logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మచిలీపట్నం మంగినపూడి సాగరతీరమహాగణపతి మహ్మోత్సవాలకు పోతటెత్తిన భక్త సముదాయం మచిలీపట్నం. మంగిన పూడి సాగరతీరం వినాయకుని దర్శించుకొనేందుకు నలుమూలల నుండి వ చ్చిన భక్తులు. వారికీ ఇబ్బంది లేకుండా ప్రసాదములు, వాటర్ ప్యాకెట్లు దప్రత్యేక ర్శనాలు ఏర్పాటు చేసిన కమిటీబృందం.మరియు పిల్లలు, పెద్ద ల కోసం ఏ ర్పాటు చేసిన జైంటు వీల్, స్కైరైడర్, బైక్ రైడర్ వగైరా ఆకట్టుకున్నాయి.స్టాల్స్ ప్రత్యేకంగా ఏ ర్పాటు చేశారు

13 hrs ago
user_MANDAPAKALA RAO
MANDAPAKALA RAO
Insurance Agent Challapalle, Krishna•
13 hrs ago
38866c23-330e-44d3-b7fc-811d79b9a357
983030dd-b8cf-483e-a90a-25e5487d63d0

మచిలీపట్నం మంగినపూడి సాగరతీరమహాగణపతి మహ్మోత్సవాలకు పోతటెత్తిన భక్త సముదాయం మచిలీపట్నం. మంగిన పూడి సాగరతీరం వినాయకుని దర్శించుకొనేందుకు నలుమూలల నుండి వ చ్చిన భక్తులు. వారికీ ఇబ్బంది లేకుండా ప్రసాదములు, వాటర్ ప్యాకెట్లు దప్రత్యేక ర్శనాలు ఏర్పాటు చేసిన కమిటీబృందం.మరియు పిల్లలు, పెద్ద ల కోసం ఏ ర్పాటు చేసిన జైంటు వీల్, స్కైరైడర్, బైక్ రైడర్ వగైరా ఆకట్టుకున్నాయి.స్టాల్స్ ప్రత్యేకంగా ఏ ర్పాటు చేశారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వర్షాలు కరువైతే భూగర్భ జలాలు అడుగంటితే పంటల సంగతి దేవుడెరుగు కనీసం తాగునీటికైనా దిక్కేది కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం పెద్దాపుత్తేడు గ్రామంలో చెరువు నీటిని చేపల వేట కోసం ఖాళీ చేస్తున్నారనే ఆరోపణలు గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఒకవైపు వర్షాలు సక్రమంగా లేకపోతే నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న వేళ మరోవైపు గ్రామానికి భవిష్యత్‌లో ఉపయోగపడాల్సిన చెరువు నీటిని ఇలా బయటకు వదిలేస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈరోజు చేపల కోసం చెరువు నీటిని వదిలేస్తే.. రేపు తాగునీటి కోసం ఎక్కడికి వెళ్లాలి?*పంటల సాగుకు నీరు అందడం ఒక ఎత్తయితే భూగర్భ జలాలు కూడా తగ్గిపోతే గ్రామాల్లో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో నీరు ఉండటం వల్ల భూగర్భ జలాలపై కూడా కొంత ప్రభావం ఉంటుందని అలాంటి నీటి వనరులను ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఖాళీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మనిషికి నీరు కావాలి పశువులకు నీరు కావాలి వ్యవసాయానికి నీరు కావాలి మరి ఆ నీటిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? గ్రామంలోని పశువులు, ప్రజలు ఆధారపడే నీటి వనరు ఖాళీ అయితే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్థులు చెబుతున్నారు.
