహిస్తూ ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయి.
Solanke Ravi
కామోల్‌లో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి కామోల్ గ్రామంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ మాతకు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తి గీతాలు, మంగళహారతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. అనంతరం తులసీ మాత, గోమాతలకు పూజలు నిర్వహించి భక్తులు తమ కోరికలు తీర్చాలని ప్రార్థించారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు. ప్రతిరోజూ వివిధ పూజలు, భజనలు, కీర్తనలు నిర్వహిస్తూ ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయి.
More news from తెలంగాణ and nearby areas
- Post by Solanke Ravi8
- కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. 'వృక్షో రక్షతి రక్షితః' అని ఉమారాణి పేర్కొంటూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్ఓ నిఖిత, ఆర్డీవో వీణ పాల్గొన్నారు.1
- జగిత్యాల. పలు సమస్యలపై ప్రజలనుండి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్, అధికారులు ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ....పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 46 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.1
- జగిత్యాల, మార్చి 23: జగిత్యాల పట్టణంలోని ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూం అర్బన్ కాలనీ (నూకపల్లి) సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ భారీగా చెత్తను పడేయడం, తరచుగా దానిని కాల్చడం వల్ల విషపూరిత పొగ, దుర్వాసన కాలనీ అంతటా వ్యాపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, దగ్గు, అలర్జీలతో బాధపడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వైద్య ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు చేసి విసుగొచ్చిన కాలనీ వాసులు, ఈ పరిస్థితుల్లో అక్కడ నివసించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించకపోతే తాము అక్కడ ఉండలేమని, లేకపోతే తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ప్రస్తుతం కొనసాగుతున్న చెత్త కాల్చే చర్యలను తక్షణమే నిలిపివేసి, ఇప్పటికే ఉన్న మంటలను ఆర్పివేసి పొగ వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నారు. లేకపోతే, ఆందోళనలు, నిరసనలు మరియు చట్టపరమైన చర్యలు చేపట్టడం తప్ప మరో మార్గం ఉండదని కాలనీ వాసులు హెచ్చరించారు.4
- జన్నారం ప్రభుత్వాసుపత్రిని 30 పడకలకు పెంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ జాయింట్ కన్వీనర్ కత్తెరపాక రాజేష్ కోరారు. సోమవారం జన్నారం ఆసుపత్రిలో చైర్మన్ ను ఆయన కలిసి పలు సమస్యలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి సమస్యను పరిష్కరించాలని, వీల్ చైర్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.1
- వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా 5వ రోజు సోమవారం పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామి వారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు.శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.1
- సంక్షేమ పథకాల అమలుకై ఈనెల 30న ఇందిరా పార్క్ వద్ద జరిపే నిరాహార దీక్షలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనిలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయ వంతం చేయండి ఈనెల 30 తారీఖున నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం నాడు పాపన్నపేట్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 30న తలపెట్టిన నిరాహార దీక్షను విజయవంతం కోసం జిల్లా నుండి భారీగా తరలివెళ్దామని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అల్లారం సుమన్ పిలుపునిచ్చారుఈకార్యక్రమంలో జిల్లా ,మండల నాయకులు ,కార్యకర్తలు ఉన్నారు.జిల్లా దండోరా ప్రధాన కార్యదర్శి అల్లరాంసుమన్ ఎన్నికలప్పుడు దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అమీలు నెరవేర్చడం లో జాప్యం చేస్తున్నాదని ఆరోపించారు.మంగళవారం పాపన్నపేటలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఏం ఆర్ పిఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాపయ్య ,వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ పిలుపుమేరకు హమీల అమలుకోసంఇందిరాపార్కువద్దతలపెట్టినధర్నవిజయవంతంచేయాలనిళ్లఉ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర లింగం మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లారం సుమన్ మాదిగ బాచుపల్లి ఎల్లం బాచుపల్లి శరత్ మహిళా అధ్యక్షురాలు బాచుపల్లి లక్ష్మి మాదిగ గుల్ల ప్రసాద్ గుడికి చంద్రం కుంట ప్రకాష్ కుంట బిక్షపతి వడ్ల భూషణం బూస మహేష్ వట్టెం శివయ్య వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గం కార్యకర్తలు అధిక సంఖ్యలోపాల్గోనివిజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు.1
- కామారెడ్డిలో సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ సబ్ ప్లాన్ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ తాహెర్, ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోష్ డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.1