Shuru
Apke Nagar Ki App…
మన్యం జిల్లాలో నీట మునిగిన ప్రభుత్వ పాఠశాల వీరఘట్టం మండలం చిట్టపులివలస ప్రభుత్వ పాఠశాల నీట మునిగింది ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో పాఠశాల ప్రాంగణం మొత్తం జలసంద్రమైంది. తరగతి గదిలోకి వర్షం నీరు పోటెత్తింది. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలోకి నీరు చొచ్చుకునిపోవడంతో సోమవారం తరగతికి వచ్చిన విద్యార్థులు అవస్థలు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఉంచిన బియ్యం తడిసిపోయాయని నిర్వాహకులు తెలిపారు.
Seelam Ashok Reddy Flex Print
మన్యం జిల్లాలో నీట మునిగిన ప్రభుత్వ పాఠశాల వీరఘట్టం మండలం చిట్టపులివలస ప్రభుత్వ పాఠశాల నీట మునిగింది ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో పాఠశాల ప్రాంగణం మొత్తం జలసంద్రమైంది. తరగతి గదిలోకి వర్షం నీరు పోటెత్తింది. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలోకి నీరు చొచ్చుకునిపోవడంతో సోమవారం తరగతికి వచ్చిన విద్యార్థులు అవస్థలు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఉంచిన బియ్యం తడిసిపోయాయని నిర్వాహకులు తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయిl పొన్నెకల్లు గ్రామానికి చెందిన నెల్లూరు ప్రసాద్ ఉంగరం చోరీపై నాగేంద్రమ్ ఫిర్యాదు మేరకు ఆగస్టు 25న Cr.No.140/2026 కేసు నమోదు.ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన చీకటి గోపి (30) మృతిపై Cr.No.145/2026గా మరో కేసు నమోదు.చీకటి గోపి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు జారీ చేశారు.విచారణ అధికారిగా సౌత్ డివిజన్ ఎస్‌డీపీఓ జి. పూర్ణచంద్రరావు నియామకం. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి గుంటూరు జిల్లా ఎస్పీకి నివేదిక సమర్పిస్తామని గుంటూరు జిల్లా సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ జి. పూర్ణచంద్రరావు తెలిపారు.1
- కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం సంబేపల్లి మండలం మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం సంబేపల్లి మండలం మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో తరలిస్తున్న పశువుల మేతకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్ ఇంజన్‌తో సహా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.1
- పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం శ్రీనివాస్ నగర్ నివాసితుల పక్షాన తాను అండగా నిలబడి తమకు న్యాయం జరిగే వరకు కోట్లాడుతానని భరోసా ఇచ్చారు. BRS పార్టీ, లీగల్ సెల్ ద్వారా కోర్టులో పోరాడి న్యాయం చేస్తామని, ఎవరికీ భయపడి తెల్ల కాగితాలపై సంతకాలు చేయవద్దని బాధితులకు సూచించారు. ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఏం చెప్పినా నమ్మొద్దన్నారు.1
- మచిలీపట్నం మంగినపూడి సాగరతీరమహాగణపతి మహ్మోత్సవాలకు పోతటెత్తిన భక్త సముదాయం మచిలీపట్నం. మంగిన పూడి సాగరతీరం వినాయకుని దర్శించుకొనేందుకు నలుమూలల నుండి వ చ్చిన భక్తులు. వారికీ ఇబ్బంది లేకుండా ప్రసాదములు, వాటర్ ప్యాకెట్లు దప్రత్యేక ర్శనాలు ఏర్పాటు చేసిన కమిటీబృందం.మరియు పిల్లలు, పెద్ద ల కోసం ఏ ర్పాటు చేసిన జైంటు వీల్, స్కైరైడర్, బైక్ రైడర్ వగైరా ఆకట్టుకున్నాయి.స్టాల్స్ ప్రత్యేకంగా ఏ ర్పాటు చేశారు3
- సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి1
- మునిసిపల్,పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన మహిళలు!🔥నిలబడాలి కూడ...1
- ఖమ్మంలో AIKMS భారీ ప్రదర్శన.. రెడ్ ఫ్లాగ్స్‌తో హోరెత్తిన ర్యాలీ! 🚩 ఖమ్మంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. AIKMS జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం నుంచి SR BG NR కళాశాల వరకు రెడ్ ఫ్లాగ్స్‌తో ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు జేవీ చలపతిరావు పాల్గొన్నారు. రైతులు, కూలీలు, కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలతో ప్రదర్శన కొనసాగింది. AIKMS జాతీయ మహాసభల నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఖమ్మం జిల్లా AIKMS అధ్యక్ష, కార్యదర్శులు వై. ప్రకాష్, వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.1
- “చేతబడి అనుమానంతో వృద్ధురాలికి చిత్రహింసలు..! చెట్టుకు ఎక్కించి మేకులు కొట్టారా?” భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో కలకలం రేపుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌కే శకినాబి అనే వృద్ధ మహిళపై చేతబడి అనుమానంతో చిత్రహింసలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ప్రచారం జరుగుతున్న వివరాల ప్రకారం.. బాధితురాలిని చెట్టుకు ఎక్కించి, మేకులు కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అసలు వృద్ధ మహిళను ఎవరు, ఎందుకు హింసించారు? చేతబడి అనుమానానికి కారణమేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూఢనమ్మకాల పేరుతో ఒక వృద్ధ మహిళపై ఇలాంటి దాడి జరిగిందనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే బాధితురాలికి రక్షణ కల్పించి, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలను పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. పూర్తి వివరాలు, అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.1
- విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత : డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ నిరసన కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున జరిగిన అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు శాప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నిరసనకారులు డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు బారికేడ్లు పెట్టి అమానుషంగా అడ్డుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను అడ్డం పెట్టి రాకపోకలను పూర్తిగా నిలిపివేయడమే కాకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసే హక్కును కాలరాసేలా పోలీసులు వ్యవహరించడంపై పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ప్రభుత్వ వైఫల్యాలను, డీఎస్సీ స్కామ్‌ను కప్పిపుచ్చుకోవడానికే పోలీసులను ముందుంచి ప్రభుత్వం ఈ విధమైన అణచివేత చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము.1