    1
    వర్షాలు కరువైతే భూగర్భ జలాలు అడుగంటితే పంటల సంగతి దేవుడెరుగు కనీసం తాగునీటికైనా దిక్కేది
కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం పెద్దాపుత్తేడు గ్రామంలో చెరువు నీటిని చేపల వేట కోసం ఖాళీ చేస్తున్నారనే ఆరోపణలు గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఒకవైపు వర్షాలు సక్రమంగా లేకపోతే నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న వేళ మరోవైపు గ్రామానికి భవిష్యత్‌లో ఉపయోగపడాల్సిన చెరువు నీటిని ఇలా బయటకు వదిలేస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈరోజు చేపల కోసం చెరువు నీటిని వదిలేస్తే.. రేపు తాగునీటి కోసం ఎక్కడికి వెళ్లాలి?*పంటల సాగుకు నీరు అందడం ఒక ఎత్తయితే భూగర్భ జలాలు కూడా తగ్గిపోతే గ్రామాల్లో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో నీరు ఉండటం వల్ల భూగర్భ జలాలపై కూడా కొంత ప్రభావం ఉంటుందని అలాంటి నీటి వనరులను ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఖాళీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మనిషికి నీరు కావాలి పశువులకు నీరు కావాలి వ్యవసాయానికి నీరు కావాలి మరి ఆ నీటిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? గ్రామంలోని పశువులు, ప్రజలు ఆధారపడే నీటి వనరు ఖాళీ అయితే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్థులు చెబుతున్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఒరాకిల్ లేఆఫ్స్ ఉద్యోగాలు కోల్పోయిన వారి ఆవేదన ⚡ వాడుకున్నంత కాలం వాడుకుని ఇష్టమొచ్చినట్లు ఉద్యోగాల్లోంచి తీసేస్తే తమ పరిస్థితి ఏంటని ఒరాకిల్ లేఆఫ్స్‌లో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    ఒరాకిల్ లేఆఫ్స్ ఉద్యోగాలు కోల్పోయిన వారి ఆవేదన
⚡ వాడుకున్నంత కాలం వాడుకుని ఇష్టమొచ్చినట్లు ఉద్యోగాల్లోంచి తీసేస్తే తమ పరిస్థితి ఏంటని ఒరాకిల్ లేఆఫ్స్‌లో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మంత్రి నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో వరిధనం గ్రామంలో శ్రమదానం మంత్రి నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వరిధనం గ్రామంలో.. పోతుల సూరిబాబు సారధ్యంలో.. సుమారు 200 మంది గ్రామ ప్రజలు స్థానిక మంచినీటి చెరువు చుట్టూ శ్రమదానం చేశారు. చుట్టూ ఉన్న తుప్పలు, పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు
    1
    మంత్రి నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో వరిధనం గ్రామంలో శ్రమదానం
మంత్రి నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో.. పశ్చిమగోదావరి జిల్లా
పాలకొల్లు మండలం వరిధనం గ్రామంలో..
పోతుల సూరిబాబు సారధ్యంలో.. సుమారు 200 మంది గ్రామ ప్రజలు స్థానిక మంచినీటి చెరువు చుట్టూ శ్రమదానం చేశారు. చుట్టూ ఉన్న తుప్పలు, పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తొలి దశలో 25 లేబర్ అడ్డాలను ఏర్పాటు ,.రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం తాడేపల్లిగూడెం , గణేష్ నగర్ లో రూ.26లక్షలు ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డా పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే, తాడేపల్లిగూడెంలో ఎక్కువ మంది కార్మికులు ఉండటంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాపీ, వడ్రంగి, ప్లంబర్, ఎలక్ట్రికల్ కార్మికులంతా ఒక్క చోటకు చేరుకునే ప్రాంతమే లేబర్ అడ్డా అని పేర్కొన్నారు. లేబర్ అడ్డా ముఖ్యోద్దేశాన్ని లేబర్ కమిషనర్, ఇతర అధికారులు రూపొందించడం జరిగిందన్నారు. తమిళనాడులో ముందుగా 50 లేబర్ అడ్డాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లేబర్ అడ్డా నమూనాకు సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారన్నారు. మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. లేబర్ అడ్డాలలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, కోఆర్డినేటర్, ముగ్గురు వాచ్ మెన్ , వ్యాను, డ్రైవర్, స్వీపర్ ఉంటారన్నారు. లేబర్ అడ్డాకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు తమ అవసరాలకు యాప్ ద్వారా కార్మికులను వినియోగించుకోవచ్చన్నారు. లేబర్ అడ్డా ప్రారంభానికి ముందుగానే విధివిధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు. సీఎం