వార్ పై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగాలి...ఐక్యరాజ్య సమితి తక్షణమే చర్యలు తీసుకోవాలి- సిపిఐ నేత చాడ వెంకట్ రెడ్డి యుద్ధాలు, బాంబుల దాడుల నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని, ఐక్యరాజ్య సమితి తక్షణమే చర్యలు తీసుకోవాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ చొరవ చూపాలని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశానికి చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు జరుపుతున్న బాంబుల దాడుల రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయని,దాని వల్ల అంతర్జాతీయ స్థాయిలో చమురు,గ్యాస్ కొరత ఏర్పడుతుందని,వంట గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలించి కొరత సృష్టించి ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం పడుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ల కొరత లేకుండా చేయాలని,ప్రధాని నరేంద్ర మోడీ కూడా బాంబుల దాడుల నియంత్రణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సంప్రదింపులు చరపాలని వెంకటరెడ్డి హితవు పలికారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు అందె స్వామి, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సమ్మయ్య, కేదారి, రాజిరెడ్డి, పాల్గొన్నారు.
వార్ పై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగాలి...ఐక్యరాజ్య సమితి తక్షణమే చర్యలు తీసుకోవాలి- సిపిఐ నేత చాడ వెంకట్ రెడ్డి యుద్ధాలు, బాంబుల దాడుల నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని, ఐక్యరాజ్య సమితి తక్షణమే చర్యలు తీసుకోవాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ చొరవ చూపాలని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్
లో సిపిఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశానికి చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు జరుపుతున్న బాంబుల దాడుల రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయని,దాని వల్ల అంతర్జాతీయ స్థాయిలో చమురు,గ్యాస్ కొరత ఏర్పడుతుందని,వంట గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలించి కొరత సృష్టించి ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం పడుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
గ్యాస్ సిలిండర్ ల కొరత లేకుండా చేయాలని,ప్రధాని నరేంద్ర మోడీ కూడా బాంబుల దాడుల నియంత్రణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సంప్రదింపులు చరపాలని వెంకటరెడ్డి హితవు పలికారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు అందె స్వామి, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సమ్మయ్య, కేదారి, రాజిరెడ్డి, పాల్గొన్నారు.
- అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోని ఈనెల 27 న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జాతర ఘనంగా నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్ లు ఆలయ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. 13 రోజులపాటు జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను రూట్ మ్యాప్ ను పరిశీలించారు. మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రంగా ఉండుటకు శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, భారీ గేట్లను ఏర్పాటుతో భక్తులు క్యూ లైన్ పద్ధతిలో వచ్చేలా చూసుకోవాలన్నారు. రాత్రి పగలు ఎంపీడీవో సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నాలుగు అంబులెన్స్ ను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆలయం మండపం వద్ద డోనర్ పాసులను, వివిఐపి పాసుల వద్ద వేరు వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోర్టు అధికారిక ఈమెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు సందేశం పంపడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగగా, ప్రత్యేక బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, కోర్టు పరిసరాలను పూర్తిగా సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బెదిరింపు మెయిల్ పంపిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.1
- వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా 5వ రోజు సోమవారం పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామి వారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు.శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.1
- జగిత్యాల. పలు సమస్యలపై ప్రజలనుండి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్, అధికారులు ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ....పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 46 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.1
- జనగాం జిల్లా:జనగామ పట్టణంలో భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సందర్భంగా సీపీఎం జిల్లా కార్యాలయంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.1
- జగిత్యాల, మార్చి 23: జగిత్యాల పట్టణంలోని ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూం అర్బన్ కాలనీ (నూకపల్లి) సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ భారీగా చెత్తను పడేయడం, తరచుగా దానిని కాల్చడం వల్ల విషపూరిత పొగ, దుర్వాసన కాలనీ అంతటా వ్యాపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, దగ్గు, అలర్జీలతో బాధపడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వైద్య ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు చేసి విసుగొచ్చిన కాలనీ వాసులు, ఈ పరిస్థితుల్లో అక్కడ నివసించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించకపోతే తాము అక్కడ ఉండలేమని, లేకపోతే తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ప్రస్తుతం కొనసాగుతున్న చెత్త కాల్చే చర్యలను తక్షణమే నిలిపివేసి, ఇప్పటికే ఉన్న మంటలను ఆర్పివేసి పొగ వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నారు. లేకపోతే, ఆందోళనలు, నిరసనలు మరియు చట్టపరమైన చర్యలు చేపట్టడం తప్ప మరో మార్గం ఉండదని కాలనీ వాసులు హెచ్చరించారు.4
- *నాడు ఏప్రిల్ 13, 2022లో వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు మరియు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు* సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం.1
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామపంచాయతీ పరిధిలోని నర్సింహులపల్లేలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రామంచ గ్రామ పంచాయతీ పరిధిలోని నరసింహులపల్లే వాసులు పోచమ్మ బోనాలు నిర్వహించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా పెద్దసంఖ్యలో ర్యాలీగా అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. పాడిపంటలతో ప్రజలందరిని చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. బోనాల వేడుకల్లో సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, రెడ్డి సంఘం ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, సాగర్ రెడ్డి, సమ్మిరెడ్డి, విజేందర్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.2