Shuru
Apke Nagar Ki App…
ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి.... దుగ్గొండి ఎస్ ఐ రణధీర్ రెడ్డి... నర్సంపేట డివిజన్, మార్చి10, నర్సంపేట, ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి చెందినట్లు దుగ్గొండి ఎస్ఐ రణధీర్ రెడ్డి తెలిపారు. మండలంలోని తొగర్రాయి గ్రామ శివారు మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరవేణి మనోహర్ (26) గిర్నిబావి వైపు నుంచి దుగ్గొండికి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లుఎస్సై తెలిపారు.
Venkatgoud kallepu
ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి.... దుగ్గొండి ఎస్ ఐ రణధీర్ రెడ్డి... నర్సంపేట డివిజన్, మార్చి10, నర్సంపేట, ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి చెందినట్లు దుగ్గొండి ఎస్ఐ రణధీర్ రెడ్డి తెలిపారు. మండలంలోని తొగర్రాయి గ్రామ శివారు మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరవేణి మనోహర్ (26) గిర్నిబావి వైపు నుంచి దుగ్గొండికి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లుఎస్సై తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు. నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.1
- ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.1
- తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...* *ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...* *నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...* సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!* పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!! ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి సాగునీరు అందక రైతులు వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రుద్రంగి మండలంలో రైతులు వాటర్ ట్యాంకర్ తో నీరందిస్తున్నారు. కొందరు రైతులు నీరు లేక పోవడంతో చేసేదేమీలేక పంట పొలాలను పశువులకు మేతగా వదిలిపెట్టారు. రుద్రంగి లో అచ్చయ్యకుంట చెరువు, బతుకమ్మ కుంట చెరువు, నాగారం చెరువు, సూరమ్మ చెరువు ఉన్నప్పటికీ వాటిలో నీరు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. అలాగే వర్షాలు కూడా ఎక్కువగా పడలేదని రైతులు అంటున్నారు. కనీసం కాళేశ్వరం ఎల్లంపల్లి నీటితోనైనా పంటను కాపాడుకుందాం అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి నీటిని విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటలు ఎండిన తర్వాత నీరందించి ఏంలాభం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదే నీటిని జనవరి నెలలో విడుదల చేసి ఉంటే పంటలు ఎండక పోవునని అన్నారు. జనవరి నెలలోనే చేరువులన్ని కాళేశ్వరం నీటితో నింపి ఉంటే భూగర్భజలాలు పెరిగి రైతులకు ఇంతటి కష్టంనష్టం జరగకపోవునని తెలిపారు. ఇప్పటికైనా త్వరగా నీటిని విడుదల చేస్తే మిగిలిన పంటనైన రైతులు కపాడుకుంటామని రైతులు అంటున్నారు.1
- జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.1
- తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.1
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- హన్మకొండ నగరంలోని మాస్టర్ జి డిగ్రీ & పీజీ కళాశాలలో నార్కోటిక్స్ మరియు డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్కోటిక్స్ మరియు డ్రగ్స్‌పై ప్రత్యేక అధికారి గిరిధర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం గురించి వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2