సమక్షంలో జరిగే సమీక్ష సమావేశంలో విషయాలను వెల్లడిస్తారన్నారు. రాజమహేంద్రవరం, మంగళగిరిలో లేబర్ అడ్డాలు సిద్ధమయ్యాయని బాబ్జీ వివరించారు. సీఎం అపాయింట్ మెంట్ రాగానే 25 లేబర్ అడ్డాలను ప్రారంభిస్తామన్నారు. ప్రధానంగా లేబర్ అడ్డాలలో రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాలు, కార్మికుల గుర్తింపు కార్డు నవీకరణ, నైపుణ్య శిక్షణ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడును స్పూర్తిగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారన్నారు. లేబర్ అడ్డాల ద్వారా తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు మన రాష్ట్రం అమలుకు ఏపీబీవోసీడబ్ల్యూడబ్ల్యూ బోర్డు, కార్మిక శాఖ మంత్రి సుభాష్, కమిషనర్, సెక్రటరీ తరపున కృషి చేస్తామన్నారు. ఇక్కడ మంచి స్థలం సమకూర్చిన తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక శాఖ అధికారి గోపి కుమార్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, లీల, వాసు, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
    2
    రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తొలి దశలో 25 లేబర్ అడ్డాలను ఏర్పాటు ,.రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ
మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం
తాడేపల్లిగూడెం , గణేష్ నగర్ లో రూ.26లక్షలు ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డా పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే, తాడేపల్లిగూడెంలో ఎక్కువ మంది కార్మికులు ఉండటంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాపీ, వడ్రంగి, ప్లంబర్, ఎలక్ట్రికల్ కార్మికులంతా ఒక్క చోటకు చేరుకునే ప్రాంతమే లేబర్ అడ్డా అని పేర్కొన్నారు. లేబర్ అడ్డా ముఖ్యోద్దేశాన్ని లేబర్ కమిషనర్, ఇతర అధికారులు రూపొందించడం జరిగిందన్నారు. తమిళనాడులో ముందుగా 50 లేబర్ అడ్డాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లేబర్ అడ్డా నమూనాకు సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారన్నారు. మరో 200 లేబర్ అడ్డాలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. లేబర్ అడ్డాలలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, కోఆర్డినేటర్, ముగ్గురు వాచ్ మెన్ , వ్యాను, డ్రైవర్, స్వీపర్ ఉంటారన్నారు. లేబర్ అడ్డాకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు తమ అవసరాలకు యాప్ ద్వారా కార్మికులను వినియోగించుకోవచ్చన్నారు. లేబర్ అడ్డా ప్రారంభానికి ముందుగానే విధివిధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు. సీఎం సమక్షంలో జరిగే సమీక్ష సమావేశంలో విషయాలను వెల్లడిస్తారన్నారు. రాజమహేంద్రవరం, మంగళగిరిలో లేబర్ అడ్డాలు సిద్ధమయ్యాయని బాబ్జీ వివరించారు. సీఎం అపాయింట్ మెంట్ రాగానే 25 లేబర్ అడ్డాలను ప్రారంభిస్తామన్నారు. ప్రధానంగా లేబర్ అడ్డాలలో రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాలు, కార్మికుల గుర్తింపు కార్డు నవీకరణ, నైపుణ్య శిక్షణ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడును స్పూర్తిగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారన్నారు. లేబర్ అడ్డాల ద్వారా తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలు మన రాష్ట్రం అమలుకు ఏపీబీవోసీడబ్ల్యూడబ్ల్యూ బోర్డు, కార్మిక శాఖ మంత్రి సుభాష్, కమిషనర్, సెక్రటరీ తరపున కృషి చేస్తామన్నారు. ఇక్కడ మంచి స్థలం సమకూర్చిన తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక శాఖ అధికారి గోపి కుమార్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, లీల, వాసు, పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • చింతలపూడి లోభారీ వర్షానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు. చింతలపూడి లో నిన్న కురిసిన భారీ వర్షానికి మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక బైపాస్ రోడ్డు నుంచి పెద్ద చెరువు ప్రక్కన రియల్ ఎస్టేట్ ఫామ్ కు వేసిన విద్యుత్ స్తంభాలు. స్తంభాలు వేసేటప్పుడు బేస్ కాంక్రీట్ వేయని కాంట్రాక్టర్. దీనితో స్తంభాలు నెలకొరిగాయని స్థానికుల కథనం.
    1
    చింతలపూడి లోభారీ వర్షానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు.
