Shuru
Apke Nagar Ki App…
ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఆదేశం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. జన్నారం మండల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం జన్నారం ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆయన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
Gourinatha p.g
ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఆదేశం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. జన్నారం మండల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం జన్నారం ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆయన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జన్నారం ప్రభుత్వాసుపత్రిని 30 పడకలకు పెంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ జాయింట్ కన్వీనర్ కత్తెరపాక రాజేష్ కోరారు. సోమవారం జన్నారం ఆసుపత్రిలో చైర్మన్ ను ఆయన కలిసి పలు సమస్యలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి సమస్యను పరిష్కరించాలని, వీల్ చైర్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.1
- జగిత్యాల. పలు సమస్యలపై ప్రజలనుండి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్, అధికారులు ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ....పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 46 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.1
- జగిత్యాల, మార్చి 23: జగిత్యాల పట్టణంలోని ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూం అర్బన్ కాలనీ (నూకపల్లి) సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ భారీగా చెత్తను పడేయడం, తరచుగా దానిని కాల్చడం వల్ల విషపూరిత పొగ, దుర్వాసన కాలనీ అంతటా వ్యాపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, దగ్గు, అలర్జీలతో బాధపడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వైద్య ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తులు చేసి విసుగొచ్చిన కాలనీ వాసులు, ఈ పరిస్థితుల్లో అక్కడ నివసించడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించకపోతే తాము అక్కడ ఉండలేమని, లేకపోతే తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ప్రస్తుతం కొనసాగుతున్న చెత్త కాల్చే చర్యలను తక్షణమే నిలిపివేసి, ఇప్పటికే ఉన్న మంటలను ఆర్పివేసి పొగ వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నారు. లేకపోతే, ఆందోళనలు, నిరసనలు మరియు చట్టపరమైన చర్యలు చేపట్టడం తప్ప మరో మార్గం ఉండదని కాలనీ వాసులు హెచ్చరించారు.4
- సిర్పూర్‌లో నవచండీ యాగం కొనసాగింపు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్‌లోని శ్రీ సంతోషిమాత ఆలయంలో మార్చి 16 నుంచి 26 వరకు అతి రుద్రం సహిత నవచండీ యాగం వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. యాగంలో భాగంగా కోనేరు రమాదేవి, కోనప్ప దంపతులు భవానీ శంకర స్వామివారిని దర్శించి పట్టు వస్త్రాలు సమర్పించారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం వేద పండితులు దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోర్టు అధికారిక ఈమెయిల్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు సందేశం పంపడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగగా, ప్రత్యేక బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, కోర్టు పరిసరాలను పూర్తిగా సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బెదిరింపు మెయిల్ పంపిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.1
- వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా 5వ రోజు సోమవారం పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామి వారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు.శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.1
- అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోని ఈనెల 27 న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జాతర ఘనంగా నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్ లు ఆలయ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. 13 రోజులపాటు జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను రూట్ మ్యాప్ ను పరిశీలించారు. మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రంగా ఉండుటకు శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, భారీ గేట్లను ఏర్పాటుతో భక్తులు క్యూ లైన్ పద్ధతిలో వచ్చేలా చూసుకోవాలన్నారు. రాత్రి పగలు ఎంపీడీవో సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నాలుగు అంబులెన్స్ ను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆలయం మండపం వద్ద డోనర్ పాసులను, వివిఐపి పాసుల వద్ద వేరు వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.1
- ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. జన్నారం మండల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం జన్నారం ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆయన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.1