చింతలపూడి లో నిన్న కురిసిన భారీ వర్షానికి మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక బైపాస్ రోడ్డు నుంచి పెద్ద చెరువు ప్రక్కన రియల్ ఎస్టేట్ ఫామ్ కు వేసిన విద్యుత్ స్తంభాలు. స్తంభాలు వేసేటప్పుడు బేస్ కాంక్రీట్ వేయని కాంట్రాక్టర్. దీనితో స్తంభాలు నెలకొరిగాయని స్థానికుల కథనం.
    user_Mogaparthi.Devakrupavaram
    Mogaparthi.Devakrupavaram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఎన్టీఆర్ కాలనీలో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కేవలం మూడు రోజుల్లో నేర్చుకున్న నృత్యాలను ప్రదర్శించి.. మేమేమీ తక్కువ కాదు అంటూ ఆటపాటలతో అలరించారు. విద్యార్థినీల నృత్యాలను చూసిన స్థానికులు చప్పట్లతో వారిని అభినందిస్తూ ఉత్సాహపరిచారు. విద్యార్థినీల ప్రతిభకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు స్థానిక ఉపాధ్యాయుడు నరసింహారావు విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నారు. చదువుతో పాటు ఆటపాటలు.. ప్రతిభకు ప్రోత్సాహం అనే విధంగా ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్న నరసింహారావు ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
    3
    ఎన్టీఆర్ కాలనీలో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కేవలం మూడు రోజుల్లో నేర్చుకున్న నృత్యాలను ప్రదర్శించి.. మేమేమీ తక్కువ కాదు అంటూ ఆటపాటలతో అలరించారు.
విద్యార్థినీల నృత్యాలను చూసిన స్థానికులు చప్పట్లతో వారిని అభినందిస్తూ ఉత్సాహపరిచారు.
విద్యార్థినీల ప్రతిభకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు స్థానిక ఉపాధ్యాయుడు నరసింహారావు విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నారు.
చదువుతో పాటు ఆటపాటలు.. ప్రతిభకు ప్రోత్సాహం అనే విధంగా ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్న నరసింహారావు ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయిl పొన్నెకల్లు గ్రామానికి చెందిన నెల్లూరు ప్రసాద్‌ ఉంగరం చోరీపై నాగేంద్రమ్‌ ఫిర్యాదు మేరకు ఆగస్టు 25న Cr.No.140/2026 కేసు నమోదు.ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన చీకటి గోపి (30) మృతిపై Cr.No.145/2026గా మరో కేసు నమోదు.చీకటి గోపి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాలు జారీ చేశారు.విచారణ అధికారిగా సౌత్‌ డివిజన్‌ ఎస్‌డీపీఓ జి. పూర్ణచంద్రరావు నియామకం. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి గుంటూరు జిల్లా ఎస్పీకి నివేదిక సమర్పిస్తామని గుంటూరు జిల్లా సౌత్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ జి. పూర్ణచంద్రరావు తెలిపారు.
    1
    గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు
గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయిl
పొన్నెకల్లు గ్రామానికి చెందిన నెల్లూరు ప్రసాద్‌ ఉంగరం చోరీపై నాగేంద్రమ్‌ ఫిర్యాదు మేరకు ఆగస్టు 25న Cr.No.140/2026 కేసు నమోదు.ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన చీకటి గోపి (30) మృతిపై Cr.No.145/2026గా మరో కేసు నమోదు.చీకటి గోపి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాలు జారీ చేశారు.విచారణ అధికారిగా సౌత్‌ డివిజన్‌ ఎస్‌డీపీఓ జి. పూర్ణచంద్రరావు నియామకం.
వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి గుంటూరు జిల్లా ఎస్పీకి నివేదిక సమర్పిస్తామని గుంటూరు జిల్లా సౌత్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ జి. పూర్ణచంద్రరావు తెలిపారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • వైసీపీ బూతుల బ్రాండ్ అంబాసిడర్.. బెజవాడ 60వ డివిజన్ ప్రెసిడెంట్ గారి లీలలు పేరు: షేక్ ఫాతిమా పదవి: వైసీపీ విజయవాడ 60వ డివిజన్ అధ్యక్షురాలు, పార్టీ స్థాయికి తగ్గ అర్హత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్: భర్తపై పోలీస్ స్టేషన్లలో కేసులు.. పిల్లల చదువులు, ఉద్యోగాలంటూ పబ్లిక్ లో హైడ్రామా మంచితనానికి, సంస్కారానికి వైసీపీలో తావు లేదనడానికి ఈ మేడమే లేటెస్ట్ ఉదాహరణ. పదవి రావాలంటే మినిమమ్ బూతుల బ్యాక్ గ్రౌండ్ ఉండాలనే పార్టీ రూల్‌ను అక్షరాలా పాటిస్తూ రోడ్డెక్కిన ఈ లేడీ లీడర్ అసలు చరిత్రేంటో ఈ వీడియో చూసి మీరే డిసైడ్ చేయండి. మరి ఇలాంటి ఘనత వహించిన నాయకులను భుజాన వేసుకుంటున్న ఆ పార్టీ తీరు చూస్తుంటే నవాబుల కాలం నాటి రౌడీ రాజ్యాంలాగే ఉందిగా.
    1
    వైసీపీ బూతుల బ్రాండ్ అంబాసిడర్.. బెజవాడ 60వ డివిజన్ ప్రెసిడెంట్ గారి లీలలు

 పేరు: షేక్ ఫాతిమా

 పదవి: వైసీపీ విజయవాడ 60వ డివిజన్ అధ్యక్షురాలు, పార్టీ స్థాయికి తగ్గ అర్హత

ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్: భర్తపై పోలీస్ స్టేషన్లలో కేసులు.. పిల్లల చదువులు, ఉద్యోగాలంటూ పబ్లిక్ లో హైడ్రామా

మంచితనానికి, సంస్కారానికి వైసీపీలో తావు లేదనడానికి ఈ మేడమే లేటెస్ట్ ఉదాహరణ. పదవి రావాలంటే మినిమమ్ బూతుల బ్యాక్ గ్రౌండ్ ఉండాలనే పార్టీ రూల్‌ను అక్షరాలా పాటిస్తూ రోడ్డెక్కిన ఈ లేడీ లీడర్ అసలు చరిత్రేంటో ఈ వీడియో చూసి మీరే డిసైడ్ చేయండి. 

మరి ఇలాంటి ఘనత వహించిన నాయకులను భుజాన వేసుకుంటున్న ఆ పార్టీ తీరు చూస్తుంటే నవాబుల కాలం నాటి రౌడీ రాజ్యాంలాగే ఉందిగా.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె ఆర్డీవోకి వినతిపత్రం ఇచ్చిన వీఆర్ఏ సంఘాలు తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం డివిజన్ లోని ఐదు మండలాల వీఆర్ఏలు సమ్మె నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ గోపాలకృష్ణ మాట్లాడుతూ నెలకు రూ.10వేల జీతంతో కుటుంబాన్ని పోషించడం గగనంగా మారుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నామని, అర్హులైన వారికి వీఆర్వోలుగా ప్రమోషన్, నామినీలకు ఉద్యోగావకాశం కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ మాదిరిగా అదే విధంగా మాకు కూడా పే స్కేల్ ఇవ్వాలని కోరారు. ఆర్డిఓ మన్నే సూర్యరావు కి వీఆర్ఏల సంఘం వినతి పత్రాన్ని అందజేశారు. వీఆర్ఏ సంఘ ఐదు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు , మండలాల వారి వీఆర్ఏలు పాల్గొన్నారు.
    3
    కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె 
ఆర్డీవోకి వినతిపత్రం ఇచ్చిన వీఆర్ఏ సంఘాలు
తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం డివిజన్ లోని ఐదు మండలాల వీఆర్ఏలు సమ్మె నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ గోపాలకృష్ణ మాట్లాడుతూ నెలకు రూ.10వేల జీతంతో కుటుంబాన్ని పోషించడం గగనంగా మారుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నామని, అర్హులైన వారికి వీఆర్వోలుగా ప్రమోషన్, నామినీలకు ఉద్యోగావకాశం కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ మాదిరిగా అదే విధంగా మాకు కూడా పే స్కేల్  ఇవ్వాలని కోరారు. ఆర్డిఓ మన్నే సూర్యరావు కి వీఆర్ఏల సంఘం వినతి పత్రాన్ని అందజేశారు. వీఆర్ఏ సంఘ ఐదు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు , మండలాల వారి వీఆర్ఏలు పాల్గొన్నారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.